Our Health

Posts Tagged ‘our minds’

ఏ వ్యాయామం ఎందుకు ? 1.

In Our Health on సెప్టెంబర్ 27, 2015 at 6:43 సా.

ఏ వ్యాయామం ఎందుకు ? 1. 

సర్వ సాధారణం గా మనం , వ్యాయామం ( ఎక్సర్సైజ్ ) అంటే , కేవలం  శారీరిక వ్యాయామమే అని అనుకుంటాము !  శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది ,  మానవుల ఆయుష్షు కూడా పెరుగుతూ ఉండడం తో , మెదడు ఆరోగ్యం  గురించి కూడా ప్రాముఖ్యత పెరుగుతూ వస్తూంది ! 
కేవలం శారీరిక ఆరోగ్యాన్నే  మననం చేస్తూ , మెదడు ఆరోగ్యం పట్టించుకోక పొతే ,  జీవనం కేవలం యాంత్రిక మవుతుంది ! 
పరోక్షం గా శారీరిక వ్యాయామం , మన మెదడునూ , తద్వారా మేధస్సు నూ  ప్రభావితం చేస్తున్నా కూడా ,  మెదడు ఆరోగ్యానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఎక్కువ గా ఉపయోగ పడతాయని , ఇటీవలి పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి ! శాస్త్రజ్ఞులు , కేవలం ఇప్పటిదాకా అనుకుంటున్న , రోజూ  అరగంట వ్యాయామం  చేస్తున్న వారిని కాకుండా , ఇతర వ్యాయామాలను కూడా శ్రద్ధతో చేస్తున్న వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు ! 
ఆ పరిశీలనల ఫలితాలు తెలుసుకుందాం ! 
నాడీ కణాలు ఆరోగ్యం గా పెరుగుతూ  ఉండాలంటే ,  BDNF  అనే పదార్ధం అవసరం ఉంటుంది !  టూకీ గా చెప్పుకోవాలంటే ఈ BDNF పదార్ధం , మనం  వ్యాయామం చేస్తూ ఉంటే , మెదడులో సమ పాళ్ళ లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది ! 
ఈ పదార్ధం సహాయం తో , నాడీ కణాలు , సమర్ధ వంతం గా పనిచేస్తాయి ! అంటే  చురుకు గా ఆలోచించగలగడం ,  విషయాలను గ్రహించడం ,  ఆ గ్రహించిన విషయాలను గుర్తు పెట్టుకోవడం , వాటిని మళ్ళీ  అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడం వంటి పనులు ! 
అనేకమంది మానవులు కేవలం ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూ ఉంటేనే , వారిలో BDNF పాళ్ళు ఎక్కువ అవుతున్నట్టు తేలింది !  
ఈ ఏరోబిక్ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసే వారిలో , ముందు ముందు , మతి మరుపు వ్యాధి వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి ! 
ఏరోబిక్ వ్యాయామాలు అంటే ఏమిటి ? :
మన గుండె కొట్టుకోవడం , శ్వాస తీసుకోవడం ఎక్కువ చేసి , మనకు చెమట పోయించే ప్రతి వ్యాయామమూ , ఏరోబిక్ వ్యాయామాలు అనబడతాయి ! అంటే ( పైన ఉన్న చిత్రం చూడండి ) వడి వడి గా నడక , లేదా పరిగెట్టడం , నాట్యం చేయడం , నీళ్ళ మీద ఈదడం , సైక్లింగ్ లాంటి వన్నీ కూడా , మన గుండె వేగం , శ్వాస వేగం , ఎక్కువ చేసి , ఎక్కువ స్వేదం కలిగిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

మనసు పడిన మగువను కౌగిలించుకోవడం ఎలా ?4.

In Our Health on సెప్టెంబర్ 1, 2015 at 7:31 సా.

మనసు పడిన మగువను కౌగిలించుకోవడం ఎలా ?4. 

క్రితం టపాలో, ఎదురెదురుగా,  ప్రేయసీ ప్రియులు,  కౌగిలించుకోవడం ఎలానో తెలుసుకున్నాం కదా ! 
మరి ప్రియుడు , ఒక్కసారిగా, ప్రేయసి వెనుక నుంచి ఆమెను కౌగిలించుకోవడం గురించి తెలుసుకుందాం ! 
ఈ రకమైన కౌగిలి లో , ఒక రకమైన ఆతృత , సస్పెన్స్  , కలిగించ వచ్చు , ప్రేయసి లో కానీ , ప్రియుడి లో కానీ  ! 
ప్రత్యేకించి , ప్రేయసి , ఆ సందర్భం లో , ఇతర ముఖ్యమైన పనులేవీ చేస్తూ ఉండక పొతే ,  తన వెనుకనుంచి , ఒక్క సారిగా , ఆమె నడుము చుట్టూ చేతులు వేసి , ఆమె మెడకు , అతడి ముఖం తగిలిస్తూ ఉంటే , అది ఒక  అందమైన , ఉక్కిరి బిక్కిరి చేసే  అనుభూతి గా మిగిలి పోతుంది ఆమె మనసులో ! అట్లా కాకుండా , ఆమె వెనుకనుంచి వచ్చి  తన వక్షో జాలను , అతడి వీపుకు హత్తుకుంటూ  , ఉంటే , ఆమె ముఖం,   అతడికి ఆనించడం కూడా  ఓ అందమైన అనుభూతే !  కొన్ని కిటుకులు, ఆ  అనుభూతుల రుచి  ఎక్కువ చేస్తాయి  ! రస మయం కూడా చేస్తాయి ! 
అతడు కనుక , వెనుక గా వస్తే , ఆమె నడుము చుట్టూ చేతులు వేయడమే కాకుండా , అతడి కటి వలయ భాగాన్ని కూడా  అంటే అతడి టార్సో ను , ఆమె పిదురులకు , మధ్య లో సందు లేకుండా , తగిలించితే , ఆమెకు ఎక్కువ చేరువ అవుతాడు ! 
తలల స్పర్శలు ,  ఇరువురిలో ఊహా లతలను  ఒక్కసారిగా పెనవేసుకుపోయే లా చేస్తాయి ! ప్రత్యేకించి,  తలలు కలిసినప్పుడు , తలపులు కూడా కలిసి , ఆత్మీయత ,అవధులు దాటుతుంది , ఇరువురిలో !
ఎంత సేపు ?:  కమ్మటి కౌగిలి లో , కాలమే కరిగి పోతుంది ! సమయం , సందర్భాన్ని బట్టి కౌగిలి  సమయం కూడా ,  మారుతుంది ! పెరుగుతుంది ! అప్పుడప్పుడూ , దీర్ఘ మైన శ్వాస తీసుకుని , కౌగిలి కి సరిపడినంత  ఆక్సిజన్ ను తాజా గా జత చేస్తూ ఉంటే , అలసట కూడా తగ్గి , ఆ కౌగిలి శక్తి వంతం  అవుతుంది ! 
చేతుల అలసట కూడా తగ్గాలంటే , ఆ దృఢ బంధాన్ని , అప్పుడప్పుడూ సడలించి ,  చేతులకు , మిగతా  ‘ ముఖ్యమైన చేతల ‘  మీద ధ్యాస పెడితే  కూడా ,  ఆ కౌగిలికి  ఎక్కువ రుచి వస్తుంది !  అట్లాగే , కేవలం వెనుకనే నిలబడకుండా , కౌగిలి సడలించి , ప్రేయసి ,  ప్రియుడిని తన  ఎదురుగా తిప్పుకోవడమూ , లేదా ప్రియురాలిని , ప్రియుడు  తన ఎదురుగా తిప్పుకోవడమూ  , కూడా చేస్తూ ఉండ వచ్చు , సమయానుకూలం గా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

మనసు పడ్డ మగువను ఎట్లా కౌగిలించుకోవాలి ? 3.

In Our Health on ఆగస్ట్ 10, 2015 at 11:46 ఉద.

మనసు పడ్డ మగువను ఎట్లా కౌగిలించుకోవాలి ? 3. 

సాధారణం గా రెండు రకాలు గా ఉంటాయి, ఈ ప్రేమ మయ కౌగిళ్లు !
1. అభిముఖ కౌగిలి ! : ఇందులో ప్రేయసీ ప్రియులిద్దరూ ఒకరికి , ఇంకొకరు ఎదురెదురు గా ఉంటారు ! 
వారిరువురి చాతీ లు , ఉదర భాగాలూ , కటివలయ భాగాలూ , తగిలి ఉంటాయి ! అంటే ఒకరి ఛాతీ ఇంకొకరికీ , ఒకరి ఉదరం ఇంకొకరికీ , ఒకరి కటివలయం , అంటే పెల్విస్ , ఇంకొకరికీ తగులుతూ ఉంటాయి ! 
ఈ రకమైన కౌగిలి , ఎంతో  స్పర్శ కలిగి , చాలా సన్నిహితం చేస్తుంది , ప్రియులను , కేవలం భౌతికం గానే కాకుండా , మానసికం గా కూడా ! 
అప్పుడు, పొడుగు గా ఉన్న వ్యక్తి , తనకన్నా తక్కువ ఎత్తు లో ఉన్న ప్రియుడిని కానీ ప్రియురాలిని కానీ , నడుము చుట్టూ చేతులు వేయడం , అవతలి వ్యక్తి , తమ మెడ చుట్టూ ( వదులు గా ) చేతులు వేయడం , జరుగుతుంది !
ఆమె మెడకు కానీ , తలకు కానీ మీ తలను , లేదా బుగ్గలను తగిలించండి !  మెడ భాగం అతి సున్నితమైన స్పర్శకు స్పందిస్తుంది ! 
కౌగిలిని బిగించడం : అంటే కొద్దిగా స్క్వీజ్ చేయండి !  ఆమె ఉక్కిరి బిక్కిరి అయి పోయి శ్వాస తీసుకోలేక పోయే అంత గా కాదు ! ఇట్లా కనీసం మూడు నాలుగు సెకండ్లు ఆమెను మీ కౌగిటిలో ‘ బంధించ వచ్చు ‘ !  మీ ప్రేమ తీవ్రత ను బట్టి , ఈ బంధనా సమయం పెరుగుతూ ఉంటుంది ! 
మీ చేతులకు పని చెప్పండి ! :  ఆమె కురులను నిదానం గా సరిచేస్తూ కానీ , ఆమె తలను స్పృశిస్తూ కానీ , మీ చేతులు బిజీ అయి , మీరు ఆ కౌగిలి లో బిజీ అవుతూ ఉంటే  , ఆ  అనుభూతి , న భూతో , న భవిష్యతి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

మనసుపడ్డ అమ్మాయిని, ఎట్లా కౌగిలించుకోవాలి ?2.

In Our Health on జూలై 26, 2015 at 9:56 ఉద.

మనసుపడ్డ  అమ్మాయిని, ఎట్లా కౌగిలించుకోవాలి ?2. 

ఆమె కౌగిలి కోసం పరిగెత్త కండి !
ఒక సారి మీరు , ఆమె , మీ కౌగిలి కోసం సుముఖం గా ఉందని తెలుసుకున్నాక ,  ఆమెను మీ కౌగిలి లో బంధించడానికి పరిగెట్టకండి !  నిదానం గా ఆమెను సమీపించితే , రొమాంటిక్ గా ఉంటుంది !
ఎంత సమయం కౌగిలించుకోవాలి ?:
ఆమె కళ్లలో చూస్తూ , ఆమెను సమీపించండి ! అందుకు కొంత సమయం పడుతుంది ! ఈలోగా ఆమెకు మీ కౌగిలి ఇష్టం లేక పొతే , మీ నుంచి దూరం తప్పుకుంటుంది ! ఇష్టముంటే అక్కడే ఉంటుంది ! అప్పుడు మీ చేయిని ఎత్తి , ఆమెను కౌగిలించుకోవచ్చు ! తొలి పరిచయాలలో కౌగిలి ఒకటి రెండు క్షణాల కన్నా ఎక్కువ అవుతే , బాగుండదు ! అంటే ఒకటి రెండు సెకండ్లు మాత్రమే !  ఆమె తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతూ ఉంటే , మీ కౌగిలింత సమయం కూడా పెంచ వచ్చు , తదనుగుణం గా ! బాగా తెలిసిన స్నేహితులూ ,బంధువులూ , తోబుట్టువుల తో మాత్రమే , దీర్ఘమైన కౌగిలి ఇవ్వ వచ్చు ! మీరు కనుక ఆమెకు ముద్దు కూడా ఇవ్వాలని నిర్ణయించు కుంటే , కౌగిలింత సమయం పెరుగుతుంది !
ముగింపు కూడా ముఖ్యమే : మీరు కౌగిలింత ఇచ్చే కొన్ని క్షణాలు  ఎంత ముఖ్యమైనవో , మీరు మీ కౌగిలిని ఎట్లా విడుదల చేస్తారో కూడా అంతే  ముఖ్యమైనది !  ఆ ముఖ్యమైన ముగింపు క్షణాలలో ,  సీ యు లేటర్  అని కానీ ,  ఐ యామ్  హాపీ టు సీ  యు అని కానీ అన వచ్చు !
మీరు కౌగిలించుకునే , యువతి తో ప్రేమ వ్యవహారం లో ఇరుక్కుంటే కానీ , ఆ ప్రయత్నాలు చేస్తుంటే కానీ ,  మీకు ఇష్టమైన , మీకు ప్రత్యేకమైన , మాటలు , ఆమె చెవిలో ‘ ఊద వచ్చు ‘ ఆ  కౌగిలి  ముగింపు క్షణాలలో !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

మనసుపడ్డ అమ్మాయిని, ఎట్లా కౌగిలించుకోవాలి ?1.

In Our Health on జూన్ 19, 2015 at 1:10 సా.

మనసుపడ్డ  అమ్మాయిని, ఎట్లా కౌగిలించుకోవాలి ?1. 

అంతర్జాల ‘ మహిమ ‘ అంతా ఇంతా కాదు !  గుండు సూది ఉపయోగాల నుంచి బ్రంహాండం ఎట్లా బద్దలవుతుందో కూడా  అత్యంత వివరం గా అందరికీ అందుబాటు లో ఉంచారు, మానవులు ! మరి మనసుపడ్డ అమ్మాయిని ఎట్లా కౌగిలించుకోవాలి ? అనే సందేహం కూడా , అనేకమంది యువకులకు , యుక్తవయసులో కలగడం  సహజమే ! 

మరి ఆ వివరాలు తెలుసుకుందాం ! ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం : అంతర్జాలం ప్రపంచం లో అందరికీ  అందుబాటు లో ఉన్నా , అందులో రాసే ప్రతి విషయమూ ,  ప్రపంచమంతా , ఒకే తీరు గా అమలు పరచడం అసాధ్యం !   అంతర్జాలం లో రాసిన విషయాలను , ప్రతి దేశ , ప్రాంత , భాష , సంస్కృతు లకు  అనుగుణం గా ప్రవర్తించాలి !  ఇంకో రకంగా చెప్పుకోవాలంటే , ప్రపంచీకరణ, కేవలం వస్తువులకు మాత్రమే , పరిమితం అవుతుంది , ప్రస్తుతం ! మానవ  సంబంధాలు చాలా వరకూ , ఆయా దేశాల  ప్రజల ఆచారాలూ , అలవాట్లతో ముడి పడి ఉంటాయి !  ఆ ఆచారాలలోనూ , అలవాట్లలోనూ మార్పులు  రావడానికి సమయం పడుతుంది ! 
అందుకే , క్రింద రాసిన సలహాలు ( అంతర్జాలం నుంచి సేకరించినవే ! ) ఎదుటి వ్యక్తి  ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా , మక్కీ కి మక్కీ గా, అమలు పరచడానికి ప్రయత్నించకూడదు ! 
1. సమయం , సందర్భం !: 
లేడి కి లేచిందే పరుగు అన్నట్టు , ఇష్టపడ్డ ప్రతి వారినీ , కనిపించినప్పుడల్లా కౌగిలించలేము కదా !? అందుకే ,  ఆ పవిత్ర మైన , అమూల్యమైన కార్యానికి , చక్కటి సమయం , సందర్భం చూసుకోవడం కూడా ముఖ్యమే !  అది పాటించక పొతే , మీ అనుభూతులు  చప్పగా ఉండడమే కాకుండా , మీరు  అనుకున్న పని కూడా బెడిసి కొట్ట వచ్చు ! 
తొలిసారి :  ఇష్టమైన అమ్మాయిని తొలిసారి చూసినప్పుడే , మనసు ‘ పారేసుకుంటే ‘  ఓ కమ్మని కౌగిలింత కోసం ప్రయత్నించడం  !
విజయం సాధిస్తే :  మీరు , మీకు నచ్చిన అమ్మాయి జతలో , కఠిన మైన పోటీలో విజయం పొందితే , మీరు  ఆమెకు ఇచ్చే కౌగిలి , లేదా ఆమె నుంచి స్వీకరించే కౌగిలి , అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది ! 
రోజు కఠినం గా ఉంటే : అన్ని రోజులూ , సరదా గా , గడచి పోవు ! కొన్ని రోజులు కష్టం గా , చాలా నిదానం గా , నిరుత్సాహ కరం గా గడుస్తూ ఉంటాయి ! చాలా శ్రమ పడడం , అలసట చెందడం కూడా జరుగుతూ ఉంటుంది , కొన్ని రోజులలో ! ఆ రోజులలో  మీరు  , ఆమె కు ఇచ్చే కౌగిలి , ఎంతో  స్వాంతన తో , ఓదార్పు తోనూ , ఉత్సాహ పరిచే ,శక్తి వంతం చేసే , ‘ కౌగిల్టిన్ ‘  అవుతుంది ! 
విడి పోయే సమయాలలో : ఈ విశాల ప్రపంచం లో అనేక మంది వ్యక్తులతో వివిధ సందర్భాలలో కలుస్తూ ఉంటాము ! అన్నికలయికలూ  , జీవితాలతో ముడి పడి పోవు ! పవిత్రమైన లేదా ప్రేమ పూర్వకమైన , లేదా స్నేహ పూర్వకమైన పరిచయాలు గా మిగిలిపోతాయి !  మీ జీవితాన్ని  చై తన్యం చేసిన , ఆ మ్మాయిని  , వీడి పోయే సమయం కూడా , మీరు ఇచ్చే ,  స్నేహ పూర్వకమైన , కృతజ్ఞతా పూర్వకమైన కౌగిలి కి  మరపు రాని సమయం అది ! 
వచ్చే టపాలో మిగతా సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?12. మొండి వాదన !

In Our Health on జూన్ 7, 2015 at 4:42 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ?12. మొండి వాదన !

ఒక బంధం ఏర్పడే మొదటి దశలలో కానీ , ఏర్పడ్డాక కానీ ,  స్త్రీ పురుషుల మధ్య , అనేక సందర్భాలలో వాదోప వాదాలు జరుగుతూ ఉంటాయి ! ఆ సందర్భాలలో , సాధారణం గా పురుషులు  , తమ   పెద్ద గొంతు తోనో , లేదా మొండి వాదనతోనో , స్త్రీల  నోరు మూయించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ! స్త్రీలు కూడా , కొన్ని , కొన్ని సమయాల లో , తమ ఇంట్లో వారికీ , తమ వీధిలో వారందరికీ కూడా , వినపడేంత గొంతుతో , తమ వాదనను వినిపిస్తారు !  మరి, ఆ వాదనలను ,  తమ జీవితాలకు ఉపయోగ కరం గా  మార్చుకోవడం ఎట్లా ? :
1. విరామం !:
వాదనలు , తారాస్థాయి కి చేరుకునే సమయం లో , రక్త పీడనం హెచ్చుతుంది ! అంటే అధిక బీపీ ! దానితో , ఆందోళన , మానసిక వత్తిడి కూడా ఎక్కువ అవుతాయి ! చాలా మందికి కోపం వస్తే, వారి గుండె కాయ , ఎక్కువ వేగం గా కొట్టుకుంటూ ఉంటుంది !   కొందరు శివాలు ఎత్తినట్టు , ఊగి పోతూ ఉంటారు , చెప్పలేనంత కోపం తో ! 
ఎక్కువ కోపం వచ్చిన వారు , పక్షవాతమూ , గుండె జబ్బు ( హార్ట్ ఎటాక్ ) బారిన అకస్మాత్తు గా పడిన సందర్భాలు కూడా అనేకం !  కోపం లోనూ , ఆవేశం లోనూ , మానవులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు ! కేవలం , గుస గుసలు కూడా ఇతరులకు వినిపించే  చోట , నోరు పెద్దది చేసుకుని , అరవడం మొదలు పెడతారు !  అంటే , వారు ఏ సమస్య గురించి ఆలోచిస్తున్నారో , ఆ సమస్య  ను సరిగా , అంటే హేతుబద్ధం గా  అర్ధం చేసుకోలేక పోతారు ! అట్లాగే , పరిష్కారం కూడా కనుగొన లేక పోతారు !   అందుకని ,  కోప తాపాలు , ఆ బంధం లో ఎవరికి  ఎక్కువ గా అవుతున్నాకూడా ,  వారిరువురూ , వెంటనే విరామం తీసుకోవడం , అతి ముఖ్యమైన చర్య !  వెంటనే ఆ స్థానం నుంచి , వెళ్ళిపోవడం , చేయవలసిన పని ! 
2. మీ వాదన లక్ష్యం   ఏమిటి ?:  మీరు , మీ వాదనతో , ఏమి సాధిద్దామని అనుకుంటున్నారు ?  ఈ విషయం ముందుగానే  ఆలోచించుకోవాలి !  లేకపోతే , మీ వాదన  కు ఫలితం ఉండదు !  అంతే కాకుండా , మీరు  , మీ వాదన ఎట్లా ఉంటే  ,  మీ ‘ బంధం ‘ లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుందో కూడా , ముందుగానే , ఆలోచించుకోవాలి ! 
కేవలం, మీరు వాదించే , మీ ఎదుటి వారి మనసును  గాయ పరచడమే , మీ లక్ష్యం కాకూడదు !  సమస్యను ,   పరిష్కార దిశగా , మీరు చూడ గలుగు తే , మీరు  నిదానం గా ఆ సమస్య గురించి ఆలోచించ గలగడమే కాకుండా , మీ ఎదుటి వారి  అభిప్రాయాలను కూడా గౌరవించి , వాటిని కూడా ఓపికతో వినే అలవాటు చేసుకుంటారు ! 
ఎవరి మనసులో ఉన్నది వారు, బయటకు చెప్పుకోకుండా , ‘ బాటిల్ ‘ చేసుకోవడం కూడా , అధిక రక్త పీడనకూ , ఇతర మానసిక రుగ్మత లకూ దారి తీస్తుందని , అనేక శాస్త్రీయ పరిశీలన ల ద్వారా తెలిసింది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బంధం గీత దాటడం అంటే ?1.

In Our Health on మే 25, 2015 at 11:00 ఉద.
బంధం గీత దాటడం అంటే ?1.  
మన జీవితాలలో , అనేక దశల లో అనేక  పరిచయాలు కలుగుతూ ఉంటాయి, మనకు ! అనేక మైన వ్యక్తులతో , మనం ఆకర్షింప బడుతూ ఉంటాము , అట్లాగే , అనేక మంది వ్యక్తుల మీద , అనేక రకాలైన అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి, మనకు ! మరి  ఏ పరిచయం , ప్రణయం గా మారి , ఒక బంధం లా ఏర్పడుతుంది ? ఈ క్రింద వివరించినవి మీలో కలుగుతూ ఉంటే ,  మీ కు కలిగిన ఆ బంధంలో మీరు ‘ గీత దాటు తూ ‘ ఉన్నట్టే !

1. మీరు ఆ వ్యక్తి తో, భావానుభూతుల  సంబంధం కలిగి ఉంటారు ! :రమ,  తన క్లాస్ మేట్  మాధవి తో ‘  కిరణ్  ను చూసినా , అతని తో మాట్లాడినా నీ  ఉరకలూ , పరుగులూ , నిదానించి , ఏదో యదాలాపం గా ఉంటావు , నీ కళ్ళు బరువుగా అవుతాయి !  మిగతా క్లాస్ మేట్స్ ఎవరి తోనూ నువ్వు అట్లా బిహేవ్ చేయవు ! అని  తన అభిప్రాయాన్ని నిర్మొహమాటం గా  చెబుతుంటే , లేదా , మోహన్ , రవి తో  ‘ అరే  నువ్వు ఎందుకు రా  , మా ముందు హీరో లా పోజులు కొడుతూ ,  సంధ్య ముందు , కుందేలు లా అయిపోతావు ? అని చురకలు వేస్తుంటే , అది భావాను భూతుల  పరిణామమే ! మీకు , ఆ వ్యక్తి  మీద , ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కలిగినట్టే  ! 

2. ఆ వ్యక్తి కోసం, మీరు ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు! : రోజూ లా కాకుండా , అతనికి ఇష్టమైన  సల్వార్ కమీజ్  దరించ డానికీ , లేదా జీన్స్ అండ్ టీ షర్ట్ వేసుకోడానికీ , ఇష్టపడతారు ! లేదా ఓ చక్కని  జార్జెట్ చీర కట్టుకోడానికి , ఓ అరగంట ముందే లేచి  , ఆ సమయాన్ని , చీర చక్కగా కట్టుకోవడం కోసం కేటాయిస్తారు !  
3. ఆ వ్యక్తి తో, మీ  సమయం గడపడానికి తహ తహ లాడడమే కాకుండా , ఆ సమయాన్ని మీరు ఎంతో విలువైనది గా కూడా  భావిస్తారు ! : మీరు  కలవాలనుకునే ఆ వ్యక్తి  కలిసే ముందు , ఇతర వ్యక్తులు  మీతో మాట్లాడుతూ ఉంటే , మీరు ఆ సంభాషణను వీలైనంత త్వరగా ముగించాలని కోరుకుంటారు ! అందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తారు ! మీకు ‘ ఇష్టమైన ‘ ఆ వ్యక్తి  తో కలిసే సమయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు ! 
4. మీ భర్తతో , కానీ భార్య తో గానీ మాట్లాడ లేని సంబంధం, ఆ వ్యక్తి తో కలిగి ఉండడమే కాకుండా ,  మీరు ఆ వ్యక్తి తో చేసే పనులు కూడా , చెప్ప లేనివి గా ఉంటాయి ! : మీరు , వివాహితులై ఉంటే కనుక ,  మీరు మీ భాగస్వామి తో  చెప్పుకోలేనంత రహస్యం గా ఉంటాయి , మీ పనులు !  అవి కేవలం  క్రీగంటి చూపులే కావచ్చు ! లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ అయినా కావచ్చు ! 
5. మీరు ఆ వ్యక్తి తో,  మీ వివాహ సంబంధం లో మీకు ఉన్న , లేదా కలిగిన అసంతృప్తి ని పంచుకుంటారు ! :  మీరు మీ ప్రస్తుత వివాహం లో  మీకు ఉన్న , లేదా కలుగుతున్న అసౌకర్యాలనూ , అసంతృప్తి నీ  ,  ఆ వ్యక్తి తో చెప్పుకోడానికి  తయారు అవుతారు ! 
6. ఆ వ్యక్తి తో మీరు గడిపే సమయాన్ని కూడా రహస్యం గా ఉంచుతారు ! అంటే ,  ఫోను లో మాట్లాడుతూ కానీ , టెక్స్ట్  చేస్తూ కానీ , గడిపే సమయాన్ని కూడా రహస్యం గా ఉంచుతారు ! 
7. మీ బంధం లో మీరు , భావోద్రేకం ( emotional highs ) పొందుతారు ! :  మీరు సంబంధం కలిగి ఉన్న ఆవ్యక్తి తో  , అనేక విధాలు గా భావోద్రేకం పొందుతూ ఉంటారు !  ఆ వ్యక్తి మీకు గుర్తు కు వచ్చినప్పుడల్లా , మీరు  భావోద్రేకం చెందుతారు ! మీ మనసు పరిగెత్తుతుంది ! మీ ఆలోచనలు గుర్రాలవుతాయి ! ఆ వ్యక్తి కి సంబంధించిన అన్ని గుర్తులూ , జ్ఞాపకాలూ , అయస్కాంతాలు గా మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ! 
వచ్చే టపాలో, ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?11. నమ్మకం !

In Our Health on మే 6, 2015 at 12:06 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ?11. నమ్మకం ! 

‘ ప్రేమకు పునాది నమ్మకమూ , అది నదీ సాగర సంగమమూ ‘ అని ఒక  సినీ కవి రాశాడు.   ( గుర్తుంటే చెప్పండి, ఏ సినిమా లోదో , ఈ పాట ! ) 
నమ్మకం వమ్ము అవుతుంటే , ప్రేమ పునాదులు బీటలు వారుతూ ఉంటాయి ! అందుకే , ఆ నమ్మకాన్ని ఎప్పుడూ దృఢ మైన పునాది గా  ఉంచుకోవాలంటే,  ఏమి చేయాలో చూద్దాం  !
1. మీ భాగస్వామి తో,  మీ ప్రవర్తన ఎప్పుడూ ఒక  కనీస సమతుల్యం అంటే బాలెన్స్ గా  ఉండాలి ! మనుషులన్నాక , మానసిక స్థితి, అనేక సందర్భాల లో అనేక రకాలు గా ఉండడం సహజమే ! కానీ  ఆ పరిస్థితి  ‘ చిత్త చాంచల్యం ‘ అని కానీ ‘ చపల చిత్తం ‘ కానీ అనిపించుకోదు ! ‘ ఎప్పుడు ఎట్లా ఉంటాడో చెప్పడం కష్టం ‘ అని కానీ ‘  ఆమె మైండ్ చాలా ఫికిల్ ‘ అని కానీ  ఎవరినైనా అనగలుగుతుంటే, వారి ఆ మానసిక స్థితి సహజమైనది కాదు అని తెలుస్తుంది ! 
2. సమయ పాలన :  అనుభవ రీత్యా , సమయానికి రాని రైళ్ళూ , విమానాలూ ,  రిజల్ట్సూ , ఉద్యోగాలూ ,  అతిథులూ , పెళ్లి వారూ , మనలను ఎంత ఇబ్బంది పెడతాయో  మనకు తెలుసు !  ఒక బంధం లో కూడా  సమయ పాలన లేక పొతే , అంతే ఇబ్బంది , ఆమాటకొస్తే , ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది ! 
3. మాట తప్పక పోవడం :  మీరు మీ భాగ స్వామి తో  ఏపని నైనా చేస్తానని అంటే , అది చేసి చూపండి ! కేవలం మాటలకే పరిమితం కాకుండా ! 
4. అబద్ధాలు కూడదు ! :   బంధం తెగడానికి , అబద్ధాలు , పదునైన కత్తి లా పనిచేస్తాయి ! అవి నమ్మకాన్ని ముక్కలు ముక్కలు గా   ఖండిస్తాయి , దానితో  ‘ ప్రేమ బంధం ‘ పునాదులు కదులుతాయి ! 
5. వాదనలో కూడా   న్యాయం గా ఉండండి ! :  అంటే తప్పైనా కూడా మీ వాదనే నెగ్గాలనే పంతం కూడదు !  ఆ పరిస్థితి లో  ,  మీరు నిజాన్ని ఆమోదించలేక పోతున్నారని స్పష్టం అవుతుంది ,  చాలా సమయాలలో మీకు నిజం తెలిసినా కూడా ! 
6. బాధ , సున్నితత్వం  అనేవి అందరికీ ఒకటే : అంటే,  మీ బాధ మాత్రమే  నిజమైన బాధ అనీ , ఇతరులు ( అంటే మీ భాగ స్వాములు ) బాధ పడరనీ ,  లేదా మీ హృదయమే సున్నితమైనదనీ , ఇతరుల మనసు  మొద్దు బారి , మొండి గా ఉంటుందనీ అనుకోవడం ,  అద్దం లో ఎప్పుడూ మిమ్ము మీరు చూసుకోవడమే !  దానిని,  నార్సిసిజం అంటారు !  అన్న మాటలతో బాధ పడే మనస్తత్వం ఉన్న మీరు , మాటలు ఇతరులను అనే సమయం లో కూడా చాలా జాగ్రత్త గా ఉండాలి !  మాటలు కటువు గానూ , పరుషం గానూ ఉంటే , అవి అందరినీ ఒకే రకం గా బాధిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?10. ఘర్షణ !

In Our Health on ఏప్రిల్ 26, 2015 at 10:51 ఉద.

బంధాలు ఎందుకు తెగుతాయి ?10. ఘర్షణ !

ఏ బంధం లోనైనా ఎంతో కొంత , అప్పుడప్పుడూ  ఘర్షణ ఉండడం సహజమే !  కానీ ఆ ఘర్షణ నిరంతరం , అంటే విరామం అంటూ లేకుండా , పగలూ , రాత్రీ జరుగుతూ ఉంటే , ఆ బంధం తెగిపోయే అవకాశం హెచ్చుతుంది ! 
ఘర్షణ తీవ్రతరం అవుతున్నప్పుడు  బంధం లో ఉన్న ఇరువురూ గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన విషయాలు :
1.  మీకు ఆ ఘర్షణ సమయం లో ఏ విధం గా ప్రతి స్పందించాలో , అంటే రియాక్ట్ అవ్వాలో,  అది పూర్తి గా మీ మీదే ఆధార పడి  ఉంటుంది ! అంటే ఆ స్వేచ్ఛ  మీకు ఉంది !
2. ఘర్షణ సమయం లో మీరు  తీసుకునే ప్రతి చర్యా , ఆ ఘర్షణ ను తీవ్రతరం చేస్తున్నదా , లేదా ఆ ఘర్షణ ను  తగ్గిస్తున్నదా అనే విషయం మీరు ఆలోచించుకోవాలి ! మీరు తీసుకునే చర్య , కేవలం ఒక మాట అనడం కావచ్చు ! అంటే  ఒక  పరుషమైన మాట , అంటే , ఇతరుల ను ఉద్రేక పరిచే మాట , లేదా అవమాన పరిచే మాట అవ వచ్చు ! అట్లా పరుషమైన మాటలు అనే ముందు , వాటి పరిణామాలు కూడా మీరు ఆలోచించుకోవాలి ! అంటే , మీరు అనే మాట ఘర్షణ ను తీవ్రతరం చేస్తుందా లేదా అని !  లేదా ఒక  పని అవ్వ వచ్చు ! ఉదాహరణ కు , ఆ ఘర్షణ వాతావరణం నుంచి , బయటకు కానీ , ఇంకో గది లోకి కానీ వెళ్ళడం !  లేదా మీ భాగస్వామి దగ్గరికి వెళ్లి  అనునయం గా వారితో మాట్లాడి సర్ది చెప్పడం అవ వచ్చు ! లేదా  వారిని విదిలించుకుని పోవడం కూడా అవ వచ్చు ! 
3. కొన్ని సమయాలలో , మీ కు బాగా బాధ కలిగించే మాటలు వినడం కానీ , లేదా  ప్రవర్తన కానీ మీకు అనుభవం అవ వచ్చు ! ఆ సమయాలలో  వెంటనే రియాక్ట్ అవకుండా , కేవలం కొన్ని క్షణాలు  పాజ్ అంటే విరామం ఇస్తేనే , ఆ ఘర్షణ పరిస్థితి ఎంత ‘ చల్ల ‘ బడుతుందో మీరే గమనించండి ! అంటే , మీకు ఆ ఘర్షణ సందర్భం , బాధ లేదా ఉద్రేకం కలిగించినా కూడా  మీరు  ఓపికతో , వెంటనే ఇంకో మాట అనకుండా , కేవలం  మీ మౌనం తో , ఆ పరిస్థితిని మార్చ గలరు ! 
4. మీ పొరపాటును ఒప్పుకోండి !  : పొరపాట్లు మానవ సహజం ! ఎందుకంటే , ఖచ్చితమైన,  లేదా ఆదర్శ ప్రాయమైన ప్రవర్తన , కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది !  ఏది పొరపాటో , ఏది మంచో అనేది కేవలం సాపేక్ష ! అంటే రిలేటివ్ !  కానీ , మీవల్ల జరిగిన పొర పాట్లను  సహృదయత తో అంగీకరించితే , ఆ బంధం బల  పడుతుంది ! 
5. ఇతరుల ప్రవర్తన మార్చే ముందు , మీ లో మార్పు కు సిద్ధ పడండి ! మీ ప్రవర్తన  ( బంధం లో ) ఇతరుల ప్రవర్తన ఎట్లా మారుస్తుందో గమనించండి ! మీలో మార్పే , ఎదుటి వారిలో మీకు నచ్చని ప్రవర్తనను మార్చి వేయవచ్చు !  మీ బంధం  చక్కటి అనుబంధం గా మారవచ్చు ! 
మిగతా సంగతులు వచ్చే టపా లో ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ? 9. డబ్బు !

In Our Health on ఏప్రిల్ 17, 2015 at 2:35 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ? 9. డబ్బు ! 

స్త్రీ పురుషుల బంధానికి , ప్రత్యక్షం గానో , పరోక్షం గానో , డబ్బు  ఎంతగా ప్రభావితం చేస్తుందో , ప్రత్యేకించి చెప్ప నవసరం లేదు కదా ! బంధం ఏర్పడడానికి ముందు నుంచీ , ఆ బంధం గట్టి పడి , పాకం లో పడ్డాక , ఆ తీపి పాకం , చేదు అవ్వడానికి , లేదా ఇంకా తీయగా , అమృతమయం అవడానికి కూడా డబ్బు  చాలా  ఉపయోగకరం ! 
కానీ, విజ్ఞత కలిగిన స్త్రీ పురుషులు , తమ బంధం బలహీన పడకుండా , డబ్బు విలువ ను గ్రహించి , ఆ డబ్బును అదే స్థానం లో ఉంచి , ఆనంద మయ జీవితం గడప వచ్చు ! 
1. నిజాయితీ గా పరస్పరం తమ ఆర్ధిక విషయాలు తెలుసుకోవడం ! : చాలా వరకూ బంధాలు ఏర్పడే సమయం లో , పురుషులు , లేని పోని  గొప్పలు చూపిస్తూ ఉంటారు ! ఆస్తి పరులు గానూ , డబ్బు జల్సా గా ఖర్చు పెట్టే వారి లాగానూ , అమ్మాయిల ముందు , తమ ఇమేజ్  పెంచు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ! నిజం గా డబ్బు కల వారయినా కూడా , ఒక బంధం ఏర్పడ్డాక , తమ భాగస్వాములతో , ఆర్ధిక పరమైన వాస్తవాలను , మనసు విప్పి , ఉన్నది ఉన్నట్టు , మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి ! 
2. ఎప్పుడు ? :  ఇట్లా మాట్లాడుకోవడం , బాగా ఉద్రేకం గా ఉన్నప్పుడో , లేదా ఇరువురి మధ్య వాదనలు జరుగుతున్నప్పుడో చేయకూడదు ! ప్రశాంతమైన , ఇరువురికీ అనుకూలమైన సమయాల లోనే  జరగాలి ! 
3. అప్పులూ , క్రెడిట్ కార్డు అప్పులూ , ఇతర లోన్ లూ , ఇట్లా ఏ ఆర్ధిక విషయాలూ దాచుకో కుండా మాట్లాడుకోవాలి !  ఎందుకంటే , అవి వారిరువురి జీవితాలనూ ప్రభావితం చేస్తాయి కాబట్టి ! 
4. పరస్పర నిందారోపణలు కూడదు :  ‘ నువ్వు ఎక్కువ గా ఖర్చు చెస్తున్నావనో , లేదా నీవు వృధాగా ఖర్చు పెడుతున్నావనో ‘ , ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ  , తప్పు పట్టాలని చూస్తూ ఉంటే , బంధం బలహీన పడడం ఖాయం ! అందుకే నిందలు మోపడం మానుకుని , వాస్తవాలు గ్రహించాలి, ఇరువురూ !
5. కొంత సమయం తీసుకున్నా , ప్రతి నెలా , మొదటి వారం లోనో , ఆఖరి వారం లోనో , ఇరువురూ , అనుకూల సమయం లో తీరిక గా కూర్చుని , తమ తమ ఆదాయం ఎంతో , ఖర్చులు ఏంటో , ఒక ప్రణాళిక వేసుకుని , అవసరమైన ఖర్చులకు తప్పించి , అనవసరమైన ఖర్చులను ఏ విధం గా తగ్గించుకోవాలో చర్చించుకుని , తగిన నిర్ణయాలు తీసుకోవాలి ! వాటిని అమలు చేయాలి కూడా ! ఆశ్చర్యకరం గా , ఇట్లా చిన్న పాటి  లెక్కలను కూడా చేసుకోకుండా , బతుకు భారం మోస్తున్న వారు కోట్లల్లో ఉన్నారు ప్రపంచం లో ! 
6. తగినంత డబ్బును ఆదా చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి !:  విహారాల కోసమో , విందుల కోసమో , లేదా తమ సంతానం కోసమో !  ఈ రోజుల్లో ప్రతి బ్యాంకు వాడూ , ఊరూ పేరూ తెలియక పోయినా కూడా అప్పులిస్తున్నాడు ! ఆ అప్పుల వల లో పడకుండా , కొద్ది కొద్ది మొత్తాలు ఆదా చేసుకుంటూ ఉంటే , ఆర్ధిక పరమైన వత్తిడులు, బంధాలను బలహీనం చేయ లేవు ! 
7. కేవలం , తమ తమ అవసరాలకే కాకుండా , కనీస మొత్తాలను అంటే , వారి సంపాదన లో అతి కొద్ది డబ్బు నైనా , ఆపదలో ఉన్న బంధువులకోసమో , లేదా పేద వారికోసమో , ఇట్లా, ధార్మిక కార్యాలకు ఉపయోగిస్తే , ఆ బంధం దృఢ పడడమే కాకుండా ,  వారి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: