Our Health

Archive for నవంబర్ 29th, 2013|Daily archive page

చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 29, 2013 at 5:50 సా.

చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?  

పోలికలు మంచిదే ! :
క్రితం టపాలో, నోట్సు ఎట్లా తీసుకోవాలనే విషయం చాలా వరకూ తెలుసుకున్నాం కదా !   విద్యార్ధులు, కేవలం వారి కోసమై నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకున్నా , ఇంకొన్ని ముఖ్యమైన విషయాల మీద కూడా దృష్టి పెడితే , వారు రాసుకున్న నోట్సు తో అత్యధికం గా లాభం పొందుతారు ! ఆ విషయాల లో ఒకటి ,  తాము రాసిన నోట్సు ను , తోటి విద్యార్ధుల నోట్సు తో పోల్చుకోవడం. ఇట్లా చేయడం వల్ల అనేకమైన ఉపయోగాలున్నాయి ! సామాన్యం గా , ఒక విద్యార్ధి , కేవలం తను ఒక రోజో లేదా కొన్ని రోజులో , స్కూలు కు కానీ , కాలేజీ కి కానీ వెళ్లక పోవడం వల్లనే , ఇతర స్నేహితుల వద్దనుంచీ , తోటి విద్యార్ధుల నుంచీ ,నోట్సు తీసుకుంటారు !  కానీ ఈ అలవాటును ఒక క్రమ పధ్ధతి లో చేస్తే , అంటే ,  ప్రతి వారమూ , తోటి విద్యార్ధుల నుంచి నోట్సు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి !  ఈ పధ్ధతి తో , తాము మిస్ అయిన ముఖ్యమైన విషయాలను ఇతర విద్యార్ధుల నోట్సు తో  పోల్చుకుని , ఆ పాయింట్స్ కూడా  తమ నోట్సు లో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ! ముఖ్యం గా, తోటి విద్యార్ధులు ఆ పాఠాన్ని ఎట్లా అర్ధం చేసుకుంటున్నారు ? , తమ కన్నా భిన్నం గా ? అని ఒక అంచనా కూడా వేసుకోవచ్చు !  తమ నోట్సు ను ఆ రకం గా ఇంకా బాగా రాసుకోవడం చేయవచ్చు !  వారు పాఠాన్ని వినే సమయం లో ఇంకేవైనా విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలా లేదా అన్న విషయం కూడా వారికి బోధ పడుతుంది , ఇతర విద్యార్ధుల నోట్స్ తో వారి నోట్స్ ను పోల్చుకుంటే !  వారిలో స్నేహ భావం కూడా అలవడుతుంది ! పోటీ స్వభావం కూడా పెంపొందుతుంది !  ఈ పోటీ , కేవలం ఒక ఆరోగ్యదాయకమైన పోటీ గానే ఉండాలి కానీ , అసూయా ద్వేషాలకు  అవకాశం ఇవ్వ కూడదు ! 
సమీక్షించడం ( రివ్యూ ) , మళ్ళీ మళ్ళీ రాసుకోవడం ! మెరుగులు దిద్దడం : 
ఒక సారి,  ప్రతి పాఠం చెప్పే సమయం లోనూ నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకున్నాక ,  ఇంకో అతి ముఖ్యమైన విషయం కూడా విద్యార్ధులు ఎప్పుడూ గుర్తు ఉంచుకోవాలి !  అది, నోట్సు రాసుకోవడం  అనేది ఒక్క సారి చేశాక , మీ పని అయి పోయిందని , చేతులు దులుపు కో కూడదు ! అంటే ఒక సారి రాసిన నోట్సు , ఫైనల్ కాకూడదు !   ఇంటికి వచ్చాక , ఆ నోట్సు ను అనేక సార్లు సమీక్షించుకోవాలి ! అంటే , ఆ విషయం మీద, మీరు రాసుకున్న నోట్సు , సంపూర్ణం గా ఉందో లేదో , తరచి చూసుకుంటూ ఉండాలి !  ఇట్లా చూసుకోవడం, అనేక మార్లు చేయాలి , అవసరమైతే !   ఈ చర్యలో పైన ఉదహరించిన , ఇతర విద్యార్ధుల నోట్సు తో పోలికే కాక ,ఒక పాఠ్య పుస్తకం నుంచి కూడా రిఫర్ చేసి  కొన్ని ముఖ్యమైన  విషయాలను , నోట్సు లో రాసుకోవచ్చు ! అంతే కాక , మీరు రాసుకున్న విషయాలను ఒక  పధ్ధతి లో  ఆర్గనైజ్ చేసుకోవాలి మీరు మీ నోట్సు లో !  ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే , మీరు రాసుకున్న నోట్సు సులభం గా అర్ధం అవుతుంది !   కొన్ని సమయాలలో మీరు కొన్ని పటాలు కూడా చేర్చు కోవలసిన అవసరం ఉండ వచ్చు , మీ నోట్సు లో !   మీరు, మళ్ళీ ,మళ్ళీ, నోట్సు ను రివైజ్ చేసి, కుదించి , మెరుగులు దిద్దుతూ ఉండడం వల్ల , మీకు   మీరు రాసుకున్న నోట్సు లో ఉన్న విషయాలు చాలా వరకు అర్ధం కావడమే కాక , మీరు ఎక్కువ కాలం గుర్తు ఉంచుకో గలుగుతారు కూడా  !  ఇట్లా చేయడం అలవాటు చేసుకుంటే , విద్యార్ధులకు చిన్న తనం నుంచే , తాము ( పాఠం లో ) గ్రహిస్తున్న విషయాలను , తరచి చూసి , సునిశితం గా పరిశీలించే , పరిశీలనా జ్ఞానం కూడా పెంపొందుతుంది !  చదివే ఏ చదువు లక్ష్యం అయినా అదే కదా !   చివరగా , ఇట్లా  మీరు శ్రమ పడి , అనేక రకాలు గా విషయాలను సేకరించి , రాసుకున్న నోట్సు ను  జాగ్రత్తగా , ఒక ఫైల్ లో నో ఫోల్డర్ లోనో  , బైండర్ లోనో పెట్టుకోండి !
నోట్సు   తీసుకోవడం ఎప్పుడూ, ఒక పధ్ధతి గా ఎట్లా చేయాలో సులభం గా గుర్తుంచు కోవడానికి    5R లు అంటే అయిదు R లు :  Record,Reduce, Recite, Reflect, and Review  ఉపయోగ పడతాయి , విద్యార్ధి జీవితం లో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: