ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.7.
ప్రేమ :
ఇంత వరకూ టపాలలో ఆకర్షణ, ప్రత్యేకించి ప్రణ యాకర్షణ గురించి, వివరం గా తెలుసుకోవటం జరిగింది.
ఈ ప్రణయాకర్షణ, క్రమంగా ప్రేమ గా పరిణమించినప్పుడు వచ్చే మార్పులు ఇప్పుడు తెలుసుకుందాము.
ప్రేమ, లేక ‘ compassionate love ‘ , పక్షులలోనూ, మిగతా స్తన్య జంతువులలోనూ గమనించినప్పుడు , అవి పరస్పరం, ఆహారం పంచుకోవడము, గూడు కలిసి కట్టుకోవదమూ, తమ తమ పరిధులు నియంత్రించు కోవటము, విడిపోయినప్పుడు ఆందోళన చెందటము, తమ పిల్లలను కలిసి పెంచడం లాంటి క్రియల లో కనిపిస్తుంది.
మానవులలో ప్రేమ , ఒక విధమైన ప్రశాంతత గాను, పరస్పర మనోభావ సంగమం గానూ , ఒక సాంఘిక అనుకూలత గానూ, ఒక సురక్షణ వలయం గానూ కనిపిస్తూంది.
ప్రేమలో ఒక రకమైన అనుబంధత ఏర్పడుతుంది ప్రేయసీ ప్రియుల మధ్య. దీనినే ‘ అటాచ్మెంట్ ‘ అని కూడా అనవచ్చు మనము.
ఈ రకమైన అనుబంధానికి ఆమె లో ఆక్సీ టోసిన్, అతనిలో వాసోప్రేస్సిన్ అనే జీవ రసాయనాలు కారణం. ఈ ఆక్సీ టోసిన్ , వాసో ప్రేస్సిన్ లను న్యూరో పెప్టైడ్స్ అని కూడా అంటారు.
ఆకర్షణ, లేక ప్రణయాకర్షణ, ప్రేమ గా తప్పకుండా మారనవసరం లేదు. కొన్ని పరిస్థితులలో కామోద్రేకం మొదట కలిగి, రతి క్రియ తరువాత, భావ ప్రాప్తి జరిగి ( అంటే ‘ orgasm ‘ ), అతడిలో వాసో ప్రేస్సిన్ విడుదల అయి తద్వారా, ఆమె పైన అనుబంధం అభి వృద్ధి చేసుకో వచ్చు. అంటే అతను మొదట సంబంధాన్ని ఆమె తో ఏవిధమైన ప్రణయాకర్షణ లేకుండా మొదలెట్టవచ్చును. శారీరిక సంభంధం ఏర్పడినాక, అతను గాఢమైన అనుబంధం అంటే ప్రేమానుబంధం ఏర్పరుచుకో వచ్చును. ఇలా జరగటానికి అతనిలో విడుదల ఆయే వాసోప్రేస్సిన్ కారణమని చెప్పవచ్చు.
శాస్త్రీయం గా చెప్ప్పలంటే, ప్రణ యాకర్షణ, ప్రేమ, మరియూ కామ వాంఛ లకు మూడు ప్రత్యేకమైన నాడీ వలయాలు మానవులలో ఉండి పని చేస్తాయి. కొన్ని పరిస్థితులలో ఈ మూడు నాడీ వలయాలు
( అంటే ‘ neural circuits ‘ ) ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా మనమీద ప్రభావం చూపించవచ్చు. అలాగే కొన్ని పరిస్థితులలో ఒక దానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉండవచ్చు.
కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం లో జరిపిన ఒక పరిశోధనలో నూట ఎనభై పక్షి జాతులలో కేవలం పది శాతం పక్షులు తాము మొదట కలిసి, సంగమించిన వాటితోనే జీవితం గడుపుతాయి, కానీ మిగతా తొంభై శాతం పక్షులు , ఇతర పక్షులతో కూడా సంగమిస్తాయని తెలిసింది.
ఈ విధంగా ఎప్పుడూ కలిసి ఉంటున్న పక్షులతో కాక, ఇతర పక్షులతో సంబంధము పెట్టుకోవడం జీవ పరిణామ రీత్యా , వాటి ప్రత్యుత్పత్తి అవకాశాలను వీలైనంత ఎక్కువ చేసుకోవడానికి అని భావించడం జరుగుతుంది.
కాలక్రమేణా మానవులలో కూడా ఈ లక్షణాలు పరిణామం చెందాయి. మానవులు ఒకరితో ప్రేమానుభంధం తో జీవిస్తూ కూడా, ఇతరులతో ప్రణయాకర్షణ వలలో చిక్కుకో గలగటానికి ఇదే కారణం. అంటే మానవులు స్వాభావికంగా అనేక మంది తో సంబంధాలు పెట్టుకోగలిగి ఉంటారు. కేవలం సాంఘిక కట్టుబాట్ల వల్ల, ఒక్కో ప్రాంత సంస్కృతి, ఆచార వ్యవహారాల వల్ల వారి ప్రవర్తన సరిఐనది గానూ, లేక తప్పు గానూ వ్యాఖ్యానింప బడుతుంది.
ఈ స్పష్టమైన మూడు రకాల నాడీ వలయాలూ , నవీన మానవ జీవితాన్ని అనేక విధాలు గా క్లిష్టతరం చేశాయని చెప్ప వచ్చును.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న, ప్రబలుతున్న విడాకుల సంఖ్య కూ , కామ విశృంఖలతకూ, ఏక పతీ, లేక ఏక పత్నీ వ్యవస్థ చెదరి పోతూ ఉండటానికీ, ‘ అనైతిక జీవనానికీ , గృహ హింస కూ,
ప్రియురాలినీ, ప్రియుడినీ, చాటు గా ఉండి అనుసరించటము, అంటే ‘ stalking ‘ , కామ అసూయ , అంటే ‘ sexual jealousy ‘ , డిప్రెషన్ , ఆత్మ హత్య, హత్యలు , వీటన్నిటికీ మనలో ఉన్న ఈ నాడీ వలయాలు, కొంత వరకు కారణమని జీవ పరిణామ శాస్త్ర వేత్తలు , సాంఘిక మనో విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే టపాలో ‘ ప్రేమ ‘ గురించి ఇంకొన్ని విషయాలు చదవండి!!.