మానవులలో ఉత్తేజం ( మోటివేషన్ ) గురించి శాస్త్రవేత్తలు ఏమంటారు ?.3.
మానవులు అభివృద్ధి పధం లో ముందుకు పోవడానికి అతి కీలకమైన ‘ ఉత్తేజానికి కారణాలు ‘ అనేక మంది శాస్త్ర వేత్తలు, సైకాలజిస్ట్ లు అనేక దశాబ్దాలు గా పరిశోధనలూ, పరిశీలనలూ చేశారు. ఈ పరిశోధనా వివరాలను మనం రెండు రకాలు గా చెప్పుకోవచ్చు.ఒకటి: మానవ ప్రవర్తన కు సంబంధించిన ఉత్తేజం ( behaviour model ). రెండు:. మానవ జ్ఞానానికి సంబంధించిన ఉత్తేజం ( cognitive model ).
మానవ ప్రవర్తన కు సంబంధించిన ఉత్తేజం గురించి కొంత తెలుసుకుందాము.
ఈ థియరీ ప్రకారం, మానవులలో ఉత్తేజం వారి మూల అవసరాలు , అంటే బేసిక్ డ్రైవ్ ల ను బట్టి వస్తుంది అని. బేసిక్ డ్రైవ్ లు , అంటే ఆకలి, కామ కోరికలు , లాంటి ఎమోహన్స్. ఉదాహరణకు , మనకు ఆకలి అయినప్పుడు , ఆహారం కావాలి అనిపిస్తుంది కదా, అట్లా ఆహారం కోసం ప్రయత్నించాలనే ఉత్తేజం వస్తుందన్న మాట. అట్లాగే మనకు కామ వాంఛ తీర్చుకోవాలనే బేసిక్ డ్రైవ్ ( అంటే మూల అవసరం ) కలిగినప్పుడు, మనం ఉత్తేజం అంటే మోటివేట్ అయి తదనుగుణం గా ప్రయత్నాలు ప్రారంభిస్తాము. అంటే మనకు ఒక ప్రేరణ లేదా స్తిమ్యులాస్ కలిగినప్పుడు, ఆ స్తిమ్యులాస్ కు అనుగుణం గా మనం చేసే ప్రతి చర్య అంటే రెస్పాన్స్ – వీటి పైన మన ఉత్తేజం కూడా ఆధార పడి ఉంటుందని భావించ బడుతూ ఉంది.
ఇలాంటి బేసిక్ నీడ్స్ ను సంతృప్తి పరుచుకోవడానికి , మానవులు పొందే ఉత్తేజం , రెండు రకాలు గా , అంటే మనకు రివార్డ్ గానూ , లేదా పనిష్మెంట్ గానూ మార వచ్చు. అంటే మనకు ఆకలి అయినప్పుడు, మనం ఉత్తేజం పొంది, ఆహారం సంపాదించుకుని, తింటే , అది రివార్డ్ అనబడుతుంది. అంటే మనం పొందిన ఉత్తేజం , ఫలితాన్ని వెంటనే ( ఆహార రూపం లో ) ఇచ్చింది కనుక దానిని రివార్డ్ అంటారు. అదే ఆహారం దొరకని సమయం లో మనం ఉత్తేజం పొందుతున్నా , ఫలితం ( ఆహారం దొరకలేదు కాబట్టి ) శూన్యం కాబట్టి దానిని పనిష్మెంట్ అంటారు. పైన వివరించిన థియరీ లో గమనించ వలసినదేమిటంటే , మనం పొందే ఉత్తేజానికి కారణాలు , బాహ్య పరమైనవి అంటే ఎక్స్టర్నల్ ( external stimuli ). అంటే మన మానసిక మార్పులు కాదు. కేవలం మన భౌతిక కారణాలను సంతృప్తి పరుచుకోవడానికి మాత్రమె మనం ఉత్తేజం చెందుతున్నట్టు ఈ థియరీ వివరిస్తుంది.
కానీ గత పాతిక సంవత్సరాలలో , సైకాలజిస్ట్ లు ఈ ఉత్తేజానికి కొత్త నిర్వచనం ఇవ్వటానికి ప్రయత్నించారు. వారి వాదన ప్రకారం, మానవులలో ఉత్తేజానికి మూల కారణం , వారి ఆలోచనలు, ఆలోచనా సరళి. అంటే వీరి ప్రకారం ఉత్తేజం మన బేసిక్ డ్రైవ్ వల్ల వస్తున్నది కాదు అని. ఈ రెండవ రకాన్ని కాగ్నిటివ్ మోడల్ అఫ్ మోటివేషన్ అంటారు. ఇది మన నిత్య జీవితం లో అత్యంత ఉపయోగకారి అయిన విధానం. దీని వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాము !