బీ పీ కంట్రోలు కాకపొతే ?.4.
మునుపటి టపాలో పటం ద్వారా మనం క్లుప్తం గా తెలుసుకున్నాము కదా బీ పీ కంట్రోలు కాక పొతే వచ్చే ప్రధాన పరిణామాలు.
ఇప్పుడు ఆ ఆంగ్ల పదాలను తెలుగు లో వివరించడానికి ప్రయత్నిస్తాను.
అదే పటాన్ని మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది, చదువరులు వెనకటి టపా చూడనవసరం లేకుండా !
మీరు పటం లో చూస్తున్న శీర్షిక ‘ మెయిన్ కాంప్లికేషన్స్ అఫ్ పర్సి స్టెంట్ హై బ్లడ్ ప్రెషర్ ‘ అని ఉంది. అంటే అందులో చాలా అర్ధం ఉంది.
దీనిని తెలుగులో చెప్పాలంటే ‘ అధిక రక్త పీడనం, ఎక్కువ కాలం ఉంటే జరిగే ప్రధాన విపరీత పరిణామాలు ‘ అని. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, ‘ చాలా కాలం ‘ కంట్రోలు లో లేని అధిక రక్త పీడనం అన్న మాట !
ఇక మిగతా ఆంగ్ల పదాలు చూద్దాము.
మెదడు లో పరిణామాలు :
Cerebro vascular accident or CVA : సెరిబ్రో వాస్క్యులార్ యాక్సిడెంట్ అంటే ‘ మెదడు లోని రక్త ప్రసరణ లో జరిగే ప్రమాదం’ దీనినే స్ట్రోక్ అంటారు ( stroke ) తెలుగులో పక్ష వాతం అని కూడా ఉంటారు. దాని గురించి ముందు ముందు మనం తెలుసుకుందాము.
రెండో ప్రధాన పరిణామం : Hypertensive encephalopathy : ‘ హైపర్ టేన్సివ్ ఎంకేఫలో పతీ ‘ లేక అధిక రక్త పీడనా మస్తిష్కం ‘ అనవచ్చు నేమో తెలుగు లో దీనిని ( ఇంకా మంచి పదాలు తెలుగు లో ఉంటే తెలియ చేయండి )!
ఈ పరిస్థితి ఏర్పడితే , విపరీతమైన తల నొప్పి గా ఉండటమూ, Confusion , కన్ఫ్యు షన్ అంటే మతి స్థిరం గా లేక పోవడమూ జరిగి, అధిక రక్త పీడనం అలాగే కంట్రోలు కాకుండా ఉంటే , మూర్చ లేక ఫిట్స్ రావడం జరుగుతుంటుంది. ఇంగ్లీషు లో convulsion (కన్వల్స్హన్ అంటారు )
కంటిలో పరిణామాలు : Hypertensive retinopathy : హైపర్ టేన్సివ్ రేటినో పతీ అంటే అధిక రక్త పీడనం వల్ల ( ఇక్కడ కూడా మనం పర్సిస్ టెంట్ అనే మాట గుర్తుంచు కోవాలి, అంటే దీర్ఘ కాలం అధిక రక్త పీడనం ఉంటే ) కంటి లోని అతి ముఖ్య మైన రెటీనా అనే భాగం లో వచ్చే మార్పులు, జరిగే పరిణామాలూ.
Heart , లేక గుండె లో ప్రధానం గా జరిగే పరిణామాలు :
1. Myocardial Infarction, మయో కార్దియల్ ఇన్ఫార్క్షన్, దీనినే తెలుగు లో గుండె పోటు అంటారు కదా ! దీనికే ఆంగ్లం లో ఇంకో పేరుంది, అది Heart Attack ( హార్ట్ ఎటాక్ ) . దీని గురించి మనం కూడా మనం ముందు ముందు వివరం గా తెలుసుకుందాము.
2.Hypertensive Cardiomyopathy : హైపర్ టేన్సివ్ కార్డియో మయోపతీ. అంటే అధిక రక్త పీడనం వల్ల గుండె కండరాలలో జరిగే మార్పులూ , వాటి పరిణామాలూ !
3. Heart failure: గుండె విఫలం అనవచ్చేమో ఈ పరిస్థితిని. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం. గుండె విఫలం అవగానే ప్రాణాలు పోవు అని. గుండె విఫలం కూడా కొన్ని దశలలో జరుగుతుంది, ఉంటుంది. చాలా మంది ఈ పరిస్థితి అనుభవిస్తున్న వారు చాలా కాలం జీవించ గలుగుతున్నారు, ఆధునాతన చికిత్సా పద్ధతులతో?
Kidneys: మూత్ర పిండాలలో జరిగే ప్రధాన పరిణామాలూ, మార్పులు :
1. Hypertensive nephropathy: హైపర్ టేన్సివ్ నెఫ్రోపతీ, అంటే మూత్ర పిండాలలో రక్త పోటు. 2. Chronic renal failure: క్రానిక్ రీనల్ ఫెఇల్యుర్ అంటే దీర్ఘ కాలిక మూత్ర పిండాల విఫలం అవడం. ఇక్కడ కూడా విఫలం అంటే ‘ సరిగా పని చేయకపోవడం అనే గుర్తు ఉంచు కోవాలి, అంటే పూర్తిగా విఫలం అయినట్టు కాదు.
రక్తం లో వచ్చే మార్పులు : Elevated blood sugars. అంటే ఎలివేటేడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే రక్తం లో చెక్కెర శాతం పెరుగుదల.
చూశారా ఈ ఒక్క పటం లో ఎంత సమాచారం ఉందొ ! అందు వల్లనే దీనిని రెండో సారి పోస్టు చేయడం జరిగింది, మీరు ఎప్పుడూ గుర్తు ఉంచుకోడానికీ, మీకు ఉపయోగ పడటానికీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !