Our Health

Archive for మార్చి, 2012|Monthly archive page

తెలుగు మిత్రులందరికీ శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలు !!!

In Our Health on మార్చి 22, 2012 at 9:41 సా.

ప్రపంచమంతా ఉన్న తెలుగు మిత్రులందరికీ  వందనాలు.

మొదలు పెట్టి మూడు నెలలైనా కాకుండానే  అనూహ్యంగా,   నాలుగు వేలకు పైగా    ‘ హిట్స్’ తో        ‘ బాగు ‘ ను ఆదరించి ఉత్సాహం చూపిన,  చూపుతున్న మీకు కృతజ్ఞతలతో,
నూతన శ్రీ నందన నామ ఉగాది  సంవత్సరము, 
మీ జీవితాలను ఆనంద నందనం చేయాలని 
ఆశిస్తూ , 
శుభాకాంక్షలతో 
సుధాకర్ 

మువాంబా ఇండియాలో ఫుట్ బాల్ ఆడి ఉంటే !?

In Our Health on మార్చి 22, 2012 at 5:26 సా.

చరిత్రలో రెండు ఒకే రకమైన సంఘటనలు కొద్ది రోజుల వ్యవధి లో  రెండు దేశాలలో జరగటం కేవలం యాదృచ్చికం. అయితే తరువాతి  పరిణామాలు మాత్రం కాదు.

అదే జరిగింది ఇటీవల ఫుట్ బాల్ మైదానాల మీద. ఒకటి ఇండియా లోని బెంగుళూరు లో. ఇంకోటి  ఇంగ్లాండు లోని లండన్ లో !! తేడాలు గమనించండి ( ఫోటోలలో కూడా ! )  
శ్రద్ధగా చదవండి, ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి.
పేరు : వెంకటేష్
వయసు : 27 సంవత్సరాలు.
ఆట : ఫుట్ బాల్
స్థానం : స్ట్రయికర్
క్లబ్: బెంగుళూరు మార్స్
ఆడిన తేదీ: 21.03.12.
జరిగిన సంఘటన:   రైల్వే టీం తో ఆడుతున్న ఆట లో లేట్  సబ్సిస్త్యూట్ గా వచ్చాడు వెంకటేష్. కొద్ది సేపటికే ఆకస్మికంగా పడిపోయాడు ఆట స్థలం లో.ఫస్ట్ ఎయిడ్ టీం అక్కడ లేదు,
మిగతా ఆటగాళ్ళు వెంకటేష్ దగ్గరకు వచ్చారు. వెంకటేష్ కదలలేదు , మెదలలేదు.  స్ట్రెచర్ కోసం వెదికారు, శిధిలావస్థలో ఉంది అది. అందరూ కలిసి మోసుకు వెళ్ళారు గ్రౌండ్ బయటకు. బయట అంబులెన్స్  లేదు. ఒక ఆటో లో ఇరికించారు తీవ్ర అస్వస్తుడైన వెంకటేష్ ను. ఆసుపత్రికి చేర్చారు. డాక్టర్లు అప్పటికే మరణించాడని  ద్రువించి , చెప్పే మాట  వినడం   కోసం !!
ఇంకో ఫుట్ బాల్ ఆటగాడు.
స్థానం : మిడ్ ఫీల్డర్
పేరు: ఫాబ్రిస్ మువాంబా
వయసు : 23  సంవత్సరాలు.
క్లబ్: బోల్టన్ ప్రిమియర్ లీగ్ ఫుట్ బాల్ క్లబ్.
ఎక్కడ జరుగుతుంది: లండన్ లో
ఆడిన తేదీ : 17.03.12.
జరిగిన సంఘటన: టోటెన్ హాం  టీం తో ఆడుతున్న మువాంబా  ఆకస్మికంగా కూలిపోయాడు ఆట స్థలం లో.
వెంటనే పారా మేడిక్స్ అంటే ప్రధమ చికిత్స లో సుశిక్షుతులైన  సిబ్బంది నిమిషాలలో చేరారు అక్కడకు స్ట్రెచర్ తో సహా.
ఆటస్థలం లోనే రిసస్సిటేట్ చేసారు 48 నిమిషాల సేపు. ఫలితం : శూన్యం : మువాంబా కదలలేదు మెదలలేదు. ఆ సిబ్భంది అంటే పారామేడిక్స్ వారు చేస్తున్న విధి ఆపలేదు.
ఫాబ్రిస్ మువాంబా ను దగ్గరలోని లండన్ హాస్పిటల్ కు చేర్చారు. అక్కడ మువాంబాను బ్రతికించే క్రియ ఉధృతం అయింది. పదిహేను సార్లు  కరెంటు షాక్ ఇవ్వడం జరిగింది. అంటే డీ  ఫిబ్రిలేటార్ ( defibrillator ) అంటారు వైద్య పరి భాషలో.
ఫలితం : ఫాబ్రిస్ మువాంబా నిజంగా రెండు గంటలు చచ్చి, తరువాత బ్రతికాడు !. అవును మువాంబా నిజంగా మరణించి బ్రతికాడు !!
మువాంబా ఇండియా లో  ఆడుతున్నప్పుడు  అదే సంఘటన జరిగి ఉంటే ??!!! 
( ఏమి జరిగేదో  మీ ఊహకు వదిలేయడం మంచిదనుకుంటున్నాను )
( ఇక్కడ చదువరులు ఒక విషయం గమనించాలి.  మానవులకు ఏ ఆకస్మిక ప్రమాదం అయినా జరిగినప్పుడు, జరిగిన వెంటనే ఉన్న అరవై నిమిషాలను  ‘ బంగారు గంట ‘ లేక వైద్య పరిభాష లో  GOLDEN HOUR అంటారు. అంటే ప్రమాదం లో తీవ్రంగా రక్త స్రావం అవటం గానీ, హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు కానీ, లేక పక్షవాతం వచ్చినవెంటనే కానీ, ఈ అరవై నిమిషాలలో జరిగే వైద్య సహాయం ఎంతో కీలకమైనది. ఆ సమయం లో చేపట్టే ప్రధమ చికిత్స చర్యలు  మరణాల సంఖ్యను ఎంతగానో తగ్గిస్తాయని ప్రపంచం లో  వివిధ దేశాలలో జరిగిన పరిశోధనలు ఖచ్చితంగా తెలుపుతున్నాయి.  భారత దేశం కర్మ భూమి. ఏమి జరిగినా చేసిన కర్మల వలెనే అనుకునే స్వభావం. కానీ గీతా సారం కూడా  ‘ మన విధి సక్రమం గా నిర్వర్తించమని, ఫలితం దేవుడిమీద వదిలేయమని ! ఇలా అన్ని పరిస్థితులలో జరుగుతుందా అని ఆత్మ శోధన చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితులకు కారకులైన వారు, ( ఎవరో కూడా చదువరులకు తెలుసు కదా ! ) 
.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.9.

In Our Health on మార్చి 22, 2012 at 11:10 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.9.

ముందాట: 
మనసును తాకే ముందాట గురించి మనం కొంత తెలుసుకున్నాము.
మాట్లాడకుండా హావ భావాలతో మన ఇష్టా ఇష్టాలను తెలుపటం కూడా   ముందాట  లో చేస్తుంటారు,  చాలా మంది.
అంటే తదేకంగా రెప్పలార్పకుండా ఆమె వైపు చూడడం, కన్ను కొట్ట్టటం, పెదవులు సున్నితంగా పంటి మధ్య నొక్కుకోవడం, ( నాగ భూషణం గారి లానో, రావు గోపాల రావు గారిలానో కాదండీ ! )  వ్యక్తిగత స్థలం లో  దూసుకు పోవటం ( అంటే పర్సనల్ స్పేస్ : ప్రతి వ్యక్తికీ ఈ పర్సనల్ స్పేస్ లేక వ్యక్తిగత స్థలం ఉంటుంది. మనం ఎవరితో మాట్లాడినా, ఈ స్థలాన్ని అతిక్రమించకూడదు, ఈ పట్టింపు  పాశ్చాత్య దేశాలలో ఎక్కువ గా ఉంటుంది. భారత దేశం లో కారణాంతరాల వల్ల ఈ వ్యక్తిగత స్థలాన్ని చాలా మంది ( కావాలని కొంతమంది ) అతిక్రమిస్తూంటారు. ఉదాహరణకు,  సిటీ బస్సు లో ప్రయాణించేటప్పుడు, సినిమా టాకీస్ వద్ద, ఇంకా బహిరంగ ప్రదేశాలలో!). కానీ ఇష్ట పడే వారుంటే, వారి స్థలాన్ని అతిక్రమించినా నొచ్చుకోరు.
ఆకర్షణీయమైన దుస్తులు ధరించడం, సరియిన స్థలాలలో అసలు ధరించకపోవడం కూడా కామోత్తేజాన్ని కలిగించే ముందాట అవుతుంది.
ముందాట  ముందు జాగ్రత్తలు:  
ప్రియురాలి తో సంభాషణలో ప్రియుడు ఎక్కువ సమయం తన ఇతర స్నేహితుల గురించో లేక తనకు తెలిసిన ఇతర అమ్మాయిల గురించో మాట్లాడుతూ ఉండటం, అపరిశుభ్రం గా ఉండి, నోటినుంచి ఉల్లిపాయలో , వేల్లుల్లో, తిన్నప్పుడు  వాసన , సిగరెట్ తాగిన వాసన ( చాలా మంది యువతులు సిగరెట్ వాసన ఇష్టపడరు ), మద్యం సేవించిన తరువాత  ( సామాన్యంగా ఏ రకమైన మద్యం తాగినా  , తరువాత కనీసం ఎనిమిది గంటల వరకూ మన శ్వాస లో  ఆ వాసన వస్తూంటుంది)   లేక ఇతర భరించలేని వాసనలు రావడం, ఎక్కువ స్వేదం పట్టడం, ఇలాంటివి  ముందాట మొదలు కాకుండానే ప్రియుడిని  ఓడించుతాయి. అలాగే విపరీతంగా కామోత్తేజ పరంగా బిడియం గా ఉండటం, చొరవ చూపించకపోవటం కూడా  ముందాట కు అవరోధాలావుతాయి.
ముందాటలు ఎలా ఉండ వచ్చు? : ఎలాగైనా ఉండవచ్చు. ఫలితం  ప్రేయసీ ప్రియులు బిడియం మాని సన్నిహితం, ప్రేమానుభంధం  ఎక్కువ అవాలి.
ఈ ఇంటర్నెట్ యుగం లో మెసేజెస్  పంపుకోవడం మొబైల్ ఫోనులమీదో లేక  ఈ మెయిల్స్ ద్వారానో. అలాగే చిన్న చిన్న ఆటలు ఆడి గేలిచిన వారు ఓడిపోయిన వారిచేత బట్టలు తీసేయడమో, లేక ఫుట్ మసాజ్ చేయించు కోవడమో , లేక ముద్దు  పెట్టించు కోవడమో , ఇలాంటి  పందాలు పెట్టుకుంటే ,ఆత్మీయత పెరిగి కామూత్తేజం పొందుతారు ప్రేయసీ ప్రియులు.  సెక్స్ వీడియోలు, సినిమాలూ ప్రేయసీ ప్రియులు కలిసిచూడటం కూడా ముందాట లో భాగం చేసుకోవచ్చు.
తాంత్రిక ముందాట : ఈ రకమైన ముందాట లో  ప్రేయసీ ప్రియులు రతి క్రియ కోసం తహ తహ లాడకుండా మొదట మనో సంగమం చెందటం మీద లగ్నం చేసేట్టు చేస్తుంది.
ఈ ఆటలో  ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు  సుగంధ తైలాల తో మాసాజ్ చేసుకోవడము, జలకాలాడడమూ,  గోరంత దీపాలలో అంటే  క్రొవ్వొత్తి వెలుగులలో  కామోత్తేజం చెందడమూ కూడా ఉంటాయి.   ఈ తాంత్రిక ముందాట, ముందు ముందు భారత దేశం లో ప్రతి మసాజ్ పార్లర్ లోనూ, ప్రతి స్టార్ హోటల్ లోనూ ప్రవేశ పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు !
నిత్య జీవితం లో ముందాట ఉపయోగం ఏమైనా ఉందా ?: 
ముందాట, ప్రేయసీ ప్రియులను, వారు దంపతులైనా కూడా,   వారి ఇంటిమసీ అంటే సన్నిహితం ఎక్కువ చేసి అనుబంధాన్ని ప్రేమ బంధం గా  బల పరుస్తుంది. కామోత్తేజం కూడా ఎక్కువ చేసి వారిని కామోద్రేకులను కూడా చేసి, రతి క్రియ లో అత్యంత ఆనందం పొందేట్లు చేస్తుంది.
కానీ ఒక యూరోపియన్ సర్వే,  ప్రాగ్ నగరం లో జరిగింది, రెండు వేల మూడు వందల మంది స్త్రీల  కామ పరమైన అంటే సెక్స్ అలవాట్ల మీద. దాని ఫలితం ఏమిటంటే : ముందాట ప్రతి రతి లో కంపల్సరీ  కాదు. అంటే తప్పనిసరి గా ముందాట రతిక్రియ కు ముందు ఉండనవసరము లేదు.  ముఖ్యమైన విషయం  రతి క్రియా సమయం. అంటే రతిక్రియ మొదలు నుంచి ప్రేయసీ ప్రియులు  ఆర్గాసం పొందేంత వరకూ. ఈ సమయం రమారమి పదహారు నిమిషాలు ఉంటే, స్త్రీలు ఎక్కువ సంతృప్తి చెందుతారు కామ పరంగా అంటే సెక్స్ పరంగా అని తెలిసింది. 
అంటే పదహారు నిమిషాల రతిక్రియ ఎంతో కీలకమైనది ప్రతి జంట కూ ! ప్రత్యేకించి స్త్రీకి ! 
ముందాట ను ప్రేయసీ ప్రియులు ఎంత రమణీయం గా  తెలిపారో ఈ పాటలో చూడండి.( పూర్తిగా ఆస్వాదించాలంటే,  వీలు చేసుకుని వినండి, చూడండి  ఇంటర్నెట్ లో ),
అదే, అదే, అదే వింత నాకు అంతు తెలియకున్నదీ,
ఏదో లాగు మనసు లాగుతున్నదీ అని ఆమె
అదే వింత నేను తెలుసుకున్నదీ ,
అదే నీ వయసు లోన ఉన్నదీ అని అతడు
నీ నడకలోన రాజ హంస అడుగులున్నవీ ,
నీ నవ్వు లోన సన్న జాజి పువ్వులున్నవీ అని అతడు ఆమె అందాన్ని వర్ణిస్తే,
ఏమేమి ఉన్నవీ , ఇంకేమి ఉన్నవీ ,
‘ ఈవేళ నా పెదవులేల వణుకుతున్నవీ ‘ అని ఆమె  తన దేహం లో కామోత్తేజం తో జరుగుతున్న మార్పులను, అమాయకంగా ప్రియునికి తెలుపుతుంది ! ప్రశ్నిస్తుంది.
నీ చేయి సోకగానె ఏదో హాయి రగిలెనూ,
ఓయీ అని పిలవాలని ఊహ కలిగేనూ  అని ఆమె ( ఇక్కడ మనం వ్యాసం లో ముందు చూసినట్లు, ప్రేయసి ప్రియని చేయి తగలగానే హాయి కలిగిందని అంటే అది కామోత్తేజ స్థానం అనీ, ప్రియుణ్ణి, ఓయీ అని పిలవాలని  ఇంటిమసీ ఎక్కువ చేసుకునే ఉద్దేశం తెలుపుతుంది )
ఏమేమి ఆయెను, ఇంకేమి ఆయెను,
ఈవేళ లేత బుగ్గలెంత  కందిపోయెను ?  అని అతడు ప్రియురాలిలో జరుగుతున్న మార్పులను, గమనించి, చిలిపి గా  టీజ్ చేస్తూ అడుగుతున్నాడు, ఏమీ తెలియనట్టు !! (  తను తెలుసుకున్న వింత అదే ననీ , అది ప్రియురాలి వయసు లో ఉన్నదనీ ముందే చెప్పాడు కదా ! )
పాట చివరకు ఆమె కూడా’  అదే వింత నేను తెలుసుకున్నది’ అని ముగిస్తుంది !
( చిత్రం: రాముడు – భీముడు,  రచన : Dr.C.నారాయణ రెడ్డి, పాడిన వారు ఘంటసాల, సుశీల, సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు ) 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు చూద్దాము.
( మీ అభిప్రాయాలు తెలియ చేయండి )

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.8.

In Our Health on మార్చి 21, 2012 at 9:31 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.8.

ముందాట లేక ‘ foreplay ‘ : 
ప్రేయసీ ప్రియులలో కామోత్తేజం ఎక్కువ చేసి వారిని  రతిక్రియకు ప్రేరేపించి , సంసిద్ధత చేసే ఏ  క్రియ అయినా ముందాట లేక ‘ foreplay ‘ అనబడుతుంది.
దేశ, ప్రాంత, కాల, మత పరిస్థితులను బట్టి మారుతుంటుంది ఈ ముందాట. ఈ సంసిద్ధత  మానసికమైనది, భౌతికమైనదీ కూడా.
మానసికంగా  ఆడే ముందాట లో , ప్రియురాలిని మొదట ప్రణయ సంభాషణతో  కవ్వించడము. internet ద్వారా chat line లో సంభాషణ, mobile లో SMS messages, కూడా ఈ కోవలోకి వస్తాయి.
ఈ విషయం లో మన సినీ కవులు అత్భుత  ప్రతిభ కనబరచారు పాటల లో. 
ఉదాహరణకు ఈ పాట చదవండి:
( వీలు చేసుకుని కనీసం వీడియో కాక పోయినా ఆడియో వినండి )  :
మెల్ల మెల్ల మెల్లగా, అణువణువూ నీదెగా, మెత్తగ అడిగితే లేదనేది లేదుగా,
నాది కానిదేది లేదు నాలో, నిజానికే నేనున్నది నీలో, అని ఆమె అంటే
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో, ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో అని అతడంటాడు
నిన్ను చూసి నన్ను నేను మరచినాను, నన్ను దోచు కొమ్మనీ  నిలిచినాను అని అతడంటే
దోచుకుందమనే నేను చూసినాను, చూచి చూచి నన్ను నువ్వె దోచినావు అని ఆమె
కన్నులకూ కట్టినావు ప్రేమ గంతలూ, కన్నె మనసు  ఆడినదీ  దాగుడు మూతలు,అని ఆమె
దొరికినాము చివరకూ తోడు దొంగలం, దొరలమై ఏలుదాం వలపు సీమలూ అని అతడు
( పక్షుల కల కలల మధ్య ఆమె  కామోత్తేజ నిట్టూర్పు !! )
ఇక్కడ ఆమె ప్రియుణ్ణి, తొందర పడవద్దని , తన శరీరం లో అణువణువూ ప్రియుడిదేననీ చక్కగా తెలిపింది. అతడు కూడా,  తన మనసు ఆమె గుప్పిటి లోనే ఉందని, ‘ దొరలమై వలపు సీమ ఏలుదామనీ ఆమెను సమాయత్తం చేస్తున్నాడు మానసికం గా !
ఇంకో పాట : 
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు, అందీ అందని అందమె ముద్దు,
విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు.
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు అని అతడు,
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు అని ఆమె,
చక చకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు అని అతడు
కలకాలం తల దాచుకోమ్మనే ఎడద ను చూస్తే ఏదో ముద్దు అని ఆమె
పచ్చని చేలే కంటికి ముద్దు, నెచ్చెలి నవ్వే జంటకు ముద్దు అని అతడు ,
చెట్టు చేమా జగతి కి ముద్దు, నువ్వు నేనూ ముద్దుకు ముద్దు అని ఇద్దరూ !!
ముద్దు ఎన్ని రకాలు గా ఉంటుందో రమణీయం గా అచ్చ తెలుగులో వర్ణింప బడ్డది ఈ పాటలో ! ఇక్కడ ముద్దు ను ‘ ఇష్టత ‘ గా  లేక  ‘ లైకింగ్ ‘ అనే అర్ధం వచ్చేటట్లు  వ్రాయ బడ్డది.
 ఇంత చక్కటి పాట, పర్యావరణం కూడా దృష్టి లో ఉంచుకుని ప్రేయసీ ప్రియుల కోసం  ఆ రోజులలోనే రాసినది,  పై రెండు పాటలనూ మనసు కవి  ఆత్రేయ.’ దాగుడు మూతలు సినిమా కోసం ఘంటసాల, సుశీల పాడినవి.  పూర్తిగా ఆస్వాదించాలంటే మీరు ఈ పాటలు విన వలసిందే !
రాసిన రోజులలో ‘ నువ్వు నేను ముద్దుకు ముద్దు’ అన్న మాట ను  సెన్సారు వాళ్ళు అభ్యంతరం తెలిపి తొలగించారు సినిమా లో !!! మీరు ఊహించవచ్చు , అలాంటి అభ్యంతరాలు ఈ రోజులలో ఉంటే పరిణామాలు ఎలా ఉండేవో !  
తరువాతి టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.7.

In Our Health on మార్చి 20, 2012 at 10:16 ఉద.

google verification file

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.7.

ఇంకొన్ని కామోత్తేజ శరీర స్థానాలు:
ముంజేతులు: ( arms) : 
ముంజేతుల లోపలి ప్రదేశం అంతా ఎక్కువ సెన్సిటివ్ నాడీ కణ తంత్రులతో ఆవరించి ఉన్నది. ఈ ప్రదేశం కూడా, ప్రియుని వేళ్ళ స్పర్శ తో కానీ, వేళ్ళతో  కలిగించిన వత్తిడి చేత కానీ, అంటే గట్టిగా ‘ పిసుకు తున్నట్టు ‘ అంటే ‘ kneading ‘ like pressure’ , లేక పెదవులతో చుంబనం చేసినప్పుడు కానీ, లేక నాలుక చివరతో ఈ ప్రదేశాన్నంతా తాకి నప్పుడు కానీ, ఎంతో కామోత్తేజం చెంది, తీవ్రమైన కామ వాంఛ తో రతిక్రియ కు సంసిద్ధ మవుతుంది ఆమె. ఈ చర్యలు ఆమె లో ‘ ఆర్గాసం ‘ కూడా కలిగించవచ్చు ఆమెలో ! అంటే  ఆమె జననాంగాలను తాకిన అనుభూతి కలుగుతుంది, ముంజేతుల కామోత్తేజం తోనే !! అలాగే అతడిలో కూడా తీవ్రమైన కామోత్తేజం కలిగి వీర్య స్ఖలనం కూడా అవవచ్చు.
బాహు మూలాలు ( arm pits ): 
కొంత మంది బాహు మూలాలు కూడా కామోత్తేజ కరమని భావిస్తారు.
‘George Preti, organic chemist, ఇంకా , Winifred Cutler, psychologist  చేసిన పరిశోధనలలో , బాహుమూలాలనుంచి  స్రవించిన పదార్ధాన్ని  కొంతమంది స్త్రీలకు ఒక క్రమ పధ్ధతి లో వాసన చూపితే, వారిలో అంత వరకూ సరిగా లేని ఋతు క్రమం అంటే ‘ menstrual cycle’ , తరువాత ఒక క్రమం లో రావటం  గమనించారు. దీనికి కారణం  బాహు మూలాలలో ప్రత్యేకం గా మార్పు చెందిన స్వేద గ్రంధులు  ‘ Pheromones ‘  అనే హార్మోనులను ఉత్పన్నం చేస్తాయి. ఈ ఫిరమోనులు  కామోత్తేజం కలిగించే హార్మోనులు.
ఇవి ప్రణ యాకర్షణ కలిగిస్తాయి. మనకు మార్కెట్  లో లభించే అనేక రకాలైన డీ ఓడరెంట్లు  ( deodourant  sprays ) అన్నీ ఈ ఫిరమోనులను అనుకరించే  కృత్రిమ రసాయనాలే !
చేతి వేళ్ళు ( fingers ) :  నాలుక తరువాత, మన శరీరం లో అత్యంత సెన్సిటివ్ స్థానాలు మన చేతి వేళ్ళు . ఇవి  నాడీ కణాలు ఎక్కువ సంఖ్య లో నిర్మితమై ఉంటాయి. అందు వల్లనే  కొద్దిగా, అతి సున్నితం గా తాకినా, వెంటనే స్పందిస్తాయి వేళ్ళు.
ప్రణయ భావాలను వేళ్ళలో గమనించ గలరు కొందరు రసికులు.
పాదాలూ, బొటన వేళ్ళు : (  feet and toes ):
పాదాలూ, బొటన వేళ్ళు కూడా కామోత్తేజ స్థానాలే. ఈ ప్రదేశాలలో కూడా అతి సున్నితమైన అంటే సెన్సిటివ్ నాడీ కణజాలం ఉంటుంది. కాక పొతే, ఈ స్థానాలలో కొద్దిగా గట్టి వత్తిడి అంటే ‘ firm pressure ‘ తో కామోత్తేజం కలుగుతుంది కొందరిలో. చాలా మంది లో పాదాల అడుగు ల లో అంటే పాదం క్రింద స్థానం ప్రేరేపిస్తే అంటే స్టిములేట్ చేస్తే గిలిగింతలు గా అంటే ticklish గా ఉంటుంది.
‘ ఫ్రెంచ్ కిస్ ‘  అంటే  ఏమిటో  ఈ  భామల  మాటలలో వినండి,  సరదా గా ఉంది, ఈ యు ట్యూబ్ వీడియో !
తరువాతి టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.6.

In Our Health on మార్చి 19, 2012 at 11:00 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.6.

మిగతా కామోత్తేజ స్థానాలు:
తల: 
పెదవులు, నాలుక  ఎంతో ముఖ్యమైన కామోత్తేజ స్థానాలు. 
వీటిలో కూడా నాడీ కణాలు అత్న్యంత  సాంద్రత లో అంటే ఎక్కువ గా ఉండి కామోద్రేకాన్ని కలిగిస్తాయి. పెదవుల తో సున్నితం గా ఆమె పెదవులను స్పృశించడం, అలాగే ఆమె  మిగతా కామోత్తేజ స్థానాలను తాకడము, ఎక్కువ కామోద్రేకము కలిగిస్తుంది ఆమెలో !
నాలుక లో  కూడా నాడీ తంత్రుల చివరలు,లేక మొనలు ఎక్కువ సంఖ్య లో ఉండి కామోద్రేకాన్ని కలిగిస్తాయి, నాలుక మనము నోటిలో ఉంచిన ఏ పదార్దాన్నైనా రుచి చూడటానికి ప్రత్యేకంగా నిర్మితమైనది. అనుభవజ్ఞులైన  ప్రేయసీ ప్రియులు ముద్దాడుతున్న్నప్పుడు  తమ  నాలుకలు కూడా కలిపి ప్రణయ రుచులు కూడా ఆస్వాదించుతారు ! 
చాలా మంది స్త్రీలు, తమ తల మీది కురుల మొదళ్ళు తాకుతూ సున్నితంగా తలంతా అతడి వేళ్ళను నిదానంగా  పోనిస్తే,  చాలా రిలాక్స్ అయిన అనుభూతి పొంది అత్యంత కామోద్రేకులవుతారు.
పురుషులలో కూడా ఈ అనుభూతులు ఉంటాయి.
మెడ :
మెడ కు ఇరు ప్రక్కలా, ఇంకా క్రింద క్లావికల్ అంటే కాలర్ క్రింద ఉండే ఎముక, మెడ వెనుక భాగం కూడా  అత్యంత సున్నితమైన నాడీ తంత్రులతో ఉంటాయి. ఈ స్థానాలను సున్నితంగా తాకితే కానీ, ముద్దాడితే కానీ, ముని వేళ్ళతో  మాసాజ్ చేస్తే కానీ, లేక నాలుక తో ‘ ఆ స్థానాలను ‘ సర్వే ‘ చేస్తే కానీ అత్యంత  కామోత్తేజం చెందుతారు.ప్రేయసీ ప్రియులు.
ఇక్కడ కూడా రసికులు కొద్దిగా గట్టిగా పంటి తో ఈ స్థానాలను ‘ బైట్ ‘ చేయించుకోదానికీ, లేదా చేయడానికీ వెనుకాడరు, ప్రత్యేకమైన ‘ లవ్ బైట్ ‘ కోసం!!
చెవులు : 
కొంత మంది ప్రేయసీ ప్రియులు, చెవి లో గుస గుసలాడితే కానీ, శ్వాస వదిలితే కానీ, లేక చెవుల  క్రింద భాగం లో, తాకినా, ముద్దిడినా లేక నాలుక తో ‘ రుచి’ రుచి చూసినా ఆనందానుభూతి, కామోత్తేజమూ పొందుతారు.
రొమ్ము :
స్థనాలు లేక పాలిండ్లు ( ఆంగ్లం లో బ్రెస్ట్ ) ప్రత్యేక మైన నాడీ కణజాలం తో నిర్మితమై ఉంటాయి. అవి అనియంత్రిత కండరాలతో అంటే స్మూత్ మసుల్ తో అమరి ఉంటాయి. చన్ను , ( లేక కుకుకము, లేక  టీట్ లేక teat  ) నుంచి స్తన్యం అంటే చను బాలు వస్తాయి. ఈ చనుబాలు చన్ను  చుట్టూ ఉండే ప్రత్యేకంగా పరిణామం చెందిన పాల గ్రంధుల నుంచి వస్తాయి. ఈ గ్రంధులు కూడా ఎక్కువ  నాడీ తంత్రులతో  సంధించబడి ఉంటాయి.
స్థనాలు మొత్తమూ నాడీ కణజాలం తో అమరి ఉంటాయి. వాటి సంఖ్య స్థనం యొక్క పరిమాణం తో మారదు. అంటే సహజంగా పెద్ద  స్థనాలను చూసి    మగవారు చెందే ప్రణ యాకర్షణ  మానసికమైనది. చిన్న పరిమాణం లో ఉండే  స్థనాలు, పెద్ద పరిమాణం లో ఉండే స్థనాలతో పోలిస్తే ఎక్కువ సున్నితం అంటే సెన్సిటివ్  గా ఉంటాయి, నాడీ తంత్రుల సాంద్రత దృష్ట్యా ! ఎందుకంటే నాడీకణాల సంఖ్య మారదు కనుక .
చన్ను లేక టీట్ ను  సున్నితంగా మాసాజ్ చేస్తే అందులోనుంచి ముఖ్యమైన హార్మోనులు అప్రయత్నంగా ఊట లాగా  విడుదల అవుతాయి. ( మొదటి భాగం లో మనం తెలుసుకున్నాము , హార్మోనులు అంటే ఏమిటో ) వీటి పేర్లు ఆక్సీ టోసిన్ ( oxytocin ) ఇంకా ప్రోలాక్టిన్ ( prolactin ).  ఈ హార్మోనులు ఆమె జాననాంగం మీద కూడా ప్రభావం చూపి, రతిక్రియ కు పురి గొల్పుతాయి. 
ఉదరం అంటే అబ్డామెన్ ( abdomen ) మరియూ  నాభి , లేక బొడ్డు ( navel ):
చాలా మంది లో  పొట్ట అంటే ఉదర భాగాన్ని,  సున్నితంగా తాకినా, వేళ్ళ గోళ్ళతో సున్నితంగా గీరినా,  ఆ స్థానాన్ని ముద్దు పెట్టుకున్నా, లేక నాలుక తో స్పర్శించినా లేక పొదివి పట్టుకున్నా , అంతులేని ప్రణ యానంద అనుభూతులు ఉప్పొంగి , వారు కామోత్తేజం పొందుతారు.
ప్రత్యేకించి ప్యుబిక్ స్థానానికి దగ్గర గా ఉన్న ఉదర భాగం లో ఈ ప్రతిక్రియానుభూతులు  ఎక్కువ గా ఉంటాయి.
ఈ విధంగా ప్రేరేపితమైన కామోత్తేజం , మగ వారిలో కానీ, ఆడ వారిలో కానీ చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఇంటెన్స్ గా. ఈ తీవ్రత,  జననాంగాలను, ప్రేరేపితం అంటే స్టిములేట్ చేసినదానికంటే కూడా ఎక్కువ గా ఉండ వచ్చు.
నాభి స్థానం : రతిక్రియ రీత్యా, నాభి స్థానం ఎంతో శక్తివంతమైనది. ఈ స్థానం కూడా అతి సున్నితమైన నాడీ తంత్రులతో నిర్మితమై ఉంటుంది.
 వేళ్ళ స్పర్శ తో కానీ, నాలుక చివర తో కానీ  నాభి  ‘ వీణను ‘  సున్నితంగా మీటితే   కోటి  ‘ రతి  రాగాలు’  పలుకుతాయి !
( ఈ విషయం కూడా మన సినీ దర్శకులకు ‘  శతాబ్దాల క్రితమే ‘ తెలుసు కదా ! ) 
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్ గాయని మడోన్నా ఒక ఇంటర్వు లో ఇలా చెప్పింది ‘ నేను నా వేలును నా నాభిలో ఉంచుకున్నప్పుడు , నాకు ఒక నాడీ తంత్రి ఒక్కసారిగా నా ‘ దేహం ‘ లో ‘ మధ్య భాగం ‘ నుంచి నా వెన్నెముకకు  షూట్ అయినట్లు అనుభూతి పొందుతాను ‘
ఇలా జరగటం ఎందుకంటే నాభి కూడా జననాంగాలు నిర్మితమైన కణజాలం తోనే నిర్మింప బడ్డది.
స్థనాలను  ప్రేరేపించడం ఎలాగో  ఈ కన్య మాటలలో వినండి !!  (  ఇది యు ట్యూబ్  వీడియొ )
 

వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.5.

In Our Health on మార్చి 18, 2012 at 9:34 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.5.

ప్రత్యేక మైన కామోత్తేజ స్థానాలు:
కటి వలయ ప్రాంతము అంటే ప్యూ బిక్ ఏరియా: ఈ ప్రాంతం లో జననాంగాలు ఉంటాయి.
పురుషులలో :
జననాంగము అనేక నాడీ కణ జాలం తో,  పరిణామ పరంగా ప్రత్యేకం గా ప్రత్యుత్పత్తి కి అనుగుణం గా నిర్మితమైనది.
పురుషుల జననాంగాన్ని ఆంగ్లం లో పెనిస్ అంటారు. పెనిస్ చివర భాగాన్ని గ్లాన్స్ పెనిస్ అంటారు.పెనిస్ క్రింద వైపు భాగం అంతా అనేక నాడీ తంత్రుల తో ఉండి ఎక్కువ కామోత్తేజం కలిగిస్తుంది.
ముఖ్యం గా   పెనిస్, గ్లాన్స్ పెనిస్ (  అంటే జననాంగము చివరి భాగం ) తో కలిసే స్థానంలో నాడీ కణాల సంఖ్య అధికంగా ఉండి, అత్యధిక కామోత్తేజం కలిగిస్తుంది. అట్లాగే  పెనిస్ పై భాగం కూడా ఎక్కువ నాడీ కణజాలం తో నిర్మితమై ఉన్నది. పెనిస్ కూ గ్లాన్స్ పెనిస్ కూ మధ్య ఉండే చర్మము కూడా అతి సున్నితమైన నాడీ కణజాలం తో నిర్మితమై, స్పర్శ కు త్వరగా కామోత్తేజం చెందుతుంది.
స్త్రీలలో :
స్త్రీ జననాంగము కూడా ప్రత్యేకమైన కామోత్తేజ స్థానం.
క్లిటోరిస్ అంటే ‘ యోని కీల’ :  క్లిటోరిస్ స్త్రీ జననాంగం లో అత్యంత కామోత్తేజ స్థానం. ఈ స్థానం  జననాంగము పై భాగం లో ఉంటుంది. ఈ స్థానం లో అనేకమైన నాడీ  తంత్రుల చివరలు లేక మొనలు ఉండి ఏమాత్రము స్పర్శ తగిలినా అత్యంత కామోత్తేజం, కామోద్రేకము కలిగిస్తాయి. 
‘A’ స్పాట్, ‘ G ‘ స్పాట్,  ‘ U ‘ స్పాట్ అంటే ఏమిటి? ( పైన ఉన్న పటం చూడండి ) 
యోని అంటే   వాజినా  ద్వారము లోపల ఉండే చర్మము .దీనినే  ‘ A ‘ స్పాట్ అంటారు. ఎందుకంటే యాన్టీరియర్ ఫార్నిక్స్  లో ఈ స్థానం ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా ఎక్కువ కామోత్తేజకర నాడీ తంత్రులు ఉంటాయి.
యోని ద్వారం అంటే వాజినల్ కెనాల్ ముందరి భాగంలో ఒక స్థానం. దీనిని గ్రాఫెంబర్గ్ స్పాట్ లేక  ‘ G ‘ స్పాట్ అంటారు. ఈ స్థానం కామోత్తేజం లేనప్పుడు కొద్దిగా మందంగా  మన నోటి అంగిలి అంటే పాలెట్ ను నాలుక తో ముట్టుకుంటే ఎలాంటి అనుభూతి ఉంటుందో అలా ఉంటుంది. కానీ స్త్రీలు కామోత్తేజం  పొందినప్పుడు , ఈ స్థానం  స్పాంజ్ లా  మెత్తగా అవుతుంది.
‘ U ‘ స్పాట్, క్లిటోరిస్ ముందు భాగం లో మూత్ర ద్వారం ఇరు ప్రక్కలా ఉండే చర్మము. ఇది కూడా అతి సున్నితంగా నాడీ కణాలతో ఉంటుంది. 
యోని లో మిగతా భాగాలు కూడా ఎక్కువ నాడీ సాంద్రత కలిగి కామోత్తేజం కలిగిస్తాయి.
ఇంకొన్ని   విషయాలు వచ్చే టపా లో తెలుసుకుందాము.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.4.

In Our Health on మార్చి 17, 2012 at 11:21 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.4.

కామోత్తేజ, లేక కామోద్దీపనా స్థానాలు. అంటే ‘ erogenous zones ‘ :
క్రితం టపా లో చెప్పినట్లు మానవ శరీరమంతా కామోత్తేజ స్థానాలే !  
ఉదాహరణకు ఎక్కువ గా  ప్రియురాలి  అందమైన కనుబొమలు, కను రెప్పలూ , కేశాలూ,   ముఖం ప్రక్క భాగం అంటే చెవుల ముందరి నుంచి కను సన్నల మధ్య ఉన్న స్థానం , భుజాలూ, ముంజేతులు, చేతులు వీటిని  సున్నితంగా,   ప్రియుడు తన  వేళ్ళతో తాకి  ఒక దిశలో పోనిస్తే కానీ  తీవ్రమైన కామోత్తేజం కలుగుతుంది. అట్లాగే ఆమె ఉదర భాగం అంటే నడుము రొమ్ము ల మధ్య భాగాన్ని అతడు సున్నితం గా తాకి ఒక చివర నుంచి ఇంకో చివరకు పోనిస్తే కానీ, లేక ఆ ప్రదేశాన్ని చుంబిస్తే  అంటే ముద్దు పెడితే కానీ ఎక్కువ కామోత్తేజం కలుగుతుంది. అలాగే ప్రత్యేకించి ఉదర భాగం లో ఉన్న బొడ్డు అంటే ‘ navel ‘ ఉన్న స్థానం కూడా ఎంతో సున్నితమైనది కామోత్తేజానికి ! 
ఈ వాస్తవాన్ని తెలుగు సినిమా దర్శకులు ఎంతగానో  ‘ సొమ్ము’  చేసుకున్నారు, చేసుకుంటున్నారు కదా !!
ఈ కామోత్తేజ స్థానాలు ఎక్కువగా ఉత్తేజ పూరితం అవటానికి  ఈ స్థానాల చివరల ఉండే నాడీ తంత్రులు కారణం. నాడీ తంత్రుల చివరలు అతి సున్నితమైన కుంచెల రూపంలో మన బాహ్య శరీరమంతా విస్తరించి ఉంటాయి. కానీ కొన్ని స్థానాలలో ఈ నాడీ తంత్రుల మొనలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇందువల్ల , ఈ ప్రదేశాలలో తాకినప్పుడు కానీ , చుంబించి  నప్పుడు అంటే ముద్దాడి నప్పుడు కానీ ఆ స్థానాలు తీవ్రంగా ఉత్తేజం పొంది,
తద్వారా  మెదడు కు సంజ్ఞలు అంటే ‘ neuronal signals ‘ పంపి, మనను సంపూర్ణంగా ఉత్తేజం చేస్తాయి.
పైన చెప్పిన ఈ కారణం వల్ల ఈ కామోద్దీపనా స్థానాలు, లేక కామోత్తేజ స్థానాలు, రెండు రకాలుగా అంటే, సాధారణ కామోత్తేజ స్థానాలు, ప్రత్యేక కామోత్తేజ స్థానాలు గా పరిగణింప బడతాయి.
సాధారణ కామోత్తేజ స్థానాలు :  ఈ స్థానాలు,మెడ వెనక స్థానము,  మెడ ప్రక్క స్థానం,  ముంజేతుల లోపలి స్థానాలూ, రొమ్ము ప్రక్క స్థానాలు. ఈ స్థానాలు చర్మం మీద ఉండే  సాధారణ సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్య లో నాడీ కొనలు లేక చివరలు ఉండి ఎక్కువ ఉత్తేజం కలిగిస్తాయి, రతిక్రియకు ప్రేరేపిస్తాయి.
ఇక రెండవ రకం: ప్రత్యేకమైన కామోత్తేజ స్థానాలు:
ఇవి స్త్రీ పురుషుల జననేంద్రియాలు.
వీటి వివరాలు వచ్చే టపా లో చూద్దాము

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.3.

In Our Health on మార్చి 16, 2012 at 8:46 సా.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.3.

మాస్టర్స్ అండ్  జాన్సన్ ప్రతిపాదించిన కామ ప్రతిక్రియా వలయం కన్నా యదార్ధానికి మానవులలో  కామ ప్రతిక్రియ ఇంకా జటిలమైనదని ఇటీవలి పరిశోధనలు రుజువు చేసాయి. ఈ వలయం, వారు  ప్రతిపాదించి నంత  ఖచ్చితం గా ఉండక సమయ సందర్భాలను, స్త్రీ పురుష ప్రేరేపిత శరీర భాగాలను  బట్టి మారుతుంటుంది.
ఉదాహరణకు  రతిక్రియ లో పాల్గొనాలనే కామ వాంఛ అంటే ‘  డిజైర్’   రతి క్రియ కు ముందు ఉండక పోవచ్చు. కామ వాంఛ,   రతిక్రియానుభూతులు  మొదలైనప్పుడు ప్రేరేపితం కావచ్చు.
అట్లాగే   కామ వాంఛ, కామోద్రేకము ఒకదాని మీద ఒకటి  ‘ overlap ‘ ఆవ వచ్చు. అంటే కామ వాంఛ  పెరుగుతున్న కొద్దీ కామోద్రేకము కూడా ఎక్కువ అవుతుంటుంది.
అనేక మైన జీవ సంబంధమైన, మానసిక  పరిస్థితులు, కామ ప్రేరణ కలిగిస్తాయి.అంటే  స్త్రీ లోనూ పురుషుని లోనూ రతిక్రియకు అంటే రెండో దశ కు తీసుకు వెళతాయి. ఈ పరిస్థితులు మన మెదడు లో  ఫ్రాన్ టాల్ లోబ్స్  లో   మనం  రతిక్రియ మీద మనకు ఆ సమయం లో ఉన్న అనుభూతులనూ , రతిక్రియలో పాల్గొనాలనే నిర్ణయాన్నీ ప్రభావితం చేస్తాయి.
ఈ జీవ, మానసిక  సంబంధమైన పరిస్థితులు, అంటే biological and psychological factors  అనేక రకాలు గా ఉండవచ్చు.
 పరిసర వాతావరణం కూడా  రతిక్రియకు ప్రేరేపించ వచ్చు.
స్త్రీ కొన్ని లక్షణాలను పురుషునిలో ముందే గమనించి వాటివల్ల ప్రభావితం అయి ఉండ వచ్చు. అలాగే పురుషుడు కూడా స్త్రీలో కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల ఆకర్షింప బడవచ్చు.
అవి భౌతిక లక్షణాలే కావచ్చు వారు ధరించే దుస్తులే కావచ్చు.వారి  కేశాలంకరణ కావచ్చు , లేక ‘ వారి మనసే’  కావచ్చు
సుగంధమయ ప్రదేశము, అందమైన పరిసరాలూ,  అలాగే  ప్రణయ వాతావరణము: అంటే సమ ఉష్ణోగ్రతా,  ప్రశాంత సమయము, లేక నచ్చిన సంగీతము ఇలాంటివి.
ముందు మాట, కామోత్తేజ స్థానాలు, ముందాట ( fore play ) : 
రతిక్రియ ను ప్రేరేపించటానికి ముందు ప్రేయసీ ప్రియుల మధ్య  ఆనంద కరమైన ప్రణయ సంభాషణ ఎంతో విలువైనది. వారి మధ్య బాసలు, ఊసులు , ఇద్దరినీ రతిక్రియ కు మనసులో ఉత్కంథత రేపి వారిని సమాయత్తం చేస్తాయి.అలాగే రతిక్రియ కు ముందు ఒక మంచి పుస్తకం చదివితే  , సినిమానో చూస్తే కూడా  ప్రేయసీ ప్రియులు సిద్ధమవుతారు రతిక్రియకు. ఈ  పరిస్థితులన్నీ ప్రణయ లేక కామ వాంఛ ను  శక్తి వంతం చేస్తాయి.
కామోత్తేజ స్థానాలు అంటే erogenous zones:  అంటే కామాన్ని ఉత్తేజం  చేసే స్థానాలు.: ఈ స్థానాలు  ఆమెలోనూ, అతడి లోనూ  దేహమంతా ఉంటాయి.
కాకపొతే ఈ స్థానాల వల్ల ఒక్కొక్కరూ ఒక్కొక విధంగా ప్రేరేపించ బడి ఉత్తేజం చెందుతారు. అంటే కొన్ని కొన్ని స్థానాలు కొంతమంది లో ఎక్కువ గా ప్రభావితం అవుతాయి.
ఉదాహరణ కు , ఆమెలో  చెవి కింద భాగం లో స్పర్శ ఎక్కువ ఉత్తేజం కలిగించ వచ్చు.అలాగే అతడి చేతిని ఆమె స్ప్తుశించితే అతడు ఎక్కువ ప్రేరేపించ బడ వచ్చు. సాధారణం గా దేహం లో ప్రతి స్థానమూ  కామోత్తేజ  స్థానమే !!
కామోత్తేజ స్థానాలూ, ముందాట గురించి ఇంకొన్ని విషయాలు వచ్చే టపాలో చూద్దాము.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 2.

In Our Health on మార్చి 15, 2012 at 11:04 ఉద.
కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 2.
కామ వాంఛ – ప్రతిక్రియా వలయం. అంటే సెక్సువల్ రెస్పాన్స్ సైకిల్. ( human sexual response cycle ):
మానవులలో కామ ప్రతిక్రియ గురించి ఒక శాస్త్రీయ విశ్లేషణ చేసి ప్రతిపాదించిన వారిలో మాస్టర్స్ అండ్ జాన్సన్  ప్రముఖులు.
వీరు ( Dr.Masters  పురుషుడు, Dr.Johnson స్త్రీ ) 1950 నుంచి 1980 వరకూ ఈ విషయం పైన అనేక పరిశోధనలూ , పరిశీలనలూ, చేశారు. వీరి  ప్రతిపాదన ప్రకారం, మానవులలో కామ ప్రతిక్రియ నాలుగు దశలు గా ఉంటుంది.
మొదటి దశ :  Excitement  దీనిని తెలుగు లో సాధారణం గా ‘  కామోద్రేకం ‘  అని అంటాము.
రెండవ దశ :  Plateau. దీనినే సమతల దశ  అనవచ్చు. 
 మూడవ దశ :  Orgasm.  ఈ దశ కామ ప్రక్రియ లో ఉచ్చ దశ. Climax  అని కూడా పిలవ బడుతుంది  .
నాల్గవ దశ : Resolution.  యధాస్తితి అనవచ్చు నేమో దీనిని తెలుగులో.
మాస్టర్స్ అండ్ జాన్సన్ చేసిన పరిశీలనలో, మానవులలో  ఈ కామప్రతిక్రియ ఒక నిర్దిష్టమైన  పధ్ధతి లో  జరుగుతుందని చెప్పారు.
ఈ ప్రతిక్రియ స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఒకే విధం గా కాక , కొద్ది తేడాలతో  ఉంటుంది.
పురుషులు త్వరగా ‘ వేడెక్కి ‘ ఉచ్చ దశ కు అంటే క్లైమాక్స్ కు చేరుకుంటారు కామ క్రియలో! స్త్రీలు కొద్దిగా ‘ ఆలస్యంగా ‘ వేడెక్కి ‘ ఉచ్చ దశ కు చేరుకుంటారు.
పైన ఉన్న పటం లో నీలం గీత పురుషుల కామ ప్రక్రియ నూ , ఎరుపు రంగు గీత స్త్రీలలో ఈ కామ ప్రక్రియనూ తెలియ చేస్తుంది.
ఈ గీతలు రెండూ మీరు గమనించినట్లైతే  క్రిందనుంచి మొదలై క్రమంగా పైకి వెళుతున్నాయి.  ఇలా గీయటం కామోద్రేకం క్రమం గా ఎలా ఎక్కువ అవుతుందో సూచిస్తూంది.
ఈ గీతలు రెండూ ఒకే సారి ఉచ్చ దశకు చేరుకోకుండా  వేరు వేరు సమయాలలో ఈ దశ లో ఉన్నాయి.
అలాగే ఈ గీతలు క్రిందకు వచ్చేటప్పుడు కూడా కలిసి రాకుండా కుడి ఎడమలు గా దిగుతున్న్నాయి.
ఇది కామ ప్రక్రియ లో సంపూర్ణ మైన తృప్తి పొంది ‘యధాస్థితి’  కి వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి.
ఈ గీతల మొదలు నుంచి చివరల వరకూ ఉండే దూరం  కామ ప్రతిక్రియ సమయాన్ని సూచిస్తూంది. మీరు సరదాగా ఒక స్కేలు తీసుకుని కొలవవచ్చు ఈ దూరాలను.
(  గ్రాఫ్  అంటే  graph అంటే తెలియని వారికి కూడా అర్ధం ఆయేట్టు  ఈ విధం గా వివరించటం జరిగింది. )
మాస్టర్స్ మాటలలో చెప్పాలంటే   ‘ Men are like microwaves ‘ and ‘ Women are like slow cookers’ !! 
వీటి మిగతా  వివరాలు వచ్చే టపాలో చూద్దాము.
%d bloggers like this: