Our Health

Archive for మే 10th, 2012|Daily archive page

మన జీవన శైలి ( life style ) లో మార్పులు, బీ పీని ఎట్లా కంట్రోలు చేస్తాయి ?.23.

In Our Health on మే 10, 2012 at 11:27 ఉద.

మన జీవన శైలి  ( life style ) లో మార్పులు, బీ పీని ఎట్లా కంట్రోలు చేస్తాయి ?.23.

 
పైన ఉన్న టేబుల్ చూడండి. అనేక శాస్త్రీయ పరిశీలనల ఫలితం గా దీనిని రికమెండ్ చేసింది అమెరికన్ డిపార్ట్మెంట్  అఫ్ హెల్త్ వారు.
మనం రోజు వారీగా మన కార్యక్రమాలలో, అంటే మన ఆహారపు అలవాట్లలో , లేక తీసుకునే మద్య పానీయాల అలవాట్లలో , లేక వ్యాయామం చేయటం లో మన జీవన శైలి , మన రక్త పీడనాన్ని ఎట్లా తగ్గిస్తుందో వివరింప బడ్డది.
అధిక రక్త పీడనం మొదటి దశలో ఉన్నప్పుడు కేవలం పైన ఉదాహరించిన  జీవన శైలి మార్పులతో , కంట్రోలు చేసుకోవచ్చు. 
మనం అతి బరువు గా ఉండడం, లేక , అతిగా మద్యం సేవించడం, లేక  అనేక విషతుల్యమైన పదార్ధాలను మన దేహం లో నింపే స్మోకింగ్ చేయడం , వీటన్నిటి వల్లా  , గుండె, రక్తనాళాల మీద వీటి ప్రభావం గురించి ఎంతో వివరం గా మునుపటి టపాలలో తెలుసుకున్న్నాము, పటాల సహాయం తో కూడా ! 
ఇక్కడ ఒక గమనిక : పైన చూపిన టేబుల్ లో మద్య పానం మితం గా చేయమని ఉంది.  దీనిని అమెరికన్ వైద్యులు తయారు చేశారు కాబట్టి , అక్కడి ఆచార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని , మద్యం అప్పటికే తాగుతున్న వారు మితం గా తాగితే బీ పీని కంట్రోలు చేయగలరు అని తెలిపారు. ఈ సూచన అన్ని దేశాల వారికీ  వర్తించదు.  ఎందుకంటే,  మొత్తం మీద మద్యం చేసే హాని, లాభాలతో పోలిస్తే చాలా ఎక్కువ. 
గమనించినట్టయితే, ఎక్కువ గా మనం బీ పీని కంట్రోలు చేయగలిగేది , మన బరువును నియంత్రించు కోవడం ద్వారానూ , ఇంకా మన ఆహారం లో మార్పులు తీసుకు రావడం ద్వారానూ కదా ! 
ఈ చర్యలన్నీ కూడా  బీ పీ రెండవ దశ, మూడవ దశ కు చేరుకొని , మందులు అంటే యాంటీ హైపర్ తెన్సివ్స్  తీసుకునే వారు కూడా పాటించడం శ్రేయస్కరం. అంటే కేవలం మొదటి దశలోనే కాదు. ఎందుకంటే ఈ చర్యలన్నీ అశ్రద్ధ చేస్తే , మందులు ఎక్కువ గా వాడ వలసిన అవసరం రావచ్చు. కొన్ని పరిస్థితులలో , ఆ మందులు కూడా కంట్రోలు చేయలేక పోవచ్చు అధిక బీ పీని. అందువల్లనే  మనం అధిక బీపీని కంట్రోలు చేయడం లో అత్యుత్తమ విజయాలు సాధించేది   జీవన శైలి లో మార్పులు ఎల్ల కాలం అనుసరించడం వల్లనే,  మందులు తీసుకోక పోయినా , లేక మందులు తీసుకుంటున్నా ! 
వచ్చే టపా లో ఇంకొన్ని వివరాలు చూద్దాము ! 
 
ఈ టపా నచ్చితే http://www.baagu.net. ను మీ స్నేహితులకు తెలియ చేయండి ! 

అధిక రక్త పీడనం ( హై బీ పీ ) చికిత్స కేవలం మందులేనా !?.22.

In Our Health on మే 10, 2012 at 9:38 ఉద.
అధిక రక్త పీడనం ( హై బీ పీ ) చికిత్స  కేవలం మందులేనా !?.22. 
 

 

చూసుకో రోజూ లవణమారు గ్రాములు గా , నీ మిత భోజనం లో

 ఉంచుకో  నిన్ను,  మద్యానికీ, పొగాకుకూ, దూరంగా,

గడుపుకో కొంత సమయం  రోజూ  వ్యాయామం, ధ్యానం లో 

తీసుకో మందులు అవసరమైతే,  క్రమంగా 
జీవించు నీ జీవితం ఆనందం గా !
అధిక రక్త పీడనం నిన్నుఇక  పీడించ లేదుగా !  
 
పైన చెప్పిన  ‘ శులభ ‘  సూత్రాలు మనం రోజూ మననం చేసుకుని ఆచరిస్తే  అధిక రక్త పీడనం ఇక మనని బాధించలేదు! 
మనం మునుపటి టపాలలో  తెలుసుకున్నాము  చాలా వివరం గా,  అధిక రక్త పీడనం , చాలాకాలం ఉంటే, దాని ప్రభావం గుండె మీదా, మెదడు మీదా, మూత్ర పిండాల మీదా, కళ్ళ మీదా, ఏ విధంగా ఉంటుందో. ( ఈ బ్లాగు మొదటి సారి చూస్తున్న వారు, ఆర్కివ్స్ లో మునుపటి టపాలు చూడ వచ్చు , ఈ సంగతులన్నీ తెలుసుకోవడానికి ) 
ఇపుడు మనం అధిక రక్త పీడనం చికిత్సా పద్ధతులు చూద్దాము. 
ఇవి ప్రధానం గా మూడు విధాలు:
మొదటి విధానం : 
బీ పీ కనక 130/80 mm Hg. కన్నా ఎక్కువ ఉంటే,  కేవలం జీవన శైలి లో మార్పులు అంటే ( life style modifications ), ఆ అధిక రక్త పీడనాన్ని  కంట్రోలు చేసుకోవచ్చు. 
రెండవ విధానం :
బీ పీ కనక 140/90 mm Hg. అంతకు మించీ ఉంటే , అప్పుడు  జీవన శైలి లో మార్పులతో పాటు  అధిక రక్త పీడనం తగ్గించే  మందులు వీటినే  యాంటీ హైపర్  టేన్సివ్ లు అంటారు ( anti hypertensives ). వీటిని కూడా తీసుకోవలసి ఉంటుంది. 
మూడవ విధం : 
బీ పీ కనక 180/110 mm Hg. కానీ అంతకు మించి కానీ ఉంటే , ఆ పరిస్థితి ప్రమాదకరమైనది. అపుడు వెంటనే తగు వైద్య సహాయం తీసుకోవాలి ఆలస్యం చేయకుండా. ప్రత్యేకమైన పరీక్షలు కూడా అవసరం అవుతాయి ఆ పరిస్థితిలో. 
 
జీవన శైలి లో మార్పులు మనం ఎట్లా తేవచ్చో , వచ్చే టపాలో వివరం గా తెలుసుకుందాము ! 
మీ ప్రియ స్నేహితుల, బంధువుల బాగు కూడా కోరుకుంటున్నారు కదూ అయితే ఆలస్యం దేనికి ? వారికి  www.baagu.net. గురించి తెలపండి ! 
 
 
 
 
%d bloggers like this: