Our Health

Archive for మే 26th, 2012|Daily archive page

పాజిటివ్ సైకాలజీ – మన నిత్య జీవితం లో ఫ్లో ( flow ) తో ప్రయోజనాలు . 13.

In మానసికం, Our minds on మే 26, 2012 at 7:40 సా.

పాజిటివ్ సైకాలజీ –  మన నిత్య జీవితం లో ఫ్లో ( flow ) తో ప్రయోజనాలు . 13.

మనం క్రితం టపాలో తెలుసుకున్నాము కదా ! ఫ్లో ( flow ) స్థితి ఎట్లా ఏర్పడుతుందో ! అంటే మనం చేయవలసిన పని అంటే ఏ కార్యం అయినా సరే , బాగా కష్టం గా ఉన్నప్పుడు , దానితో మన  నైపుణ్యం అంటే , మన శక్తి యుక్తులు కూడా సరితూగుతున్నప్పుడు, మనం  ప్రవాహ స్థితి లో అంటే ఫ్లో స్థితిని పొందుతాము . అంటే ఆ స్థితి లో మనం పూర్తి ఏకాగ్రత తో పని చేస్తూ , ఆ పనిలో  ‘ మమైకం ‘ చెంది అంటే పూర్తి గా లీనమై ,  ఆ   పనిని , లేక కార్యాన్ని విజయ వంతం గా పూర్తి చేస్తూ , అత్యంత ఆనందం పొందుతామన్న మాట.
ఇప్పుడు మనం మన నిత్య జీవితం లో ఈ ఫ్లో వల్ల  ఉపయోగాలు చూద్దాము . ముఖ్యం గా  కుటుంబం అంటే ఫ్యామిలీ ( family ) లో ఈ  ఫ్లో ఎట్లా ఏర్పడుతుందో  తెలుసుకుందాము. 
మనకందరికీ మన సంతానం, చక్కగా చదువు నేర్చుకొని , ప్రతిభావంతులు కావాలని ,   పెరిగి పెద్ద వారై , ప్రయోజకులు కావాలనీ, ఆశలు, ఆశయాలూ ఉంటాయి కదా !  ఈ ఆశలూ, కోరికలూ నెరవేరాలంటే , కుటుంబం లో  ‘ఫ్లో ‘ ముఖ్యం.
 ప్రతి తల్లి దండ్రులకూ ,  ఈ ఫ్లో స్థితి  కి అనువైన  వాతావరణం కల్పించ వలసిన బాధ్యత ఉంది కదా ! అందువల్ల తల్లి దండ్రులు కూడా ఈ విషయం తెలుసుకోవడం వల్ల లాభం పొందుతారు. 
ప్రతి కుటుంబం లో తమ   సంతానానికి    ఈ  ఫ్లో స్థితి ఉండాలంటే  అయిదు లక్షణాలు  చాలా ముఖ్యం.  ఈ అయిదు లక్షణాలూ ఇవి :
1.స్పష్టత : అంటే పిల్లలకు వారి తల్లిదండ్రులు , వారినుంచి , ఏమి ఆశిస్తున్నారో, ఆ విషయం మీద వారికి ( అంటే పిల్లలకు ) స్పష్టమైన  అవగాహన ఉండాలి. ( అంటే తలిదండ్రులు  తమ సంతానానికి  చిన్నప్పటినుంచే  ఈ విషయాలు  తెలియచేస్తూ వారిలో  విజయ సాధన  బీజాలు నాటాలి ! )
2.అవకాశాలు:  పిల్లలకు వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చే అనేకమైన అవకాశాలు కూడా వారికి తెలియాలి ( అంటే తలిదండ్రులు తమ పిల్లలకు ఏ ఏ అవకాశాలు ఇవ్వగలరో , లేక కల్పించ గలరో వారి పిల్లలకు  తెలియ చేయాలి )
3.కేంద్రకం : అంటే  పిల్లలు కుటుంబం లో వారే కేంద్రం అనీ , ప్రస్తుతం వారు చేస్తున్నది (  అంటే ప్రతి క్షణం లోనూ పిల్లలు చేస్తున్నది ! ) తెలుసుకోవాలని వారి తలి దండ్రులు ఉత్సాహ పడుతూ ఉంటారనీ పిల్లలకు తెలియాలి.( ఈ విషయం లో కూడా తలిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కలిగించాలి ) 
4.బాధ్యత : అంటే తలిదండ్రులు తమ పిల్లల మీద ఉంచుకునే విశ్వాసం వల్ల , పిల్లలలో , ఒక  కమిట్ మెంట్ అంటే   ఏ పనినైనా బాధ్యత తో చేయాలనే భావన కలుగుతుంది. దానితో వారు, మిగతా భయాలనూ, ఆందోళనలనూ పక్కన పెట్టి , అప్రయత్నం గా నే కర్తవ్యోన్ముఖులవుతారు. 
5. క్లిష్టమైన లేక చాలెంజింగ్ అవకాశాలు:  సమయానుకూలం గా పిల్లలకు చాలెంజింగ్ సమస్యలు ఇస్తూ ఉంటె, వారు వారి శక్తి సామార్ధ్యాలకు  పదును పెడుతూ , ఆ కార్యం లో పూర్తిగా నిమగ్నమై  విజయాలు సాధిస్తూ , తద్వారా , అధికానందం కూడా పొందుతారు. అంటే ఫ్లో లేక ప్రవాహ స్థితి లో ఉంటారు.  ( అంటే ఉదాహరణకు వారి చదువులో, తీసుకోవలసిన  పరీక్షలూ, ఇతర ఎంట్రెన్స్ పరీక్ష లూ ఈ కోవకు చెందుతాయి )
పైన చెప్పిన అయిదు విషయాలూ కుటుంబాన్ని కూడా ఒక ఫ్లో అంటే ప్రవాహ స్థితి లో ఉంచుతాయి.  తల్లి దండ్రులు, వారి సంతానానికి , కేవలం  భౌతిక మయిన  అవసరాలు  కలిగించడమే కాకుండా, పై విషయాలలో కూడా శ్రద్ధ చూపించి, ఆ పరిస్థితులు కూడా కల్పిస్తే , కుటుంబం అంతా అధికానందం పొందుతుంది. 
వచ్చే టపాలో మిగతా సంగతులు తెలుసుకుందాము ! 

పాజిటివ్ సైకాలజీ. ( flow )వివరణ.12.

In మానసికం, Our minds on మే 26, 2012 at 11:29 ఉద.

పాజిటివ్ సైకాలజీ. ( flow )వివరణ.12.

క్రితం టపాలో చూశాము కదా ఫ్లో  సైకాలజీ అంటే ఏమిటో! ఇప్పుడు దాని వివరణ చూద్దాము.
మనం ఒక అందమైన రంగుల పటం కూడా చూశాము కదా! కానీ  ఆ పటం చూడటానికి బాగుంది కానీ వెంటనే మనకు విషయం అర్ధం అవటం లేదు కదా ! ఆ పటాన్నే ఇంకోవిధం గా పైన  చూపించడం జరిగింది. చూడండి.
ఇక్కడ  ఎడమ ప్రక్క  మనం చేయ బోయే పని యొక్క క్లిష్టత అంటే  డిఫికల్టీ  ను సూచిస్తుంది.  పై దిశలో బాణం ఉంది కాబట్టి  పని క్లిష్టత  ఎక్కువ అవుతున్నట్టు  చూపించడం అన్న మాట. అలాగే , మన నైపుణ్యాన్ని అడుగు భాగం లో చూపడం జరిగింది. ఇక్కడ బాణం ఎడమ నుంచి కుడి దిశ లో ఉన్నట్టు చూపించడం జరిగింది కదా అంటే మన నైపుణ్యం కుడి దిశ లో ఎక్కువ  అవుతున్న్నది  అని అర్ధం.
ఇప్పుడు మధ్య లో ఉన్న వలయం  పరిశీలించండి.  మనం రిలాక్సేషన్ అన్న   చోటనుంచి మొదలు పెడదాము. అంటే మనకు  సగటు నైపుణ్యం ఉండి, మనం చేయవలసిన పని కష్టం గా లేనప్పుడు,   ఆ పరిస్థితి రిలాక్సేషన్, ( relaxation ) కు దారి తీస్తుంది. అంటే అక్కడ ఆనందం ఉండదు. కేవలం సేద తీర్చుకోవడమే జరుగుతుంది. వలయం లో రిలాక్సేషన్ కు ఎడమ ప్రక్క గా అపతీ ( apathy )ఉంది కదా. అపతీ అంటే నిరుత్సాహం అని అర్ధం. ఆ పరిస్థితి ,  మనకు  పని లో నైపుణ్యం లోపించి,  దానికి తగ్గట్టుగా,  మనం చేసే పని కూడా క్లిష్టం కానప్పుడు  ఏర్పడుతుంది.   అలా కాకుండా  మనం చేసే పని   ఒక మాదిరి గా క్లిష్టం గా ఉండి, మనకు ఆ పనిలో నైపుణ్యం లోపించినప్పుడు ,  మనం వర్రీ ( worry )  అవడం జరుగుతుంది. అంటే కలత చెందడం.  చేయవలసిన పని ఇంకా కష్టం గా ఉండి , మన నైపుణ్యం దానికి తగ్గట్టు గా లేక, తక్కువ గా ఉంటె, అప్పుడు (anxiety ) యాంగ్ జైటీ  అనుభవిస్తాము, అంటే ఆందోళన చెందుతాము .   మనం చేయవలసిన పని ఎక్కువ కష్టం గా ఉండి , మన నైపుణ్యం సగటుగా అంటే ఒక మాదిరిగా ఉన్నప్పుడు మనం ఎక్కువ అప్రమత్తత తో ఉంటాము. ( దానినే ఎరౌజల్ , arousal  అంటారు ) ఇక మనం చేసే పని  అతి క్లిష్టం గా ఉండి , మన నైపుణ్యం కూడా  ఎక్కువ గా ఉంటె ,
అప్పుడు ఫ్లో ( flow ) స్థితి ఏర్పడుతుంది. అంటే  అప్పుడు మనం ఆ పనిలో , పూర్తీ గా నిమగ్నమయి , ఏకాగ్రత తో ఆ పని చేస్తూ , అత్యంత ఆనందం పొందుతామన్న మాట.అప్పుడు మనకు కాలం కూడా తెలియదని అనిపిస్తుంది. ఇక మనం చేయవలసిన పని కష్టం గా లేకున్నా,  శులభం గా ఉన్నా ,  మనకు ఆ పనులలో నైపుణ్యం ఎక్కువ ఉంటే, ఆ పని చేయడం లో పూర్తి నియంత్రణ ( control ) ఏర్పడడమూ, లేదా( boredom ) బోరు గా  అనిపించడమూ జరుగుతాయి.
వచ్చే టపాలో ఈ ఫ్లో సైకాలజీ తో పొందే ఉపయోగాల గురించి తెలుసుకుందాము ! 
%d bloggers like this: