హృదయం ‘ లయ’ తప్పితే లక్షణాలు ఎలా ఉంటాయి ?.36.

హృదయం ‘ లయ’ తప్పితే లక్షణాలు ఎలా ఉంటాయి ?.36.
హృదయం ‘ లయ తప్పటం ‘ అంటే ఏమిటి .35.
మానవులందరి లో సహజం గా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని మనకందరికీ తెలుసు కదా ! దీనిని హార్ట్ రేట్ ( heart rate ) అంటారు. ( గుండె యాభై నుంచి వంద సార్లు ,నిమిషానికి కొట్టుకోవడాన్ని నార్మల్ హార్ట్ రేట్ అంటారు. అంటే యాభై కంటే తక్కువ సార్లు కానీ , వంద కంటే ఎక్కువసార్లు కానీ కొట్టుకుంటుంటే అది అసాధారణం అనబడుతుంది. అప్పుడు వైద్య సలహా తీసుకోవాలి )
అంటే అరవై సెకండ్లకు రమారమి డెబ్బయి రెండు సార్లు కొట్టుకుంటుంది. కానీ ఈ డెబ్బయి రెండు సార్లూ ఒక లయ బద్ధం గా కొట్టుకుంటుంది. దీనినే రిధం ( Heart Rhythm ) అంటారు.
రిధం ( rhythm ). అంటే , ఈ అరవయి సెకండ్లలో మొదటి పది సేకనులూ ముప్పయి సార్లు కొట్టుకొని , మిగతా యాభయి సేకండ్లూ నలభయి రెండు సార్లు కొట్టుకోవడం జరగదు. ఒక లయ తో డెబ్బై రెండు సార్లూ , సమానం అయిన అంతరాయం అంటే interval తో కొట్టుకుంటుంది.
ఇది ఆరోగ్య వంతమైన మానవులలో. చాలా ఆరోగ్య వంతమైన అథ్లెట్ లకు, గుండె తక్కువసార్లు కొట్టుకోవడం సహజం. అది ఏమీ జబ్బు అనబడదు అప్పుడు. ( ఉదాహరణ కు టెన్నిస్ ఆటలో అత్యంత ప్రముఖులలో ఒకడైన స్వీడిష్ ఆట గాడు జార్న్ బోర్గ్ కు నిద్ర లేచినప్పుడు 50, మద్యాహ్నానికి 60 సార్లు కొట్టుకునేది ట , గుండె, ( నిమిషానికి ).
అలాగే మనం ఆతురుత తో ఉన్నప్పుడు గుండె వేగం గా కొట్టుకుంటుంది. అంటే మన హార్ట్ రేట్ ఎక్కువ అవుతుందన్న మాట. అప్పుడు కూడా హార్ట్ రిధం మారదు. అంటే ఎక్కువ సార్లు కొట్టుకున్నా మొదటి ఇరవయి సేకండ్లూ నిదానం గా కొట్టుకోవడం , లేక మిగతా నలభై నిమిషాలూ వేగం గా కొట్టుకోవడం లాంటిది జరుగదు, ఆరోగ్య వంతులలో !
అలా కాక హృదయం లయ తప్పితే అంటే దాని రిధం మారితే, లేక రిధం అవకతవక గా అయితే ఆ పరిస్థితిని హార్ట్ ఎరిత్మియా ( Heart or Cardiac arrythmiya ) అంటారు.
ప్రేమ లో హృదయం లయ తప్పుతుందా ?:
ప్రేమలో ‘ పడితే ‘ , గుండె ఒక్కోసారి ఎక్కువ గా కొట్టుకుంటున్నట్టు అనిపించ వచ్చు. లేదా ‘ ఒక బీట్ మిస్సవుతున్నట్టు కూడా అనిపించవచ్చు ! ఇది కూడా సహజమే ! అంటే ప్రేమలో ‘ ఇరుక్కు పొతే ‘ తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతాము మనం. దాని ఫలితమే ‘ హృదయం లయ తప్పడం ‘ అంటే హార్ట్ రేట్ కానీ రిధం గానీ మారడం. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికం మాత్రమే ! అంటే ప్రేమించడం మానితే ఆగి పోతాయని అర్ధం చేసుకోకండి ! ప్రేమ కంటిన్యూ అవుతున్నా , ఈ తీవ్ర భావోద్వేగాలు నిరంతరం ఉండవు గా !అందువల్ల. అలాగే హృదయం ‘ లయ ‘ తప్పని వాళ్ళు ప్రేమించడం లేదనీ అర్ధం చేసుకో కూడదు. ప్రేమిస్తున్నప్పుడు అలా జరిగితే కంగారు పడవద్దు ‘ ప్రేమ ‘ శృతి మించి ‘ ‘ రాగాన ‘ లేక ‘ మధుర రాగాల ‘ పాకం ‘ లో పడుతుందని మాత్రమే అనుకోవాలి మరి !
ప్రేమికులు తమ అనుభవాలు తెలియ చేయండి ‘ హృదయ పూర్వకం గా ‘ !
ఇలా హృదయం లయ తప్పితే ఏమవుతుందో వచ్చే టపాలో తెలుసుకుందాము !