Our Health

స్త్రీ హింస ఎందుకు జరుగుతుంది?

In మానసికం, Our minds on జనవరి 12, 2013 at 8:31 సా.

స్త్రీ హింస ఎందుకు జరుగుతుంది?

 ( ” NO VIOLENCE AGAINST WOMEN ” )

కొన్ని కారణాలు చూద్దాం ! 

పితృస్వామ్యం :  తర తరాలు గా సమాజం లో  లోతు  గా నాటుకున్న పితృ స్వామ్య భావాలు .  స్త్రీ , చదువుకుని , బయటకు వెళ్లి , ఉద్యోగం చేస్తున్నప్పటికీ , , ప్రదానం గా పురుషుడి మాటే , అంటే తండ్రి మాటే  పై చేయి కావాలనుకునే  వాదం ! 

సజాతి వైరం : అంటే  పురుషుడి తో పాటు గా , గర్భం దాల్చిన ‘ తల్లి ” కూడా , పుట్ట బోయేది ఆడ శిశువు అన్న విషయం తెలిసినప్పటి నుంచీ , ఆ విషయాన్ని అంగీకరించలేక పోవడం ,  ఆ ఆడ శిశువుకు  గర్భం లోనో లేదా  పుట్టిన తరువాతనో  ఈ భూమి మీద నుంచి ” శాశ్వతం గా ఉద్వాసన ” చెప్పే మార్గాలు అన్వేషించడం ,  లేదా ఆ  ప్రక్రియలో సఫలం అవడం ! 

ఆడపిల్ల తల్లి దండ్రులు ,  ఆడ శిశువు పుట్టగానే ,  పెరిగి  పెద్దయి నాక  ” కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి ” అందువల్ల  తమ ఆర్ధిక పరిస్థితి విషమిస్తుంది అనే  వాదన. 

తల్లి దండ్రులు , మగ శిశువును  విపరీతమైన  గారాబం తో , శ్రద్ధ తో పెంచుతూ , అదే కుటుంబం లో ఉన్న ఆడ శిశువును అశ్రద్ధ చేయడం ,  ” క్రమ శిక్షణ ” తో పెంచడం వల్ల  ,  మగ శిశువు లోనూ , పెరిగిన తరువాత  పురుషుడి లోనూ  పెరిగే అహంకార భావం , తాను  స్త్రీకన్నా  అధికం  అనే భావాలు  అలవడడం ! 

తల్లి దండ్రుల మధ్య హింస , ఒక ఇన్ఫెక్షన్ :  చిన్న వయసు నుంచీ ,  ఆడ పిల్ల లైనా , మగ పిల్లలైనా ,  సునిశితమైన పరిశీలనా శక్తి , సామర్ధ్యాలు కలిగి ఉంటారు ! 

వారి కుటుంబం లోనూ , పరిసరాలలోనూ  జరుగుతున్న సంఘటనలు ,  ఆనంద కరమైనవి కానీ , హింసా యుతమైనవి గానీ , వారి చిన్నారి హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి !   భర్త ఏ  కారణం వల్ల  నైనా , విపరీతమైన క్రోధం , తన ” ఇల్లాలి ” మీద చూపించి  తరచూ ” చేయి ” చేసుకుంటూ  ఉంటే  ,  అది  పరిశీలిస్తున్న  చిన్నారుల  మనస్సులో ” సామాన్యమైన సంఘటనలు ” అవుతాయి !  వారు పెరిగి పెద్ద వారై   వారి వివాహ సంబంధాలు ఏర్పరుచు కున్నప్పుడు ,వాటిలో కూడా ” హింస ” సాధారణ విషయం అవుతుంది ! 

విసర్జన కన్నా  మింగుడు మేలు :  చాలా మంది అత్యాచార సంబంధాలతో  ” వివాహ బంధం ” కోన సాగిస్తున్న స్త్రీలు ,  సామాన్యం గా , ఆ సంబంధం నుంచి విడి పోయే సమయం లో ఎదురయే భయాలూ , ఆందోళన లూ ,  తలుచుకుని , తరువాత తమకు  ” సొంత వారి నుంచీ ,  ” సమాజం ” నుంచీ ఎదురయే  సమస్యలూ ,భయాల  ను భరించడం కన్నా ,  ” చెడ్డ ” మొగుడితో  ” సంసారం ” మేలు ” అనుకునే  అభద్రతా భావం ! 

పిల్లల భవిత మీద భయాలు :  స్త్రీ   తన వివాహ బంధం లో పరిస్థితులు విషమించి  అది ” విష తుల్యం ” అయినా కూడా , నిరంతరం   పెరుగుతున్న తన పిల్లల భవిత  మీద భయాందోళన లు పెట్టుకుని , వారు ( తాను  విడిపోతే ) పడే కష్టాలను తలుచుకుని ,  విడి పోయే నిర్ణయం మానుకుంటుంది , దానితో ,హింసను  భరించడం ” అలవాటు ” చేసుకుంటుంది.

” సహన మూర్తి ” స్త్రీ ! :  తర తరాలు గా సమాజం లో  వివాహం చేసుకున్న స్త్రీ ని అనేక విధాలు గా వర్ణిస్తూ ఉంటారు అందులో ఒకటి ” ఆ ఇల్లాలు ఎంతో  ఆదర్శ వంతురాలు ”  భర్త తాగి తందనాలు వేస్తున్నా , ఎంతో  సహనం తో  పిల్లలు చదువుకుని పెద్ద వారై ,  వారి దోవల్లో వారు వెళ్లి , పెళ్ళిళ్ళు చేసుకునే వరకూ ,తానే  అంతా  బాధ్యత వహించి చేసింది ” ( స్త్రీ ,  కొవ్వత్తి అయి  కొడి గడుతున్నా పరవాలేదు సమాజానికి ! ) అనే   నల్లటి సంప్రదాయ ముసుగు  వేసుకోవడం అలవాటవుతుంది !  ఆమె  నిఘంటువులో   అన్యాయానికి ఎదురు తిరగడం , ధిక్కరించడం అనే పదాలు  ” సంప్రదాయం ” అనే నల్లటి సిరా తో  శాశ్వతం గా చెరిపి వేసి ఉంటాయి ! 

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

  1. తాగుబోతులు, తిరుగుబోతులు,సంసారాన్ని పట్టించుకోనివారు, సంపాదనలేనివారు, ఆత్మన్యూనతా భావంతో రగిలిపోయేవారు మొదలైన కారణాలతో హింస పెరిగింది, ఇప్పుడు విడాకులు ఎక్కువ కనపడుతున్నాయి.సహనం నశిస్తోంది, అందుకు తప్పూ పట్టక్కరలేదు.

  2. స్త్రీలు విడాకులు కోరడం పెరిగింది, పై సందర్భలలలో, పిల్లలను భర్త సరిగా చూడనపుడు, వారు విడాకులు కోరడం తప్పుకాదని నాభావం. వ్యధతో జీవితాంతం బాధపడటం కంటే విడిపోవడమే మేలని నా ఊహ,

    • మీ అభిప్రాయం తో సంపూర్ణం గా ఏకీభవిస్తాను. చాలా మంది స్త్రీలు , విడి పోవడం వల్ల , పిల్లలకు మేలు జరగదని అనుకుంటారు. కానీ, కోపోద్రేకాలకూ , కలహాలకూ ఆలవాలమై, హింసాయుత వాతావరణం లో పెరుగుతున్న పిల్లల భవిత , బాగుండక పోవడమే కాకుండా , వారిని హింస ని ప్రేరేపించే వారిగానూ , లేదా తీవ్రమైన హింసను కూడా చాలా ఓరిమి తో సహించే నిరాసక్తులు, నిస్సహాయులు గానూ తయారు చేస్తుంది. దీనివల్ల ఎవరికీ ఒరిగేది ఏమీ ఉండదు , కీడు తప్ప !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: