Our Health

Archive for మే, 2012|Monthly archive page

డ్యాష్ డైట్( DASH diet ) లో రోజు వారీ క్యాలరీ లక్ష్యాలు. 26.

In Our Health on మే 12, 2012 at 3:01 సా.
DASH diet , డ్యాష్ డైట్ లో రోజు వారీ క్యాలరీ లక్ష్యాలు. 26.
 
Daily Nutrient Goals Used in
the DASH Studies
(for a 2,100 Calorie Eating Plan)
Total fat 27% of calories Sodium 2,300 mg*
Saturated fat 6% of calories Potassium 4,700 mg
Protein 18% of calories Calcium 1,250 mg
Carbohydrate 55% of calories Magnesium 500 mg
Cholesterol 150 mg Fiber 30 g
 
* 1,500 mg sodium was a lower goal tested and found to be even better for
lowering blood pressure. It was particularly effective for middle-aged and older
individuals, African Americans, and those who already had high blood pressure.
g = grams; mg = milligrams.
 
మనం క్రితం టపాలో చదివాము కదా, డ్యాష్ డైట్  మూల సూత్రాలు. ఇప్పుడు మనం అది ఎలా మన నిత్య జీవితం లో అమలు చేయ వచ్చో పరిశీలిద్దాము వివరంగా .
ఇందుకు మనకు ముఖ్యం గా కొన్ని విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉండాలి .
అంటే  మనకు రోజూ కావలసిన క్యాలరీలు, ఆ క్యాలరీలు మనం రోజూ తినే ఆహారం లో  ఏ ఏ  పదార్ధం నుంచి ఎన్నెన్ని  క్యాలరీలు  పొందాలి ? అనే విషయం మనకు తెలిసి ఉండాలి. మన జీవితాలు మనం చాలా ఖచ్చితం గా త్రాసులో పెట్టి కొలిచి జీవించము, జీవించలేము కదా ! కానీ మనకు రమా రమి గా అంటే రఫ్ ఎస్టిమేట్  మనం రోజూ ఎన్ని క్యాలరీలు ఏ ఏ  ఆహార పదార్ధం నుంచి తీసుకోవాలి అనే విషయం తెలిస్తే , తదునుగుణం గా మనం ఒక కంట్రోలు ఏర్పరుచుకోగలం, మన ఆహారం మీద.
ఇలా జరగలేదనుకోండి. అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో ఉదాహరణకు చూద్దాము. మనం సరిపోయినన్ని  క్యాలరీలు కలిగిన ఆహారం రోజూ తినక పొతే,  మనం రోజూ చేస్తున్న పనులకు సరిపడినంత  శక్తి లభించదు. అప్పుడు మనం బలహీన పడతాము. 
కానీ మనం అతి జాగ్రత్త గా , బలహీన పడతామేమో అని రోజూ ఎక్కువ క్యాలరీలు కల ఆహారం కనక తిన్నట్టయితే,  మన ఆహారం లో ఉన్న ఆ ఎక్కువ క్యాలరీలు కాస్తా  ఫ్యాట్ స్టోర్స్ గా మార్చుతాయి మన దేహాన్ని.  దానితో మన బరువు అతి బరువు గా మారి, సమస్యలు సృష్టించు తాయి. 
అలాగే క్యాలరీలు మనం తినే ఆహారం లో కార్బో హైడ్రేటు అంటే పిండి పదార్ధాల రూపం లోనూ , ప్రోటీనుల రూపం లోనూ , కొవ్వు పదార్ధాల రూపం లోనూ కొన్ని నియమిత పాళ్ళలో అంటే ( right  proportions ) , ప్రపోర్శన్స్ లో అంటే నిష్పత్తి లో తీసుకోవాలి.
ఒక ఉదాహరణకు రోజూ మనం రెండు వేల ఒక వంద క్యాలరీలు ఖర్చు చేస్తామనుకోండి మనం చేసే వివిధ పనులలో. అప్పుడు  వివిధ ఆహార పదార్ధాలు పైన చూపిన విధం గా వివిధ నిష్పత్తులలో ఉండాలి.
ఇక్కడ కూడా సోడియం ప్రాముఖ్యత మళ్ళీ చెప్పబడింది అంటే  మన ఆహారం లో ఉప్పు లేక సోడియం ను తక్కువ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు. ఇక్కడ మనం ఈ డ్యాష్ డైట్ ను ప్రత్యేకించి అధిక రక్త పీడనాన్ని తక్కువ చేసుకోవడానికి , తింటున్నామని గుర్తు చేసుకోవాలి. గుర్తు ఉంచుకోవాలి కూడా !
రక్త పీడనాన్ని  తగ్గించడం లో పొటాసియం ప్రాముఖ్యత ఇటీవలి పరిశోధనలలో  స్పష్టంగానూ , ఖచ్చితం గా నూ తెలిసింది. మనం తినే ఆహారం లో పొటాసియం లోపిస్తే,  వివిధ జీవ రసాయన చర్యల ద్వారా , రక్త పీడనాన్ని పెంచుతుంది.  
ఇంకో విషయం : ఈ పొటాసియం లోపాన్ని మనం తినే ఆహార పదార్ధాల మార్పు తోనే సరిచేయడం అత్యుత్తమం అని కూడా శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. 
వచ్చే టపాలో  రోజూ ఎన్ని సర్వింగ్స్  అంటే ఎంత పరిమాణం లో ఆహారం ఎన్ని సార్లు , ఏ ఏ ఆహారం గా తిన వచ్చో పరిశీలిద్దాము.
 
       టపా నచ్చితే http://www.baagu.net. గురించి తెలపండి.

డ్యాష్ ( DASH ) డైట్ ఎందుకు బెస్ట్ ?. 25.

In Our Health on మే 12, 2012 at 12:42 సా.

డ్యాష్ ( DASH ) డైట్  ఎందుకు బెస్ట్ ?. 25.

క్రితం టపాలో చూశాము కదా డ్యాష్ డైట్ శాస్త్రీయం గా  అధిక బీ పీ తగ్గించే  డైట్ గా ఋజువు చేయ బడిందని.
మరి ఈ డైట్ వివరాలు ఇప్పుడు చూద్దాము.
స్థూలం గా  డ్యాష్ డైట్  ఈ  సూత్రాల మీద ఆధార పడి తయారు చేయబడ్డది. 
1. ఈ డైట్ లో స్యాచు రేటెడ్ ఫ్యాట్, కొలెస్టరాల్, ఇంకా  టోటల్ ఫ్యాట్ – ఇవన్నీ తక్కువ గా ఉంటాయి. ( అంటే low in saturated fat, cholesterol and total fat  ) 
2. ఎక్కువగా , కాయగూరలు, పళ్ళు , కొవ్వు శాతం అతితక్కువ గా ఉన్నలేక అసలు లేకుండా ఉన్న పాల కు ఈ డైట్ లో ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వడం జరిగింది. ( అంటే  focuses on vegetables, fruits and low fat or no fat milk  and milk products ) 
3. ప్రాసెస్ చేయని ధాన్యాలు, బీన్స్ , విత్తనాలు , నట్స్   , శాక హారులకు , ఇంకా చేపలు, కోడి మాంసం మొదలైనవి శాకాహారులు కాని వారికీ  – ఇవి ఆహారం లో ఎక్కువగా తీసుకోవచ్చు ఈ డైట్ లో. ( DASH diet is rich in whole grains, beans,seeds, nuts  ( for vegetarians and fish and poultry  for non vegetarians ) 
4. పంచదార , లేక చెక్కెర  తో చేసిన స్వీట్స్ , చెక్కెర ఏ రూపం లో ఉన్నా ,  ఇంకా  ఎర్ర మాంసం
 ( శాకాహారులు కానివారు  ) వీటిని వీలయినంత తక్కువ  గా ఈ డైట్ లో వాడాలి. ( contains fewer sweets, added sugars, or sugary beverages for vegetarians  and these plus red meats for the non vegetarians ) 
5. ఈ డ్యాష్ డైట్  లో సోడియం  అంటే common salt , అంటే మనం రోజూ  ఆహారం లో తీసుకునే ఉప్పు కూడా చాలా తక్కువ వాడమని సిఫార్సు చేయబడ్డది. ఎందుకంటే , మనం తీసుకునే ఉప్పు , మన దేహం లో , ఇంకా ఖచ్చితం గా చెప్పాలంటే  మన రక్త పరిమాణాన్ని అంటే బ్లడ్ వాల్యూం ను పెంచుతూ , తద్వారా మన రక్త పీడనాన్ని అధికం చేస్తుంది.
( ఆహారం లో అధిక ఉప్పు మనకు తెచ్చే ముప్పు గురించి మనం ఒక టపా లో పటం సహాయం తో తెలుసుకున్నాము కదా ! అందువల్ల ఇక్కడ వివరించడం లేదు )
పైన చెప్పిన ఈ మూల సూత్రాలు మనకందరికీ తెలిసినవే అని అశ్రద్ధ చేయకూడదు. ప్రతి  వాక్యం లోనూ, శాస్త్రీయం గా  ఋజువు చేయబడ్డ నిజాల అంటే  యదార్దాలు ఉన్నాయి. ఉదాహరణకు  శాక హారులు కూరగాయలను ఎక్కువ గా తీసుకోవచ్చు అని ఉన్నది కదా అని మూడు నాలుగు కూరలు చక్కగా    వేపుడు చేసి రోజూ రెండు పూటలో , మూడు పూటలో తిన్నామనుకోండి , (   వేపుడు చేసిన  కూరలు ఎవరికీ ఇష్టం ఉండవు కనక ! ) అప్పుడు మనం ఈ డైట్ సూత్రాలలో  మొదటి సూత్రాన్ని అశ్రద్ధ చేసిన వారం అవుతాము కదా అంటే వేపుడు కూరలలో  కొలెస్టరాల్ శాతం ఎక్కువ అవుతూ ఉంటుంది కదా !  ఆ పరిస్థితిలో మనం ఈ డ్యాష్ డైట్ ను నిందించలేము , మనకు పనిచేయట్లేదని ! )
అలాగే ప్రాసెస్ చేయని ధాన్యాలు , నట్స్ , లేక విత్తనాలు ప్రత్యేకించి ఈ డ్యాష్ డైట్ లో ఎక్కువ గా వాడమని ఎందుకు రికమెండ్ చేయ బడిందంటే, అలాంటి ఆహారం లో మనకు రోజూ కావలసిన విటమిన్లూ ,ఖనిజాలూ  , ఇంకా  పీచు పదార్ధం ఎక్కువ గా ఉంటుంది.
 ( అంటే vitamins, minerals and fibre )  ముఖ్యం గా ఖనిజాలూ, విటమిన్లూ , మనకు మన రోజువారీ ఆహారం లో అతి తక్కువ పరిమాణం లో ఉండి, మనకూ , మన ఆరోగ్యానికీ , అంటే భౌతిక ఆరోగ్యమూ, మానసిక ఆరోగ్యానికీ , అన్ని విధాల అత్యంత  లాభ దాయకం చేస్తాయి.  మన దేహం లో  అనునిత్యం జరిగే  అనేక అత్యంత క్లిష్టమయిన జీవ రసాయన చర్యలు ఈ విటమిన్ల లోపం ఉంటె  కుంటు పడతాయి, లేక ఆగి పోతాయి కూడా ( లోపం అత్యధికం అయినప్పుడు ). అట్లాగే మన ఆహారం లో పీచు పదార్ధం లోపమయితే , కొన్ని రకాల కోలన్ అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ లకు కారణ మవుతుందని కూడా శాస్త్రీయ పరిశోధనల వల్ల తెలిసింది. 
పైన మనం చదివాము కదా ఈ డ్యాష్ డైట్ లో ఏ ఏ పదార్ధాలు,ఎక్కువ గా వాడాలో , అంటే తినాలో , అలాగే ఏ ఏ పదార్ధాలకు మనం దూరం గా ఉండాలో  తెలుసుకున్నాము కదా ! వచ్చే టపాలో  మనం ఎంతెంత  ఈ పదార్ధాలు రోజూ తినవచ్చో  కూడా తెలుసుకుందాము

డ్యాష్ (DASH ) డైట్ బీ పీ తగ్గించేందుకు ఎందుకు బెస్ట్ ( అత్యుత్తమం )!?.24.

In Our Health on మే 11, 2012 at 7:13 ఉద.

డ్యాష్ (DASH ) డైట్  బీ పీ తగ్గించేందుకు   ఎందుకు బెస్ట్ ( అత్యుత్తమం )!?.24.

నవీన  ఇంటర్నెట్  యుగం లో  ప్రతి అల్లాటప్పా వాడూ ,  మా డైట్ మంచిది అంటే మా డైట్ మంచిది అని అనేక ప్రకటనలు ఇచ్చి ప్రజలను మభ్య   పెడుతుంటారు .
కానీ అధిక రక్త పీడనాన్ని తగ్గించే శాస్త్రీయమయిన  డైట్ లు చాలా కొన్న్ని మాత్రమె ఉన్నాయి.  అందులో  డ్యాష్ డైట్  ( DASH ) ప్రధానమయినది. దీని గురించి కొంత తెలుసుకుందాము.

DASH అంటే  డయ టరీ అప్రోచెస్ టు స్టాప్  హైపర్ టెన్షన్ ( Dietary Aproaches to Stop Hypertension ).
అమెరికా నేషనల్ ఇన్స్టిట్యుట్  అఫ్ హెల్త్  ( National Institute of Health of America )  వారు  చేయించిన పరిశోధనలు, పరిశీలనల ద్వారా ఈ డ్యాష్ డైట్  చాలా శాస్త్రీయం అయినదీ,
ఉపయోగ కరమైనదీ అని రుజువు అయింది.  అంతే కాక ఈ ప్రత్యేకమయిన డైట్ , గత రెండు సంవత్సరాలుగా,  అత్యుత్తమ డైట్ గా ర్యాంకింగ్ పొందుతూ ఉంది అమెరికా లో.
అందువల్లనే  ఈ డ్యాష్ డైట్ ను ఈ క్రింది సంస్థలు రికమెండ్ చేస్తున్నాయి:
1. అమెరికన్ హార్ట్ అసోసి ఎషన్ ( American Heart Association, AHA )
2.The 2010 diet guidelines for Americans.
3.The National Heart, Lung, and Blood Institute of America.
4.The 2011  Treatment  guidelines  for women.
5.US guidelines for treatment of high blood pressure.
6.The Mayo clinic ( USA )
ఎవరికోసం ఈ డ్యాష్ డైట్ ? :
డ్యాష్ డైట్ ప్రత్యేకించి  అధిక రక్త పీడనం  ఉన్న వారికీ,  లేక అధిక రక్త పీడనం  వచ్చే ముందు లక్షణాలు ఉన్న వారికీ ( ఆంటే ఈ  దశను  ప్రీ హైపర్ టెన్షన్ లేక Pre Hypertension  అంటారు ) రికమెండ్ చేయబడుతుంది.
డ్యాష్ డైట్  వల్ల ఉపయోగం ఉంటుందా ? :
DASH డైట్  సరిగ్గా ఆచరిస్తే  పద్నాలుగు ( అంటే 14 ) రోజులలోనే  అధిక రక్త పీడనం , ఆంటే హై బీ పీ , కంట్రోలు లోకి వస్తుందని శాస్త్రీయం గా రుజువు అయింది.  కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే,  ఈ డైట్  ప్రారంభ దశలోనూ, మధ్య దశలోనూ హై బీ పీ ఉన్న వారికి ప్రత్యేకించి లాభదాయకం.
అంతే కాకుండా,  అధిక రక్త పీడనానికి మందులు వాడే వారిలోనూ,  ఈ డైట్   ను ఆచరిస్తే, వారి మందులను బాగా పని చేసేటట్టు చేస్తుంది. అంటే , మందులను తీసుకుంటున్న వారు , ఈ డ్యాష్ డైట్ ను కూడా తీసుకుంటుంటే , వారిలో అధిక రక్త పీడనం చక్కగా కంట్రోలు అవుతుంది.
DASH డైట్ వల్ల ఇతర లాభాలు :
1. ఈ డైట్   మన రక్తం లో కొలెస్టరాల్ ను తగ్గించ గలదు.
2. అట్లాగే  మన శరీరం లో వివిధ అవయవాలకూ , కండరాలకూ , ఇన్సులిన్  కు ఎక్కువగా స్పందించే టట్టు చేసి , తద్వారా మధుమేహ వ్యాధి నివారణ కు కారణమవుతుంది.
3. ఈ ప్రత్యేకమయిన డైట్ , అధిక బరువును కూడా తగ్గిస్తుంది.
వచ్చే టపాలో  డ్యాష్ డైట్  (DASH )వివరాలు చూద్దాము !
ఈ టపా నచ్చితే  హై బీ పీ  పత్యం అంటే డైట్ ద్వారా తగ్గించుకోవాలని చూసే మీ స్నేహితులకూ తెలియ చేయండి  www.baagu.net. గురించి.

మన జీవన శైలి ( life style ) లో మార్పులు, బీ పీని ఎట్లా కంట్రోలు చేస్తాయి ?.23.

In Our Health on మే 10, 2012 at 11:27 ఉద.

మన జీవన శైలి  ( life style ) లో మార్పులు, బీ పీని ఎట్లా కంట్రోలు చేస్తాయి ?.23.

 
పైన ఉన్న టేబుల్ చూడండి. అనేక శాస్త్రీయ పరిశీలనల ఫలితం గా దీనిని రికమెండ్ చేసింది అమెరికన్ డిపార్ట్మెంట్  అఫ్ హెల్త్ వారు.
మనం రోజు వారీగా మన కార్యక్రమాలలో, అంటే మన ఆహారపు అలవాట్లలో , లేక తీసుకునే మద్య పానీయాల అలవాట్లలో , లేక వ్యాయామం చేయటం లో మన జీవన శైలి , మన రక్త పీడనాన్ని ఎట్లా తగ్గిస్తుందో వివరింప బడ్డది.
అధిక రక్త పీడనం మొదటి దశలో ఉన్నప్పుడు కేవలం పైన ఉదాహరించిన  జీవన శైలి మార్పులతో , కంట్రోలు చేసుకోవచ్చు. 
మనం అతి బరువు గా ఉండడం, లేక , అతిగా మద్యం సేవించడం, లేక  అనేక విషతుల్యమైన పదార్ధాలను మన దేహం లో నింపే స్మోకింగ్ చేయడం , వీటన్నిటి వల్లా  , గుండె, రక్తనాళాల మీద వీటి ప్రభావం గురించి ఎంతో వివరం గా మునుపటి టపాలలో తెలుసుకున్న్నాము, పటాల సహాయం తో కూడా ! 
ఇక్కడ ఒక గమనిక : పైన చూపిన టేబుల్ లో మద్య పానం మితం గా చేయమని ఉంది.  దీనిని అమెరికన్ వైద్యులు తయారు చేశారు కాబట్టి , అక్కడి ఆచార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని , మద్యం అప్పటికే తాగుతున్న వారు మితం గా తాగితే బీ పీని కంట్రోలు చేయగలరు అని తెలిపారు. ఈ సూచన అన్ని దేశాల వారికీ  వర్తించదు.  ఎందుకంటే,  మొత్తం మీద మద్యం చేసే హాని, లాభాలతో పోలిస్తే చాలా ఎక్కువ. 
గమనించినట్టయితే, ఎక్కువ గా మనం బీ పీని కంట్రోలు చేయగలిగేది , మన బరువును నియంత్రించు కోవడం ద్వారానూ , ఇంకా మన ఆహారం లో మార్పులు తీసుకు రావడం ద్వారానూ కదా ! 
ఈ చర్యలన్నీ కూడా  బీ పీ రెండవ దశ, మూడవ దశ కు చేరుకొని , మందులు అంటే యాంటీ హైపర్ తెన్సివ్స్  తీసుకునే వారు కూడా పాటించడం శ్రేయస్కరం. అంటే కేవలం మొదటి దశలోనే కాదు. ఎందుకంటే ఈ చర్యలన్నీ అశ్రద్ధ చేస్తే , మందులు ఎక్కువ గా వాడ వలసిన అవసరం రావచ్చు. కొన్ని పరిస్థితులలో , ఆ మందులు కూడా కంట్రోలు చేయలేక పోవచ్చు అధిక బీ పీని. అందువల్లనే  మనం అధిక బీపీని కంట్రోలు చేయడం లో అత్యుత్తమ విజయాలు సాధించేది   జీవన శైలి లో మార్పులు ఎల్ల కాలం అనుసరించడం వల్లనే,  మందులు తీసుకోక పోయినా , లేక మందులు తీసుకుంటున్నా ! 
వచ్చే టపా లో ఇంకొన్ని వివరాలు చూద్దాము ! 
 
ఈ టపా నచ్చితే http://www.baagu.net. ను మీ స్నేహితులకు తెలియ చేయండి ! 

అధిక రక్త పీడనం ( హై బీ పీ ) చికిత్స కేవలం మందులేనా !?.22.

In Our Health on మే 10, 2012 at 9:38 ఉద.
అధిక రక్త పీడనం ( హై బీ పీ ) చికిత్స  కేవలం మందులేనా !?.22. 
 

 

చూసుకో రోజూ లవణమారు గ్రాములు గా , నీ మిత భోజనం లో

 ఉంచుకో  నిన్ను,  మద్యానికీ, పొగాకుకూ, దూరంగా,

గడుపుకో కొంత సమయం  రోజూ  వ్యాయామం, ధ్యానం లో 

తీసుకో మందులు అవసరమైతే,  క్రమంగా 
జీవించు నీ జీవితం ఆనందం గా !
అధిక రక్త పీడనం నిన్నుఇక  పీడించ లేదుగా !  
 
పైన చెప్పిన  ‘ శులభ ‘  సూత్రాలు మనం రోజూ మననం చేసుకుని ఆచరిస్తే  అధిక రక్త పీడనం ఇక మనని బాధించలేదు! 
మనం మునుపటి టపాలలో  తెలుసుకున్నాము  చాలా వివరం గా,  అధిక రక్త పీడనం , చాలాకాలం ఉంటే, దాని ప్రభావం గుండె మీదా, మెదడు మీదా, మూత్ర పిండాల మీదా, కళ్ళ మీదా, ఏ విధంగా ఉంటుందో. ( ఈ బ్లాగు మొదటి సారి చూస్తున్న వారు, ఆర్కివ్స్ లో మునుపటి టపాలు చూడ వచ్చు , ఈ సంగతులన్నీ తెలుసుకోవడానికి ) 
ఇపుడు మనం అధిక రక్త పీడనం చికిత్సా పద్ధతులు చూద్దాము. 
ఇవి ప్రధానం గా మూడు విధాలు:
మొదటి విధానం : 
బీ పీ కనక 130/80 mm Hg. కన్నా ఎక్కువ ఉంటే,  కేవలం జీవన శైలి లో మార్పులు అంటే ( life style modifications ), ఆ అధిక రక్త పీడనాన్ని  కంట్రోలు చేసుకోవచ్చు. 
రెండవ విధానం :
బీ పీ కనక 140/90 mm Hg. అంతకు మించీ ఉంటే , అప్పుడు  జీవన శైలి లో మార్పులతో పాటు  అధిక రక్త పీడనం తగ్గించే  మందులు వీటినే  యాంటీ హైపర్  టేన్సివ్ లు అంటారు ( anti hypertensives ). వీటిని కూడా తీసుకోవలసి ఉంటుంది. 
మూడవ విధం : 
బీ పీ కనక 180/110 mm Hg. కానీ అంతకు మించి కానీ ఉంటే , ఆ పరిస్థితి ప్రమాదకరమైనది. అపుడు వెంటనే తగు వైద్య సహాయం తీసుకోవాలి ఆలస్యం చేయకుండా. ప్రత్యేకమైన పరీక్షలు కూడా అవసరం అవుతాయి ఆ పరిస్థితిలో. 
 
జీవన శైలి లో మార్పులు మనం ఎట్లా తేవచ్చో , వచ్చే టపాలో వివరం గా తెలుసుకుందాము ! 
మీ ప్రియ స్నేహితుల, బంధువుల బాగు కూడా కోరుకుంటున్నారు కదూ అయితే ఆలస్యం దేనికి ? వారికి  www.baagu.net. గురించి తెలపండి ! 
 
 
 
 

గుండె జబ్బు నివారణ లో కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్ ఎట్లా ఉపయోగ పడుతుంది.?. 21.

In Our Health on మే 9, 2012 at 8:56 సా.
  • గుండె జబ్బు నివారణ లో కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్   ఎట్లా ఉపయోగ పడుతుంది.?. 21.

  • పైన ఉన్న చిత్రం నిశితం గా గమనించండి. ఇది గుండె యొక్క  ఈ సి జీ అంటే  తక్కువ వోల్టేజీ తో విద్యుత్తును  ప్రసరింప చేసి  మన గుండె కొట్టుకునే  విధానాన్ని రికార్డు చేయడం అన్న మాట. 

    ఈ చిత్రం లో సహజం గా గుండె కొట్టు కుంటూ ఉన్నప్పుడూ, వేగం గా, నిదానం గా , లేక అవకతవకలతో కొట్టుకుంటూ ఉన్నప్పుడూ , ఆ తరంగాలు ఎట్లా రికార్డు చేయ బడతాయో  చూపబడింది.

    అలాగే యాంజైనా ఉన్నప్పుడూ, లేక గుండె పోటు ఉన్నప్పుడూ,  ఈ సి జీ  ఒక ప్రత్యేకమైన రీతిలో  గుండె తరంగాలను రికార్డు చేస్తుందన్న మాట. 
     
    ( Cardiac stress test )కార్డియాక్ స్త్రెస్స్  టెస్ట్  లో  గుండె  తీవ్రమైన వత్తిడి లో ఎట్లా పని చేస్తుందో , కనుక్కోవడం. ఇక్కడ వత్తిడి లేక స్త్రెస్స్  అంటే శారీరిక  శ్రమ  అంటే Physical stress. అంటే ఇది భౌతికమైనది. అంటే మానసికమైనది కాదు. ఇలాంటి పరీక్షలలో సాధారణంగా  ఈ పరీక్ష చేసే పరిస్థితులను నియంత్రించ వచ్చు అన్న మాట. అంటే  కంట్రోల్డ్  ఎన్విరాన్మెంట్ . ఈ విధమైన పరీక్ష  వల్ల మన గుండె  శారీరిక శ్రమ ఎక్కువ అవుతున్న కొద్దీ ఎంత  ఎఫిషియెంట్  గా  పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అందువల్ల  ఒకవిధం గా గుండె కు సరఫరా చేసే కరోనరీ ధమనులు కూడా  మూసుకు పోకుండా గుండె కండరాలకు తగినంత  రక్తం సరఫరా చేస్తున్నాయో లేదో కూడా  తెలుసుకోవచ్చు. 
    ఎందుకంటే ఒక మోస్తరు గా శారీరిక శ్రమ  పడితే , ఒక వేళ  కరోనరీ ధమనులు కనుక పాక్షికం గా కానీ , పూర్తిగా కానీ మూసుకుని పోయి ఉన్నట్టయితే, వారికి ఆయాసం రావడమూ, లేక చాతీ లో నొప్పి రావడము, ఎక్కువ అలసట కలగడమూ జరగవచ్చు. అలా కనక జరిగితే తదనుగుణంగా మార్పులు  ఎలెక్ట్రో కార్దియోగ్రం  అంటే ఈ సి జీ  ( Electro Cardiogram or ECG or EKG ) లో కనిపిస్తాయి. అప్పుడు మిగతా పరీక్ష లు  చేయవలసిన  అవసరం ఉంటుంది, ఖచ్చితంగా ఏ కరోనరీ ధమని ఎంత వరకు మూసుకు పోయిందనే విషయం తెలుసుకోవడానికి. 
    ఎవరెవరు  ఈ పరీక్షలు చేయించుకో కూడదు ? :
    గత 48 గంటలలో గుండె పోటు వచ్చిన వారు, గుండె కవాటాలలో లోపం ఉన్న వారు ( Valvular heart disease ) ,ఒకటి కన్నా ఎక్కువ కరోనరీ ధమనులు సరిగా పని చేయక పోతున్నప్పుడు , అన్ స్టేబుల్  యాంజైనా ( అంటే మందులకు సరిగా లొంగని యాంజైనా )తో బాధ పడుతున్నప్పుడు, గుండె కొట్టుకోవడం లో ఒడు దుడుకు లు ఉన్నప్పుడు అంటే  కార్డియాక్  ఎరిత్మియా  ( cardiac arrythmia ) 
    ఇలాంటి పరిస్థితులలో  కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్ చేయించుకోవడం కూడదు.  గుండె  స్పెషలిస్ట్ ను సంప్రదించాలి తప్పకుండా !
    ఈ కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్ రెండు రకాలు గా ఉంటుంది ప్రధానం గా ! 
    ఒకటి  ట్రెడ్ మిల్ టెస్ట్. ( Exercise Treadmill test  ) 
    రెండు న్యూక్లియర్ స్త్రెస్స్ టెస్ట్ . ( Nuclear Stress Test ) 
    ట్రెడ్ మిల్ టెస్ట్ లో ఒక కదిలే   దిమ్మ  మీద స్థిరం గా నుంచోవడం అంటే మనం కొంత వేగం తో పరిగేట్టాలన్న మాట. దీనినే ట్రెడ్ మిల్ అంటారు. ఈ ట్రెడ్ మిల్ వేగాన్ని మన శక్తి సామర్ధ్యాలకు అనుగుణం గా పెంచడమో తగ్గించడమో చేస్తూ ఉంటారు. 
    అలాగే మనల్ని పెడల్స్ ఉన్న ట్రెడ్ మిల్ మీద కూర్చోపెట్టి , సైకిల్ తొక్కుతున్న విధం గా పెడల్ చేయాలన్న మాట.  ఇలా క్రమం గా వేగం పెంచుతూ చేస్తుంటే , మన గుండె  ఈ భౌతిక మైన శ్రమకు ఎట్లా తట్టుకుంటుందో  ECG ద్వారానూ , మనలో వచ్చే లక్షణాల ద్వారా నూ తెలుసుకుంటారు. 
    ఇక న్యూక్లియర్ స్త్రెస్స్ టెస్ట్ లో  మన గుండె లో ఉండే కరోనరీ రక్త నాళాల ను ఫోటో తీసే విధంగా  కొన్ని  రేడియో ట్రేసర్  రసాయనాలను ఇంజెక్షన్ రూపం లో ఇచ్చి , అప్పుడు ఆ ఫోటో లలో ఉన్న ధమనులను విపులం గా పరీక్షించి  ఎక్కడెక్కడ ధమనులు , ప్లేక్ ఫార్మేషన్ తో నొక్కుకు పోయినాయో , ఏ మేరకు పూడుకు పోయినాయో  ఖచ్చితం గా కనుక్కోవడం జరుగుతుంది.  
    పైన చెప్పిన ఈ రెండు రకాల పరీక్షలూ , ప్రధానంగా మనకు ఇస్కీమిక్  హార్ట్ డిసీస్( Ischemic Heart disease )  ఉందొ లేదో తెలుసుకోవడానికి  చేస్తారు.   ఇలా తెలుసుకోవడం  తరువాత చేయించుకోవలసిన చికిత్స కోసం ఎంతో ముఖ్యం. 
    ఒక గమనిక :  పైన తెలిపిన పరీక్షలు, కార్డియాక్ స్త్రెస్స్ టెస్ట్ లు అంటే ఏమిటో ఒక అవగాహన ఏర్పడడానికే.  వీటి అవసరం ఉందనుకునే వాళ్ళు కార్డియాలజిస్ట్ ను తప్పనిసరిగా సంప్రదించాలి. 
    హృదయం లేక గుండె కు సంబంధించిన అన్ని రకాల అధునాతన పరీక్షల పేర్లూ ఈ క్రింద పొందు పరచ పడినాయి మీ సౌలభ్యం కోసం. 
  • Angiography
  • Blood Tests
  • Cardiac Catheterization
  • Cardiac MRI
  • Chest X-ray 
  • Computerized Tomography Scan
    (CT or CAT)
  • Doppler Ultrasound
  • Echocardiogram (ECHO)
  • Electrocardiogram (EKG OR ECG)
  • Electrophysilogy Study (EPS)
  • History and physical exam
  • Holter Monitoring
  • Loop Recorder
  • Muga Scan/Viability Scan
  • Nuclear Stress Test
  • Positron Emission Tomography (PET)
  • Stress Tests
  • Pharmacological (Drug-Induced) Stress Tests
  • Tilt-Table Test
  • Transesophageal Echocardiogram (TEE)
  • Treadmill Stress Test
  • వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !  

గుండె జబ్బు నివారణకు ఇంకో రెండు రక్త పరీక్షలు. 20.

In Our Health on మే 8, 2012 at 10:04 సా.

గుండె జబ్బు నివారణకు ఇంకో  రెండు రక్త పరీక్షలు. 20.

Lipoprotein a  test. లైపో ప్రోటీన్ ఎ  లెవెల్స్ టెస్ట్ : 
                         
మనం మునుపటి టపాలలో వివరం కా తెలుసుకున్నాము కదా చెడు కొలెస్టరాల్ గురించి. లైపోప్రోటీన్ ఎ, ఈ చెడు కొలెస్టరాల్ LDL  కొలెస్టరాల్ కు చెందుతుంది.
పైన ఉన్న  మొదటి చిత్రం చూడండి ఈ లైపోప్రోటీన్ ఎ  అణువు ఎంత అందం గా ఉందొ.  కానీ ఈ అందమైన లైపోప్రోటీన్ ఎ అణువు  మన ఆరోగ్యానికి ఎంత హానికరమో రెండవ చిత్రం లో  ఒక కార్టూన్ రూపం లో చూప బడింది.  ఈ కార్టూన్ లో రక్త నాళం లోపలి గోడలలో అతుక్కుని కూర్చున్న రాక్షసి లాంటి LDL కొలెస్టరాల్ ను  ప్రక్కనే ఉండి రక్తనాళం గోడలను అంటే ఇంటిమా ను ‘ శుభ్రం’ చేస్తున్న  HDL కొలెస్టరాల్ నూ గమనించ వచ్చు.
మన దురదృష్టం ఏమిటంటే  మనలో ఈ  LDL  కొలెస్టరాల్ ఎంత ఉండేదీ మన జీన్స్ అంటే జన్యువులు నిర్ణయిస్తాయి. అందులో మన ప్రమేయం ఏమీ ఉండదు.  మనం ఏమైనా చేయగలిగితే,   ఈ లైపోప్రోటీన్ ఎ లెవెల్ ఎంత ఉందొ పరీక్ష చేయించుకుని , ఎక్కువ గా ఉంటె తగు జాగ్రత్తలు తీసుకోవడమే కదా !
BNP test or B type Natri Uretic Peptide test  బీ ఎన్ పీ పరీక్ష లేదా  బీ టైపు  నెట్రి యురెటిక్ పెప్టైడ్ పరిక్ష : 
ఈ పరీక్ష లో BNP అనే రసాయనం పరిమాణం మన రక్తం లో ఎంత ఉందొ  కొలిచి, దాని ద్వారా  మన గుండె జబ్బు తీవ్రత కనుక్కుంటారు.
ఈ BNP ఎక్కడ నుంచి వస్తుంది ? :  ఇది అత్భుతమైన  ప్రకృతి చిత్రాలలో ఒకటి  అనుకోవచ్చు.
ఎందుకంటే ,  గుండె జబ్బు వచ్చినప్పుడు , గుండె నుంచీ , ఇంకా మనలో ఉన్న రక్తనాళాల నుంచీ విడుదల అయే ఈ BNP,  అనవసరమైన  ద్రవాలను  మూత్రము ద్వారా పంపించి , మన రక్తం  పరిమాణం లో మార్పులు తీసుకువచ్చి  ,  తద్వారా గుండె చేసే పనిని  తగ్గించి , గుండె కు తగు విశ్రాంతి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ BNP  హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా విడుదల అవుతుంది.  గుండె జబ్బు తీవ్రం గా ఉంటె , ఎక్కువ గానూ విడుదల అవుతుంది.
ఈ BNP గుండె జబ్బు వల్ల వచ్చే ఆయాసం ,  లేక  ఊపిరితిత్తుల జబ్బుల వల్ల వచ్చే ఆయాసం లో తేడా కనుక్కోవడానికి కూడా ఉపయోగ పడుతుంది.  ఎందువల్ల నంటే ఈ BNP  ఎక్కువ గా విడుదల అయేది గుండె జబ్బు లోనే !
క్రింద చిత్రం లో చూడండి ఈ BNP  ఏ పరిస్థితులలో విడుదల అవుతుందో !  
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

HbA1C పరీక్ష దక్షిణ ఆసియా వారందరికీ గుండె జబ్బు నివారణలో ఎందుకు విలువైనది ?19.

In Our Health on మే 8, 2012 at 8:45 సా.

HbA1C   పరీక్ష దక్షిణ ఆసియా  లో వారందరికీ గుండె జబ్బు నివారణలో  ఎందుకు విలువైనది ? 19.

దక్షిణ ఆసియా దేశాలలో భారత దేశమూ, నేపాలు , పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్  మొదలైన దేశాలున్నాయి. ఇటీవలి పరిశోధనల  వల్ల  ఈ  దేశ వాసులందరిలో , డయాబెటిస్  వచ్చే రిస్కు  పలు కారణాల వల్ల  ఎక్కువ గా ఉంటుందని తెలిసింది. ఈ రిస్కు , వారు , వారి దేశం వదిలి వెళ్లి , వేరే ఏ  ఇతర దేశం లో స్థిర పడ్డా కూడా మారదని కూడా వివిధ పరిశీలనల వల్ల విశదమయింది. ( మనం డయాబెటిస్ లేక మధుమేహ వ్యాధి  గురించి ముందు ముందు టపాలలో వివరం గా తెలుసుకుందాము  ).
ఇప్పుడు HbA1C పరీక్షకూ , గుండె జబ్బులకూ సంబంధం ఏమిటి ? : 
మనం గుండె జబ్బు నివారణ  ఎట్లా చేయ వచ్చో తెలుసుకుంటున్నాము కదా !  డయాబెటిస్  అంటే మధుమేహాన్ని అత్యంత తొలి దశలలో  కనుక్కోవడానికి  HbA1C test అంటే  హెచ్  బీ  ఎ  వన్  సి  పరీక్ష  అత్యంత  ఉపయోగకరమైనది. మనం ఇప్పటి వరకూ  మధుమేహాన్ని కనుక్కోవడానికి  మన రక్తం లో ఉన్న  చెక్కెర పరిమాణాన్ని కొలిచి  నిర్దారించడం జరుగుతూ ఉన్నది.  కానీ ఇటీవల  HbA1C test ను  మధుమేహాన్ని నిర్ధారించే  ప్రధాన  పరీక్ష గా  ప్రపంచం అంతా ఆమోదించడం జరిగింది.
ఈ పరీక్ష వివరాలు చూడండి. 
మన రక్తం లో సహజం గా ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా ! ఈ  ఎర్ర  రక్త కణాలలో  హీమోగ్లోబిన్  ఉంటుంది
కదా !  ఈ  హీమోగ్లోబిన్  సహజం గా  ఆక్సిజెన్ ను ఆకర్షించి  మన  శరీరం లో ప్రతి భాగాన్నీ చేరవేస్తుంది.
కానీ ఇటీవల శాస్త్రజ్ఞులు  మన  రక్తం లో ఉన్న  గ్లూకోజు  కూడా  ఈ  హీమోగ్లోబిన్ చేత  ఆకర్షింప  బడుతుంది.  అప్పుడు  దానిని   గ్లయికోజిలేతేడ్  హీమోగ్లోబిన్  అంటారు ( glycosilated hemoglobin  or HbA1C ). కొన్ని ప్రత్యెక పద్ధతుల ద్వారా  ఈ  గ్లయికోజిలేటేడ్  హీమోగ్లోబిన్  పరిమాణం కొలిచి,  నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటె అప్పుడు మధుమేహాన్ని లేక డయాబెటిస్ ను నిర్దారించుతారు.
పై చిత్రం చూడండి. వివరణ : మొదటి చిత్రం లో  రక్తనాళం ను కోసినట్టు చూపించారు.  అందులో సహజం గా ఉండే గ్లూకోజు అణువులు రక్త కణాలకు ఎక్కువ గా అతుక్కోవు. కానీ మన రక్తం లో అవే గ్లూకోజు అణువులు ఎక్కువ అయినప్పుడు ,  రక్త కణాలకు ఎట్లా అతుకు కుంటాయో కూడా చక్క గా చూపబడింది. 
మధుమేహాన్ని ముందుగా కనుక్కోక పొతే ,  కంట్రోలు లో లేని మధుమేహం  గుండెజబ్బులకు  అత్యధిక రిస్కు అవుతుంది. అందువల్ల  ఈ HbA1C పరీక్ష అత్యంత విలువైనది, ఉపయోగ కరమైనది కూడా ! 
ఎవరు చేయించుకోవాలి ఈ పరీక్షను ? :
కుటుంబం లో మధుమేహం ఉంటె, లేక అత్యధిక బరువు ఉంటె, ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సహజం గా కుటుంబం లో ఎవరికైనా మధుమేహం ఉంటె , ఆ జన్యువులు లేక జీన్స్  మనలో కూడా ఉండి, మధుమేహం కలిగించడానికి అవకాశం హెచ్చుతుంది. అలాగే ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ ఉన్నవారికి మధుమేహం రావడానికి అవకాశం హెచ్చు. అందువల్ల ఈ పరీక్ష  చాలా  ప్రయోజనకారి.
పై  చిత్రం లో ఎన్ని మిల్లీగ్రాముల గ్లూకోజుకు  ఎంత HbA1C ఉందొ  చాలా అర్ధ వంతం గా రంగులతో చూపబడింది. 
ఇక్కడ సాధారణ లెవెల్స్ ఆకు పచ్చ రంగులోనూ , ప్రమాదకర లెవెల్స్ ఎరుపు రంగులోనూ చూపబడ్డాయి.  ప్రమాద కరం అంటే  రక్తం లో ఒక లెవెల్ లో ఉండవలసిన పరిమాణం కన్నా ఎక్కువ గ్లూకోజు ఉంటె ఆ పరిస్థితి పరిణామాలు తీవ్రం గా ఉంటాయి.
వచ్చే టపాలో ఇంకో పరీక్ష గురించి తెలుసుకుందాము !

గుండె జబ్బు నివారణలో హోమోసిస్టీన్ ( homocysteine ) పరీక్ష ఎందుకు ?.18.

In Our Health on మే 7, 2012 at 10:27 సా.

 గుండె జబ్బు నివారణలో హోమోసిస్టీన్ పరీక్ష ఎందుకు ?.18.

రక్త పరీక్షలు మనలో అత్యంత తొలి దశలలో వ్యాధులు కలిగించే సూక్ష్మమైన మార్పులు తెలిపి,  భవిష్యత్తు లో మన ఆరోగ్య నిర్దేశన చేసే టెలిస్కోపులు !  

మనం క్రితం టపాలో కొన్ని రక్త పరీక్షలు, ముందుగా చేయించుకుంటే, మనకు గుండె జబ్బు లక్షణాలను ఎట్లా కనిపెడతాయో  చూశాము కదా ! గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ రక్త పరీక్షల వల్ల , మన దేహం లో, రక్త నాళాల లో చాలా ముందుగా జరిగే మార్పులు మనకు తెలుస్తాయి. అంటే  కొన్ని దశాబ్దాల క్రితం మాదిరిగా జబ్బు ముదిరే దాకా వేచి ఉండనవసరం లేదు.  శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ , అతి సున్నితమైన పరీక్షలు, అవి రక్త పరీక్షలు కానీయండి , వేరే  ఇమేజింగ్ పరీక్షలు కానీయండి , చాలా మనకు అందుబాటు లోకి వచ్చాయి. ఇక మనం చేయవలసిందల్లా తగు జాగ్రత్త లు తీసుకోవడమే ! లేక తక్షణ వైద్య సహాయం తీసుకోవడమో ! ఈ రెండు పనులు చేయడానికీ మనకు ఈ పరీక్షల గురించి తెలియాలి కదా !  ఆ అవగాహన కలిగించడానికే ఈ ప్రయత్నం !
3.Homocysteine levels test. హోమో సిస్టీన్ లెవెల్స్ టెస్ట్ : 
హోమో సిస్టీన్ కధ ఏమిటో చూద్దాము ఇప్పుడు :  మన దేహం లో 22 రకాల అమీనో యాసిడ్స్ ఉంటాయి.  అందులో 9 అంటే తొమ్మిది రకాల అమీనో యాసిడ్స్ ను మనం ఎసెన్షియల్  అమీనో యాసిడ్స్ అంటాము. ఎందుకంటే ఈ తొమ్మిదీ మన దేహం లో తయారు కాలేవు.  కానీ మనకు ఇవి చాలా ముఖ్యం. అందువల్ల మనం మన ఆహారం లో ఈ తొమ్మిది అమీనో యాసిడ్స్ నూ తీసుకోవాలి.  ఈ హోమోసిస్టీన్ అనే అమీనో యాసిడ్ ,  రూపాంతరం చెందిన సిస్టీన్ అనే అమీనో యాసిడ్. ఒక రకం గా చెప్పుకోవాలంటే ఈ హోమోసిస్టీన్ కూడా ఎసెన్షియల్ అమీనో యాసిడ్ కోవ కు చెందుతుంది.
ఇటీవలి పరిశోధనల వల్ల ఈ హోమోసిస్టీన్  గుండె జబ్బులలో ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిసింది.
ఒక్క ముక్క లో చెప్పాలంటే ఈ హోమోసిస్టీన్  మన రక్త నాళా లను ‘  కరోడ్ ‘ చేసే జీవ రసాయనం.
  ( homocysteine is a biological corrosive ) 
మనకు మన  నిత్య జీవితం లో , ఇనుము ‘ తుప్పు ‘ పట్టడమూ, లేక రాగి పాత్రలు చిలుము పట్టడమూ , అనుభవం లోనిదే కదా ! అలాగే  మన రక్త నాళాల లోపలి ‘ గోడలను ‘  ( ఇంటిమా – intima ,  అని మనం క్రితం టపాలలో పటం సహాయం తో తెలుసుకున్నాము ), వివిధ రసాయన చర్యలతో  ఈ హోమోసిస్టీన్  బలహీనం చేస్తుందని  తెలిసింది.  పై చిత్రం లో  ఈ హోమో సిస్టీన్   ఉదాహరణకు ఒక  కరోనరీ ధమని గోడను  ఎలా ‘ చీల్చుతుందో ‘ చూపబడింది. ఇది అత్యంత సూక్ష్మమైన చీలిక అయినా , ఆ చీలిక తరువాత  అక్కడ జరిగే మార్పులు , అంటే అక్కడ ‘ చెడు కొవ్వు పేరుకోవడమూ, తదనంతరం ,  ప్లేక్ ఫార్మేషన్ అంటే ఒక ‘ పెచ్చు ‘ ఏర్పడడమూ, ఆ తరువాత ఆ పెచ్చు ఊడి పోయి , ఆ ప్రాంతం లో రక్తస్రావం జరగడమూ, అప్పుడు అక్కడ రక్తం గడ్డ కట్టడమూ,  అంటే త్రాంబస్ ఏర్పడడమూ ,  అప్పుడు ఆ రక్తనాళం పాక్షికం గానో  , లేక సంపూర్ణం గానో మూసుకు పోయి , యాంజైనా కానీ , హార్ట్ ఎటాక్ కానీ కలిగించడమో  జరుగుతాయి.  ఇప్పుడు మనకు అవగాహన అయింది కదా ఈ హోమోసిస్టీన్ మన రక్త నాళాలను ఏ విధం గా ‘ తుప్పు ‘  లేక ‘ చిలుం ‘  పట్టిస్తుందో !
ఈ హోమోసిస్టీన్  నార్మల్ లెవెల్స్ ఏమిటి ?: 
4.4 to 10.8 micromols per litre అంటే  4.4 నుంచి 10.8 మైక్రో మోల్స్ పర్ లీటర్.
ఎవరు చేయించుకోవాలి ఈ హోమోసిస్టీన్ టెస్ట్ ? :  ఈ పరీక్ష కూడా గుండె జబ్బు కు రిస్కు ఫ్యాక్టర్లు ఉన్న వారు చేయించుకోవాలి. ( మునుపటి టపాలో తెలుసుకున్నాము కదా చాలా వివరం గా ఈ రిస్కు ఫ్యాక్టర్ల గురించి ! )
4.Lipoprotein ‘ a ‘ levels test. లేక లైపో ప్రోటీన్ లెవెల్స్ టెస్ట్. ( దీని గురించి వచ్చే టపాలో తెలుసుకుందాము ) 
( ఈ టపా నచ్చితే మీ స్నేహితులకు  www.baagu.net. గురించి తెలియచేస్తారు కదూ ! )

గుండె జబ్బు నివారణ కు మిగతా రక్త పరీక్షలు ఏమిటి ? ఎందుకు ? .17.

In Our Health on మే 7, 2012 at 1:52 సా.

గుండె జబ్బు నివారణ కు మిగతా రక్త పరీక్షలు ఏమిటి ? ఎందుకు ? .17.

 క్రితం టపాలో మనం  గుండె జబ్బుల నివారణలో  ఫాస్టింగ్  కొలెస్టరాల్  పరీక్ష  ప్రాముఖ్యత తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు మిగతా ముఖ్యమైన పరీక్షలు కూడా  ఏమిటో , ఆ పరీక్షలు మనకు  గుండె జబ్బు గురించి ఏమి చెబుతాయో కూడా తెలుసుకుందాము.
1. C – reactive protein , లేక  సి – రియాక్టివ్  ప్రోటీన్  టెస్ట్.
2. Fibrinogen levels test. లేక ఫైబ్రినోజెన్ లెవెల్స్ టెస్ట్.
3.Homocysteine levels test. హోమో సిస్టీన్ లెవెల్స్ టెస్ట్.
4.Lipoprotein ‘ a ‘ levels test. లేక లైపో ప్రోటీన్ లెవెల్స్ టెస్ట్.
5. Natriuretic peptides. లేక  నెట్రి యురెటిక్ పెప్ టైడ్ లెవెల్స్ టెస్ట్. 
6. HbA1C test. 
1. C – reactive protein , లేక  సి – రియాక్టివ్  ప్రోటీన్  టెస్ట్. :   ఈ ప్రోటీన్  మన కాలేయం అంటే లివర్
( liver ) లో ఉత్పత్తి అవుతుంది.  ఎప్పుడంటే , మన దేహం లో ఏదైనా  గాయం ఉన్నప్పుడు, అంటే ఆ గాయం బయటకు కనిపించేదే ఆవ నవసరం లేదు.  ( పైన ఉన్న C – reactive protein  చిత్రం చూడండి.  ) 
అలాగే, మన దేహం లో ఎక్కడైనా, ఇన్ఫెక్షన్ కానీ ( infection ) ,  ఇన్ఫ్లమేషన్  అంటే inflammation  ఉన్నప్పుడు.   గుండె జబ్బుకు సంబంధించిననంత వరకూ , ప్లేక్ ఫార్మేషన్ గురించి తెలుసుకున్నాము కదా మునుపటి టపాలలో పటం సహాయం తో ! అలా జరిగినప్పుడు కూడా సి రియాక్టివ్ ప్రోటీన్ విడుదల అవుతునుందన్న మాట.  అంటే ఎక్కడైనా గాయం మానేటప్పుడు.
C – reactive protein , లేక  సి – రియాక్టివ్  ప్రోటీన్ నార్మల్ లెవెల్స్ ఏమిటి ? :  
లీటర్ కు ఒక మిల్లీగ్రాము  కన్నా తక్కువ ఉంటె గుండె జబ్బు రిస్కు తక్కువ ఉన్నట్టు.
( low risk  if less than 1 milligram per litre ).
లీటర్ కు ఒకటి నుంచి మూడు మిల్లీ గ్రాముల మధ్య ఉంటె  యావరేజ్  రిస్కు అంటే ఒక మాదిరిగా రిస్క్ ఉన్నట్టు. ( average risk if the levels are between 1 and 3 milligrams per litre ) 
లీటర్ కు మూడు, అంతకు మించీ ఉంటే వారికి గుండె జబ్బు వచ్చే రిస్కు ఎక్కువ గా ఉన్నట్టు.
( High risk if levels are 3 or above 3 milli grams per litre ). 
ఈ పరీక్ష ఎవరు చేయించుకోవాలి ? :  అమెరికన్ హార్ట్  అసోసి ఎషన్  ఈ పరీక్షను గుండె జబ్బులు వచ్చే రిస్కు ఎక్కువ గా ఉన్న వారే చేయించుకోవాలని సిఫార్సు చేసింది. అంటే ఈ పరీక్ష అందరూ చేయించు కొనవసరం లేదు.
 2. Fibrinogen levels test. లేక ఫైబ్రినోజెన్ లెవెల్స్ టెస్ట్.: 
ఫైబ్రినోజేన్ అంటే ఏమిటి ? : ఇది మన రక్తం లో ఉండే ఒక ప్రోటీన్.  రక్తం గడ్డ కట్టే క్రియ లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.  అంటే బ్లడ్ క్లాటింగ్ ( blood clotting ). ఈ ఫైబ్రినోజెన్  సహజం గా మనందరిలోనూ  ఒక నిర్ణీత పరిమాణం లో ఉంటుంది. ఎక్కువ గా ఉంటే రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
 కొన్ని ప్రత్యెక పరిస్థితులలో ఈ ఫైబ్రినోజెన్ దేహం లో ఎక్కువ అవుతుంటుంది. 
స్మోకింగ్ చేసే వారిలోనూ , మద్యపానం ఎక్కువ గా చేసే వారిలోనూ,  ఈస్త్రోజేన్  ( estrogen containing drugs or contraceptive pills ) ఉన్న మందులు తీసుకునే వారిలోనూ,  వ్యాయామం అసలే చేయక, అతి తక్కువగా కదిలే వారిలోనూ , ఈ ఫైబ్రినోజెన్ పరిమాణం ఎక్కువ అవుతుంది.  ఇలా ఎక్కువ అయిన ఫైబ్రినోజెన్  కరోనరీ ధమనులలో కూడా రక్తాన్ని గడ్డ కట్టించి  ( అంటే ప్లేక్ దిస్రప్షన్ జరిగినప్పుడు , మనం చూశాము కదా , మునుపటి టపాలలో , దీని గురించి కూడా , పటం సహాయం తో ! ) , గుండె పోటు కు  కారణం అవుతుంది.
అలాంటి పరిస్థితులలో , వారు ఫైబ్రినోజెన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
 ( కింద ఉన్న అత్భుతమైన ఎలెక్ట్రాన్ ఫోటో లో  ఫైబ్రిన్ మన దేహం లో  రక్తం గడ్డ కట్టడానికి  ఎర్ర రక్త కణాల మీద ఒక వల లా ఏర్పడుతుందో ! మన దేహం లోని ఈ అత్యంత సహజమైన   బ్లడ్ క్లాటింగ్ చర్య ,  సమ తూకం లోనే జరగాలి ఎక్కువగా జరిగితే  గుండె కు హానికరం. తెల్లటి పోగుల రూపం లో ఉన్నది  ఫైబ్రినోజెన్ నుంచి జనించిన  ఫైబ్రిన్ పోగులు. గుండ్రం గా ఎర్రగా ఉన్నవి మన ఎర్ర రక్త కణాలు ) 
మిగతా పరీక్షల గురించి కూడా వచ్చే టపాలో తెలుసుకుదాము !