కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.6.
మిగతా కామోత్తేజ స్థానాలు:
తల:
పెదవులు, నాలుక ఎంతో ముఖ్యమైన కామోత్తేజ స్థానాలు.
వీటిలో కూడా నాడీ కణాలు అత్న్యంత సాంద్రత లో అంటే ఎక్కువ గా ఉండి కామోద్రేకాన్ని కలిగిస్తాయి. పెదవుల తో సున్నితం గా ఆమె పెదవులను స్పృశించడం, అలాగే ఆమె మిగతా కామోత్తేజ స్థానాలను తాకడము, ఎక్కువ కామోద్రేకము కలిగిస్తుంది ఆమెలో !
నాలుక లో కూడా నాడీ తంత్రుల చివరలు,లేక మొనలు ఎక్కువ సంఖ్య లో ఉండి కామోద్రేకాన్ని కలిగిస్తాయి, నాలుక మనము నోటిలో ఉంచిన ఏ పదార్దాన్నైనా రుచి చూడటానికి ప్రత్యేకంగా నిర్మితమైనది. అనుభవజ్ఞులైన ప్రేయసీ ప్రియులు ముద్దాడుతున్న్నప్పుడు తమ నాలుకలు కూడా కలిపి ప్రణయ రుచులు కూడా ఆస్వాదించుతారు !
చాలా మంది స్త్రీలు, తమ తల మీది కురుల మొదళ్ళు తాకుతూ సున్నితంగా తలంతా అతడి వేళ్ళను నిదానంగా పోనిస్తే, చాలా రిలాక్స్ అయిన అనుభూతి పొంది అత్యంత కామోద్రేకులవుతారు.
పురుషులలో కూడా ఈ అనుభూతులు ఉంటాయి.
మెడ :
మెడ కు ఇరు ప్రక్కలా, ఇంకా క్రింద క్లావికల్ అంటే కాలర్ క్రింద ఉండే ఎముక, మెడ వెనుక భాగం కూడా అత్యంత సున్నితమైన నాడీ తంత్రులతో ఉంటాయి. ఈ స్థానాలను సున్నితంగా తాకితే కానీ, ముద్దాడితే కానీ, ముని వేళ్ళతో మాసాజ్ చేస్తే కానీ, లేక నాలుక తో ‘ ఆ స్థానాలను ‘ సర్వే ‘ చేస్తే కానీ అత్యంత కామోత్తేజం చెందుతారు.ప్రేయసీ ప్రియులు.
ఇక్కడ కూడా రసికులు కొద్దిగా గట్టిగా పంటి తో ఈ స్థానాలను ‘ బైట్ ‘ చేయించుకోదానికీ, లేదా చేయడానికీ వెనుకాడరు, ప్రత్యేకమైన ‘ లవ్ బైట్ ‘ కోసం!!
చెవులు :
కొంత మంది ప్రేయసీ ప్రియులు, చెవి లో గుస గుసలాడితే కానీ, శ్వాస వదిలితే కానీ, లేక చెవుల క్రింద భాగం లో, తాకినా, ముద్దిడినా లేక నాలుక తో ‘ రుచి’ రుచి చూసినా ఆనందానుభూతి, కామోత్తేజమూ పొందుతారు.
రొమ్ము :
స్థనాలు లేక పాలిండ్లు ( ఆంగ్లం లో బ్రెస్ట్ ) ప్రత్యేక మైన నాడీ కణజాలం తో నిర్మితమై ఉంటాయి. అవి అనియంత్రిత కండరాలతో అంటే స్మూత్ మసుల్ తో అమరి ఉంటాయి. చన్ను , ( లేక కుకుకము, లేక టీట్ లేక teat ) నుంచి స్తన్యం అంటే చను బాలు వస్తాయి. ఈ చనుబాలు చన్ను చుట్టూ ఉండే ప్రత్యేకంగా పరిణామం చెందిన పాల గ్రంధుల నుంచి వస్తాయి. ఈ గ్రంధులు కూడా ఎక్కువ నాడీ తంత్రులతో సంధించబడి ఉంటాయి.
స్థనాలు మొత్తమూ నాడీ కణజాలం తో అమరి ఉంటాయి. వాటి సంఖ్య స్థనం యొక్క పరిమాణం తో మారదు. అంటే సహజంగా పెద్ద స్థనాలను చూసి మగవారు చెందే ప్రణ యాకర్షణ మానసికమైనది. చిన్న పరిమాణం లో ఉండే స్థనాలు, పెద్ద పరిమాణం లో ఉండే స్థనాలతో పోలిస్తే ఎక్కువ సున్నితం అంటే సెన్సిటివ్ గా ఉంటాయి, నాడీ తంత్రుల సాంద్రత దృష్ట్యా ! ఎందుకంటే నాడీకణాల సంఖ్య మారదు కనుక .
చన్ను లేక టీట్ ను సున్నితంగా మాసాజ్ చేస్తే అందులోనుంచి ముఖ్యమైన హార్మోనులు అప్రయత్నంగా ఊట లాగా విడుదల అవుతాయి. ( మొదటి భాగం లో మనం తెలుసుకున్నాము , హార్మోనులు అంటే ఏమిటో ) వీటి పేర్లు ఆక్సీ టోసిన్ ( oxytocin ) ఇంకా ప్రోలాక్టిన్ ( prolactin ). ఈ హార్మోనులు ఆమె జాననాంగం మీద కూడా ప్రభావం చూపి, రతిక్రియ కు పురి గొల్పుతాయి.
ఉదరం అంటే అబ్డామెన్ ( abdomen ) మరియూ నాభి , లేక బొడ్డు ( navel ):
చాలా మంది లో పొట్ట అంటే ఉదర భాగాన్ని, సున్నితంగా తాకినా, వేళ్ళ గోళ్ళతో సున్నితంగా గీరినా, ఆ స్థానాన్ని ముద్దు పెట్టుకున్నా, లేక నాలుక తో స్పర్శించినా లేక పొదివి పట్టుకున్నా , అంతులేని ప్రణ యానంద అనుభూతులు ఉప్పొంగి , వారు కామోత్తేజం పొందుతారు.
ప్రత్యేకించి ప్యుబిక్ స్థానానికి దగ్గర గా ఉన్న ఉదర భాగం లో ఈ ప్రతిక్రియానుభూతులు ఎక్కువ గా ఉంటాయి.
ఈ విధంగా ప్రేరేపితమైన కామోత్తేజం , మగ వారిలో కానీ, ఆడ వారిలో కానీ చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఇంటెన్స్ గా. ఈ తీవ్రత, జననాంగాలను, ప్రేరేపితం అంటే స్టిములేట్ చేసినదానికంటే కూడా ఎక్కువ గా ఉండ వచ్చు.
నాభి స్థానం : రతిక్రియ రీత్యా, నాభి స్థానం ఎంతో శక్తివంతమైనది. ఈ స్థానం కూడా అతి సున్నితమైన నాడీ తంత్రులతో నిర్మితమై ఉంటుంది.
వేళ్ళ స్పర్శ తో కానీ, నాలుక చివర తో కానీ నాభి ‘ వీణను ‘ సున్నితంగా మీటితే కోటి ‘ రతి రాగాలు’ పలుకుతాయి !
( ఈ విషయం కూడా మన సినీ దర్శకులకు ‘ శతాబ్దాల క్రితమే ‘ తెలుసు కదా ! )
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్ గాయని మడోన్నా ఒక ఇంటర్వు లో ఇలా చెప్పింది ‘ నేను నా వేలును నా నాభిలో ఉంచుకున్నప్పుడు , నాకు ఒక నాడీ తంత్రి ఒక్కసారిగా నా ‘ దేహం ‘ లో ‘ మధ్య భాగం ‘ నుంచి నా వెన్నెముకకు షూట్ అయినట్లు అనుభూతి పొందుతాను ‘
ఇలా జరగటం ఎందుకంటే నాభి కూడా జననాంగాలు నిర్మితమైన కణజాలం తోనే నిర్మింప బడ్డది.
స్థనాలను ప్రేరేపించడం ఎలాగో ఈ కన్య మాటలలో వినండి !! ( ఇది యు ట్యూబ్ వీడియొ )
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !