ఊరక రాదు గురక !
గురక ! దానినే స్నోరింగ్ అంటారు ఆంగ్లం లో ! చాలా తరచుగా మానవులలో కనిపించే లక్షణం !
అన్యోన్య దాంపత్య జీవితాలలో చీకాకులు చిందించే గురక !
అమూల్యమైన నిద్రను భంగం చేసే గురక !
సతినీ, పతి నీ కూడా సతమతం చేసే గురక !
సెక్స్ జీవితాన్ని దొంగిలించే గురక !
సజావు గా సాగుతున్న జీవిత నావ లో,
తుఫాను లు శ్రుష్టించే గురక !
ఏ వాహనం నడుపుతున్నా ,
ఏ పని చేస్తున్నా ,
ఏకాగ్రత పాడుచేసే గురక !
ప్రమాదాలకు కారణ మయే గురక !
మరి ఈ గురక సంగతి మనకు ఎంత ఎరుక ?
వచ్చే టపా నుంచి తెలుసుకుందాం !