Our Health

Archive for నవంబర్ 24th, 2013|Daily archive page

చదువు కోవడం ఎట్లా ? 11. సమయ పాలన లో మిగతా విషయాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 24, 2013 at 10:56 ఉద.

చదువు కోవడం ఎట్లా ? 11. సమయ పాలన లో మిగతా విషయాలు ! 

Students in the village of Tahipur in Bihar used kerosene lanterns for studying.

చదువుకునేందుకు చోటు ఎట్లా ఉండాలి ? 
సామాన్యం గా  విద్యార్ధులు, తమ తోటి విద్యార్ధులతో , కేవలం చదువు మాత్రం తప్ప , మిగతా విషయాలన్నీ మాట్లాడడమూ ,  అంటే  క్యాంటీన్ లో గప్పా లు కొట్టడమూ , సినిమాలో సరదా గా ఎంజాయ్ చేయడమూ , రోడ్ల మీద  నడిచి కానీ వివిధ రకాలైన వాహనాలలో కానీ, తిరగడమూ చేస్తారు ! అవన్నీ , విద్యార్ధి దశలో సామాన్యమైనవే ! కానీ చదువు  విషయానికొస్తే , తమ చదువు తాము , ఏకాంతం గా చదువుకోవడం చేస్తారు ! కొంత వరకూ , తమ అసలు ‘ సరుకు ‘ ఎక్కడ బయట పడుతుందో అని అనుకుంటూ ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది !  ఆ ‘ సరుకు ‘ వారు బాగా చదువుతున్న వారవుతే , విలువైనది గానూ , చదువు అశ్రద్ధ చేసే వారైతే , విలువ ఎక్కువ లేనిది గానూ ఉంటుంది ! కొంత మంది విద్యార్ధులు , తాము బాగా చదువుతున్నామని ఇతర విద్యార్ధులకు తెలిస్తే , వారు గేలి చేస్తారనీ , ఆట పట్టిస్తారనీ , చదువు విషయం ఏమీ బయటకు చెప్పుకోరు ! కొందరు విద్యార్ధులు ఇతర విద్యార్ధులకు ఎక్కువ విషయాలు తెలియక పొతే , లేదా వారు కొన్ని సబ్జెక్ట్ లు కష్టం గా ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటే ,తమకు , ఆ సబ్జెక్ట్ బాగా బోధ పడుతున్నా కూడా , ఆ సంగతి తెలియ చేయకుండా , మిగతా వారితో వంత పాడతారు ! తమకూ ఆ సబ్జెక్ట్ కష్టం గా ఉన్నట్టు ! కానీ పరీక్షలో అత్యధికం గా మార్కులు సంపాదించు కుంటూ ఉంటారు ! 
మరి చదువుకునేందుకు చోటు ఎట్లా ఉండాలి ?  విద్యార్ధుల మనస్తత్వాలు, ఎవరివి ,  ఎట్లా ఉన్నా కూడా , కనీసం ముగ్గురు కానీ అంత కన్నా ఎక్కువ మంది కానీ , కలిసి చదువుకోవడం ఉత్తమం ! మరీ ఎక్కువ మంది అయితే , ప్రయోజనం ఉండదు ! అది ఒక క్లాస్ రూం లా తయారవుతుంది ! ప్రత్యేకించి,  ఏకాంతం గా చదివే విద్యార్ధులు కూడా , ఇట్లా  స్కూల్ లోనూ , కాలేజీ లోనూ చేరిన వెంటనే , ఇట్లా తమ కు నచ్చిన వారితో ఒక గ్రూప్ ను ఏర్పరుచుకోవడం మంచిది !   ఇంటి దగ్గరే ఉంటున్న వారూ ,  హాస్టల్ లో ఉంటున్న వారూ , లేదా  కాలేజీ లో కలిసే వారూ,ఇట్లా ఎవరి వీలు ను బట్టి వారు,  గ్రూప్ ను ఏర్పరుచుకోవాలి ! 
గ్రూప్ వల్ల ప్రయోజనాలు ఏమిటి ?  : ఒక స్థిరమైన, ఉత్సాహ భరితమైన , ప్రేరణా పూరితమైన ,  చదువు వాతావరణం ఏర్పడుతుంది !  పోటీ తత్వం పెరుగుతుంది !  ఇతర విద్యార్ధులు ఓపెన్ గా అన్ని విషయాలూ చర్చించు కుంటూ ఉంటే , ఆత్మ విశ్వాసం పెరుగుతుంది ! ముఖ్యం గా చదవాలనీ ,  బాగా మార్కులు తెచ్చుకోవాలనీ కూడా పట్టుదల పెరుగుతుంది !   మంచి స్నేహితులు గా మారే అవకాశం ఉంది ! వారి మనస్తత్వాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జీవిత గమనం లో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ! అంటే ఒకే దేశం లో పని చేయడమో , లేదా ఒకే సంస్థ లో పనిచేయడమో  కూడా జరగవచ్చు , చాలా సందర్భాలలో !  ఆత్మ న్యూనతా భావం తగ్గి పోతుంది ! డిప్రెషన్ కు అవకాశాలు తగ్గుతాయి ! వారికి తెలియ కుండానే , ఇతర స్నేహితులను గౌరవించడం , వారి అవసరాలకు కూడా ప్రాధాన్యత నివ్వడం , అలవాటు అవుతాయి ! ఈ గుణాలు , ముందు ముందు , వారు చదివే పై చదువుల్లోనూ , లేదా చేయ బోయే ఉద్యోగాల్లో నూ ఎంత గానో ఉపయోగ పడతాయి !  ఇట్లా , ఎన్నో లాభాలున్నాయి , కలిసి చదువుకుంటే ! 
కలిసి చదువుకుంటే, కలిగే చెడు ప్రభావాలు ఏమిటి ? :  చాలా సమయాలలో , ఆ గ్రూప్ లో ఉన్న ఒక్కరైనా స్మోకింగ్ అలవాటు చేసుకుంటే ,  ఆ ప్రభావం మిగతా విద్యార్ధుల మీద పడుతుంది !  ఒకటి : వారు తమ సహ విద్యార్ధులు స్మోకింగ్ చేస్తుంటే , తాము చెయ్యట్లేదు , ఆ గ్రూప్ లోనుంచి వెలి వేస్తారనే భయం తో , మానసిక వత్తిడి తో , వారూ స్మోకింగ్  మొదలు పెట్టే ప్రమాదం ఉంది ! ఒక వేళ , మొదలు పెట్టక పోయనా , గ్రూప్ లో ఉన్న ఇతర విద్యార్ధులు స్మోకింగ్ చేస్తుంటే , ఆ స్మోక్ తమకు సోకి , వారూ వివిధ రోగాలూ , క్యాన్సర్ ల బారిన పడే ప్రమాదం ఉంది ( దీనిని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు , ఇది శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! ) ఇట్లా గే మిగతా చెడు అలవాట్లు కూడా ! ఈ అలవాట్లు లేని విద్యార్ధులు , మొదటి దశాలలోనే అప్రమత్తమవాలి !  జాగ్రత్త గా, ఈ అలవాట్లు లేని వారితోనే , జత కట్టాలి ! గమనించ వలసినది , మీరు కేవలం , ‘ ఆ అలవాట్లను ‘ మాత్రమే , అసహ్యించు కుంటున్నారు !  ఆ అలవాట్లున్న మీ స్నేహితులను కాదు ! ఇక ఇట్లా జత కట్టిన వారు, చదువుకోవలసిన చోట్లు అనేకం అవ్వచ్చు !  స్కూల్ లైబ్రరీ , కాలేజీ లైబ్రరీ , లేదా ఒక మాదిరి గా బిజీ గా ఉన్న కాఫీ హోటల్ , లేదా క్యాంటీన్ , ఇట్లా ఏ  స్థలమైనా  పవిత్రమవుతుంది , ఏకాగ్రత తో మీరు అక్కడ  చదువు కొన సాగిస్తే !  ఒక్కో చోటు,  మీ స్మృతి పధం లో శాశ్వతం గా , మీ జీవితాంతం ఉండి పోతుంది , మీరు  ప్రయోజకులయ్యాక ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
( మీకు తెలుసా?  ఈ టపా మీకు నచ్చితే , ప్రింట్ చేసుకోవచ్చు ! నచ్చక పొతే ,తెలియ చేయ వచ్చు ! ఈ టపా మీద, ‘మీ ప్రత్యేకమైన  ముద్ర ‘ వేయండి ! మీ స్పందన తెలియ చేయండి ! మన తెలుగు లో కానీ , ఆంగ్లం లో కానీ ! )
%d bloggers like this: