Our Health

పురుషులలో గుండె పోటు లక్షణాలు ఎట్లా ఉంటాయి ?.13.

In Our Health on మే 4, 2012 at 8:03 ఉద.

పురుషులలో గుండె పోటు  లక్షణాలు ఎట్లా ఉంటాయి ?.13.

మనం క్రితం టపాలో  వివరంగా, స్త్రీలలో గుండె నొప్పి లక్షణాలు ఎట్లా బయట పడతాయో ! ఇప్పుడు పురుషులలో ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాము.
షుమారు అరవై శాతం పైగా పురుషులలో గుండె నొప్పి లక్షణాలు,  గుండె పోటు సంభవించక ముందే వారికి అనుభవం అవుతాయని ఒక పరిశీలన లో తెలిస్సింది. కానీ తరచూ పురుషులు ముందు గా వచ్చే ఈ లక్షణాలను పట్టించుకోక అశ్రద్ధ చేస్తారని కూడా పరిశీలన లో తెలిసింది.
గుండె నొప్పి ఎట్లా ఉంటుంది? : 
గట్టి గా పిండినట్టు , తీవ్రమైన వత్తిడి తో ఉంటుంది. ఇలాంటి నొప్పి చాతీ కి మధ్య లో ఉంటుంది. కొద్ది నిమిషాలు ఉండవచ్చు ఈ నొప్పి. గుండె వేగం గా కొట్టుకోవడం అంటే సాధారణం గా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువగా.
డిస్కంఫర్ట్ : గుండె నొప్పి తో పాటు చాలా డిస్కంఫర్ట్ కూడా వీరు అనుభవించ వచ్చు. 
మిగతా భాగాలలో నొప్పి : లోపలి కడుపు భాగం లో నొప్పి , ఈ నొప్పి పైభాగం లో ఉన్న గుండె నొప్పి కలిగించే వత్తిడి వల్ల, క్రింద ఉన్న పొట్ట లేక జీర్ణాశయం లో ఉన్నట్టు అనిపించవచ్చు ఈ నొప్పి. అందుకనే ఇలాంటి నొప్పిని అశ్రద్ధ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పిని రిఫర్ద్  పెయిన్ అంటారు . ( referred pain ) . ఎలాంటి నొప్పి భుజాలకూ ప్రత్యేకించి ఎడమ భుజానికీ, ఎడమ చేయి కీ , ఎడమ ముంజేతికీ పాకవచ్చు. అలాగే వీపు భాగానికీ, రెండు చేతి రెక్కల మధ్య భాగానికీ పాక వచ్చు అంటే ( between the shoulder blades ). ఇలా గుండె లో మొదలైన నొప్పి శరీరం లో మిగతా భాగాలకు పాక టానికి కారణం , గుండె కు మిగతా శరీర భాగాలకు నొప్పిని తెలియ చేసే నాడులు ఒకటే అవటం వలన.
ఊపిరి అందక పోవడమూ, కళ్ళు తిరిగినట్టూ, తల తిరిగినట్టూ , ఆత్రుత గా ఉండడము, వాంతులు రావడమూ, ఒళ్ళు  చమటలు పట్టడమూ,  తిన్న ఆహారం అరగనట్టు అనిపించడము కూడా జరగ వచ్చు .
పైన చెప్పిన లక్షణాలు , సాధారణం గా కనిపించేవి. కానీ  హార్ట్ ఎటాక్ లేక గుండె పోటు లక్షణాలు  కొద్ది తీవ్రత నుంచి , చాలా తీవ్రత తో ఉండి విపరీతమైన నొప్పి కూడా కలిగించ వచ్చు.
అలా కాకుండా, పురుషులలో  షుమారు నాలుగో వంతు కేసులలో , ఈ లక్షణాలు ఏవీ లేకుండా కూడా సంభవించవచ్చు. దానిని సైలెంట్ మయోకార్డియల్ ఇంఫార్క్షన్ అని అంటారు. ఎందుకంటే అది ఏ రకమైన ముందు లక్షణాలూ చూపించకుండా’ నిశ్శబ్దం గా  వస్తుంది కాబట్టి.  అందువల్లనే  ఛాతీలో నొప్పి ఎప్పుడు వచ్చినా, లేక అనుమానం గా ఉన్నా వెంటనే అత్యవసరంగా అంటే అర్జెంటు గా వైద్య సహాయం తీసుకోవాలి, అశ్రద్ధ చేయకుండా !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 
  1. హయ్ సర్ నాకు ఛాతి ఎడమవైపు నొప్పి వస్తుంది మరియు ఎడమ చేతికి,ఎడమ బుజని,విపు బాగన నొప్పి వస్తుంది ఇ సి జి చెసరు నర్మల్ వచ్చంది మందులు వాడను కానీ నొప్పి తగ్గడం లేదు please నాకు సలహ ఇవ్వాగలరు

    • ఐసాక్ గారూ,

      మీ వయసు చెప్పలేదు.
      మీ కు ఇతర జబ్బులు ఉన్నాయా ? హై బీ పీ లేదా డయాబెటీస్ లాంటి జబ్బులు ?
      మీకు వచ్చే నొప్పి లక్షణాలు కూడా వివరం గా లేవు ?
      ఛాతీ కి ఎడమ భాగాన నొప్పి తీవ్రత ఎంతగా ఉంటుంది ?
      ఏ సమయం లో వస్తుంది ? ఎంత సమయం ఉంటుంది ?
      ఎట్లా ఉపశమనం అవుతుంది ?
      మీరు చూపించుకున్న డాక్టరు స్పెషలిస్ట్ డాక్టరా?
      మీకు మిగతా పరీక్షలు అంటే రక్త పరీక్షలు ఏమైనా చేశారా ?
      మీరు సిగరెట్లు , ఆల్కహాలు తాగుతారా?
      ఈ వివరాలు ఉంటే మంచిది.

      మీరు మీ దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ ను కలిసి పై వివరాలు చెప్పి తగిన సలహా తీసుకోండి.
      ఏమి జరిగిందో తెలియ చేయండి.

      Dr .సుధాకర్

Leave a reply to ఇస్సక్ స్పందనను రద్దుచేయి