ఆకర్షణ,ప్రేమ,కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.13.
సంస్కృతి, జీవ శక్తుల కలగలుపు:
లెక్కకు మించిన ఆచార వ్యవహారాలూ, అలవాట్లూ, సాంఘిక కట్టుబాట్లూ, నాగరికతలూ, ఈ మూడు జీవ శక్తులు అంటే ఆకర్షణ, ప్రేమ , కామ వాంఛ ల నుంచి పరిణామం చెందినవే !!
అవి ఒక కుటుంబం గానే కావచ్చు, అతడు, ఆమె సంగమించే ఆచారాలే కావచ్చు, లేక పిల్లల పెంపకమే కావచ్చు, లేక మనం అభిమానించి పెంచే కళలే కావచ్చు.
ఈ మూడు జీవ శక్తులు ( అంటే ఈ ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ అనే అనుభూతులు ) కొన్ని విపరీత పరిణామాలకు కూడా దారి తీయవచ్చు. అవే : డిప్రెషన్, స్త్రీలపైన అత్యాచారాలు చేయటము, సంబంధాలు తెగి పోవటము, కుల టత్వము ( అంటే adultery ) విడాకులు, హింస, ఆత్మ హత్య లేక హత్య.
మనము కేవలం ఈ జీవ శక్తులకు బానిసలమా ? మనం మనలో ఈ జీవ శక్తులకు కారణమైన డీ ఎన్యే అంటే ‘ DNA ‘ నే మన పొరపాట్లకూ, మన విపరీత ప్రవృత్తికీ, కామ విశృంఖలతకూ బాధ్యులను చేస్తూ ఉందామా? వీటన్నిటికీ సమాధానం ఒకే ఒక్క పదం లో చెప్పవచ్చు: కాదు !
మానవుడు పరిణామం చెందుతున్న కొద్దీ అతడి లో ఉన్న మెదడు కూడా పరిణామం చెందుతూ ఉన్నది.
ప్రీ ఫ్రాన్టాల్ కార్టెక్స్ లేక ( pre frontal cortex ) కూడా పరిణామం చెంది అది మానవులు చేసే వివిధ క్రియలను హేతువాద బద్ధంగా చేయటానికీ ముఖ్య కారణం అవుతుంది.
ప్రీ ఫ్రాన్ టాల్ కార్టెక్స్ , మెదడు లో ఒక ముఖ్యమైన భాగం. ఈ భాగం మన నుదిటి వెనుకనున్న మెదడు భాగం. ఈ భాగం కంప్యుటర్ లోని ప్రాసెసర్ లాగా మనలో పని చేస్తుంది. ఈ భాగం మన మెదడు లోని మిగతా భాగాలతో అనుసంధానమై ఉంటుంది. మెదడు లో ఉన్న లేక వస్తున్న సమాచారాన్నంతా ఈ ప్రీ ఫ్రాన్ టాల్ కార్టెక్స్ ,
విచారించి, మంచీ, చెడూ విచక్షణ చూపి, హేతు వాద బద్ధం గా ఒక నిర్ణయం తీసుకునేట్లు చేస్తుంది. అలాగే భవిష్యత్తు కు సంబంధించిన పధకాలు వేసుకోవడం , వాటిని అమలు పరచడం లో కూడా ఈ ప్రీ ఫ్రాన్ టాల్ కార్టెక్స్ కీలక పాత్ర వహిస్తూంది.
ఈ ప్రీ ఫ్రాన్ టాల్ కార్టెక్స్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఈ భాగమే మానవులను కేవలం జీవ ప్రవ్రుత్తి తోనే ప్రేరేపింప పడకుండా, తమ విచక్షణా జ్ఞానాన్ని కూడా ఉపయోగించి తదనుగుణంగా కీలకమైన విషయాలలో సరి అయిన నిర్ణయాలు తీసుకునేట్లు చేస్తుంది.
అందు వల్లనే, ఆకర్షణ కు లోనైన వారందరూ విపరీతం గా ప్రవర్తించరు ! . ప్రేమించే వారందరూ కామ విశృంఖలత చూపరు !!. కామ వాంఛ ఉన్న వారందరూ హింసకు, అత్యాచారాలకూ పాల్పడరు !!. వివాహం చేసుకున్న వారందరూ విడిపోరు !!
ఇంకో విధం గా చెప్పాలంటే ‘ most humans are not just driven by their basic instincts, but by their intellect too !!
జీవ శక్తులు, సంస్కృతి- ఈ రెండూ ‘ nature and nurture ‘ గా మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మన హేతు వాద ఆలోచనా ధోరణి – ఈ మూడూ కూడా ఒకదాని మీద ఇంకొకటి ముడి పడి ఉంటాయి మనలో ! ఈ మూడు శక్తుల కలగలుపుల పరిణామమే మన నడవడిక, ప్రవర్తన.
అందు వల్లనే విపరీతమైన కోరికల అలలు చెలరేగినా, ప్రణయాకర్షణ, ప్రేమ, లేక అంతులేని కామవాంఛ లు ఉత్పన్నమైనా , వాటిని మనలో మనమే కనిపెట్టి , తగు నిర్ణయాలు హేతు బద్ధంగా తీసుకోగాలుగుతున్నాము .
అందు కే వివాహ వ్యవస్థ ఇంకా వర్దిల్లుతూంది ప్రపంచం లో !!!
తరువాతి టపాలో కామ వాంఛ గురించి తెలుసుకుందాము !!