Our Health

Archive for జనవరి, 2013|Monthly archive page

స్త్రీ హింస – భారత్ లో(మచ్చుకు 2010 ) గణాంకాలు !

In మానసికం, Our minds on జనవరి 5, 2013 at 4:06 సా.

స్త్రీ హింస – భారత్ లో(మచ్చుకు  2010 ) గణాంకాలు !

 ( ఒక బ్లాగు సందర్శకుడు క్రితం టపాలో ఇచ్చిన గణాంకాల మీద సందేహం వెలిబుచ్చడం జరిగింది. అతనికే కాక, మిగతా వారికి కూడా వివరం గా తెలియ పరచాలానే ఉద్దేశం తో ఈ క్రింది లింక్ ను యధా తదం గా ఆంగ్లం లో ఇవ్వడం జరిగింది ) .

ఈ గణాంకాలు భారత్ లో 2010 సంవత్సరం లో సేకరించినవి. వీటిద్వారా స్త్రీల మీద హింస ఏ రకం గా ఉంటుందో , ఎంత తీవ్రం గా ఉంటుందో కూడా మనకు విశదమవుతుంది ! ఇక్కడ మనమందరం గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ గణాంకాలు అన్నీ కేవలం రిపోర్ట్ చేసిన లేదా రిపోర్ట్ చేయబడిన సంఘటనల ద్వారా సేకరించినవే ! అంటే మనం ఊహించుకోవచ్చు , రిపోర్ట్ అవకుండా అసలు ఏవైనా సంఘటనలు జరుగుతున్నాయా ( !!!??? ) అవుతే ఎన్ని రెట్లు ఎక్కువ గా జరుగుతున్నాయో కూడా ఊహించు కోవచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం !

<div style=”margin-bottom:5px”> <strong> <a href=”http://www.slideshare.net/mitukhurana/crime-against-women-in-india&#8221; title=”Crime Against Women In india ” target=”_blank”>Crime Against Women In india </a> </strong> from <strong><a href=”http://www.slideshare.net/mitukhurana&#8221; target=”_blank”>Mitu Khosla</a></strong> </div>

స్త్రీ హింస – శాస్త్రీయ విశ్లేషణ.

In మానసికం, Our minds on జనవరి 4, 2013 at 7:26 సా.

స్త్రీ హింస – శాస్త్రీయ విశ్లేషణ :

లింగ పరంగా ( అంటే కేవలం స్త్రీ అన్న కారణం గా ) జరిపే ఏ చర్య అయినా , శారీరకం గా కానీ , మానసికం గా గానీ , కామ పరంగా కానీ ( అంటే సెక్సువల్ వయొలెన్స్ ) స్త్రీ ( ల ) కి హాని కానీ చెరుపు కానీ కలిగించితే దానిని స్త్రీ హింస అనబడుతుంది. కేవలం ఈ చర్యలే కాకుండా , స్త్రీని లింగ పరం గా  భయ పెట్టడం , వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలకు భంగం కలిగించడం జరిగినా అది స్త్రీ హింస గానే పరిగణించ బడుతుంది ! ఈ చర్యలు ఆ స్త్రీ వ్యక్తిగత జీవితం లో జరిగినా , లేదా బహిరంగం గా జరిగినా కూడా అవి స్త్రీ హింస గానే పరిగణించ బడతాయి !  ( ఐక్య రాజ్య సమితి ( UNO ) నిర్వచనం ! )

ఇటీవల భారత దేశం లో ” బయట పడుతున్న ” అనేక స్త్రీ హింసా సంఘటనలు విజ్ఞాన వంతులను, పామరులను కూడా కలవర పెడుతున్నాయి !

” నీ జర్క్ రియాక్షన్ ” లాగా ( అంటే ఒక రకమైన వైద్య పరికరం తో సున్నితం గా మోకాలి చిప్ప పై భాగం లో కొడితే ఆ కాలు చటుక్కున అంటే వెంటనే ముందుకు ఎగురుతుంది. దీనిని నీ జర్క్ రియాక్షన్ అంటారు వైద్య పరం గా . ఇట్లా , ఒక సంఘటన జరిగిన వెంటనే పూర్వా పరాలు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలను కూడా నీ జర్క్ రియాక్షన్ అంటారు ) కేవలం స్త్రీ హింస కి కారణమైన వారిని శిక్షించితే నే స్త్రీ హింస మాయ మవదు !

స్త్రీ హింస గురించి శాస్త్రీయం గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం వచ్చే టపా నుంచి !

స్ఫూర్తి పధం లో , ప్రయాణం కొన సాగించడం ఎట్లా?

In మానసికం, Our Health, Our minds on జనవరి 3, 2013 at 1:51 సా.

స్ఫూర్తి పధం లో , ప్రయాణం కొన సాగించడం ఎట్లా?

మనం చాలా సమయాలలో సోమరి తనాన్ని వదిలేసి , స్ఫూర్తినీ , ఉత్తేజాన్నీ పొందాలని, మన జీవితాలలో ఎక్కువ నిర్మాణాత్మకంగా పురోగామించాలనీ అనుకుంటూ ఉంటాము.  మనకు కావలసిన స్ఫూర్తిని కూడా పొందుతాము. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే మనం తెచ్చుకున్న స్పూర్తి ఒక చేప లాగా మన ” చేతులలోనుంచి ” జారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, తరచూ జారి పోతూ కూడా ఉంటుంది. మరి ఒక సారి పొందిన స్ఫూర్తిని , మన ” చేతులలోనుంచి ” జారి పోకుండా ఉండాలంటే ఏమి చేయాలో చూద్దాం !

అంతర్వలయం ఏర్పరుచుకోవడం అంటే ఇన్నర్ సర్కిల్ ఏర్పరుచుకోవడం : మానవుడు సంఘ జీవి. తాను చేసే ప్రతి పనికీ తానే సంపూర్ణ బాధ్యత వహించినా , ఏదో ఒక సమయం లో ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవడం చేయవచ్చు. ఈ ఇతరులు ఎవరైనా కావచ్చు. వారు మీ బాగు ( హితం ) కోరే వారై ఉండాలి. వారితో మీరు అంతరంగికం గా మీ వ్యక్తిగత విషయాలు కానీ మీ చదువు లేదా ఉద్యోగ విషయాలు కానీ ఏ ఇబ్బందీ , మొహమాటమూ లేకుండా మాట్లాడి అవసరమైతే, వారి సహాయం తీసుకునేట్టు ఉండాలి. మనం చాలా సమయాలలో మనం ఇతరుల సలహా కానీ , సహాయం కానీ తీసుకోవడానికి సుముఖం గా ఉండము ! కారణాలు ఏవైనప్పటికీ , ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. మనం తీసుకునే ప్రతి సలహానూ మనం ఆచరించ నవసరం లేదు. కానీ ఇతరుల అభిప్రాయాలను కూడా తీసుకుంటే , మనం తీసుకునే నిర్ణయాల యుక్తా యుక్త విచక్షణ మనకు అలవరుతుంది. ఈ సలహాలో, సహాయమో తీసుకునే ఇన్నర్ సర్కిల్ లేదా అంతర్వలయం లో మన బాగు కోరే వారు విశ్వాస పాత్రులైన వారూ , పాజిటివ్ గా ఆలోచించే వారూ , ఇంకా వారు పురోగమిస్తూ , మన పురోగమనాన్ని కూడా కాంక్షించే వారై ఉండాలి ! ఈ విషయం లో మనం నెగెటివ్ గా ఆలోచించ నవసరం లేదు ! పైన చెప్పిన లక్షణాలున్న వారు కూడా మన సమాజం లో, మన చుట్టూ ఉంటారు ! కాకపొతే మనం కాస్త ఓపిక గా వెదకాలి ! ఇంకో ముఖ్య విషయం. మీరు మర్చిపోకూడనిది ఏమిటంటే , మీ చుట్టూ ఉండే వారు కూడా మీ సలహా , సహాయాల కోసం వెదుకుతూ ఉండవచ్చు కదా !

స్వేదం లేక పొతే విజయం లేదు : అంటే మనం తీసుకున్న నిర్ణయాల తో , చేరబోయే లక్ష్యాల కోసం తాపత్రయ పడుతూ , శ్రమ పడుతూ , చెమటను చిందించక పొతే విజయం సాధించ లేము. ప్రపంచం లో అనేక రంగాలలో విజయ వంతమైన వారు చెప్పేది ఒకటే ! 99% కృషీ , 1 % మాత్రమే అదృష్టం ! మన జీవితాల మీద మనకు ఒక పట్టు ఉండి , మనం అనుకున్నది సాధించడానికి , మన మాటలు , చేతల రూపంలోకి మారితేనే ఫలితం ఉంటుంది కదా ! లేక పొతే అవి కేవలం నీటి మాటలు అవుతాయి !
ఫ్లో ( flow state ) : ఈ ఫ్లో సైకాలజీ గురించి వివరం గా కొన్ని టపాలు పోస్ట్ చేయడం జరిగింది బాగు లో ! మన కార్యాచరణ లో ఈ ఫ్లో ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు ! ( వివరాల కోసం పాత టపాలు చూడండి ! )

పట్టు పట్టరాదు, పట్టి  విడువ రాదు !: ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరించి , వివరం గా ఆలోచించి , ఒక నిర్ణయం తీసుకున్నాక , ఆ లక్ష్య సాధన కోసం , నిరంతరం శ్రమిస్తూ ఉండాలి ! ఎన్ని అవాంతరాలు ఎదురైనా ! మానవులకే కదా అవాంతరాలు ఉండేది ! రాళ్ళూ రప్పలకు ఉండవుకదా ! అందువల్ల చివరి వరకూ పట్టుదలతో శ్రమించి లక్ష్యం చేరుకుంటే , ఆ ఆనందం, అనుభూతీ , మాటలలో వివరించ తరం కాదు ! 

అట్లా ఎన్నో లక్ష్యాలను చేరుకొని , మీ జీవితాలలో , ఎన్నో సంతృప్తి కరమైన అనుభూతులు చెందుతూ, ఆనందపు అంచులు చేరుకుంటారని ఆశిస్తున్నా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

…….. స్ఫూర్తి రాజ బాట లోకి ఎట్లా వెళ్ళ గలం ?:

In మానసికం, Our Health, Our minds on జనవరి 2, 2013 at 8:48 సా.

….  స్ఫూర్తి  రాజ బాట లోకి ఎట్లా వెళ్ళ గలం ?: 

Nowy Swiat Street- Hip And New by TravelPod Member Dancera

6. సమయం తీసుకోండి : మీరు నిర్ణయించుకున్న లక్ష్యం లేదా పనిని కొన్ని భాగాలు గా విభాజించుకోండి. మానవ మస్తిష్కం అంటే మెదడు మనం చేసే పనులు చిన్న చిన్నవి గా ఉన్నప్పుడు వత్తిడి తక్కువ గా ఉండి మనం ఆ పనిని ఉత్సాహం తో చేయగలగ డానికి మోటివేట్ చేస్తాయి.అందువల్ల మన లక్ష్యం మొత్తం మీద పెద్దదైనా , చిన్న చిన్న భాగాలు గా విభజించి ఒక నిర్ణీత సమయం ప్రాతిపదిక గా కనుక పూర్తి చేయగలుగుతూ ఉంటే , మనం మన లక్ష్యాన్ని ఉల్లాసం గా సకాలం లో చేరుకో గలుగుతాము ! అంతే కాక , చేసే పనులు చాలా రకాలు గా ఉంటే , మనకు వీలైనప్పుడు ఒక్కో పని కూడా పూర్తి చేస్తూ ఉండ వచ్చు . అంటే మనం ఒకే పనిని పూర్తి అయే వరకూ చేయ నవసరం లేదు. ఇట్లా చేయడం వల్ల ఒకే పని చేస్తున్నప్పుడు కలిగే విసుగును మనం నివారించు కోవచ్చు ! కాస్త చేసే పనులలో వెరైటీ కనుక ఉంటే !
7. ఆత్మావలోకనం : జీవితం లో ఒక వయసు వచ్చిన తరువాత అంటే టీనేజ్ దాటినప్పుడు , కొంత పరిణితి వస్తుంది ఆలోచనలలో, చేతలలో ! ముఖ్యం గా మనం చేసే పనులకు మనమే బాధ్యత వహించడం కూడా జరుగుతుంది. అంటే మనం మనం చేసే పనులు పొర పాటు కనుక అవుతే దానికి ఇతరులను నిందించ లేము ! అందువల్ల తరచూ ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి మనలో మనమే ! మన జీవితం లో మనం తీసుకో బోయే నిర్నయాలకూ, చేరుకోవాలనుకునే లక్ష్యాలకూ , మనమే ప్రేరణ కావాలి ! ” నేను ఈ పని చేయగలను ” ” నేను బ్రేక్ తీసుకునేది ( అంటే విరామం ) తీసుకునేది నేను చేస్తున్న ఈ పని పూర్తి చేసిన తరువాత మాత్రమె ” అని మనకి మనమే ఒక క్రమ శిక్షణ అలవరచు కోవాలి. దీనినే వర్క్ ఎథిక్స్ అంటారు !
8. విరామం ఖచ్చితం గా పాటించండి : క్రమ శిక్షణ మనం చేయబోయే పని ఎప్పుడు చేయాలి , ఏమి చేయాలి , అసలు చేయాలా వద్దా అనే విషయాలు చేస్తున్న వారికి తెలిసినట్టు ఇతరులకు తెలియవు. అంటే మీకు తెలిసినట్టు ఇతరులకు తెలియవు. అందువల్ల మీరు చేస్తున్న పని నుంచి తీసుకునే విరామం కూడా ఖచ్చితం గా పాటించాలి, అంటే ఎక్కువ సేపు విరామం తీసుకున్నా , మీరు చేస్తున్న పని ని మాత్రం అశ్రద్ధ చేయక , మీరనుకున్న సమయానికి చేయగలిగేట్టు ఉండాలి !
9. మిమ్మల్ని అభినందించుకోండి : మీరు పూర్తి చేసిన పనులకూ , లేదా పని పూర్తి చేసి లక్ష్యం చేరుకున్నప్పుడూ మిమ్మల్ని మీరు తప్పకుండా అభినందించు కోవడం మరచి పోకండి ! చేర వలసిన గమ్యం చాలా దూరం లో ఉన్నా మైలు రాళ్ళు దాటుతున్నప్పుడు మిమ్మల్నిమీరు అభినందించు కుంటూ ఉంటే , అది మీకు సేద తీర్చడమే కాకుండా , లక్ష్యాన్ని ఉత్సాహం తో చేరుకోడానికి ప్రేరణ కూడా అవుతుంది !
10. సెలెబ్రేట్ చేసుకోండి : అంతే కాకుండా , తాత్కాలిక లక్ష్యాలను చేరుకున్నప్పుడు ( ఆ మాటకొస్తే పూర్తి చేసిన ప్రతి పనికీ ) మీకు నచ్చిన విధం గా సెలెబ్రేట్ చేసుకోండి ! అంటే మిత్రులతో ఒక సినిమా కు వెళ్లడమో , ఒక మంచి భోజనం చేయడమో ఇలాంటివి ! ఇట్లా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటే మన మెదడు కూడా మన లక్ష్యాలను చేరుకోడానికి మనకు తెలియకుండానే ఉత్సాహం , ప్రేరణ వస్తూ ఉంటాయి !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

2013 లో, సోమరి తనం ‘సందు’ లోంచి ‘ స్ఫూర్తి రాజ బాట’ లోకి ఎట్లా వెళ్ళ గలం ?:

In మానసికం, Our Health, Our minds on జనవరి 1, 2013 at 11:52 ఉద.

2013 లో, సోమరి తనం సందు లోంచి స్ఫూర్తి రాజ బాట లోకి ఎట్లా వెళ్ళ గలం ?:

కొత్త సంవత్సరం మొదటి రోజు ! గత సంవత్సరం లో మన విజయాలను జ్ఞాపకం చేసుకుంటూ పురోగమించ వలసిన సమయం ! అట్లాగే మన అపజయాలనూ మననం చేసుకుంటూ , అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడే సమయం కూడా ! ఎవరికి ఏ విధమైన సమస్యలు ఉన్నా , మానవులనందరినీ బాధించే ప్రధాన సమస్య , సోమరితనం ! అదే లెజీనెస్స్ లేదా ఇండో లెన్స్ ! మరి ఈ సోమరి తనాన్ని వదిలించు కునే మార్గాలు తెలుసుకుని, 2013 లో విజయ పధం లో ప్రయాణానికి సన్నద్ధుల మవుదామా !

1.మిమ్మల్ని వెనక్కి లాగుతున్నది ఏంటో కనుక్కోండి : ప్రతి సారీ మీ స్ఫూర్తి ని కబళించ డానికి సోమరి రక్కసి ప్రయత్నిస్తున్నప్పుడల్లా , మీరు ఆలోచించు కొండి , మీరు ఆ పని లో ఉన్న సాధక బాధకాలు. అంటే ప్రత్యేకించి ఏ విషయం మీకు సమస్య గానూ , అవరోధం గానో , ఉందో ! ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవలసిన పదం ఒక్కటే ! ” పట్టుదల”
ఒక ఉదాహరణ: థామస్ ఆల్వా ఎడిసన్ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు అనేక వందల శాస్త్రీయ ఆవిష్కారాలు చేశాడు. మనం ఇంట్లో ప్రతి రోజూ వాడే విద్యుత్ బల్బ్ వాటిలో ఒకటి మాత్రమే ! ఈ ఆవిష్కారాలన్నీ ఆయన అనేక వేల సార్లు విఫలం చెందినా ” పట్టుదల ” తో చివరికి సాధించినవే ! ఆయన ” కష్టపడి పని చేయడాన్ని మించిన మంత్రం లేదు విజయానికి ” అని అన్నాడు ! మీరు చేయవలసింది , పట్టుదల వీడకుండా మీరు అనుకున్న పని సాధించడం !
2. సాధించ గలిగిన లక్ష్యాలను పెట్టుకోండి :
జీవితం లో ప్రతి సమయం లో ఒక్కో ప్రత్యేకమైన లక్ష్యం ఏర్పరుచుకోవడం ఎందుకంటే , మనం ఆ లక్ష్యం వైపు ఉత్సాహం తో పరుగెత్తుతూ ఉంటాం ! ఆ లక్ష్యం చేరుకోవడానికి శ్రమిస్తూ ఉంటాం ! ఆ లక్ష్యాలు మనం చేరుకో గలవి గానే ఉండాలి. అంతే కాక అవి మన శక్తి సామర్ధ్యాల ను పరీక్షించేవి గానూ ఉండాలి ! మనం ఇట్లా లక్ష్యాలను రెండు రకాలు గా ఏర్పరుచు కోవచ్చు ! తాత్కాలిక లక్ష్యాలు, దీర్ఘ కాలిక లక్ష్యాలు ! ఉదా: మనం చదువుతున్న చదువు చక్కగా చదివి జ్ఞానాన్ని సంపాదించుకుని పరీక్షల్లో సఫలం అవడం ! ఇక దీర్ఘ కాల లక్ష్యం , ఒక మంచి ఉద్యోగం సంపాదించి, ఒక మంచి జీవిత భాగస్వామి తో జత కట్టడం , ఒక ” ఇంటి ” వారవడం ! ఒక ఇల్లు, కారూ కొనుక్కోవడం ! లాంటివి. ఇంకో బిల్ గేట్స్ , జుకర్బర్గ్ , లేదా రతన్ టాటా లేదా నారాయణ మూర్తి అవుదామనుకోవడం లో కూడా తప్పు లేదు ! అట్లాగే ( నీతి, నిజాయితీ ఉన్న ) ” నేత” కావాలనే లక్ష్యం ఏర్పరుచుకున్నా తప్పు లేదు కదా !
కొందరు మానసిక శాస్త్ర వేత్తలు ఈ లక్ష్య నిర్దేశనం కోసం మీరు ఒక డైరీ లాంటిది ఏర్పాటు చేసుకుని , రోజూ అది పరిశీలిస్తూ కూడా ఉంటే , అది మనకు బాగా ఉపయోగ పడుతుందంటారు ! అట్లాగే మన లక్ష్యాలను పదాలతో రాసుకోవడం గానీ , లేదా చిత్రాలతో గీసుకోవడం కూడా చేసుకోవచ్చంటారు ! ( గుర్తుంచు కొండి, మనం చిత్ర కారులం కానవసరం లేదు దీనికి ! కేవలం మన భావి జీవిత చిత్రకారులం కావాలి. మన జీవిత గీత లను అందం గా గీసుకో గలిగేది మనమే కదా ! )
3. తరచూ లక్ష్యావలోకనం చేసుకోండి : ఇల్లలక గానే పండగ కాదు కదా ! మనం ఏర్పరుచుకునే ప్రతి లక్ష్యమూ, మన ప్రమేయం లేకుండా మనం ఎట్లా సాధించ గలం ? అందువల్ల తరచూ మనం లక్ష్యం దిశగా పోతున్నప్పుడు , అందుకోసం మనం రోజూ చేస్తున్నది సరిపోతుందా  లేదా , వస్తున్న అవరోధాలను సరిగా అధిగమించ గలుగు తున్నామా , లేకపోతే  అందుకు మన పధకాలను మార్చుకో వలసిన అవసరం ఉందా , ఉంటే , ఏవిదం గా మార్చుకోగలం అని తరచూ ” లక్ష్యావలోకనం ” చేసుకుంటూ ఉండాలి !  
4. మీకు మీరే ” నేను ఈ పని చేయగలను ” అని ధైర్యం చెప్పుకోండి : సోమరి తనానికి విరుగుడు కర్తవ్యం ! అంటే క్రియా శీలురం అవడమే కదా !  చిన్న తనం లో సోమరి గా కనుక ఉన్నట్టయితే ,  పెరిగే సమయం లో కూడా అట్లాగే పెరగ నవసరం లేదు కదా ! ఒక విధం గా చెప్పాలంటే , మీకు ఇక సోమరి గా కాక స్ఫూర్తి దాయకం గా ఎందుకు ఉండాలో కూడా బాగా తెలిసేది అప్పుడే !
5. నాంది ( అంటే మొదలెట్టడం ) : జీవితం అంటే అనేక సమస్యల , అనేక అనుభూతుల , అనేక అందాల సమ్మేళనం. కేవలం సమస్యల నే పదే పదే వల్లె వేస్తూ , ఏదో ఒక సాకు చెబుతూ , కర్తవ్యాన్ని దాటవేస్తూ ఉంటే మన లక్ష్యం నిర్లక్ష్యం చేసిన వారమవుతాము ! అపుడు నష్ట పోయేదీ మనమే కదా ! అందువల్ల మన సమస్యలను సమర్ధ వంతం గా ఎదుర్కొని , మన లక్ష్యాలను చేరుకోవడానికి సంనద్దులం కావాలి. అందుకు మనం శారీరకం గానూ ఫిట్ గా ఉండాలి. అందుకు సరి అయిన సమయం లో సరిపడినంత ఆరోగ్య కరమైన ఆహారం తినాలి, అట్లాగే  అవసరమైనంత వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి !
మిగతా సంగతులు వచ్చే టపాలో !