సోషల్ ఫోబియా కు చికిత్స .5.
సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ : ఈ ట్రైనింగ్ లో కొత్త ప్రదేశాలకు వెళ్లి నపుడు, కొత్త వారితో పరిచయాలు ఎట్లా మొదలు బెట్టాలి ?, సంభాషణ ఎట్లా మొదలు బెట్టాలి ? అనే విషయాలు తెలియ చేయడం జరుగుతుంది. అంతే కాక , మీరు ఇట్లా మాట్లాడడం మొదలు పెట్టే సమయం లో మీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది , మీ చుట్టూ ఉన్న వారు మీరు చెప్పే విషయాలను ఏవిధం గా అంచనా వేస్తున్నారు , అంటే వారు మీ మీద ఏవిదమైన అభిప్రాయాలు ఏర్పరుచుకుంటూ ఉన్నారో కూడా వీడియో ద్వారా మీరు చూసుకుని , మీ ప్రవర్తనను పాజిటివ్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ ట్రైనింగ్ కోర్సు లలో !
గ్రే డెడ్ సెల్ఫ్ ఎక్స్ పోజర్ : ఈ పధ్ధతి లో మీకు ఆందోళన , యాంగ్జైటీ కలిగించే పరిస్థితులను ఒక క్రమ పధ్ధతి లో నోటు చేసుకోవాలి. అంటే అతి తక్కువ ఆందోళన, భయం , యాంగ్జైటీ ల నుంచి ఎక్కువ గా ఆందోళన , ఫోబియా కలిగించే పరిస్థితులు. తరువాత మీరు ఒక్కో పరిస్థితినీ మీరే , ఎదుర్కోవాలి , మీ తెరపిస్ట్ సలహా , సహాయం తో , అంటే మీ అంతట మీరే ఈ పరిస్థితులను ఒక క్రమ పధ్ధతి లో అంటే తక్కువ ఆందోళన కలిగించే పరిస్థితి నుంచి , ఎక్కువ ఆందోళన కలిగించే పరిస్థితి కూడా , విజయ వంతం గా మ్యానేజ్ చేసుకో గలరు. మీరు ఈ పని ఒక్క సారి గా చెయ్యట్లేదు కాబట్టి , మీ భయాలు కూడా ఎక్కువ అవక , క్రమేణా తగ్గుతూ ఉంటాయి.
CBT : దీనినే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు : ఈ పధ్ధతి లో ముఖ్యం గా సోషల్ ఫోబియా , మీ గురించీ , మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ , ఇంకా మీ చుట్టూ ఉన్న మనుషుల గురించి , మీకు ఏర్పడిన నిరుపయోగ కరమైన అభిప్రాయాలను , చాలెంజ్ చేసి అంటే వాటిని నిలదీసి , హేతు వాదన తో ఆ ఆలోచనలను మీకు ఉపయోగం కలిగే పాజిటివ్ ఆలోచనలు , అభిప్రాయాలు గా మార్చడం జరుగుతుంది. ఒక ఉదాహరణ : మీరు ఒక కొత్త వ్యక్తి తో సంభాషణ మొదలు పెట్టారనుకోండి. ఒక పదిహేను నిమిషాల తరువాత , ఆ సంభాషణ ఆగి పోతుంది. మీకు సోషల్ ఫోబియా కనుక ఉన్నట్టయితే , మీరు ఆ సమయం లో ” నాకు ఇంకా మాట్లాడడానికి ఏ విషయాలూ తట్టడం లేదు , ఇక ఏమి మాట్టాడాలో తెలియట్లేదు , నేను ఎప్పుడూ ఇంతే ” అనుకుంటూ , ఆందోళన , యాంగ్జైటీ చెందడం మొదలు పెడతారు. కానీ మీ తెరపిస్ట్ మాత్రం ఆ సమయం లో ” మీ తో మాట్లాడుతున్న ఎదుటి వ్యక్తీ మీ లానే , మాట్లాడడానికి విషయాలు ఏవీ లేక , మాట్లాడ లేక పోతూ ఉండ వచ్చు , కేవలం మిమ్మల్ని విమర్శించు కొనవసరం లేదు కదా ” అని మీకు పాజిటివ్ దృక్పధం నేర్పుతాడు.
సోషల్ ఫోబియా కు మందుల తో చికిత్స ఉందా ?:
పైన చెప్పిన పద్ధతులు సోషల్ ఫోబియా పోడానికి సరి యైన మార్గాలు. వాటన్నిటినీ ఆచరించి , అయినా తగ్గని పరిస్థితులలోనే , మందుల సహాయం తీసుకోవాలి.ఇంకా కొన్ని ప్రత్యెక పరిస్థితులలో , అంటే సోషల్ ఫోబియా తో పాటుగా డిప్రెషన్ కూడా ఉంటే , మందుల అవసరం ఉంటుంది. అప్పుడు ప్రత్యెక నిపుణుడి సహాయం అంటే సైకి యా ట్రిస్ట్ సలహా తీసుకోవాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !