కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 14.
స్త్రీలలో ఆర్గాసం మూలాలు :
మాస్టర్స్ అండ్ జాన్సన్ ( హ్యూమన్ సెక్సువల్ రెస్పాన్స్ సైకిల్ ను ప్రతిపాదించిన శాస్త్రజ్ఞులు, దీని గురించి మీరు కామ వాంఛ మొదటి విశ్లేషణ ల లో చదివి ఉంటారు కదా ! )
కూడా తాము జరిపిన పరిశోధనలలో కిన్సే ప్రతిపాదించిన క్లై టో రల్ ఆర్గాసం ను సమర్ధించుతూ, రుజువులు కనుగొన్నారు.
ఇంకొక పరిశోధనలో ( by Shere Hite ) డెబ్బయి నుంచి ఎనభై శాతం స్త్రీలు కేవలం ప్రత్యక్షంగా ‘ యోని కీల ‘ అంటే క్లై టో రిస్ ను ప్రేరేపితం అంటే ‘ స్టిములేట్’ చేయగానే ఉచ్చ దశకు అంటే క్లైమాక్స్ కు చేరుకుని ఆర్గాసం అనుభవించారు.
స్త్రీల కామోచ్చ దశ లేక ఆర్గాసం పైన అనేక పరిశోధనలు చేసిన మేయో క్లినిక్ ఇలా తెలిపింది ” స్త్రీలలో ఆర్గాసం యొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. ఇది ‘ క్లై టో రిస్ ను ఎంత తీవ్రత తో స్టిములేట్ ‘ చేయ వచ్చు అనే అంశం మీద ఆధార పడి ఉంటుంది. సాధారణం గా క్లై టోరిస్ అత్యంత సెన్సిటివ్ స్థానం. ఎందు కంటే పురుషులలో పురుషాంగం ఎంత సెన్సిటివ్ అవునో, స్త్రీలలో క్లై టో రిస్ అంత సెన్సిటివ్. దీనికి కారణం యోనికీల మొన అంటే ‘ tip of the clitoris ‘ ( also called glans as in males ) లో సుమారు 8,000 nerve endings అంటే ఎనిమిది వేల నాడీ తంత్రుల చివరలు లేక మొనలు ఉంటాయి. ఇవి అత్యంత స్వల్ప ప్రేరేపణ లేక స్టిములస్ కు కూడా ఎంతో రెస్పాండ్ అవుతాయి. ఇలా మానవ దేహం లో ఏ భాగం లోనూ ఇన్ని నాడీ తంత్రుల చివరలు ఒకే చోట కేంద్రీకృతం కాలేదు కేవలం ఒక్క యోని కీల లేక క్లై టో రిస్ మొన లో తప్ప !
అందువలనే క్లై టో రల్ స్టిములేషన్ ద్వారా అనుభవించే ఆర్గాసం స్త్రీలలో చాలా సులువు. అంతే కాకుండా ఈ క్లై టో రిస్ లేక యోని కీల నుంచి అత్యంత సెన్సిటివ్ నాడీ తంత్రులు ఇరు ప్రక్కలా వ్యాపిస్తాయి. ఆంటే ఒక గుర్రపు నాడా ( గుర్రపు నాడా మీకు తెలిసే ఉంటుంది, గుర్రపు డెక్క పరుగెత్తేటప్పుడు ఎక్కువ అరగకుండా తొడిగే మెటల్ నాడా, ఇది తలక్రిందులు గా ఉన్న ఆంగ్ల అక్షరం ‘ U ‘ ఆకారం లో ఉంటుంది దీనినే ఆంగ్లం లో ‘ horse shoe ‘ అంటారు ) ఆకారం లో ! వజైన యొక్క పెదవులకూ, ఇంకా కొద్దిగా వ జైన లోపలి స్థానానికీ వ్యాపిస్తాయి ఈ నాడీ తంత్రులు. ఈ స్థానం లో వ జైన లో ఉన్న ‘ G ‘ spot ‘ కూడా ఉంది ( జీ స్పాట్ గురించి కూడా పటం ద్వారా తెలుసుకున్నారు మీరు మునుపటి టపాలో )
ఇక్కడ గమనించ వలసిన విషయం: మనం క్రితం టపాలలో వివరం గా చూసినట్లు, కామోత్తేజ స్థానాలు శరీరమంతా వ్యాపించి ఉన్నా , కొన్ని స్థానాలలో నాడీ తంత్రులు అత్యంత సంఖ్య లో ఉండటం వలన ఆ స్థానాలు ఎక్కువ గా ప్రేరేపితం అవుతే ఎక్కువ ఆర్గాసం లేక సంపూర్ణమైన ఆర్గాసం అనుభవించ వచ్చు.
కేవలం పురుషాంగం వజైన లేక యోని లో ప్రవేశించి నంతనే సంపూర్ణ కామోచ్ఛ దశ ను అనుభవించడం జరుగక పోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో, క్లై టో రల్ స్టిములేషన్ లోపించవచ్చు.
సంప్రదాయక సంగమ పద్ధతులలో ( పధ్ధతి అనవచ్చేమో ) పురుషాంగం ద్వారా క్లై టో రిస్ కూ ఆంటే యోని కీలకూ, యోని లోపలి పెదిమ ( labia minora ) కూ సరియైన ప్రేరణ కలగక పోవచ్చు.
( యోని లేక వ జైన ఇరుప్రక్కలా అతి సున్నితమైన కండరాల పొరలను యోని పెదవి లేక లేబియా అంటారు. ఈ లేబియా రెండు పొరలు గా ఉంటుంది ఇరుప్రక్కలా ఈ లేబియా లేక పెదవులు పుష్పము లోని ఆకర్షక పత్రముల లాగా అంటే petals లాగా అమరి ఉంటాయి. ఈ రెండు సున్నితమైన కండరాల పొరలనూ లేబియా మేజోరా ఇంకా లేబియా మైనోరా అంటారు వైద్య పరిభాషలో. ఈ లేబియా మైనోరా లో యోని కీల నుంచి అంటే క్లై టో రిస్ నుంచి నాడీ తంత్రులు వ్యాపించి ఉంటాయి.) తద్వారా ఆర్గాసం కలుగదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి శాస్త్రజ్ఞులు ‘ కాయిటల్ ఎలైన్మెంట్ టెక్నిక్ ‘ అని ఒక ప్రత్యేకమైన ( రతి సమయం లో ప్రేయసీ ప్రియుల అమరిక ) సూచించారు. దీనిని గురించి ముందు ముందు తెలుసుకుందాం )
ఇంకొన్ని విషయాలు వచ్చే టపాలో చూద్దాము !