1. ఊరక రాదు గురక !
మధుమతి జీవితం లో మధురాతి మధురమైన రోజు అది ! వారం రోజుల క్రితం వరకూ , ఇండియా లో, విపరీతంగా, బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపి , తీరిక లేకుండా ఉంది ! మనసు ఉల్లాసం గా ఉంది, శరీరం బడలిక గా ఉన్నా కూడా ! తను కోరుకున్న ప్రణవ్ తో పెళ్లి జరిగింది ! శెలవు చాలా వరకు అయిపోయి , మళ్ళీ ఉద్యోగం లో చేరడానికి సమయం అవడం తో తిరిగి వెళ్ళాల్సి వచ్చింది , తను అమెరికా కు , ప్రణవ్ తోడు గా ! పుట్టి పెరిగినది భారత దేశం అయినా ఎందుకో కొంత కాలం పై చదువూ , ఉద్యోగం కూడా చేయడం తో కాలిఫోర్నియా తనకు ఎంతో నచ్చింది ! తన ఆఫీస్ కు దగ్గర గానే ఉంటుందని , అపార్ట్ మెంట్ తీసుకున్నారు ఇద్దరూ ! తనకు నచ్చిన సిటీ లో , అన్ని వసతులూ కల అపార్ట్ మెంట్ లో , తను ప్రణవ్ తో తొలి రాత్రి గడప బోతున్నది ! ఆ సంగతి గుర్తు కు వచ్చినప్పుడల్లా , తడ బడుతుంది తను , కుచద్వయం నిక్క బొడుచు కుంటుంది ! ఆరో అంతస్తు లో ఉన్న తను తరచూ తొమ్మిదో మేఘం మీద తేలి పోతుంది ! తననూ , తన అందాన్నీ ఎంత గానో ఆరాధించే ప్రణవ్, ఆ రాత్రి మధుమతి జీవితం లో మధువులు చిలికించే రేయి అది ! ఎంతో ఎదురు చూస్తున్న రోజు కావడం చేత, మునుపటి రాత్రి బాగా నిద్ర పోయి , ఉదయం కూడా ఆలస్యం గా లేచి ” బ్రంచ్ ” అయ్యిందని పించింది !
పాల గ్లాసు , మల్లె పూల జడ, పట్టు చీర , అమ్మా నాన్నా , అత్తగారు , చేయించిన నగలు, కాటుక కళ్ళు , ఇట్లా ఫార్ములా మొదటి రాత్రి లా తయారవలేదు, మధుమతి ! పాశ్చాత్య పోకడలు అంటీ అంటనట్టు వంట పడుతున్నాయి తనకు ! లాంజ్ కు సమీపం లోనే ,మినీ బార్ స్టూల్ మీద , దీపాల వెలుతురు లో బంగారం లా మెరిసిపోతుంది మధుమతి , బంగారం నగలు ఏవీ వంటి మీద లేకుండానే , రతి రాత్రి ని తలుచుకుంటూ ఉంటే, శ్వాస తీవ్రమవుతుంటే , స్వేదం ఆమె శరీరాన్ని కూడా సువర్ణ మయం చేస్తుంది ! గోధుమ రంగు లో ఉండే మధుమతి మినీ స్కర్ట్ వేసుకోవడం వల్ల కాళ్ళూ , స్లీవ్ లెస్ అవడం వల్ల చేతులూ, తొంగి చూస్తూ,బయటకు దొర్లి పోతా యేమో అన్నట్టు గా ఉన్న వక్షోజాల పొంగులూ, ఆమె ముఖ వర్చస్సు తో పోటీ పడుతున్నాయి, మెరిసి పోతూ ! ప్రణవ్ తన అదృష్టాన్ని నమ్మ లేక పోతున్నాడు ! మధుమతి మకరందాన్ని , అతి సున్నితం గా, అతి జాగ్రత్తగా ,” పీల్చడం ” ఎట్లాగా అని ఆమె అవయవాలను తదేకం గా గమనిస్తూ ఉన్నాడు , ఆమె కళ్ళు లేడి కళ్ళ లా అతని కళ్ళ ను గమనిస్తున్నాయి ! ప్రణవ్ ఫైన్ ఫ్రెంచ్ వైన్ను గ్లాసులో పోసి ఇచ్చాడు ! మధుమతి , తన జీవితం లో కొన్ని ప్రత్యేక సందర్భాలలోమాత్రమే వైన్ తాగాలని ( కొన్ని సంవత్సరాల) ముందే నిర్ణయించుకుంది ! వాటిలో ఆ రేయి ఒకటి ! ఎంత ……… అందం గా ఉన్నావు మధూ ! అని ప్రణవ్ అనురాగం తో మృదువు గా అంటూంటే , ” నిజం గానా !? ”అని అతని కళ్ళ లోకి చూస్తూ అంది , కానీ ఆ కళ్ళు , అతని కౌగిలి లో వాలిపోయే తన అందాలతో పాటుగా , మద్యం మత్తు లో బరువు గా వాలి పోతున్నాయి ! భుజం మీద వాలిన మధుమతి పెదవులను తనపెదవులతో ” ఒడిసి ” ” పట్టుకుని ” ప్రణవ్ శయన మందిరానికి తీసుకు వెళ్ళాడు ! ఆమె బరువంతా కేవలం ఆ అధరాల కలయిక ఒక కీలకమైన, విడ దీయ రాని బంధం అయినట్టు మధు అనుభూతి చెందుతుంది ! మనసులు కలిసిన మధు, ప్రణవ్ ల కోరికలు , మధువు సహాయం తో ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలల లా చెలరేగుతున్నాయి ! ఒకరి కొకరు పోటీగా రతి రహస్యాలు ఛేదించారు ! ప్రేమోద్రేకం తో ప్రణ యోద్వేగం కూడా కలిసి, ఆ రాత్రి మొదటి ఝాము ఎంతో రస రమ్యమైంది ! ఉచ్ఛ దశకు చేరుకున్న వారిద్దరూ సొమ్మసిలి పోయారు ! మధుమతి కి మత్తు గా ఉండి, ఇంకో గ్లాసు వైన్ తీసుకుంది ! మినీ బార్ నుంచి ! మళ్ళీ పది నిమిషాలలో తిరిగి వచ్చింది కామాతురత తో ! ప్రణవ్ అప్పటికే నిద్ర పోతున్నాడు ! నిశ్శబ్దం గా కాదు ! భయంకరమైన గురక తో ! మధుకు అంత వరకూ తెలియదు , ప్రణవ్ నిద్ర లో గురక పెడతాడని ! తనకు చిన్న తనం నుంచీ ,ప్రశాంతం గా ఉన్న పడక గదిలో నిద్ర పోవడం అలవాటు! పడక మీద వాలి పోయింది ! ” ప్రణవ్ ” అని పిలిచింది చాలా సార్లు ! ఉలుకూ పలుకూ లేదు , ప్రణవ్ గురకే తనకు సమాధానం గా వినిపించింది ! మద్యం మత్తులో తేలిపోతున్న మనసు లోనుంచి , కోరికల దావాగ్ని ఎగిసి పడుతున్నా , ప్రణవ్ గురక , ఆ మంటలను అదిమి పట్టి , నివురు గప్పిన నిప్పులా చేస్తుంది ! మధుమతి కి ఎప్పుడో విన్న భానుమతి పాట , తన మనసులో ఇంకోలా వినిపిస్తుంది ! ”ఔనా కలయేనా , నాటి కధలు వ్యధలేనా , నీటి పైని అలలేనా ?! ప్రణవ్ నాకు కరువేనా , బ్రతుకు ఇంక గురకేనా? ! అని ! ” అర్ధాకలి ” తో ఒక్క ఝాము తోనే , ఆ తొలి రాత్రి ని సరిపెట్టుకుని, భారం గా, ఇంకో బెడ్ రూం లోకి వెళ్లి ,మత్తుగా నిద్ర లోకి జారుకుంది మధుమతి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !