Our Health

Posts Tagged ‘Exercise’

ఏ వ్యాయామం ఎందుకు ? 1.

In Our Health on సెప్టెంబర్ 27, 2015 at 6:43 సా.

ఏ వ్యాయామం ఎందుకు ? 1. 

సర్వ సాధారణం గా మనం , వ్యాయామం ( ఎక్సర్సైజ్ ) అంటే , కేవలం  శారీరిక వ్యాయామమే అని అనుకుంటాము !  శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది ,  మానవుల ఆయుష్షు కూడా పెరుగుతూ ఉండడం తో , మెదడు ఆరోగ్యం  గురించి కూడా ప్రాముఖ్యత పెరుగుతూ వస్తూంది ! 
కేవలం శారీరిక ఆరోగ్యాన్నే  మననం చేస్తూ , మెదడు ఆరోగ్యం పట్టించుకోక పొతే ,  జీవనం కేవలం యాంత్రిక మవుతుంది ! 
పరోక్షం గా శారీరిక వ్యాయామం , మన మెదడునూ , తద్వారా మేధస్సు నూ  ప్రభావితం చేస్తున్నా కూడా ,  మెదడు ఆరోగ్యానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఎక్కువ గా ఉపయోగ పడతాయని , ఇటీవలి పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి ! శాస్త్రజ్ఞులు , కేవలం ఇప్పటిదాకా అనుకుంటున్న , రోజూ  అరగంట వ్యాయామం  చేస్తున్న వారిని కాకుండా , ఇతర వ్యాయామాలను కూడా శ్రద్ధతో చేస్తున్న వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు ! 
ఆ పరిశీలనల ఫలితాలు తెలుసుకుందాం ! 
నాడీ కణాలు ఆరోగ్యం గా పెరుగుతూ  ఉండాలంటే ,  BDNF  అనే పదార్ధం అవసరం ఉంటుంది !  టూకీ గా చెప్పుకోవాలంటే ఈ BDNF పదార్ధం , మనం  వ్యాయామం చేస్తూ ఉంటే , మెదడులో సమ పాళ్ళ లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది ! 
ఈ పదార్ధం సహాయం తో , నాడీ కణాలు , సమర్ధ వంతం గా పనిచేస్తాయి ! అంటే  చురుకు గా ఆలోచించగలగడం ,  విషయాలను గ్రహించడం ,  ఆ గ్రహించిన విషయాలను గుర్తు పెట్టుకోవడం , వాటిని మళ్ళీ  అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడం వంటి పనులు ! 
అనేకమంది మానవులు కేవలం ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూ ఉంటేనే , వారిలో BDNF పాళ్ళు ఎక్కువ అవుతున్నట్టు తేలింది !  
ఈ ఏరోబిక్ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసే వారిలో , ముందు ముందు , మతి మరుపు వ్యాధి వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి ! 
ఏరోబిక్ వ్యాయామాలు అంటే ఏమిటి ? :
మన గుండె కొట్టుకోవడం , శ్వాస తీసుకోవడం ఎక్కువ చేసి , మనకు చెమట పోయించే ప్రతి వ్యాయామమూ , ఏరోబిక్ వ్యాయామాలు అనబడతాయి ! అంటే ( పైన ఉన్న చిత్రం చూడండి ) వడి వడి గా నడక , లేదా పరిగెట్టడం , నాట్యం చేయడం , నీళ్ళ మీద ఈదడం , సైక్లింగ్ లాంటి వన్నీ కూడా , మన గుండె వేగం , శ్వాస వేగం , ఎక్కువ చేసి , ఎక్కువ స్వేదం కలిగిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

వ్యాయామం ( ఎక్సర్సైజ్ ) గుండె జబ్బును ఎట్లా నివారిస్తుంది ?.3.

In Our Health on ఏప్రిల్ 26, 2012 at 7:28 సా.

 వ్యాయామం ( ఎక్సర్సైజ్ )  గుండె జబ్బును ఎట్లా నివారిస్తుంది ?.3. 

 
ఇప్పటి వరకూ జరిపిన అనేక శాస్త్రీయ  పరిశోధనలూ, పరిశీలనల వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ( Regular exercise )  అంటే క్రమం గా వ్యాయామం చేస్తే, కేవలం గుండె జబ్బుల నివారణే కాక , మిగతా  ఏ ఏ లాభాలు ఎంతెంత ఉంటాయో  ఈ క్రింద వివరణ చూడండి.
1.  గుండె జబ్బులూ, పక్ష వాతం అంటే  ‘ stroke ‘  వచ్చే అవకాశం 35 % అంటే ముప్పై అయిదు శాతం తగ్గుతుంది.
2. Type 2 Diabetes , టైపు టూ మధుమేహం వచ్చే అవకాశం  , 50 % అంటే యాభయి శాతం తగ్గుతుంది.
3. Colon cancer , కోలన్ క్యాన్సర్ అంటే  పెద్ద పేగు లో వచ్చే క్యాన్సర్ వచ్చే అవకాశం  50 % అంటే యాభయి శాతం  తగ్గుతుంది. 
4. Breast cancer, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము , లేక స్థన క్యాన్సర్ వచ్చే అవకాశం 20  % లేక ఇరవై శాతం తగ్గుతుంది.
5. 30 % Lower risk of early death. అంటే అల్ప ఆయుష్హు 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది. అంటే  దీర్ఘ కాలం జీవించే అవకాశం ముప్పై శాతం హెచ్చుతుందన్న మాట.
6.Osteoarthritis, ఆస్టియో ఆర్త్రైటిస్  అంటే కీళ్ళ నొప్పులూ, వాపు, వచ్చే వకాశం 83 % అంటే ఎనభై మూడు శాతం తగ్గుతుంది.
7. Hip fracture risk is reduced by 68 %. హిప్ ఫ్రాక్చర్ అంటే తుంటి ఎముక విరిగే అవకాశం
68 % అంటే అరవై  ఎనిమిది  శాతం తగ్గుతుంది.
8. 30 % reduction in falls అంటే వృద్ధులలో క్రింద పడి పోయే అవకాశం 30 % ముప్పై శాతం తగ్గుతుంది.
9. Depression, డిప్రెషన్ లేక మానసికం గా క్రుంగి పోయే వ్యాధి వచ్చే అవకాశం 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది.
10.Dementia, డిమెన్షియా  లేక వృద్ధుల లో వచ్చే మతి మరుపు వ్యాధి వచ్చే అవకాశం కూడా 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది. 
 
ఎంత వ్యాయామం అవసరం ? :
19 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్న వారికి కనీసం వారానికి రెండున్నర గంటల వ్యాయామం చేస్తే లాభకరం గా ఉంటుందని తెలిసింది. 
 
వ్యాయామం గుండె కు ఎట్లా లాభాకారి?:
 
క్రమం గా వ్యాయామం చేయడం వల్ల గుండె కండరాలు బల పడి తక్కువ సంకోచాలతోనే ఎక్కువ రక్తాన్ని పంపు చేయ గలుగుతుంది.
వ్యాయామం చేయటం, మన బరువును తగ్గిస్తుంది.
వ్యాయామం , మన మానసిక వత్తిడి ని కూడా తగ్గిస్తుంది.
మన బరువు, క్రమమైన వ్యాయామం తో నియంత్రణ లో ఉండటం వల్ల రక్త పీడనం కూడా నియంత్రణ లో ఉంటుంది. అంటే కంట్రోలు లో ఉంటుంది.
అలాగే , రక్తం లో చెడు కొవ్వు అంటే కొలెస్టరాల్  కూడా తగ్గుతుంది.  మధుమేహాన్ని కూడా నివారించడం వల్ల, గుండె జబ్బులు కూడా నివారింప బడతాయి. 
 

మరి ఆలస్యం ఎందుకు వ్యాయామానికి ? కట్టు బడి ఉందాం ఈ నియమానికి ! 

 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు చూద్దాము. 
 
%d bloggers like this: