బాల బాలికలలో ఊబ కాయం.3.
సామాజిక కారణాలు : ఊబకాయానికి ప్రధాన కారణాలు అనారోగ్య కరమైన ఆహారం తినడమూ , ఏమాత్రం శారీరిక శ్రమ లేకపోవడమూ అయినా , బాల బాలికలు , తాము పెరుగుతున్న సమాజం లో వస్తున్న సమూలమైన మార్పులు ,ప్రత్యేకించి ఆ బాల బాలికలు నివసించే దేశాల ఆర్ధిక , సామాజిక వ్యవస్థ లు , వారి జీవన శైలి ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఆయా ప్రాంతాలలో , వ్యవసాయం , రవాణా , నగర అభివృద్ధి ప్రణాళిక లో , ఆర్ధిక ప్రణాళిక లూ , ఆ యా ప్రదేశాలలో ఆహారాన్ని ప్రాసెస్ చేయడమూ , ఇట్లాంటి వాటిమీద బాల బాలికల ఊబకాయం రిస్కు ఆధార పడి ఉంటుంది. ఈ కారణాలన్నీ బాల బాలికల ఆరోగ్యాన్ని ఎందుకు ఇంతగా ప్రభావితం చేస్తున్నాయంటే , యువతీ యువకుల లాగానో , లేదా వయసు మీరిన వారిలాగానో , బాల బాలికలు తాము నివశిస్తున్న ప్రదేశాన్ని కానీ , లేదా వారు తినే ఆహారాన్ని కానీ , వారే ఎంచుకో లేరు ! అంతే కాక , వారు , ఆహారం విషయం లోనూ , ఇంకా ఇతర విషయాలలోనూ , ఆ వయసు లో తమ ప్రవర్తన వల్ల కలిగే దీర్ఘ కాలిక పరిణామాలను ఊహించు కోలేరు ! అందువల్లనే బాల బాలికల భవితవ్యం, కేవలం మంచి భవిష్యత్తే కాక , మంచి ఆరోగ్యం కూడా , వారి పెద్దల మీద ఆధార పడి ఉంది ! అందువల్ల పెద్దలు , తమ చిన్నారుల ఆరోగ్యం విషయం లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి !
పిల్లలకు డైట్ ( Diet ):
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా నివసిస్తున్న పిల్లలకు ఇట్లా డైట్ ఉండాలి అనే నిబంధన ఏమీ లేదు కానీ ఈ క్రింది మూడు ముఖ్య సూత్రాలు పాటించాలి , వారి ఆహారం విషయం లో !
1. కూరగాయలు , పండ్లు , ధాన్యాలు , పప్పులు , ఎక్కువ గా ఆహారం లో రోజూ తీసుకునేట్టు చూడడం , ప్రోత్సహించడం .
2. క్రొవ్వు పదార్ధాలు వీలైనంత వరకూ ఆహారం లో నియంత్రించడం, ఒక వేళ అది తప్పని సరి అయితే , అన్ స్యాచురేటేడ్ క్రొవ్వు పదార్ధాలనే వాడడం , తినడం అలవాటు చేయాలి.
3. చెక్కెర ఉన్న ఆహార పదార్ధాలను వీలైనంత వరకు నియంత్రించడం.
ఈ చర్య ల వల్ల ఉపయోగాలు :
1. ఆరోగ్య కరమైన ఆహారం , బాల బాలికలు చురుకు గా రోజూ నేర్చుకోవడానికి ( అంటే విద్య ) ఉపయోగ పడుతుంది.
2. బాల బాలికలు ఆరోగ్యం గా ఉండడానికి ముఖ్య కారణం.
3. వారు పెరిగి పెద్ద వారైనప్పుడు , ఊబ కాయమూ , దానితో పాటు గా వచ్చే అనేక అనర్ధాలు కూడా నివారించ గలుగుతారు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !