రెండు వేళ్ళ ( అ ) న్యాయం !
ఢిల్లీ లో నివసిస్తున్న, లేదా సందర్శించిన నా స్నేహితు రాళ్ళు అందరికీ ఒక్కో కధ ఉంటుంది, అక్కడి పురుషుల గురించి చెప్పడానికి ! క్రిస్టీన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ఆన్త్రపాలజిస్ట్. ఆమె తన తల్లితో ఢిల్లీ లో కనాట్ ప్లేస్ లో వీధిలో నడుస్తుంది. ఆమె తన తల్లికి ( తల్లి మొదటి సారి ఢిల్లీ కి రావడం ) భారత దేశం ఎంత అత్భుతమైన దేశమో చెప్పాలని అనుకుంది. అంతలో అకస్మాత్తుగా ఒక పురుషుడు , క్రిస్టీన్ దగ్గరకు వచ్చి, ఆమె తల్లి ఎదురుగుండానే , ఆమె జననాంగ ప్రదేశాన్ని తన చేతితో తాకి, నవ్వుకుంటూ , జనం లో కలిసిపోయాడు. ఈ సంఘటనతో క్రిస్టీన్ విలపించింది. ఆమె ఇంకా బాధ పడ్డది, వేరే కారణానికి , భారత దేశం లో గ్రామాలలో ఉండే ,పేద వారూ , నిమ్న కులాల వారూ అయిన స్త్రీల పరిస్థితులు, ఇంకా ఎంత అధ్వాన్నం గా ఉంటాయో ఊహించుకుని !
ఢిల్లీ భారత దేశం లో మిగతా పట్టణాలతో పోలిస్తే , ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడ ఉన్న అవినీతిమయ రాజకీయాలు , మనుషుల ను కూడా అవినీతి మయం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత దేశం లో ప్రతి వెయ్యి మంది పురుషులకూ కేవలం 866 మంది మాత్రమె స్త్రీలు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది తలి దండ్రులు, ఆడ శిశువులను, పుట్టగానే చంపేస్తున్నారు ! ఢిల్లీ లో మిగతా పట్టణాలు ( ముంబాయి, చెన్నై , కలకత్తా , బెంగళూరు , హైదరాబాద్ ) అన్నిటిలోనూ జరిగే మాన భంగాల మొత్తం కన్నా ఎక్కువ జరుగుతున్నాయి.
కేవలం, నిందితులకు తీవ్రమైన శిక్ష పడగానే , స్త్రీ హింస ఆగదు. భారత దేశ ప్రజలు, దేశం లో జరుగుతున్న కామ పరమైన అత్యాచారాల మీద సమూలం గా వారి ఆలోచనా ధోరణిని మార్చు కోవాలి ! అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు , పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసే విషయం లోనూ !
అంతే కాక , మాన భంగం చేయ బడ్డ స్త్రీ ని పరీక్షించే విధానం లో కూడా మార్పు ఉండాలి ! ప్రస్తుతం భారత దేశం లో ఈ పధ్ధతి చాలా లోప భూయిష్టం గా ఉంది. మాన భంగానికి గురైన స్త్రీ ని పరీక్షించే వైద్యుడు తన ఒక వేలిని ఆ స్త్రీ జననాంగం లో ప్రవేశ పెడతాడు. ఆ తరువాత , తన రెండు వేళ్ళను స్త్రీ జననాంగం లోకి అంటే వజైనా లోకి ప్రవేశ పెడతాడు. ఆ సమయం లో కనుక, ఆ స్త్రీ వజైనా వదులు గా ఉండి , ఒక వేలు కానీ , లేదా రెండు వేళ్ళు కానీ ( వజైనా ) లోపలి సులభం గా ప్రవేశింప చేయగలిగితే , ఆ వైద్యుడు , అప్పుడు ” వజైన వదులు గా ఉంది ” అని ధ్రువ పత్రం ( సర్టిఫికేట్ )ఇస్తాడు. ఇక్కడ జరుగుతున్నది, ఆ ( మాన భంగానికి గురైన ) స్త్రీ యొక్క శీలం , కేవలం , ఆమె వజైనా ఎంత వదులు గా ఉందో , దానిని బట్టి నిర్ధారించ బడుతుంది ! అంటే, పరీక్ష చేసిన ఆ వైద్యుడి రెండు వేళ్ళు కనుక ఒక స్త్రీ వజైనా లోకి ప్రవేశించ గలిగితే ,అతడు ఇచ్చే ధ్రువ పత్రం లో ” ఆ స్త్రీ కామ సంభోగానికి అప్పటికే అలవాటు పడి ఉంది ” అని ఇవ్వడం జరుగుతుంది. దీనిని సాకు గా చూపించి , ఆమె శీలం మీద సందేహాలు వెలిబుచ్చుతూ , అనేక మంది నిందితులు ” జారు కుంటున్నారు ”, చట్టం నుంచి !
ఈ ” రెండు వేళ్ళ ( అ )న్యాయం సాక్ష్యం గా పరిగణించ కూడదని భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం గా చెప్పినా , అనేక రాష్ట్రాలు ఇంకా , అత్యాచార నిందితుల విచారణ లో ఈ ” రెండు వేళ్ళ ( అ ) న్యాయ ” పద్ధతినే అనుసరిస్తున్నాయి ! అందు వల్ల నే మూడు వంతుల ( అత్యాచార ) కేసులలో, నిందితులు ” నిర్దోషులై ” సమాజం లో ” కలుస్తున్నారు ” !
చాలా మంది స్త్రీలు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలంటే జంకుతారు ! నా స్నేహితుడు ఒకడు భారత దేశం లో ఒక సినీ నిర్మాత. ఇటీవల జరిగిన సంఘటన ను అతను నాకు చెప్పాడు. అతని అకౌంటెంట్ , తన డబ్బు దుర్వినియోగం చేసి పరారయ్యాడు. అప్పుడు ఆ నిర్మాత పోలీసు లకు రిపోర్ట్ చేశాడు ఆ విషయం. అప్పుడు పోలీసులు , వెంటనే ఆ అకౌంటెంట్ ను పట్టుకో లేక పోయారు. వెంటనే వారు ఆ నిందితుని చెల్లెలు ను పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆ నిర్మాత ఆ పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ” ప్రస్తుతం మీ అకౌంటెంట్ చెల్లెలు ను ఇక్కడ లాకప్ లో ఉంచాం. మీరు ఆమెను ” మీ ఇష్టం వచ్చినట్టు , ఏమైనా చేయ వచ్చు ” అని ,” భరోసా ” ఇచ్చాడు. అప్పుడు ఆ నిర్మాత ఆ ” చెల్లెలు ” పరిస్థితి కి విపరీతం గా ఆందోళన చెంది, తన సొంత మనుషులను పోలీస్ స్టేషన్ లో పగలూ రాత్రీ ” ఆమెకు రక్షణ గా కాపలా ఉంచాల్సి వచ్చింది !
ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆరుగురు ప్రస్తుత ఎమేల్సీ లు మానభంగ కేసులలో నిందితులు. ఇరువురు పార్లమెంట్ సభ్యులూ , ముప్పై ఆరుగురు రాష్ట్ర శాసన సభ సభ్యులూ , స్త్రీ హింసా నేరాలలో నిందితులు !
ఇటీవల గన్ కంట్రోల్ విషయం లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఇట్లా అన్నారు ” అమెరికన్ ప్రజల ప్రమేయం లేకుండా ” ఈ విషయం లో ఏమీ చేయ లేము ” అని. అదే విధం గా భారత దేశం లో కూడా స్త్రీ ల పై అత్యాచారాల విషయం లో , భారత దేశ ప్రజలు ఈ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వక పొతే, ఈ పరిస్థితులలో ఏ విధమైన మార్పూ ఉండబోదు !
సుకేతు మెహతా , టైం తాజా వార పత్రిక నుంచి !