Our Health

Archive for the ‘Our mind’ Category

ఏ నూనెలు , ఏ వంట కు వాడాలి ? 1.

In మన ఆరోగ్యం., Our Health, Our mind, Our minds on డిసెంబర్ 26, 2015 at 12:40 సా.

ఏ నూనెలు , ఏ వంట కు వాడాలి ? 1. 

( పైన ఉన్న బార్ గ్రాఫ్ గమనించండి ! 
అందులో , మరిగించే కాలం ఎక్కువ అవుతున్న కొద్దీ , వివిధ రకాల వంట నూనెల లో , విషపూరిత ఆల్డి హైడ్ ల శాతం ఎట్లా పెరుగుతుందో  తెలియ చేయ బడింది ! ఆశ్చర్య కరం గా ,  వెన్న , కొబ్బరినూనె ల లో , తక్కువ విషపూరిత ఆల్డి హైడ్ లు విడుదల అవుతాయి ! ) 

ఇప్పటి వరకూ , ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ , కార్న్ ఆయిల్  ( అంటే మొక్క జొన్న నూనె ) ల   తో చేసిన వంటకాలు , ఆరోగ్య కరమైనవనీ , నెయ్యి , వెన్న లతో చేసిన వంటకాలు అనారోగ్య కరమైనవనీ భావించడం జరుగుతూంది !

తాజా పరిశోధనల ఫలితాలు అందుకు భిన్నం గా ఉన్నాయి !
ప్రొఫెసర్ మార్టిన్ గ్రూట్ వెల్డ్ ( జీవ రసాయన విశ్లేషణ నిపుణుడు ) డి  మాంట్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం లో పరిశోధనలు చేసి  , ఈ ఫలితాలు ప్రకటించాడు !
మనం మామూలు గా మంచివి అనుకుంటున్న  వంట నూనెలు మంచివే , కానీ ఆ మంచి , ఆ నూనె లలో , కొద్దిగా వేడి చేసి నంత వరకే ఉంటుంది !
అంటే , ఆ నూనెలను మరిగించి , అందులో  బజ్జీలు , లేదా ఇతర  వేయించిన వంటకాలు వండితే ,  ఆ నూనెలు ఆరోగ్య కరం కాదు ! 
ఈయన గారు  అందుకు కారణాలు కూడా, స్పష్టం గా తెలియ చేశారు !
అతిగా వేడి చేసిన వంట నూనెలు , అంటే సాధారణం గా ఎక్కువ నూనె , గిన్నె , లేదా భాండీ లో సగానికి పైగా పోసే నూనెలు , బాగా ఎక్కువ ఉష్ణోగ్రతల లో వేడి చేయ బడతాయి !
ఇట్లా వేడి అయ్యాక , ఆ నూనెల లో నుంచి ,  ఆల్డి హైడ్ లు అనే రసాయనాలు బయటకు వస్తాయి !  మరి ఆ బయటకు వచ్చిన ఆల్డి హైడ్ లు , మనం తినే ఆ వంటకాల తో పాటుగా , మన శరీరాలలోకి ప్రవేశిస్తాయి ! 
ఆల్డి హైడ్ లు, విష పూరితాలు !  కానీ ఆ  విష పూరితాలు , మనకు వెంటనే హాని చేయకుండా , కొంత కాలం అయ్యాక , వాటి ప్రభావం , మన దేహం లో చూపిస్తాయి !  ( పైన ఉన్న బార్ గ్రాఫ్ గమనించండి !  ) 
గుండె జబ్బులకు , క్యాన్సర్ కూ , ఇంకా మతి మరుపు జబ్బు ( డిమెంషియా అని అంటారు ) లకూ కారణమవుతాయి ! 
మనం నూనెలను ఎక్కువ గా వేడి చేస్తే కలిగే పరిణామాలు తెలుసుకున్నాం కదా , మరి వచ్చే టపాలో , వివిధ వంట నూనెలు , ఎట్లాంటి వంటల్లో వాడాలో కూడా తెలుసుకుందాం !

ఏ వ్యాయామం ఎందుకు ? 2.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our mind on డిసెంబర్ 13, 2015 at 3:34 సా.

ఏ  వ్యాయామం ఎందుకు ? 2.

మునుపటి టపాలో , ఏరోబిక్ వ్యాయామం వల్ల, మన శరీరానికి కలిగే లాభాల గురించి తెలుసుకున్నాం కదా !
మరి ఇప్పుడు,  ఏ యే  రకాల వ్యాయామాలు మన మెదడు లో ఏయే భాగాలకూ , కేంద్రాలకూ , ఉపయోగ పడతాయో తెలుసుకుందాం !
పరిణితి చెందిన మానవ మెదడు , అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన , మానవ మెదడు లో  ఉండే నాడీ కణాల సంఖ్య  వంద బిలియన్లు !
ఈ కణాలన్నీ కూడా  అనేక రూపాలలో , నిర్మితం అయి ,  అనేక లక్షల  సంధానాలతో  ,అన్ని ఇతర  కణాలతో సంబంధం కలిగి ఉంటాయి, నిరంతరం !
మన లో ఆలోచనలను జనింప చేయడానికీ , వివిధ రకాల పనులను మనతో చేయించడానికీ కూడా , మెదడు నిర్మితమై ఉంటుంది ! అందుకోసం మెదడు లో అనేక కేంద్రాలు నిర్మాణం అయి ఉన్నాయి !
ఉదాహరణకు :
ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి !  చిత్రం లోని ఎరుపు భాగమే !  )  మనం , ఏ పని చేయ బోయినా , ఆ పని యొక్క యుక్తా యుక్త విచక్షణ కలిగించి , అవకతవక పనులను నివారించి , నిర్మాణాత్మక మైన, ఒక లక్ష్య నిర్దేశన  ఉన్న పనులను మాత్రమే , మన చేత చేయించే కేంద్రమే , ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ !
రోజూ , ఒక మాదిరి బరువులను ఎత్తడం వల్ల , ఈ భాగం శక్తి  వంత మవుతుంది !
ఫ్రాంటల్ లోబ్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ! చిత్రం లోని ఎరుపు భాగమే !  ) ఇది మన మెదడు ముందు భాగం లో ఉండే నిర్మాణం !  అంటే మన నుదుటి వెనుక కపాలం అంటే స్కల్ లో ఉంటుంది !  ఈ నిర్మాణం , మానవుల కండరాలు   చేసే పనులను నియంత్రిస్తూ  ఉంటుంది !
క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల , ఈ భాగం ఎక్కువ క్రియాశీలం అవుతుంది !
హైపోతలామస్ : (క్రింద ఉన్న చిత్రం చూడండి , చిత్రం లోని ఎరుపు భాగమే ! )  ఈ కేంద్రం , అతి సున్నితమైనది. ఇది , మెదడు లోపలి భాగాలలో నిర్మితమై ఉండి , మానవుల ఆకలి నీ ,  కామ సంబంధమైన అనుభూతులనూ , లింగ నిర్ధారణ నూ ,  నియంత్రిస్తూ ఉంటుంది ! ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల  హైపోతలామస్ ఉత్తేజం అవుతుంది !
పరైటల్ లోబ్ (  క్రింద ఉన్న చిత్రం చూడండి,  చిత్రం లోని ఎరుపు భాగమే ! ) : ఈ కేంద్రం , ఫ్రాంటల్ లోబ్  తరువాత ఉండే భాగం !  ఈ భాగం లో మానవుల దృశ్య శబ్ద గ్రహణ నాడులను అనుసంధానం చేసి , మన ఆలోచనలను హేతు బద్ధం గా చేసే వ్యవస్థ ఉంటుంది !
హిప్పో క్యాంపస్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ,చిత్రం లోని ఎరుపు భాగమే ! ) ఈభాగం మన జ్ఞాపక శక్తి కి కేంద్రం !  ఈ భాగం కూడా ఏరోబిక్ వ్యాయామం వల్ల  ఉత్తేజం అవుతుంది ! విద్యార్ధులకు  ఏరోబిక్ వ్యాయామాలు , పరీక్షల సమయం లో బాగా ఉపయోగం అందుకే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోడం ఎట్లా? 6. ఆలస్యం, అమృతం విషం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our mind, Our minds on నవంబర్ 18, 2013 at 6:33 సా.
చదువుకోడం ఎట్లా? 6. 
ఆలస్యం, అమృతం విషం ! : ( దీని అర్ధం , ఆలస్యం అమృతమూ ,విషమూ కూడా అని కాదు , ఆలస్యం చేస్తే , అమృతం కూడా విషం అవుతుంది అని ! )  చదువుకునే విద్యార్ధులకు సమయ పాలన గురించి  , వారికి తెలిసినా , తెలియక పోయినా , తెలియ చేయ వలసిన బాధ్యత , బోధించే గురువుల మీద ఉంది !  సామాన్యం గా , బడికి వెళ్ళే విద్యార్ధులను ‘ చిన్న క్లాసులే కదా ‘ చిన్న పిల్లలు కదా  ‘  కిండర్ గార్టెన్ ‘ చదువులే కదా ! అనే ఒక రకమైన ముద్దూ , ఇంకో రకమైన నిర్లిప్తతనూ, తల్లి దండ్రులూ , ఇతర పెద్దలూ , ర్పరుచుకుంటారు ( ఉపాధ్యాయులు కూడా)  ఒక రకం గా, ఆ భావనలన్నీ యదార్ధాలే !  కేవలం ఆకారణం చేత ,  వారికి సమయం యొక్క ప్రాముఖ్యతా ,  సమయ పాలనా , నేర్పించడం మానకూడదు !  సమయ పాలన తో ముఖ్యం గా అలవాడే ఒక గుణం , క్రమ శిక్షణ ! మనం దైనందిన జీవితాలలో , సమయానికి పనులు చేయక పొతే , పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఊహించుకోండి !  ఈ సమయ పాలన, చిన్న తనం నుంచీ , బాల బాలికలకు ఒక ముఖ్య విధి గా నేర్పించాలి ! సమయ పాలనకూ, క్రమ శిక్షణ కూ, ప్రతి విద్యార్ధీ , అలవాటు పడాలి ,  లేదా ప్రతి అధ్యాపకుడూ , వారికి ఆ గుణం అలవాటు చేయాలి ఎందుకంటే , మానవుల కందరికీ , ప్రతి రోజు లోనూ ఉండేవి 24 గంటలే !   
మరి  చదువు లోనూ , పరీక్షలకు సిద్దమవడం లోనూ , ఈ సమయ పాలన ప్రాముఖ్యం ఏమిటి ? :   చిన్న తనంలో,  తల్లి దండ్రులు  తరచూ తమ సంతానానికి  చెప్పే మాటలు,  ” ఏరోజు పాఠాలు, ఆ రోజే  నేర్చుకో ”  అని !   ఇది చాలా చిన్న సలహా అయినా , ఎంతో విలువైన సలహా !  ఈ సలహాలో నిగూఢ మైన అర్ధం , ‘ ఆలస్యం చేయవద్దు’  అని !  ఒక క్రమమైన పద్ధతిలో, రోజూ కొంత సమయం కేటాయించి , చదువుకుంటే , చదివినది అర్ధం అవడమే కాక , మస్తిష్కం , అంటే మెదడు లోకి ‘ ఎక్కుతుంది ‘  ఈ మెదడు లోకి ఎక్కడం అంటే ఏమిటి ? :  మన జ్ఞాపక శక్తి నిలువ లోకి , చదివినది వెళుతుంది !  అంటే జ్ఞాపక శక్తి స్టోర్ అన్న మాట !  ఈ ‘ స్టోర్’  లోకి వెళ్ళిన విషయాలు  ఒక పట్టాన ‘ చెరిగి పోవు ‘  ! ( మనం, ముందు ముందు ,  మనం చదివింది, బాగా మెదడులో ‘ ముద్రింప ‘ బడడానికి ఏం చేయాలో ( అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ చేసుకోడానికి ఏం చేయాలో ) కూడా తెలుసుకుందాం ! ) 
ఇక పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ , ఒక్కో విద్యార్ధీ  , త్వర త్వరగా , రెండు వారాలలో చదవ వలసినది , ఒక వారం రోజుల లోనో , లేదా నెల లో చదవ వలసినది , రెండు వారాల లోనో చదివేసి ‘ తమ పని పూర్తి ‘ అయిందనిపించుకుంటారు ! కానీ వారు చేస్తున్నది, వారికి మానసికం గా తృప్తి ఇస్తుందేమో కానీ , చదివిన సంగతులు మాత్రం , మెదడు లో ఎక్కువ కాలం నిలువవు ! తీరా పరీక్ష రోజున ,  చదివిన విషయాలన్నీ కూడా స్పష్టత లోపించి , దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆకాశం లా అవుతుంది పరిస్థితి !  పరీక్ష సరిగా రాయకుండా , ఆ తరువాత   వారి కన్నీరు ‘ వర్షించి నా ‘ కూడా వారికి మార్కులు ఎక్కువ రావు కదా ! ఫలితం , విఫలమవడమో  ( అంటే ఫెయిల్ అవడమో )  లేదా చాలా తక్కువ మార్కులు రావడమో జరుగుతుంది కదా ! 
వచ్చే టపాలో  ఇంకొన్ని సంగతులు ! 

చుంబన రహస్యాలు.12. ఫ్రెంచి ముద్దు ప్రేమైకం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our mind, Our minds on సెప్టెంబర్ 27, 2013 at 9:37 సా.

చుంబన రహస్యాలు.12.  ఫ్రెంచి ముద్దు ప్రేమైకం !

మీ పెదవులతో, ఆమె పెదవులను  నెమలి ఈకతో  తాకినట్టు తాకడం :   మీ ఇరువురి పెదవులూ చేరువ అయిన తరువాత , మీ పెదవులతో, ఆమె పెదవుల మీద అతి సున్నితం గా తగలాలి !  ఆ టచ్, కేవలం,  మీరు ఒక నెమలి ఈక తో ఆమె పెదవులు తాకు తున్నంత సుకుమారం గా ఉండాలి !   ఎందుకు  అట్లా ? పెదవుల లో అనేక వందల నాడీ తంత్రులు గజిబిజి గా అల్లుకుని ఉంటాయి !  ఆ నాడీ తంత్రులు , అతి సున్నితమైన స్పర్శకు కూడా తక్షణమే స్పందించే  ధర్మం కలిగి ఉంటాయి !  మీ పెదవుల నెమలి ఈకలు ఆమె పెదవులను తాకగానే , ఆమె లో నూ , తద్వారా  ఆమె పెదవులలోనూ , విపరీతమైన యాంటిసిపేషన్ , ఎగ్జైట్ మెంట్ , కలుగుతాయి. అంటే ఆమె పెదవులు ,  మీ పెదవుల స్పర్శ తో ఉత్తేజం చెందడమే కాకుండా ,  మీ పెదవులతో బంధం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కూడా ! ఈ దశలో , పూర్తి ముద్దు కోసం కాదు ఆ ఎదురు చూపు !   ఈ పరిస్థితి లో, మీరు విపరీతం గా ఉద్రేక పడి పోకుండా , మీకు ఇప్పుడు ప్రపంచం లో  ఉన్న సమయం అంతా , మీ ఆధీనం లోనే ఉన్నట్టు భావించి , అతి నిదానం గా నింపాది గా  మీ నెమలీక  స్పర్శ ,  ఆమె పెదవులకు కలిగించాలి ! 
ఈ విధం గా కొంత సేపు ( ఎంతో సేపు ) చేసిన తరువాత , మీ ఉద్దేశం తెలియ చేయండి , ఫ్రెంచి ముద్దు కోసం ! అందుకు మీ సన్నద్ధత ను కూడా ఈపాటికి తెలియ చేసే ఉంటారు ! ఇప్పుడు, మీ నోరు విశాలం గా తెరచి , ఆమె కింది పెదవిని , మీ రెండు పెదవులతో లాక్ చేయండి అంటే బంధించడం !  ఆ తరువాత మీ నాలుక తో ఆమె క్రింది పెదవిని  ఇక్క సారిగా కేవలం కొన్ని క్షణాల పాటు స్వీప్ చేయండి , అంటే ఆమె క్రింది పెదవి మీద , మీ నాలుకతో వెన్న పూస్తున్నట్టు తాకడం !  ఆమెకు మీ చర్య ఇష్టం అవుతే ,  ఆమె నాలుక కూడా క్రియా శీలం అవుతుంది అంటే యాక్టివ్ గా మీ పెదవుల కోసం సాగుతుంది ! లేక , ఆమెకు ఇష్టం లేక పొతే  మీరు ఏ చర్యనూ ఫీల్ అవరు !  అప్పుడు , మీ ప్రయత్నం తాత్కాలికం గా విరమించుకుంటే మంచిది !  
ఆమె ఉత్సాహం చూపుతూ ఉంటే , మీ నాలుకకు పని పెట్టడం మీ తరువాతి కార్యక్రమం !   ఆమె నాలుకను మీ నాలుక తో తడిమి ( రుచి ) చూడడం , కొద్దిగా ఆమె నాలుకను తాకి , మళ్ళీ మీ నాలుక వెనుకకు పొతే , ఆమె దానిని అందుకోడానికి తన నాలుకను సాగ దీయడం ,  నోటి లో ఒక ప్రేమాట లా ఉంటుంది !   ఆనంద దాయకం గా , చిలిపి గానూ ఉంటుంది !  గుర్తు ఉంచుకోవలసినది, నాలుకను ఎప్పుడూ సాఫ్ట్ గానే ఉంచాలి ! దృఢ మైన కండరం గా చేయకూడదు !  అంతే కాకుండా , అత్యుత్సాహం తో మీ నాలుకను వీలైనంత పొడవు గా చాచి  ఆమె గొంతు కు అడ్డం గా పోనీయ కూడదు ! అప్పుడు ఆమె ఉత్సాహం నీరు కార్చిన వారవుతారు  మీరు ! 
మరి ఈ ఫ్రెంచ్ చుంబన కార్యక్రమం ఎక్కువ సమయం సాగుతుంటే , మీ   రిరువురూ శ్వాస తీసుకోవడం మరచి పోకూడదు !  మొహమాట పడకుండా , తరచూ శ్వాస తీసుకుంటూ ఉండాలి కూడా !  సరిపడినంత ఆక్సిజన్ అందితే , మీ మెదడు తో పాటుగా , మీ పెదవులూ , నాలుకా కూడా  ఉత్సాహం తో ‘ పని చేసి ‘ మీకు అధిక ఆనందాన్ని కలుగచేస్తాయి ! 
 
ఈ ఫ్రెంచి ముద్దులో కూడా కొన్ని అడ్వాన్స్ డ్  టెక్నిక్ లు ఉన్నాయి ! వాటి గురించి వచ్చే టపాలో ! 

విటమిన్ A – అనావృష్టీ , అతి వ్రుష్టీ !.4.

In ప్ర.జ.లు., మానసికం, Our mind, Our minds on డిసెంబర్ 9, 2012 at 2:23 సా.

విటమిన్ A – అనావృష్టీ , అతి వ్రుష్టీ !.4.

క్రితం టపాలలో మనం మన నిత్య జీవితం లో మన కళ్ళ ఆరోగ్యానికీ , మన శరీర చర్మ ఆరోగ్యానికీ, విటమిన్ A  ఎంత ముఖ్యమైన విటమినో తెలుసుకున్నాం కదా ! అసలు విటమిన్లన్నీ మన దేహానికి చాలా తక్కువ పాళ్ళ లో క్రమం తప్పకుండా అందుతూ ఉండాలి ! ఒకవేళ మనకు అన్నీ ఉండి అంటే , మనం ఒక మాదిరిగా ధనవంతులమై ఉండి, రోజూ లక్షణం గా ” షడ్ర సోపేతం గా ” అన్నీ వేసుకుని తినడం చేస్తూ ఉన్నప్పుడు , మనకు కావలసినంత కన్నా ఎక్కువ విటమిన్లు మనకు అందవచ్చు ! ఆ పరిస్థితిలో అట్లా ఎక్కువ గా లభించిన విటమిన్లు ముఖ్యం గా విటమిన్ A మన శరీరం లో లివర్ దానినే కాలేయం అంటారు కదా తెలుగులో , అందులో నిలువ చేయ బడతాయి. కానీ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే , విటమిన్ A , ఇంకా విటమిన్ E, D, K ( ముందు ముందు తెలుసుకుందాం ) మన దేహం లో ఉండవలసిన దానికన్నా ఎక్కువ గా ఉంటే , ఆ పరిణామాలు కూడా విపరీతం గా ఉంటాయి. అంటే అప్పుడు వచ్చే లక్షణాలు చెడు గా ఉంటాయి.

ఇట్లా అతి వృష్టి ( విటమిన్ A ) ఏ ఏ పరిస్థితులలో జరుగుతుంది ?: 

సామాన్యం గా షాపులలో దొరికే విటమిన్ మాత్రలు లేదా మల్టీ విటమిన్ మాత్రలు, విటమిన్ లోపం ఎప్పుడు వస్తుందో అన్న ఆందోళన, కంగారులో , అతిగా వేసుకోవడం వల్ల ,( అంటే డాక్టర్ సలహా ప్రకారం కాకుండా ఆరోగ్యం మీద అత్యాశ కు పోయి ) జరగ వచ్చు.
అలాగే ముఖ్యం గా ( ముఖ్యం గా మాంసాహారుల ) తల్లి దండ్రులు తమ పిల్లలు తెలివిగానూ , ఆరోగ్యం గానూ , త్వరగానూ ( ! ) పెరగాలని , తరచూ కాలేయం , లేదా లివర్ తో చేసిన వంటలను , తినిపిస్తున్నప్పుడు కూడా ఈ విటమిన్ A కాస్తా ” అతి విటమిన్ A ” అవవచ్చు.
ఈ పరిస్థితిని ” హైపర్ విటమినోసిస్ ” అని అంటారు. గమనించ వలసిన విషయం ఏమిటంటే , శాకాహారుల ఆహారం లో ఇట్లాంటి పరిస్థితి చాలా అరుదు గా వస్తుంది. ఎందుకంటే జంతువుల కాలేయం లేదా లివర్ లోనే విటమిన్ A అధిక శాతం లో ఉంటుంది. క్యా రెట్ లలో కూడా ఉంటుంది కానీ రోజూ ఎక్కువ క్యారట్ లు తిన్న వారికి   ( అట్లా నెలల తరబడి తింటూ ఉంటే నే ) కూడా ఈ అతి విటమిన్ A లక్షణాలు రావడానికి అవకాశం ఉంది .
మరి ఈ హైపర్ విటమినోసిస్ A లక్షణాలు ఎట్లా ఉంటాయి ?:

శాక హారులైనా , లేదా మాంస హారులైనా ఈ విటమిన్ A కావలసిన దానికన్నా ఎక్కువ గా మన శరీరం లో నిలువ ఉన్నప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి:
1. చర్మం గరుకు గా అయి పొలుసులు పొలుసులు గా ఊడిపోవడం ( దీనిని ఇంగ్లీషు లో desquamation డి స్క్వామేషన్ అంటారు ).
2. మన ఎముకలు పెళుసు గా తయారై నొప్పులు రావడం
3. లివర్ లేదా కాలేయం సరిగా పని చేయక
4. పచ్చ కామెర్ల లాగా చర్మం రంగు మారడం
5. వెంట్రుకలు ఎక్కువ గా ఊడిపోవడం

ఇంకా వికారం గా కళ్ళు తిరగడం , బీ పీ పెరగడం , ఏకాగ్రత లేక పోవడం కూడా జరుగుతుంటాయి.
మరి చికిత్స ఏమిటి ?: చికిత్స ఈ విటమిన్ A శరీరం లో ఎంత ఎక్కువ గా నిలువ ఉన్నదీ అన్న దాని మీద ఆధార పడి ఉంటుంది. ఈ అనుమానం ఉన్నపుడు , వెంటనే స్పెషలిస్టు డాక్టరు ను సంప్రదించాలి.
వచ్చే టపాలో విటమిన్ A ( లోపం ) అనావృష్టి ని ఎట్లా చికిత్స తో నివారించ వచ్చు వాటి వివరాలు తెలుసుకుందాం !

In Our mind on ఏప్రిల్ 27, 2012 at 9:51 సా.
%d bloggers like this: