పైన ఉన్న చిత్రం నిశితం గా గమనించండి. ఇది గుండె యొక్క ఈ సి జీ అంటే తక్కువ వోల్టేజీ తో విద్యుత్తును ప్రసరింప చేసి మన గుండె కొట్టుకునే విధానాన్ని రికార్డు చేయడం అన్న మాట.
ఈ చిత్రం లో సహజం గా గుండె కొట్టు కుంటూ ఉన్నప్పుడూ, వేగం గా, నిదానం గా , లేక అవకతవకలతో కొట్టుకుంటూ ఉన్నప్పుడూ , ఆ తరంగాలు ఎట్లా రికార్డు చేయ బడతాయో చూపబడింది.
అలాగే యాంజైనా ఉన్నప్పుడూ, లేక గుండె పోటు ఉన్నప్పుడూ, ఈ సి జీ ఒక ప్రత్యేకమైన రీతిలో గుండె తరంగాలను రికార్డు చేస్తుందన్న మాట.
( Cardiac stress test )కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్ లో గుండె తీవ్రమైన వత్తిడి లో ఎట్లా పని చేస్తుందో , కనుక్కోవడం. ఇక్కడ వత్తిడి లేక స్త్రెస్స్ అంటే శారీరిక శ్రమ అంటే Physical stress. అంటే ఇది భౌతికమైనది. అంటే మానసికమైనది కాదు. ఇలాంటి పరీక్షలలో సాధారణంగా ఈ పరీక్ష చేసే పరిస్థితులను నియంత్రించ వచ్చు అన్న మాట. అంటే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ . ఈ విధమైన పరీక్ష వల్ల మన గుండె శారీరిక శ్రమ ఎక్కువ అవుతున్న కొద్దీ ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అందువల్ల ఒకవిధం గా గుండె కు సరఫరా చేసే కరోనరీ ధమనులు కూడా మూసుకు పోకుండా గుండె కండరాలకు తగినంత రక్తం సరఫరా చేస్తున్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు.
ఎందుకంటే ఒక మోస్తరు గా శారీరిక శ్రమ పడితే , ఒక వేళ కరోనరీ ధమనులు కనుక పాక్షికం గా కానీ , పూర్తిగా కానీ మూసుకుని పోయి ఉన్నట్టయితే, వారికి ఆయాసం రావడమూ, లేక చాతీ లో నొప్పి రావడము, ఎక్కువ అలసట కలగడమూ జరగవచ్చు. అలా కనక జరిగితే తదనుగుణంగా మార్పులు ఎలెక్ట్రో కార్దియోగ్రం అంటే ఈ సి జీ ( Electro Cardiogram or ECG or EKG ) లో కనిపిస్తాయి. అప్పుడు మిగతా పరీక్ష లు చేయవలసిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా ఏ కరోనరీ ధమని ఎంత వరకు మూసుకు పోయిందనే విషయం తెలుసుకోవడానికి.
ఎవరెవరు ఈ పరీక్షలు చేయించుకో కూడదు ? :
గత 48 గంటలలో గుండె పోటు వచ్చిన వారు, గుండె కవాటాలలో లోపం ఉన్న వారు ( Valvular heart disease ) ,ఒకటి కన్నా ఎక్కువ కరోనరీ ధమనులు సరిగా పని చేయక పోతున్నప్పుడు , అన్ స్టేబుల్ యాంజైనా ( అంటే మందులకు సరిగా లొంగని యాంజైనా )తో బాధ పడుతున్నప్పుడు, గుండె కొట్టుకోవడం లో ఒడు దుడుకు లు ఉన్నప్పుడు అంటే కార్డియాక్ ఎరిత్మియా ( cardiac arrythmia )
ఇలాంటి పరిస్థితులలో కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్ చేయించుకోవడం కూడదు. గుండె స్పెషలిస్ట్ ను సంప్రదించాలి తప్పకుండా !
ఈ కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్ రెండు రకాలు గా ఉంటుంది ప్రధానం గా !
ఒకటి ట్రెడ్ మిల్ టెస్ట్. ( Exercise Treadmill test )
రెండు న్యూక్లియర్ స్త్రెస్స్ టెస్ట్ . ( Nuclear Stress Test )
ట్రెడ్ మిల్ టెస్ట్ లో ఒక కదిలే దిమ్మ మీద స్థిరం గా నుంచోవడం అంటే మనం కొంత వేగం తో పరిగేట్టాలన్న మాట. దీనినే ట్రెడ్ మిల్ అంటారు. ఈ ట్రెడ్ మిల్ వేగాన్ని మన శక్తి సామర్ధ్యాలకు అనుగుణం గా పెంచడమో తగ్గించడమో చేస్తూ ఉంటారు.
అలాగే మనల్ని పెడల్స్ ఉన్న ట్రెడ్ మిల్ మీద కూర్చోపెట్టి , సైకిల్ తొక్కుతున్న విధం గా పెడల్ చేయాలన్న మాట. ఇలా క్రమం గా వేగం పెంచుతూ చేస్తుంటే , మన గుండె ఈ భౌతిక మైన శ్రమకు ఎట్లా తట్టుకుంటుందో ECG ద్వారానూ , మనలో వచ్చే లక్షణాల ద్వారా నూ తెలుసుకుంటారు.
ఇక న్యూక్లియర్ స్త్రెస్స్ టెస్ట్ లో మన గుండె లో ఉండే కరోనరీ రక్త నాళాల ను ఫోటో తీసే విధంగా కొన్ని రేడియో ట్రేసర్ రసాయనాలను ఇంజెక్షన్ రూపం లో ఇచ్చి , అప్పుడు ఆ ఫోటో లలో ఉన్న ధమనులను విపులం గా పరీక్షించి ఎక్కడెక్కడ ధమనులు , ప్లేక్ ఫార్మేషన్ తో నొక్కుకు పోయినాయో , ఏ మేరకు పూడుకు పోయినాయో ఖచ్చితం గా కనుక్కోవడం జరుగుతుంది.
పైన చెప్పిన ఈ రెండు రకాల పరీక్షలూ , ప్రధానంగా మనకు ఇస్కీమిక్ హార్ట్ డిసీస్( Ischemic Heart disease ) ఉందొ లేదో తెలుసుకోవడానికి చేస్తారు. ఇలా తెలుసుకోవడం తరువాత చేయించుకోవలసిన చికిత్స కోసం ఎంతో ముఖ్యం.
ఒక గమనిక : పైన తెలిపిన పరీక్షలు, కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్ లు అంటే ఏమిటో ఒక అవగాహన ఏర్పడడానికే. వీటి అవసరం ఉందనుకునే వాళ్ళు కార్డియాలజిస్ట్ ను తప్పనిసరిగా సంప్రదించాలి.
హృదయం లేక గుండె కు సంబంధించిన అన్ని రకాల అధునాతన పరీక్షల పేర్లూ ఈ క్రింద పొందు పరచ పడినాయి మీ సౌలభ్యం కోసం.