Our Health

Archive for the ‘Our minds’ Category

బయటి తిండి, మన ఆరోగ్యానికి మంచిదేనా?2.

In మన ఆరోగ్యం., Our Health, Our minds on డిసెంబర్ 6, 2017 at 12:05 సా.
బయటి తిండి, మన ఆరోగ్యానికి  మంచిదేనా?2.
Image result for transfats
బయటి తిండి తో అనర్ధాలు వివరం గా తెలుసుకుందాం , ఎందుకంటే మన ఆరోగ్యం మీద శ్రద్ధ మనకు కాకపొతే , అమ్మేవాడికి ఉండదు కదా !
అమ్మే వాడికి , సొమ్ము మీదే శ్రద్ధ ఉంటుంది ! 
ఆహారం తయారు చేయడానికి ఉపయోగించే పదార్ధాలు : ఇవి నాసి రకం గానూ , తాజావి కాకుండానూ ఉంటాయి ! ఎందుకంటే , అవి చౌక కనుక !
వండే సమయం లో లోపించే శ్రద్ధ !:
తక్కువ నూనె తో వండే , ఇగురు కూరలూ , వంటలూ , ఆరోగ్యానికి మంచివి !  ఎక్కువ నూనె వేయడమే కాకుండా , బయటి తిండి లో ఆ నూనె కల్తీ ది గా ఉండడం  అతి సాధారణం గా జరుగుతుంది !
బాగా వేయించిన వంటకాలు ఆరోగ్యానికి మంచిది కాదు !
మనం ఎప్పుడైనా , బయటి తిండి  వండే  రెస్టారెంట్ వారు కానీ , తోపుడు బండి వారు కానీ ,    ఉపయోగించిన వంట నూనె ను  బయట పారబోయడం చూశామా ? ఎందుకు చూడ లేదంటే ,  వాళ్ళు , ఒక సారి ఉపయోగించిన నూనె ను , అనేక డజన్ల సార్లు ఉపయోగించి , ఆ నూనె బాండీ లోనే ‘ ఇగిరిపోయే ‘ దాకా వాడుతారు ! 
అట్లా పదే పదే , వేయించిన నూనె  రక్తనాళాలకు చాలా హానికరం !  అట్లాటి నూనె చాలా త్వరగా రక్తనాళాలు ‘ పూడుకు ‘ పోవడానికి కారణమవుతుంది ! 
నాసి రకమైన పదార్ధాలను వాడుతున్నప్పుడు , వాటి ( తక్కువ ) రుచి ని కప్పి పుచ్చడానికి , అనేక రకాల స్పైసెస్ వేస్తారు అంటే మసాలాలు !  ఆ మసాలా మజాలో పడి , మనం ఆ పదార్ధాలను ‘ ఆహా ‘ ‘ ఓహో ‘ అనుకుంటూ , లొట్టలు వేసుకుంటూ తింటాం !
తరచు గా ఇట్లా మసాలా లు దట్టించిన ఆహారం తినడం వల్ల , కడుపులో మంట  మొదలవుతుంది !  ఇంకా మసాలా లు ఉన్న ఆహారం తింటూ ఉంటే , ఆ మంట ను , మనకు తెలియకుండానే మనం ‘ పోషించుకుంటాం ‘ !
Image result for transfats
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  

బయటి తిండి, మన ఆరోగ్యానికి  మంచిదేనా?1. 

In మన ఆరోగ్యం., Our Health, Our minds on డిసెంబర్ 2, 2017 at 10:26 సా.

బయటి తిండి, మన ఆరోగ్యానికి  మంచిదేనా?1. 

Related image

బయటి తిండి కి ఈ రోజుల్లో కలిగిస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు!
ఏ ప్రచార సాధనం చూసినా , ప్రకటనలు మారు మోగి పోతున్నాయి !
బయటి తిండికి , సులభం గా ఆకర్షింప బడడం  సహజమే !
కానీ , ఎంతమందికి తెలుసు ? ఆ బయటి తిండి లోగుట్టు ఏంటో !
కనీసం , తెలుసుకునే ప్రయత్నం కూడా చేయక , కేవలం ప్రకటనల్లో ఆకర్షణీయం గా కనబడగానే , డబ్బు ఖర్చు పెట్టి , తిందామనే ప్రయత్నంలో ఉంటారు , ప్రతి సారీ !
‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడు ‘ అనే నానుడి , బయటి తిండికీ వర్తిస్తుంది !
కొన్ని ఇళ్లల్లో ప్రవేశించగానే , ఆ ఇళ్ల వాతావరణం , మనం అక్కడ ఏమైనా తినాలా , లేదా అనే విషయం నిర్ణయింప చేస్తుంది , మనచేత !
అట్లాగే , బయట మనం తినే తిండి ( food ) , మనం కేవలం ఒక హోటల్ లో నో రెస్టారెంట్ లోనో , లేదా బజారు లో  ఉండే బండి  లోనో , దాభా లల్లోనో  , వెళ్ళగానే కనబడే డాంబికాలకు  తబ్బిబ్బు అయి తింటామే కానీ , ఎప్పుడైనా అక్కడి వంట గదుల్లో కి ప్రవేశించామా ?
అది సరే , మనం ముందు , బయటి తిండి తినడం లో ఉండే  లాభాల గురించి  మాట్లాడుకుందాం !
బంధు మిత్రుల తోనో , స్నేహితులతోనో , సరదా గా కలిసి తినే సదుపాయం.
ఏమాత్రం కష్ట పడకుండా , కావాల్సినప్పుడు , ఇష్టమైన చోటికి వెళ్లి , తిని , ఇంటికి చేరుకోవడం !
ఇంట్లో , వంట చేసి తినడమూ , అంట్ల గిన్నెలు కడుక్కోవడమూ , వంటగది శుభ్రం చేసుకోవడమూ , లాంటి శ్రమలు తప్పడం !
స్నేహితులను కలుసుకోవడానికి ఒక ‘ అడ్డా ‘ గా వాడుకోవచ్చు , రెస్టారెంట్లను !
శుభ కార్యాలకు , ప్రత్యేకం గా పార్టీలు జరుపుకోవడానికి  అనుకూలం !
ఇక బయటి తిండి తో కలిగే అనర్ధాలు కూడా చూద్దాం !
బయటి తిండి ఖర్చు తో కూడిన పని !
బయట తిండి అమ్మే వాడు ఎప్పుడూ , అతి చౌకగా పదార్ధాలను కొని , అతి ప్రియం గా మనకు అమ్మి , మన నుంచి వీలైనంత వసూలు చేద్దామనే ఆలోచిస్తాడు !
మన ఆరోగ్యం సంగతి , వారి లిస్టు లో చిట్ట చివరన ఉన్నా మనం అదృష్ట వంతులమే ! ( our health and wellbeing is their last and lost concern ! )
వంట గది శుభ్రత గురించి తెలియదు! వంట చేసే వాడి ఆరోగ్యం మనకు తెలియదు ! వాడి చేతులు ఎంత శుభ్రం గా ఉన్నాయో లేదో మనకు తెలియదు !
వంటకు ఉపయోగించే పదార్ధాల నాణ్యత సంగతి మనకు అసలే తెలియదు !   ఎంత తాజా గా ఉన్నాయో తెలియదు !
ఏ నూనె లు వాడాడో కూడా తెలియదు !
రోడ్డు పక్కన బండి వాడి సంగతి సరే సరి ! అతి (అ )పవిత్రమైన ఒకే ఒక్క  బకెట్టు జలం తోనే  ఉదయం నుంచి రాత్రి వరకూ , ప్లేట్లూ , గ్లాసులూ అనేక వందల సార్లు కడగడం ! కాదు , వాడి దృష్టి లో ‘ శుభ్రం చేయడం ‘ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  

మరి గంజాయి పీలిస్తే ప్రమాదాలేంటి ?2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 19, 2017 at 9:09 ఉద.

మరి గంజాయి పీలిస్తే ప్రమాదాలేంటి?2.

Related image

1. గంజాయి పీల్చాక వాహనం నడిపితే  స్వర్గ ద్వారాలకు చేరువ అవడం ఖాయం :
గంజాయి పీల్చి డ్రైవింగ్ చేసే వారు,  విచక్షణ, సమయ స్ఫూర్తి  లోపించి , ప్రమాదాలకు లోనవడమే కాకుండా , ఇతర వాహన చోదకుల , పాద చారుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తారు ! ఈ విషయం
అనేక పరిశోధనల ఫలితం !
2. గంజాయి ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ( లంగ్ క్యాన్సర్ ) కు హేతువు :
బాగా పట్టు బిగించి గంజాయి దమ్ము లాగే వారి ఊపిరితిత్తులను , వారి జీవితాలనూ కూడా ఆ గంజాయి లాక్కెళుతుంది !
పొగాకు లో ఉన్న విషపదార్ధాల లాంటి విషాలే , గంజాయి లో కూడా ఉన్నాయని పరిశోధనల ద్వారా తెలిసింది !
3. గంజాయి స్కిజోఫ్రీనియా కి కారకం :
గంజాయి పీల్చే వారి మానసిక స్థితి క్రమేణా అధ్వాన్నం అవుతుంది !
వారు తరచూ ,  మనుషులు లేని చోట మనుషులను చూడడం , లేదా మనుషుల మాటలను లేదా ఇతర శబ్దాలను , ఎవరూ లేని చోట వినడం అంటే శూన్యం లో శబ్దాలను వినడం జరుగుతుంది !
అంటే వారు హాలూసినేషన్స్  అనే  విచిత్ర అనుభూతి చెందుతూ ఉంటారు !
ఈ హాలూసినేషన్స్ తరచూ వస్తూ ఉంటే , వారు క్రమేణా విపరీతమైన భయం చెందుతూ , ఇతర వ్యక్తులు కొందరు కానీ , లేక అందరూ కానీ , వారి కి ఎప్పుడూ హాని తలపెట్టే ఉద్దేశం లో ఉన్నారని భావిస్తూ ఉంటారు !  ఈ భ్రమ నే ‘ పారనోయియా ‘ అంటారు !
ఈ పారనోయియా తీవ్రం గా ఉన్న వారు , వారి పక్కన ఉన్న వారి మీద అకారణంగా దాడికి దిగడమూ , వారిని  కొట్టడం లేదా ఇతర రకాలు గా గాయ పరచడం కూడా చేస్తూ ఉంటారు !
4. గంజాయి వంధత్వానికి కారణం ( infertility ):
చాలా కాలం గంజాయి దమ్ము లాగే పురుషులలో శుక్ర కణాలు తగ్గి  అంటే స్పెర్మ్ కౌంట్ తగ్గి పోయి ,వారు  తండ్రులు కాలేక పోవడం , అట్లాగే స్త్రీలలో అండాలు  తగ్గి , వారు గర్భవతులు కాలేక పోవడం కూడా జరుగుతుంది !
5. గంజాయి పీలిస్తే , వికలాంగ శిశువుల జననం :
బాగా గంజాయి పీల్చే స్త్రీలు గర్భవతులవుతే , వారికి కలగ బోయే శిశువులు అవయవ లోపాలతో పుట్టే ప్రమాదాలు  ఎక్కువ అవుతాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

పరీక్షా ఫలితాల తరువాత!

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మే 29, 2017 at 6:50 సా.

పరీక్షా  ఫలితాల తరువాత! 

Image result for sunrise

పరీక్షలు జరిగాయి , చాలా పరీక్షల ఫలితాలూ తెలిశాయి !
చాలామంది విద్యార్థులు కృతార్ధు లయ్యారు , వారికి అభినందనలు !
ఇక విజయం పొందని విద్యార్థులకు కూడా నా అభినందనలు ! 
ఎందుకంటే , ఫలితం ఎట్లా ఉన్నా కూడా , వారు కూడా కష్ట పడి  , పరీక్షలు రాశారు కాబట్టి !
మార్కులూ , ఫలితాలూ , కేవలం ఆ యా పరీక్షల కు సంబంధించినవే !
అవి జీవితం లో జయాప జయాలను నిర్ణయించే ఫలితాలు ఎంత మాత్రం కావు !
విజయానికి రహస్యాలు ఏమీ లేవు ! సరిగా సిద్ధం అవడం , అందుకు తగినంత  శ్రమ పడడంతో పాటుగా , అపజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు పోవడమే ! 
అంతే కాదు !  శ్రమ పడకుండా  విజయాన్ని పొందు దామనుకోవడం , కేవలం భూమిలో విత్తనం వేయకుండా , పండు కోసుకు ని తిందామనుకోవడం లాంటిదే !
విజయం అనేది ,  మనం ప్రతి రోజూ చేసే  చిన్న చిన్న శ్రమల పూర్తి ఫలితమే ! 
వేయి మైళ్ళ దూర ప్రయాణం కూడా మనం వేసే ఒక్క చిన్న అడుగుతోనే మొదలవుతుంది ! కష్ట సమయం శాశ్వతం కాదు ! కానీ ఆ కష్ట సమయాలను ధైర్యం గా ఎదుర్కునే వారే  పురోగతి సాధిస్తారు !
అందుకే  సఫలీకృతులు కాలేక పోయిన విద్యార్థులందరూ , ఏమాత్రం  నిరాశ చెందక ,మళ్ళీ ప్రయత్నించండి ! మీ జీవితాలు విలువైనవి ! 
అపజయాలు , మీ జీవితాలను తిప్పే మలుపులు గా భావించి , పట్టు వదలకుండా , శ్రమించి విజయం పొందండి !
ఈ బ్లాగులోనే , క్రితం పోస్టు చేసిన ‘ చదువుకోవడం ఎట్లా ? ‘ అనే వ్యాసాలను ఒకసారి చదవండి !
విజయీభవ ! 

ఒథెల్లో సిండ్రోమ్. 6 మరి చికిత్స ఏమిటి ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 9, 2017 at 6:03 సా.

ఒథెల్లో సిండ్రోమ్. 6 మరి చికిత్స ఏమిటి ? 

Related image

క్రితం టపాలలో  ఒథెల్లో సిండ్రోమ్ అంటే ఏమిటి ? , దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి ? అనే సంగతుల గురించి తెలుసుకున్నాం కదా !? ఇప్పుడు దానికి చికిత్స ఏమిటో కూడా తెలుసుకుందాం !
ముఖ్యమైన మొదటి విషయం : 
ఒథెల్లో సిండ్రోమ్ ను మొదట నిర్ధారించుకోవాలి ! అది తమంత తాము చేయలేక పొతే , స్పెషలిస్ట్ సహాయం తీసుకోవాలి !
ఈ రుగ్మత ఉన్న వారికి , మద్యం అలవాటు ఉందో లేదో ,  అంతకు ముందు ఆ అలవాటు లేక పొతే , ఈ మధ్య కొత్తగా ఆ అలవాటు అయిందో  లేదో అని కూడా పరిశోధన చేయాలి , లోతు గా !
ఎందుకంటే , మూలకారణం,  చికిత్స కు కొంత వరకు మాత్రమే లొంగుతుంది , కూడా ఉన్న , లేదా ఉండే , మద్యం , ఇంకా ఇతర వ్యసన పదార్ధాల వాడకం ( అంటే ముఖ్యం గా మత్తు మందులు ) కూడా ఈ ఒథెల్లో సిండ్రోమ్ ను బాగా ప్రభావితం చేస్తుంది , కాబట్టి వాటిని కూడా సమూలం గా ఒదిలించు కోవాలి !
 రెండో విషయం :  ఈ రుగ్మత ఉన్న వారికి  డిప్రెషన్ లేదా కుంగుబాటు కూడా ఉండ వచ్చు , దాని చికిత్స  తప్పనిసరిగా జరగాలి !
దానితోపాటుగా , తరచు  కనిపించే పారనోయియా , లేదా సైకోసిస్ అనే మానసిక పరిస్థితి ని కూడా  మందులతో కంట్రోల్ చేయాలి !
ఇక మూడో విషయం : 
సైకాలజిస్ట్ ద్వారా , ఈ రుగ్మత ను దీర్ఘ కాలికం గా చికిత్స జరిపించి , ఈ ఒథెల్లో సిండ్రోమ్ ఉన్న వారి మానసిక  విపరీత పరిస్థితి లో సమూలమైన మార్పులు తీసుకు రావాలి !
పైన చెప్పిన ఈ మూడు ముఖ్యమైన చికిత్సా పద్ధతులు  అనుసరిస్తూ , క్రమం తప్పకుండా , ఈ ఒథెల్లో సిండ్రోమ్ తీవ్రత ను అంచనా వేస్తూ , లేదా వేయిస్తూ ఉండాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
మీ అభిప్రాయాలూ , ప్రశ్నలూ ,  తెలుపగలరు ! 

5. ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 18, 2017 at 7:22 సా.

5. ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

Image result for mental tension

క్రితం టపాలో చదివినట్టు , ఈ రుగ్మత ఉన్న వారు , తమ భార్యల సాంఘిక పరిచయాలను కంట్రోల్ చేస్తూ ఉంటారు.
వారి భార్యలు , ఆ కంట్రోల్ ను తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే , అప్పుడు , వారి మీద లేని పోని అపనిందలూ , ఆపవాదులూ వేస్తూ ఉంటారు !
వారికి ఇతర పురుషులతో రహస్య సంబంధాలు ఉన్నాయంటూ , వారిని మానసిక హింసకు గురి చేస్తారు !
క్రమేణా , వారిని శారీరకం గా కూడా హింసించడం మొదలు పెడతారు !
వారి దాంపత్య జీవితాన్ని చిన్నా భిన్నం చేసుకుంటారు !
వారి తప్పులకు కారణమంతా , వారి భార్యలే అని విమర్శిస్తూ ఉంటారు , వారిని ! తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోకుండా ! 
అంతే కాకుండా , ఎప్పుడూ , తమ భార్యలను విపరీతమైన మానసిక వత్తిడికి గురి చేస్తారు !
ఆ వత్తిడి తగ్గి పోతుంటే , తాము బతకలేమనీ ,  తమకు ఆత్మ హత్యే శరణ్యమనీ  , తమ భార్యలను బెదిరిస్తూ ఉంటారు , తరచూ ! 
తరువాతి టపాలో ఇంకొన్ని సంగతులు !

4.ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

In మానసికం, Our Health, Our minds on జనవరి 28, 2017 at 5:07 సా.

4.ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

Image result for suspicious husband

మునుపటి మూడు టపాల లో ఒథెల్లో సిండ్రోమ్ ఏ విధం గా కనబడుతుందో , జీవితాలను ఎట్లా చిన్నా భిన్నం చేస్తుందో తెలుసుకున్నాం కదా !
ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం !
ఒథెల్లో సిండ్రోమ్ ఒక మానసిక దుర్బలత  ! ఈ వ్యాధి ఎక్కువగా పురుషులలో కనబడుతుంది ! ఈ వ్యాధి గ్రస్తులు , తమ మానసిక స్థితి ‘ బ్రంహాండం ‘ గా ఉందనుకుంటారు ! అంటే , వారి ప్రవర్తన సహజమే అనీ , అందులో తప్పు ఏమీ లేదని బలమైన నమ్మకం తో ఉంటారు , వారి మటుకు వారు ! 
తమ జీవిత భాగస్వామి కానీ , తమ భార్యలు కానీ , ఇతరులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ , తమను అశ్రద్ధ చేస్తున్నారనే , అపోహ పడుతూ, వారిని అనుమానిస్తూ ఉంటారు , అందులో ఏమాత్రం నిజం లేక పోయినా !
క్రమేణా , ఈ అపోహ , అనుమానం  బలం గా వారి మనసు లో నాటుకుని ,  అనేక రకాలు గా వారి భార్యల, లేదా జీవిత భాగస్వాముల ప్రవర్తనను , అనుమానిస్తూ , అను నిత్యం , వారిని ప్రశ్నిస్తూ ఉంటారు , వారి ప్రవర్తన గురించి !
వారికి సమాధానాలు చెప్పలేక , భార్యలు సతమతమవుతూ ఉంటారు ! ఎందుకంటే , వారి సమాధానాలు , ఈ ‘  వ్యాధి గ్రస్తులను ‘ తృప్తి పరచలేవు గనుక !
వారిని  ఈమెయిల్ , ట్విట్టర్ , ఇస్టాగ్రామ్ , ఫేస్ బుక్ ఎకౌంట్ లు , తెరవ నివ్వరు ! ఒక వేళ తెరిచినా , పాస్ వర్డ్  తెలుసుకుంటారు , వారిని బెదిరించి ! 
ఆ తరువాత , వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు , అనుమానాస్పద కాంటాక్ట్ ల కోసం !
వారి భార్యలను , వారి వారి తల్లి దండ్రులకూ , బంధు మిత్రులకూ దూరం చేసి , వారిని ఏకాకులు గా చేస్తారు !  వారి  వారి , అభిరుచులనూ , వారి ఆనందాలనూ , ఏమాత్రం గౌరవించక , బయటకు వెళ్ళ కుండా , కట్టు దిట్టాలు చేస్తూ ఉంటారు !
వారి సాంఘిక పరిచయాలనూ ,  కలయిక లనూ నియంత్రిస్తూ ఉంటారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని లక్షణాలు ! 

ఒథెల్లో సిండ్రోమ్……… 3.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జనవరి 15, 2017 at 10:29 ఉద.

ఒథెల్లో  సిండ్రోమ్……… 3. 

 

Image result for sunrise and birds
కాలం బరువు గా గడుస్తూంది !
నవీన్  మనసు లో అనుమాన బీజం  వేళ్లూనుకుంటూ ఉంది  !
ఏదో  వెలితి , మనసులో !
వనిత కు ‘ దగ్గర ‘ కాలేక పోతున్నాడు !
‘ వనిత ఇంకొకడి తో సంబంధం పెట్టుకుంది ‘ ఇదే ఆలోచన పదే పదే  కాగుతుంది,  గుండెల్లో !
ఇంటికి రాగానే , ఎదో ఒక సమయం లో వనిత హ్యాండ్ బ్యాగ్ లో చేతులు పెట్టి , హడావిడి గా వెదుకు తున్నాడు , సెల్ ఫోన్ నంబర్ లు  నోట్ చేసుకుంటున్నాడు !
మెసేజెస్ చెక్ చేస్తున్నాడు !
ఆఫీస్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం అయినప్పుడల్లా , ఆవేశానికి లోనవుతున్నాడు !
దానితో, అనుమానం అలలు గా ఎగిసి పడుతుంది !
రాగానే వాదన మొదలవుతూ ఉంది , వనిత తో !
తనను అనుమానిస్తున్నందుకు బాధ గా ఉన్నా , అనేక మార్లు  అనునయం గా నిజం చెప్పి , నవీన్  మనసు  మార్చడానికి ప్రయత్నించింది !
అందుకు నవీన్ ను సైకియాట్రిస్ట్ దగ్గరకు కూడా తీసుకు వెళతానంది ! అదంతా వృధా ప్రయాస అయింది ! 
నవీన్ , తనలో ‘ ఏ లోపమూ లేదు , తప్పంతా వనితదే ‘  అని వాదిస్తున్నాడు , పదే పదే  !
వనిత కు నవీన్ ప్రవర్తన లో మార్పు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు !
బ్రతుకు భారమవుతోంది  తనకు , డబ్బు  హోదా ఉన్నా, తన తప్పు లేకున్నా!
ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి !
హృదయం నవీన్ కోసం మెత్త బడి నప్పుడల్లా , మెదడు కర్తవ్యాన్ని తట్టి లేపుతూ ఉంది , వనితను  !
నవీన్ అనుమానాలు అతనికి పెను భూతాలయి , పీడిస్తున్నాయి,  అహో రాత్రాలూ !
వనిత రూమ్ లో  ఆమె బట్టలూ , పుస్తకాలూ , చిందర వందర అవుతున్నాయి !
నవీన్ , ఆమె లేని సమయం లో వెదుకుతున్నాడు, ఆమె కు లేని సంబంధాలను అంటగట్ట డానికి  ! ఉన్న సంబంధాన్ని , మంట గలపడానికి ! 
ఆ మంటలు ఉవ్వెత్తున ఎగసి పడడానికి , నవీన్ కు మద్యం తోడవుతూ ఉంది , రోజూ ! 
ఇట్లా నెలలు  గడిచాయి !
ఒక ఆది వారం ఉదయమే , ‘ అమ్మా వనితా ‘  అంటూ తలుపు తట్టాడు , ఆమె తండ్రి !
శని వారం రాత్రి త్వరగానే పడుకున్నా , నిద్రలేమి తో , నిరాశతో , తలుపు తెరిచింది , వనిత !
ఒక్కసారిగా  తండ్రిని చూడగానే బావురుమని ఏడిచింది , గుండెలకు హత్తుకుని , చిన్న పాపాయి లా !
విషయమంతా , బాగా అర్ధమయింది  తండ్రికి , ఆమె ఇమెయిల్స్ తో పాటుగా ,ప్రత్యక్షం గా వనితను కూడా చూశాక ! అక్కడక్కడా మచ్చలూ ,మానిన గాయాలూ కూడా కనిపించాయి, తన ‘ బంగారు తల్లి ‘ ఒంటి మీద !
ప్రమాద వశాత్తూ అయ్యాయని తండ్రికి  చెప్పడానికి  వనితకు ఎన్ని వంకలు దొరుకుతాయి కనక !
నవీన్  చీకటి గది లో, గాఢ నిద్రలో ‘  పడి ‘ ఉన్నాడు ,  జీవితాన్ని అంధకారం చేసుకుంటూ !
అతి కష్టం మీద తండ్రి ఉద్రేకాన్ని నివారించి , సూట్ కేస్ ను రోల్ చేసుకుంటూ , తండ్రితో కూడా బయటకు వచ్చింది వనిత !
బయట ఎంతో వెలుతురు గా ఉంది , ఆ ఉదయం ! ప్రత్యేకించి వనిత కు !
సూపర్ డీలక్స్ బస్ ఎక్కబోతూ ఒక్క ఫోన్ చేసింది, సంతోషం గా  తన తల్లికి ‘ అమ్మా నేనూ, నాన్నా మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరుకుంటాం ‘ అని !
వెంటనే , సెల్ ఫోన్  ను బస్ ముందు టైర్ కింద టక్ చేసింది ఎవరి కంటా పడకుండా !
బస్ సిటీ లిమిట్స్ దాటుతూండగా , ఆకాశం లో స్వేచ్ఛ గా ఎగురుతున్న పక్షుల తో  సింక్రొనైజ్ అయింది వనిత మనసు,  హాయి గా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

ఒథెల్లో సిండ్రోమ్……. 2.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 20, 2016 at 7:57 సా.
ఒథెల్లో సిండ్రోమ్……. 2. 
Image result for sad indian couple
ఉదయం లేవ గానే , పరుగు మొదలు !
వనిత  ముందే లేచి,  బ్రెక్ ఫాస్ట్ తయారు చేసి , తను తిని , ఆఫీస్ కు బయలు దేరింది !
‘ టేబుల్ మీద బ్రెక్ ఫాస్ట్ ఉంది , ఇవాళ త్వరగా బయలు దేరుతాను ఆఫీస్ నుంచి , హోప్ ఫుల్లీ , త్వరగా ఇంటికి చేరుకుంటే , సినిమాకు వెళదాం సరేనా? ‘ అన్నది .
ముభావం గా తల ఊపాడు  నవీన్, సరే నన్నట్టుగా !తరువాత ,  తనూ తయారై, తన కంపెనీకి వెళ్ళాడు !
లంచ్ టైం లో ఓ సారి కాల్ చేశాడు వనిత తో మాట్లాడదామని ! రెస్పాన్స్ రాలేదు ! మరో మూడు సార్లు వెంట వెంటనే కాల్ చేశాడు ! వనిత దగ్గర్నుచి ఎస్సెమ్మెస్ మెసేజ్ వచ్చింది , చాలా పని వత్తిడి గా ఉందని, త్వరగా ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నానని  !
వనిత అలా చేయదే ! ఇంకెవరితోనో ఫ్రెండ్లీ గా ఉంటుందేమో ఆఫీస్ లో !? తనతో మరి ఎందుకు ప్రేమ నటిస్తుంది ?! ‘ ఈ ఆలోచనలతో , ఎదో తిన్నాననిపించాడు లంచ్ , నవీన్ !
తన వర్క్ కూడా వేగం గా చేయలేక పోయాడు,హెడేక్ గా ఉందని, ముందుగానే బయలు దేరాడు, ఇంటికి !
వనిత ఇంట్లోకి అడుగు పెడుతూనే , ‘ వచ్చేశా ! ‘  అలసిపోయినా , ఉల్లాసం గా, నవ్వు ముఖం తో అంది , నవీన్ తో !
టీవీ  చూస్తున్న నవీన్ , తన మొహం ఆమె వైపు కనీసం చూడకుండా , ‘ అన్ని సార్లు చేసినా , నా కాల్  రిటర్న్ చేయలేనంత బిజీ అయ్యావా నువ్వు ?!’  అని అడిగాడు ! ‘
‘ నీకు తెలుసు కదా నవీన్ ‘ ఎంత బిజీ గా ఉంటుందో మా ఆఫీస్ ‘?! అన్నది వనిత అనునయం గా.
సరే పద సినిమా కు ‘ అన్నాడు షూ లేసెస్ కట్టుకుంటూ , ఆమె దగ్గరకైనా వెళ్లకుండా !
బాక్స్ లో కూర్చుని సినిమా చూస్తున్నా , సినిమా మీదకు మనసు పొవట్లేదు ! నవీన్ కు !
వనిత , పక్కనే ఉన్నా , తనకు దూరమవుతూ  ఉన్నట్టు అనిపిస్తుంది !
వనితకు , పరిస్థితి అర్ధం కావట్లేదు ! తాను చేసిన తప్పేంటో తెలియట్లేదు !
ఎదురుగా  స్క్రీన్ మీద రొమాంటిక్ సినిమా ! హీరో , హీరోయిన్  తరచూ , చిలిపిగా దగ్గరికి చేరుకొని , ముద్దులు కుమ్మరించు కుంటున్నారు ఒకరి మీద ఒకరు !
నవీన్ లో ‘ చలనం ‘ కనబడటం లేదు వనితకు !
సినిమా అవగానే , కార్ స్టార్ట్ చేసి , దారిలో ఓ రెస్టారెంట్ ను బైపాస్ చేశాడు నవీన్ !
నిశ్శబ్దం గా ఇంటికి చేరుకున్నారు,  ఇద్దరూ !
ఆకలి అవుతున్నా , ఫ్రిజ్ ఓపెన్ చేసి , వైన్ బాటిల్ ఓపెన్ చేసి , ఓ రెండు గ్లాసులు  తాగాడు నవీన్  !
అమాయకం గా , చిన్న పిల్ల లా ఒక పక్కకు తిరిగి , ఒళ్ళు తెలియకుండా , నిద్రపోతున్న  వనితను చూస్తూ , తనూ జారుకున్నాడు, నిద్ర లోకి !
వచ్చే టపాలో మరి కొంత ! 

ఒథెల్లో సిండ్రోమ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 22, 2016 at 8:21 సా.

ఒథెల్లో సిండ్రోమ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 1. 

Image result for woman in a wine bottle

నవీన్ ఓ ఐటీ  కంపెనీ లో పని చేస్తున్నాడు !  చాలినంత జీతం. ముందే  మనసులు కలిసిన మగువతో పెళ్లయింది కూడా !  వనిత  కూడా ఇంకో ఐటీ  కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ !
కొంత కాలానికి  సంతానం మాట దాటవేస్తూ , తమ పొందు లో అంతులేని  ఆనందం అనుభవిస్తూ ఉన్నారు, పగలూ రాత్రీ కూడా !
వనిత , అధునాతన మైన హేర్ స్టైల్  తో ,  పిచ్చెత్తించే తన అందాలను కూడా,  తీరిక గా చూసుకోవడం, వాటి పై  శ్రద్ధ తీసుకోవడం  నేర్చుకుంటూ  ఉంది  ! ఇతర కొలీగ్స్ కూడా అసూయ పడే అందం ఆమెది ! ఆ వయసులో కనిపించే  ఆమె  ముక్కు సూటి గా పోయే స్వభావం , కొంత చిలిపితనం , చుట్టూ ఉన్న అందరినీ ‘ కట్టి పడేస్తాయి’  ! దానికి తోడు , వర్క్ కూడా అంకిత భావం తో చేస్తూ ఉండడం తో  ప్రమోషన్ కూడా వచ్చింది,  ఈ మధ్యనే !
గత కొన్ని నెలలు గా నవీన్ , వనితను ‘ ఇంకోలా ‘ చూడడం మొదలెట్టాడు ! ఇంటికి రావడం కాస్త ఆలస్యం అయినా, ఆరాలు తీస్తున్నాడు ! వనిత , అది విరహం అనుకుంది !
ట్రాఫిక్ ను దాటుకుంటూ , ఇంటికి  రావడం ఆలస్యం అయినా కూడా , ఆ అలసట కనబడ నీయక , ప్రేమ భావనతో , చక చకా వంట చేసి , ఇద్దరూ తిన్నాక  ,ఎర్ర బడుతున్న బుగ్గలతో , నవీన్ తో  సరసాల కు సమయం కేటాయించింది !
నవీన్ మాత్రం , ముభావం గా ఉంటున్నాడు !
‘ ఏంటి,  నవీన్ గారు ఈ రోజు అంత ఫ్రిజిడ్ గా ఉన్నారు ?! ‘ అంది !
‘ ఎందుకు ఇంత ఆలస్యం అయింది ?’
‘ నీకు తెలుసు కదా ,నా రూట్ లో  వెధవ ట్రాఫిక్  సంగతి ? డ్రైవింగ్ నత్త నడక అయింది ! ‘
కొంత వర్క్ ఉంది చేయాల్సి ఉంది  ‘ అని ల్యాప్ టాప్ ఆన్ చేసి , అందులో మునిగి పోయాడు నవీన్ !
తన అందాలను అతి సున్నితం గా ‘ స్పృశించే ‘ నవీన్ ‘ మడి ‘ కట్టుకోవడం అసాధారణం గా అనిపించింది వనితకు !
నిరాశ కు అలసట  కూడా తోడై , బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది , ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలియ లేదు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: