హై బీ పీ కి మందులతో చికిత్స గురించి ఏమి తెలుసుకోవాలి ?. 29.
మనం క్రితం టపాలలో మన ఆహార నియమాలలో మార్పులు తీసుకు వచ్చి, అధిక రక్త పీడనాన్ని , ఎట్లా తగ్గించుకోవాలో, తగ్గించు కొవచ్చో శాస్త్రీయం గా తెలుసుకున్నాము కదా !
ఇప్పుడు, అల్లోపతిక్ మందులు ఏవిదం గా , అధిక రక్త పీడనానికి వాడ బడతాయో చూద్దాము.
అధిక రక్త పీడనానికి వాడ బడే అల్లోపతిక్ మందులు చాలా , మనకు మార్కెట్ లో లభ్యం అవుతాయి.
చాలా మంది , సాధారణంగా తమ బంధువులు ఏవైనా మందులు, అధిక రక్త పీడనం తగ్గించడానికి వేసుకుంటుంటే , ఆ మందులు గుర్తుంచుకొని , అవే మందులు తమకు బీ పీ ఎక్కువ అయినప్పుడు కూడా వేసుకుందామని అనుకుంటుంటారు.
కొందరు ఇంకా సాహసించి , ఊళ్ళో ఉన్న మెడికల్ షాపు వాడిని అడిగి , డాక్టర్ దగ్గరకు కూడా పోయి మళ్ళీ ఫీజు ఇచ్చుకోవడం దేనికని , ఏవో ఒక తరగతి కి చెందిన యాంటీ హైపర్ టేన్సివ్ మందులు వేసుకుంటూ ఉంటారు.
ఇలా మందుల షాపు వాళ్ళు డాక్టర్లు గా మారడం భారత దేశం లో చాలా సాధారణం. ఇంగ్లండు లో దేశం మొత్తం మీద ఎక్కడా డాక్టరు చేత రాయ బడ్డ ప్రిస్క్రిప్షన్ లేక పొతే, మందులు అసలు అమ్మరు. ఒక వేళ అమ్మినట్టు తెలిస్తే , వారి లైసెన్స్ వెంటనే రద్దు చేయడం జరుగుతుంది. అంతే కాక , జరిమానా విధించ డమో, లేక చెరసాల పాలు చేయడమో కూడా జరుగుతుంది. ( ప్రపంచం లో వివిధ దేశాలలో ఉంటున్న తెలుగు వారు , వారి అనుభవాలు కూడా చెప్పండి.)
ఈ విషయం ఇక్కడ ఎందుకు తెవాల్సి వచ్చిందంటే, అధిక రక్త పీడనానికి మందులు చాలా ఉన్నాయి కానీ, వయసు ను బట్టీ , వారికి ఉన్న ఇతర జబ్బుల బట్టీ, లేక , హైపర్ టెన్షన్ తీవ్రతను బట్టి , ప్రత్యేకించి , అది ఏ దశలో ఉన్నదో కనుక్కుని , తదనుగుణం గా , ఆ మందులు ఇవ్వ వలసి ఉంటుంది. అంతే కాక , ఆ మందులు అన్నీ అందరికీ ఒకే విధం గా సరిపడవు కదా. అందువల్ల ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్త గా ఉండాలి తమ ఆరోగ్యం విషయం లో.
ఇక పాశ్చాత్య దేశాలలో , ప్రతి వ్యాధికీ , దానికి సంబంధించిన నిపుణులు చాలామంది కలిసి , కొన్ని గైడ్ లైన్స్ అంటె మార్గ దర్శక సూత్రాలు ఏర్పరుచుతారు. మిగతా డాక్టర్లు అందరూ అలాంటి సూత్రాలను పాటించాలి, తాము మందులు పేషంట్లకు ఇస్తున్నప్పుడు.అలాంటి గైడ్ లైన్స్ ఇచ్చే సంస్థ ఒకటి ఇంగ్లండు లో ఉంది. దాని పేరు నైస్ ( NICE అంటె National Institute of Clinical Excellence ). వారు అధిక రక్త పీడనానికి రూపొందించిన మార్గ దర్శక సూత్రాల పట్టీ .
వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాము.