కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.7.
ఇంకొన్ని కామోత్తేజ శరీర స్థానాలు:
ముంజేతులు: ( arms) :
ముంజేతుల లోపలి ప్రదేశం అంతా ఎక్కువ సెన్సిటివ్ నాడీ కణ తంత్రులతో ఆవరించి ఉన్నది. ఈ ప్రదేశం కూడా, ప్రియుని వేళ్ళ స్పర్శ తో కానీ, వేళ్ళతో కలిగించిన వత్తిడి చేత కానీ, అంటే గట్టిగా ‘ పిసుకు తున్నట్టు ‘ అంటే ‘ kneading ‘ like pressure’ , లేక పెదవులతో చుంబనం చేసినప్పుడు కానీ, లేక నాలుక చివరతో ఈ ప్రదేశాన్నంతా తాకి నప్పుడు కానీ, ఎంతో కామోత్తేజం చెంది, తీవ్రమైన కామ వాంఛ తో రతిక్రియ కు సంసిద్ధ మవుతుంది ఆమె. ఈ చర్యలు ఆమె లో ‘ ఆర్గాసం ‘ కూడా కలిగించవచ్చు ఆమెలో ! అంటే ఆమె జననాంగాలను తాకిన అనుభూతి కలుగుతుంది, ముంజేతుల కామోత్తేజం తోనే !! అలాగే అతడిలో కూడా తీవ్రమైన కామోత్తేజం కలిగి వీర్య స్ఖలనం కూడా అవవచ్చు.
బాహు మూలాలు ( arm pits ):
కొంత మంది బాహు మూలాలు కూడా కామోత్తేజ కరమని భావిస్తారు.
‘George Preti, organic chemist, ఇంకా , Winifred Cutler, psychologist చేసిన పరిశోధనలలో , బాహుమూలాలనుంచి స్రవించిన పదార్ధాన్ని కొంతమంది స్త్రీలకు ఒక క్రమ పధ్ధతి లో వాసన చూపితే, వారిలో అంత వరకూ సరిగా లేని ఋతు క్రమం అంటే ‘ menstrual cycle’ , తరువాత ఒక క్రమం లో రావటం గమనించారు. దీనికి కారణం బాహు మూలాలలో ప్రత్యేకం గా మార్పు చెందిన స్వేద గ్రంధులు ‘ Pheromones ‘ అనే హార్మోనులను ఉత్పన్నం చేస్తాయి. ఈ ఫిరమోనులు కామోత్తేజం కలిగించే హార్మోనులు.
ఇవి ప్రణ యాకర్షణ కలిగిస్తాయి. మనకు మార్కెట్ లో లభించే అనేక రకాలైన డీ ఓడరెంట్లు ( deodourant sprays ) అన్నీ ఈ ఫిరమోనులను అనుకరించే కృత్రిమ రసాయనాలే !
చేతి వేళ్ళు ( fingers ) : నాలుక తరువాత, మన శరీరం లో అత్యంత సెన్సిటివ్ స్థానాలు మన చేతి వేళ్ళు . ఇవి నాడీ కణాలు ఎక్కువ సంఖ్య లో నిర్మితమై ఉంటాయి. అందు వల్లనే కొద్దిగా, అతి సున్నితం గా తాకినా, వెంటనే స్పందిస్తాయి వేళ్ళు.
ప్రణయ భావాలను వేళ్ళలో గమనించ గలరు కొందరు రసికులు.
పాదాలూ, బొటన వేళ్ళు : ( feet and toes ):
పాదాలూ, బొటన వేళ్ళు కూడా కామోత్తేజ స్థానాలే. ఈ ప్రదేశాలలో కూడా అతి సున్నితమైన అంటే సెన్సిటివ్ నాడీ కణజాలం ఉంటుంది. కాక పొతే, ఈ స్థానాలలో కొద్దిగా గట్టి వత్తిడి అంటే ‘ firm pressure ‘ తో కామోత్తేజం కలుగుతుంది కొందరిలో. చాలా మంది లో పాదాల అడుగు ల లో అంటే పాదం క్రింద స్థానం ప్రేరేపిస్తే అంటే స్టిములేట్ చేస్తే గిలిగింతలు గా అంటే ticklish గా ఉంటుంది.
‘ ఫ్రెంచ్ కిస్ ‘ అంటే ఏమిటో ఈ భామల మాటలలో వినండి, సరదా గా ఉంది, ఈ యు ట్యూబ్ వీడియో !
తరువాతి టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము.