కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 1.
కామ వాంఛ లేక ‘ lust’ లేక ‘ sexual desire ‘ .
మన దేహం లో ఎన్నో ఎండోక్రైన్ గ్రంధులు ఉన్నాయి. వీటిని తెలుగు లో వినాళ గ్రంధులు అంటారు.ఈ గ్రంధులలోనుంచి ప్రత్యెకమైన జీవ రసాయనాలు విడుదల అవుతుంటాయి, నిత్యమూ. ఈ ప్రత్యేక జీవ రసాయనాలను హార్మోనులు అంటారు. ఈ గ్రంధులలో తయారైన హార్మోనులు ఏ నాళమూ లేకుండా సరాసరి మన రక్తంలోకి విడుదల అవుతుంటాయి. అందుకే వీటికి ‘ వినాళ గ్రంధులు ‘ అని పేరు వచ్చింది ( అంటే ‘ Endocrine glands ‘ )
ఈ గ్రంధులలోనుంచి హార్మోనులు చాలా స్వల్ప పరిమాణం లో విడుదల అవుతుంటాయి. అయినప్పటికీ ఈ హార్మోనులు మనకు ఎంతో ముఖ్యం. అనేక కీలకమైన జీవ క్రియలను ఈ హార్మోనులు ప్రభావితం చేస్తాయి, మన జీవితాంతమూ. ఈ హార్మోనుల లోపం వల్ల మన దేహం లో తీవ్ర అస్వస్థత కలగ వచ్చు.
ఉదాహరణకు : థైరాయిడ్ గ్రంధి నుంచి థైరాయిడ్ హార్మోను విడుదల చేయ బడుతుంది. అట్లాగే మగవారి లో యాన్డ్రోజనులు, అంటే ‘ androgens’ , ఆడ వారిలో ఈస్త్రోజెనులు, లేక ‘ estrogens’ విడుదల అయి మనలో మన లింగ నిర్ధారణకు కారణమవుతాయి.
అలాగే ఇన్సులిన్ హార్మోను మన రక్తములో గ్లుకోసు ను నియంత్రించటమనే ముఖ్య విధి నిర్వర్తిస్తుంది.
మనలో కామ కోరికలు లేక కామ వాంచలు రేకెత్త టానికి సెక్స్ హార్మోనులు కారణం. కామ కోరికలూ , రతి క్రియ అంటే సెక్స్ , ఇవి ప్రతి ప్రౌఢ వయసు వచ్చిన ప్రతి స్త్రీ కీ , పురుషునికీ ఎంతో ముఖ్యము. అందుకే ఐక్య రాజ్య సమితి సెక్సువల్ హెల్త్ లేక లైంగిక ఆరోగ్యాన్ని ప్రతి మానవుని ప్రాధమిక హక్కు గా గుర్తించింది.
స్త్రీలలోనూ , పురుషుల్లోనూ, ఈ కామ వాంచలు, రతిక్రియ ఎట్లా ప్రేరేపించ బడతాయో రేపటి టపా నుంచి మనం తెలుసుకుందాము. దానితో పాటు మానవులలో వాటి లోపాల వల్ల తలెత్తే సమస్యలూ, వాటిని ఎట్లా సరి చేయ వచ్చో కూడా మనం కొంత తెలుసుకుందాము.
ఈ విషయాలు పెద్దలకు మాత్రమే !!
ఎవరికైనా ఈ లైంగిక విజ్ఞానము అభ్యంతర కరం గా తోస్తే తగు జాగ్రత్తలు తీసుకోండి.