2. గురక లో ఏమి జరుగుతుంది ?
చాలా మందికి గురక ఏమిటో తెలియంది కాదు. గురక ఎంత సాధారణం అంటే , గురక పెడుతున్న కుటుంబ సభ్యులు, బంధువులు , లేదా స్నేహితులు ఎవరైనా ఉంటే ,కేవలం ” వారు గురక పెడతారు నిద్రలో ! వారికి గురక పెడుతూ నిద్ర పోవడం అలవాటు ! ” అని, నవ్వుకుంటూ చెప్పుకుంటారు !
మనం గురక ఎందుకు వస్తుందో , కారణాలు తెలుసుకునే ముందు , గురక లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం ! క్రితం టపాలో మనం చదివిన ప్రణవ్ గురకకు కారణం కూడా ఇదే !

పైన ఉన్న చిత్రం శ్రద్ధ తో చూస్తే , మూడు పరిస్తితులు వివరించ బడినట్టు తెలుస్తుంది కదా !
అందులో నార్మల్, అంటే సామాన్యం గా నిద్ర పోయే సమయం లో ఏమి జరుగుతుందో చిత్రం ద్వారా చూపించ బడింది ! ఇక్కడ మన నాలుకను అంగిటిని నియంత్రించే కండరాలు మన ఊపిరి తిత్తుల మొదటి భాగం దీనినే ట్రాకియా అంటారు ( ట్రాకియా లేదా గాలి గొట్టం , పైన ముక్కు తోటీ , నాసికా రంద్రాలతోటీ , కలిసి ఉంటుంది , క్రిందగా , ఈ గొట్టం , రెండు చిన్న గోట్టాలుగా విభజింప బడి , రెండు ఊపిరి తిత్తులలోకీ అనుసంధానం అయి ఉంటుంది ! మనం నిద్రలో సహజం గా శ్వాస తీసుకుంటూ ఉంటే , నాలుక చివరా , అంగిటి చివరా ఉన్న కండరాలు ట్రాకియాను తెరిచి ఉంచి అందులోకి ( తద్వారా ఊపిరి తిత్తులలోకి ) పీల్చే గాలి నిరంతరాయం గా అందేట్టు చూస్తాయి ! ఇక రెండో చిత్రం పరిశీలించండి : ఈ నాలుక చివర, అంగిటి చివరా ఉన్న కండరాలు కనుక రిలాక్స్ అవుతే, అంటే వ్యాకోచించితే , ట్రాకియా , అంటే గాలి గొట్టం , కూడా ఫ్ల్యాట్ గా అయి , అందులోంచి గాలి పోవడం కష్టమవుతుంది ! ఈ పరిస్థితిని గాలి తీసివేయ బడ్డ సైకిల్ చక్రం లోపలి ట్యూబు తో పోల్చ వచ్చు కదా ! ఈ రెండవ పరిస్థితి నే గురక లేదా స్నోరింగ్ అంటారు ! గమనించ వలసినది , గురక పెట్టే వారు పీల్చే గాలి కొంతవరకు మాత్రమే ఊపిరి తిత్తులలోకి వెళుతుందని ! పీల్చే గాలి ( కండరాలు వ్యాకోచం చెందడం వలన ) దగ్గర గా వచ్చిన ట్రాకియా లో నుంచి ఊపిరి తిత్తుల లోపలికి వెళ్లి , మళ్ళీ , కార్బండయాక్సైడ్ ఎక్కువ గా ఉన్న గాలి అదే ట్రాకియా నుంచి బయటకు వస్తుండడం వలన ” గురక ” ” ఉత్పన్నం ” అవుతుంది ! అదే , నార్మల్ గా నాలుక చివరి కండరాలూ , అంగిటి చివరి కండరాలూ , సంకోచ స్థితిలో ఉంటే , ట్రాకియా విశాలం గా ఉండి గాలి సరఫరా సాఫీ గా జరిగి , కేవలం ఊపిరి శబ్దమే వస్తుంది కదా !
కానీ మూడో పరిస్థితి లో ( దానిని ఓ ఎస్ ఎ లేదా అబ్ స్ట్ర క్టివ్ స్లీప్ అప్నియా అంటారు ) కండరాలు విపరీతం గా రిలాక్స్ అవడం చేత , ట్రాకియా కొంత సమయం పాటు పూర్తి గా మూసుకు పోయి , ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతుంది ! ఊపిరి అందని పరిస్తితి ఏర్పడితే ఏమి జరుగుతుందో మనకందరికీ తెలుసు కదా ! ప్రాణాలు కూడా అందని లోకాలకు వెళ్ళే ప్రమాదం ఉంది కదా ! ఆ కారణం వల్లనే , మనం ఈ గురక సంగతులు పూర్తి గా తెలుసుకోవాలి !
కానీ మూడో పరిస్థితి లో ( దానిని ఓ ఎస్ ఎ లేదా అబ్ స్ట్ర క్టివ్ స్లీప్ అప్నియా అంటారు ) కండరాలు విపరీతం గా రిలాక్స్ అవడం చేత , ట్రాకియా కొంత సమయం పాటు పూర్తి గా మూసుకు పోయి , ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతుంది ! ఊపిరి అందని పరిస్తితి ఏర్పడితే ఏమి జరుగుతుందో మనకందరికీ తెలుసు కదా ! ప్రాణాలు కూడా అందని లోకాలకు వెళ్ళే ప్రమాదం ఉంది కదా ! ఆ కారణం వల్లనే , మనం ఈ గురక సంగతులు పూర్తి గా తెలుసుకోవాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !