హై బీ పీ కి నైస్ ( NICE ) ( ఇంగ్లండు ) వారు ఏ మందులు వాడమంటున్నారు ?.30.
నైస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ క్లినికల్ ఎక్సేల్లెన్స్ . వీరు అధిక రక్త పీడనం కొత్తగా కనుక్కున్న వారికి మందులతో చికిత్స ఒక పధ్ధతి లో చేయాలని సూచించారు.
ఆ పధ్ధతి నమూనా పట్టీ క్రింద చూడ వచ్చు మీరు.
ఈ విషయాలు అందరం ఎందుకు తెలుసుకోవాలి? :
ఎందుకంటే , మనం సాధారణంగా చూస్తుంటాము. అధిక రక్త పీడనానికి , వేరు వేరు మందులు రాస్తుండటం. అది మనకు చాలా సందేహాలకు మూలం అవుతుంది. భారత దేశం లో ప్రత్యేకించి , ఏ డాక్టరు కూ , వివరం గా వారు ఇస్తున్న మందుల గురించి వారి పేషంట్లకు చెప్పే పెషన్సూ అంటే ఓపికా , సమయమూ ఉండదు. కొందరికి సమయం ఉన్నా , ఎప్పుడూ , చాలా చాలా బిజీగా ఉన్నట్టు ఉంటారు. అందువల్ల మొదట ఏ వయసులో ఏ మందులు ఇస్తారో ఒక అవగాహన ముందుగా , ఆ మందులు తీసుకునే మనకు కలిగితే, అప్పుడు , ఆ మందులు ఇస్తున్న డాక్టరు ను అడిగి అనుమానాలు తీర్చుకోవచ్చు కదా !
ఈ విషయాలన్నీ మనకు ఎందుకు ముఖ్యం అంటే , సరిగా కంట్రోలు అవని అధిక రక్త పీడనం మన జీవితాలలో సృష్టించే అనారోగ్య తుఫానుల గురించి చాలా వివరం గా మునుపటి టపాలలో తెలుసుకున్నాము కదా !
ఇప్పుడు క్రింద ఉన్న టేబుల్ పటం చూడండి.

ఈ పటం లో పైన ఉన్న వయసు తరగతులు రెండూ మీకు అర్ధమవుతాయి కదా ! అంటే వయసు 55 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారు, అంతకు మించి ఉన్న వారు అని.
తరువాత పటం కుడి భాగాన నాలుగు స్టెప్స్ అంటే నాలుగు దశలలో మందులు, మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తు ఉంచుకో వలసినది ఇంగ్లీషు అక్షరాలు , ఏ , సి , ఇంకా డీ ( A,C,D )
A = ACE inhibitor. లేక ఏస్ ఇన్హిబిటార్ .
C= Calcium channel blocker. లేక క్యాల్సియం చానెల్ బ్లాకర్.
D= Thiazide- type diuretic. లేక తయజైడ్ టైపు డయురెటిక్ .
వీటి వివరాలు మనం వచ్చే టపాలో చూద్దాము !. ( మీరు గమనించి ఉంటారు, టపాలు చిన్నవి గా ఉంటున్నాయి కదా ! దానికి కారణం అనేక పేజీల అర్ధం కాని , లేక అర్ధం చేసుకోలేని వివరాలు ఇచ్చి మీ రక్త పీడనాన్ని అధికం చేయడం నా ఉద్దేశం ఏ మాత్రం కాదు కనుక ! మీకు సమయం ఉంటే రెండు మూడు సార్లు ఇదే టపా చదివి బాగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి , అనుమానాలు, సందేహాలు ఉంటే తెలియ చేయండి , తప్పకుండా ! )