కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.17.
అనార్గాస్మియా నివారణోపాయాలు:
సెక్స్ థెరపీ: ప్రత్యేక మైన ట్రైనింగ్ పొందిన సెక్స్ తెరపిస్ట్ ల తో సంప్రదించి వారి సలహా పాటించడం కూడా మందులు లేకుండా అనార్గాస్మియాను నివారించడానికి ఎంతో సహాయ పడుతుంది.
సెక్స్ తెరపిస్ట్ లు సాధారణంగా కొన్ని సెషన్స్ అంటే పన్నెండు సార్లో లేక పదహారు సార్లో వారి క్లినిక్ లో మీకు అంటే జంటలకు , తగిన తరిఫీదు ఇస్తారు, అనార్గాస్మియా నివారణకు.
క్లై టోరల్ వాక్యుం పంప్ : ఈ పరికరం వాడకం వల్ల స్త్రీలలో ముఖ్య కామోత్తేజ స్థానాలైన వజైన ఇంకా క్లై టో రిస్ కు రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. దానితో వారికి ఎక్కువ ప్రేరణ కలిగి రతిక్రియ లో ఆర్గాసం పొందుతారు.
ఈ పరికరం వాడకం చాలా శులభం. అయితే స్పెషలిస్ట్ ను సంప్రదించాకే ఈ పరికరం ఉపయోగించాలి.
క్రింద ఫోటో చూడండి.

2. మందులతో అనార్గాస్మియా నివారణ:
ఈస్ట్రోజెన్ తో నివారణ: ఈస్ట్రో జెన్ వివిధ రకాలు గా అంటే చర్మము మీద అతికించే పాచ్ ల రూపం లోనూ, నోటిలో వేసుకునే బిళ్ళల రూపం లోనూ లేక జననాంగం పైన పూసుకునే ఆయింట్మెంట్ రూపం లోనూ వాడితే, అది అనార్గాస్మియా నివారణలో ముఖ్య పాత్ర వహిస్తుందని శాస్త్రీయంగా తెలిసింది. ఈస్ట్రో జెన్ వాడకం వల్ల స్త్రీల జననాంగం లో రక్త సరఫరా ఎక్కువ అయి వారిలో కామ వాంఛ అంటే డిసైర్ కూడా ఎక్కువ అవుతుంది. సాధారణం గా ఈస్ట్రో జెన్ ను ఇంకో హార్మోన్ ప్రాజె స్టిరాన్ అంటారు దానితో కలిపి వాడమని సలహా ఇస్తారు నిపుణులైన వైద్యులు.
దీనికి కారణం: కొందరు స్త్రీలలో ఈస్ట్రో జెన్ ఉత్పత్తి సరిగా లేకపోతే వారి మానసిక స్థితి కామోత్తేజ దిశ గా పోదు. కొన్ని వారాలు ఈస్ట్రో జెన్ వాడకం జరిగితే, వారు మానసికంగా ఉల్లాసవంతులై , తగినంత కామోత్తేజం పొంది, రతిక్రియలో సుఖప్రాప్తి చెందుతారు. ఆర్గాసం పొందుతారు.
అలాగే తెస్తోస్టిరాన్ వాడకం కూడా : టేస్తోస్టిరాన్ పురుషుల లో ఉండే హార్మోన్ అయినప్పటికీ తక్కువ మోతాదు లో స్త్రీలలో కూడా ఉండి, వారిలో కామవాంచ నూ తద్వారా కామోత్తేజము, క్లైమాక్స్ లేక ఆర్గాసం నూ చెప్పుకో తగినంతగా ప్రభావితం చేస్తుందని శాస్త్రీయ పరిశోధనల వల్ల తెలిసింది. టేస్తో స్టిరాన్ వాడకం, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగించ వచ్చు వాడుతున్నవారిలో అంటే మొటిమలు రావడం, వెంట్రుకలు తలమీద కాక మిగతా ప్రదేశాలలో ఎక్కువ గా పెరగటం, ఇలాంటివి. కనుక టేస్తోస్టిరాన్ వాడకం స్త్రీలలో ప్రత్యేక పరిస్థితులలోనే, అంటే వారు ఈస్త్రోజేన్, ప్రో జేస్టిరాన్ వాడినా కూడా తగిన ఫలితాలు లేక పోతేనే , లేక వారికి అండాశయం అంటే ఓవరీలు ( ovaries ) తీసివేయటం కానీ జరిగినప్పుడే జరగాలి,
ఏవిధమైన హార్మోనుల వాడకమైనా తగిన నిపుణులతో సంప్రదించి వారి పర్యవేక్షణలో జరగటం ఉత్తమం.
ముఖ్యంగా సెకండరీ అనార్గాస్మియా లేక ద్వితీయ అనార్గాస్మియా కు ట్రీట్మెంట్ మూల కారణం బట్టి ఉంటుంది. కారణం కనుక్కుని తగువిధంగా నివారణోపాయాన్ని అమలు పరచాలి.
ఇలాంటి పరిస్థితిలో కూడా స్పెషలిస్టు తో సంప్రదించి వారి సలహా తీసుకోవాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !