Our Health

Archive for నవంబర్ 21st, 2013|Daily archive page

చదువుకోవడం ఎట్లా ? 8. చదువుకు పధకమేమిటి ? ( ఐదు వందలవ టపా ! )

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 21, 2013 at 7:06 సా.

చదువుకోవడం ఎట్లా ?8. చదువుకు పధకమేమిటి ?

టైం చార్ట్ వేసుకోవడం : 
ముందుగా , ఒక వారం రోజుల కోసం, మీ రోజు వారీ కార్యక్రమాలను రాసుకోండి ! ఉదాహరణ కు : సోమ వారం , ఉదయం 6 గంటలకు లేవడం , ఒక గంట చదువుకోవడం ,   స్నానాదికాలు ముగించుకోవడం , ఫల హారం ( బ్రేక్ ఫాస్ట్ ) చేయడం , స్కూలు కు బయలు దేరడం  నాలుగు గంటలకు ఇంటికి బయలు దేరడం 5.30 సాయింత్రానికి, ఇంటికి చేరుకొని , 7 గంటల వరకూ ఆడుకుని , ఏడున్నర కు భోజనం చేసి తొమ్మిదిన్నర వరకూ చదువుకోవడం ! పదింటికి పడుకోవడం !   స్కూల్ కు వెళ్ళే రోజుల్లో ఇంచు మించుగా ఇట్లాగే ఉంటుంది కదా, రోజు వారీ కార్యక్రమం !  ప్రతి రోజూ , ప్రతి పనికీ పట్టే సమయం ఎంత అవుతుందో , ఏ టైం నుంచి ఏ టైం వరకూ ఆ పని చేస్తున్నారో కూడా  ఒక నోట్ బుక్ లో ( అతి చౌక అయిన డైరీ కదా ! ) తేదీ లవారీ గా రాసుకోవడం చేయాలి !  ఇక శలవు దినాల్లో , కుటుంబ సభ్యులతో , గడపడం , బయటకు వెళ్ళడం , లాంటివి  చేర్చ వచ్చు !  ఒక వారం రోజులు ఇట్లా  చేసి , తీరిక గా పరిశీలించు కుంటే , ఏ  ఏ  పనులకు ఎంత సమయం వెచ్చిస్తున్నారో స్పష్ట పడుతుంది ! మనకు కావలసినది ఏమిటి ? ఇట్లా పరిశీలించిన డైరీ లో ఎన్ని గంటలు , వారానికి , ఇంటి దగ్గర చదువు కోవడానికి కేటాయిస్తున్నారో తెలుస్తుంది ! అంటే , మీ చదువు అవసరాలకు , ఈ సమయం సరిపోతుందో లేదో మీకు తెలుస్తుంది !  ఇప్పుడు మీరు రోజూ ఎన్ని గంటలు , చదువు కు  ఉపయోగించాలో నిర్ణయించుకోవాలి ! అంటే , సోమ వారం రెండు గంటలు అవుతే , మంగళ వారం మూడు గంటలు , బుధ వారం ఒక గంట , గురు వారం మూడు గంటలూ , ఇట్లా , ఒక క్రమ పధ్ధతి లో చదువుకు కేటాయించాలి. గమనించ వలసినది ,  ఈ గంటలు , సామాన్యం గా స్కూల్ లో చదివే సమయం కాకుండా ! 
ఇప్పుడు మీ చదువు లక్ష్యాలు నిర్ణయించు కోండి :  ఒక సారి మీరు , రోజూ , ఇంటి దగ్గర , కొన్ని గంటలు చదవాలని అనుకున్నాక , వారం మొదటి రోజున , మీ చదువు లక్ష్యాలు  నిర్ణయించుకోండి . ఈ లక్ష్యాలు  అనేక రకాలు గా ఉండ వచ్చు !  సాధారణం గా , ఒక క్రమ పధ్ధతి లో రోజూ చదివేది ,  ఏ రోజు క్లాస్ లో చెప్పిన పాఠాలు , ఆరోజు , ఇంటి దగ్గర చదువు కోవడానికి, లేదా పరీక్షల ముందు , పరీక్షలకు సిద్ధం అవడానికి , లేదా ,  కాస్త కష్టం గా అనిపించిన సబ్జెక్ట్ లు ఇంకాస్త శ్రద్ధ గా చదవడం కోసం ! లేదా  ఎంట్రెన్స్ పరీక్షలకు సిద్ధం అవడం కోసం !  ఇట్లా దేనికోసం అయితే చదువుదామను కుంటున్నారో , ఆ లక్ష్యం కోసం, మీరు కేటాయించిన సమయం లో ఏమేం చేయాలనుకుంటున్నారో కూడా నిర్ణయించుకోండి ! ఉదా:  లెక్కల పరీక్ష కు కనుక సిద్ధం అవుతూ ఉంటే ,   ఒక అయిదు అధ్యాయాలు ఉన్న లెక్కల సబ్జెక్ట్ లో ప్రతి అధ్యాయం లో లెక్కలను నేర్చుకోవడానికి , రోజూ ఒక గంట  ఉపయోగించడం చేయ వచ్చు !  బాగా కష్టం అనిపిస్తే , మీరే ఆ సమయాన్ని రెండు గంటలు గా మార్చుకోవచ్చు ! లేదా ఇంగ్లీషు సబ్జెక్ట్ అవుతే , గ్రామర్ కోసం వారం లో రెండు గంటలు , వ్రాత ప్రాక్టిస్ చేయడానికి వారం లో ఒక గంట , ఇట్లా మీ మీ అవసరాల బట్టి , మీరు సమయాన్ని  వెచ్చించడం నిర్ణయించుకోవాలి ! ఇట్లా వేసుకున్న చదువు పధకాన్ని, మీరు క్రమం తప్పకుండా ,కనీసం,  కొన్ని వారాలు ఆచరించడం అలవాటు చేసుకోవాలి ! అప్పుడు , మీకు  ఏమైనా మార్పులు అవసరం అవుతాయో లేదో తెలుస్తుంది !   ఆ తరువాత   మీకు నచ్చితే , అంటే మీకు బాగా ఉపయోగ పడుతుంటే , ఆ పధ్ధతినే కొనసాగించ వచ్చు ! 
మరి సమయం అంతా చదువు కేనా ? : 
విద్యార్ధి దశ జీవితం లో అతి ముఖ్యమైన దశ !  అతి ఆనంద దాయకమైన దశ కూడా ! ఎందుకంటే , నూటికి తొంభై శాతం మంది విద్యార్ధులకు ,  డబ్బు సంపాదించడం గురించి ఆలోచించ నవసరం లేదు ! వారి తల్లి దండ్రులు అవసరమైన డబ్బును సమకూరుస్తారు ! విద్యార్ధులు గా చేయవలసినది బాగా చదువుకోవడమే !  ఇంకా ఆనందించడం !   చదువును అశ్రద్ధ చేయకుండా ,  మిగతా వ్యాపకాలను కూడా విద్యార్ధులు కొనసాగించాలి , కేవలం, పుస్తకాల పురుగుల్లా ఉండక !  వారి మిత్రులతో కలిసి సమయం గడపడమూ , కుటుంబ సభ్యులతో గడపడమూ , వారి  ప్రత్యేకమైన హాబీలు ఉంటే వాటిని కొన సాగించ డమో , లేదా అభివృద్ధి చేసుకోవడమో కూడా చేయాలి ! తప్పని సరిగా !  ఇంకో  ముఖ్యమైన అశ్రద్ధ చేయకూడని విషయం : తమ ఆరోగ్యం ! అంటే క్రమం తప్పకుండా , వ్యాయామం చేయడమూ , వారికి ఇష్టమైన ఆటలు ఆడడమూ కూడా కొనసాగించాలి , అందుకు ఒక క్రమ పధ్ధతి లో సమయం కేటాయించాలి కూడా వారి డైరీ లో ! అప్పుడే , విద్యార్ధి దశ ఆనంద దాయకం అవుతుంది ! 
కంప్యూటర్ లు ఉన్న విద్యార్ధులు ఈక్రింద చూపిన సైట్ కు వెళితే ,  ఆన్ లైన్ లోనే మీ డైరీ వాడుకోవచ్చు ! ఉచితం గా !
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

 
%d bloggers like this: