Our Health

Archive for మే 11th, 2012|Daily archive page

డ్యాష్ (DASH ) డైట్ బీ పీ తగ్గించేందుకు ఎందుకు బెస్ట్ ( అత్యుత్తమం )!?.24.

In Our Health on మే 11, 2012 at 7:13 ఉద.

డ్యాష్ (DASH ) డైట్  బీ పీ తగ్గించేందుకు   ఎందుకు బెస్ట్ ( అత్యుత్తమం )!?.24.

నవీన  ఇంటర్నెట్  యుగం లో  ప్రతి అల్లాటప్పా వాడూ ,  మా డైట్ మంచిది అంటే మా డైట్ మంచిది అని అనేక ప్రకటనలు ఇచ్చి ప్రజలను మభ్య   పెడుతుంటారు .
కానీ అధిక రక్త పీడనాన్ని తగ్గించే శాస్త్రీయమయిన  డైట్ లు చాలా కొన్న్ని మాత్రమె ఉన్నాయి.  అందులో  డ్యాష్ డైట్  ( DASH ) ప్రధానమయినది. దీని గురించి కొంత తెలుసుకుందాము.

DASH అంటే  డయ టరీ అప్రోచెస్ టు స్టాప్  హైపర్ టెన్షన్ ( Dietary Aproaches to Stop Hypertension ).
అమెరికా నేషనల్ ఇన్స్టిట్యుట్  అఫ్ హెల్త్  ( National Institute of Health of America )  వారు  చేయించిన పరిశోధనలు, పరిశీలనల ద్వారా ఈ డ్యాష్ డైట్  చాలా శాస్త్రీయం అయినదీ,
ఉపయోగ కరమైనదీ అని రుజువు అయింది.  అంతే కాక ఈ ప్రత్యేకమయిన డైట్ , గత రెండు సంవత్సరాలుగా,  అత్యుత్తమ డైట్ గా ర్యాంకింగ్ పొందుతూ ఉంది అమెరికా లో.
అందువల్లనే  ఈ డ్యాష్ డైట్ ను ఈ క్రింది సంస్థలు రికమెండ్ చేస్తున్నాయి:
1. అమెరికన్ హార్ట్ అసోసి ఎషన్ ( American Heart Association, AHA )
2.The 2010 diet guidelines for Americans.
3.The National Heart, Lung, and Blood Institute of America.
4.The 2011  Treatment  guidelines  for women.
5.US guidelines for treatment of high blood pressure.
6.The Mayo clinic ( USA )
ఎవరికోసం ఈ డ్యాష్ డైట్ ? :
డ్యాష్ డైట్ ప్రత్యేకించి  అధిక రక్త పీడనం  ఉన్న వారికీ,  లేక అధిక రక్త పీడనం  వచ్చే ముందు లక్షణాలు ఉన్న వారికీ ( ఆంటే ఈ  దశను  ప్రీ హైపర్ టెన్షన్ లేక Pre Hypertension  అంటారు ) రికమెండ్ చేయబడుతుంది.
డ్యాష్ డైట్  వల్ల ఉపయోగం ఉంటుందా ? :
DASH డైట్  సరిగ్గా ఆచరిస్తే  పద్నాలుగు ( అంటే 14 ) రోజులలోనే  అధిక రక్త పీడనం , ఆంటే హై బీ పీ , కంట్రోలు లోకి వస్తుందని శాస్త్రీయం గా రుజువు అయింది.  కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే,  ఈ డైట్  ప్రారంభ దశలోనూ, మధ్య దశలోనూ హై బీ పీ ఉన్న వారికి ప్రత్యేకించి లాభదాయకం.
అంతే కాకుండా,  అధిక రక్త పీడనానికి మందులు వాడే వారిలోనూ,  ఈ డైట్   ను ఆచరిస్తే, వారి మందులను బాగా పని చేసేటట్టు చేస్తుంది. అంటే , మందులను తీసుకుంటున్న వారు , ఈ డ్యాష్ డైట్ ను కూడా తీసుకుంటుంటే , వారిలో అధిక రక్త పీడనం చక్కగా కంట్రోలు అవుతుంది.
DASH డైట్ వల్ల ఇతర లాభాలు :
1. ఈ డైట్   మన రక్తం లో కొలెస్టరాల్ ను తగ్గించ గలదు.
2. అట్లాగే  మన శరీరం లో వివిధ అవయవాలకూ , కండరాలకూ , ఇన్సులిన్  కు ఎక్కువగా స్పందించే టట్టు చేసి , తద్వారా మధుమేహ వ్యాధి నివారణ కు కారణమవుతుంది.
3. ఈ ప్రత్యేకమయిన డైట్ , అధిక బరువును కూడా తగ్గిస్తుంది.
వచ్చే టపాలో  డ్యాష్ డైట్  (DASH )వివరాలు చూద్దాము !
ఈ టపా నచ్చితే  హై బీ పీ  పత్యం అంటే డైట్ ద్వారా తగ్గించుకోవాలని చూసే మీ స్నేహితులకూ తెలియ చేయండి  www.baagu.net. గురించి.
%d bloggers like this: