విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?. 2.

3. మీ ఆలోచనా ధోరణి ని మార్చు కోవడం : తరువాతి దశ లో, మీ ఆలోచనలను మార్చుకోవడం చేయాలి ! ‘ నా ఆలోచనలు నావే , నా ఆలోచనలు ఎన్నటికీ మార్చుకోను !’ అని మంకు పట్టు పట్టి కూర్చుంటే , విరహ వేదన , ఆనందం గా మారదు ! మార్చుకోవడానికి ప్రయత్నాలు చేసే ముందు , మీ ఆలోచనా ధోరణి ని అంచనా వేసుకోవడం కూడా మీరే చేయాలి ! మన జీవితాలలో , క్లిష్ట మైన పరిస్థితులు ఏర్పడినప్పుడు , మన ఆలోచనా ధోరణిని బట్టే , మన క్యారెక్టర్ అంటే మన ధృ ఢ చిత్తమూ , అంటే మన శీలతా తెలుస్తాయి ! ఆ పరిస్థితులలో నిరాశా జనకమైన ఆలోచనలు రావడం సహజం ! ఈ నిరాశా జనకమైన ఆలోచనలను నెగెటివ్ కాగ్నిషన్ లు అని అంటారు ! ఈ ఆలోచనలు ఒక సుడి గాలి లా వస్తాయి ! ప్రత్యేకించి , ప్రేమ విఫలం అయినప్పుడూ , లేదా పరీక్షలో విఫలం అయినప్పుడూ , లేదా ఇతర సంఘటనలు మానసికం గానూ శారీరికం గానూ తీవ్రం గా గాయ పరిచే సంఘటనలు అనుభవమైనప్పుడూ ! అప్పుడు , జీవితం నిరాశా జనకం అనిపిస్తుంది , ఆ నిరాశా వాద దృక్పధాన్ని ఆది లోనే తుంచి వేయాలి ! లేక పొతే , ఆ ఆలోచనల సుడి గాలి చుట్టు ముట్టి , మనిషినే గల్లంతు చేసే ప్రమాదం ఏర్పడుతుంది ! ఆ పరిస్థితి లో, సుడి గాలి , అమాంతం గా మనిషిని ఎత్తేయక పోయినా కూడా , మనసులో చెల రేగే , మానసిక ఆలోచనా సంఘర్షణ , క్రమ క్రమం గా ఉ ధృ తమవుతూ , ‘ ఇక జీవించి ప్రయోజనం లేదు ‘ ఈ జీవితాన్ని అంతం చేసుకోవడమే శరణ్యం అని ఆలోచింప చేసి , అట్లా ఆలోచిస్తున్న మనిషిని , తనకు తాను , హాని చేసుకునే పరిస్థితి కి పురి గొల్పుతుంది ! ఆ నిరాశా జనక ఆలోచనలే , ముందుకు పోనీయని సుడి గుండాలవుతాయి !
అందు వల్లనే , ఈ ఆలోచనల నిజ స్వరూపం గ్రహించాలి ! అందుకు, మీ ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవాలి ! అందుకు మీ దృక్కోణం మారాలి ! అంటే, మీరు చూసే చూపుల బట్టి , మీ ప్రపంచ పరిధి కూడా మారుతుంది ! మీ దృక్కోణం, నిరాశా జనకం గానూ , సంకుచితమైనది గానూ ఉంటే , మీరు చూసే ప్రపంచం కూడా మీకు సంకుచితం అవుతుంది, గాడాంధ కారం గా గోచరిస్తుంది ! మీ దృక్కోణం , విశాలం గానూ , విస్తృతం గానూ ఉంటే , మీ ప్రపంచం, చాలా విశాలం గా , మీకు గోచరిస్తుంది ! అందులో, మీకుండే అవకాశాలూ , పొంద గలిగే ఆనందాలూ కూడా , స్పష్టం గా కనిపిస్తాయి ! ప్రపంచం, ఆశా జనకం గా ఉంటుంది ! ఆ దేదీప్యమానమైన ప్రపంచం లో, మీకు, మీ భవిష్యత్తు కూడా ఉజ్వలం గా గోచరిస్తుంది ! నిరాశా మేఘావృతమైన ఆకాశం లో , ఆశా కిరణాలు మీకు స్పష్టమవుతాయి ! జీవితం, అందులో ప్రత్యేకించి , మీ జీవితం ఎంత విలువైనదో మీకు అవగతమవుతుంది ! విరహ బాధను, మీరు ‘ గరళ కంఠు డి లా ‘ దిగమింగ గలుగుతారు ! ఆనంద జలపాతాన్ని, మీ శిరసు లో బంధించ గలుగుతారు ! కేవలం, మీ లో కలిగిన ఆలోచనా ధోరణి లో మార్పులతో ! ఆశావాద దృక్పధం తో ! అప్పుడు, మీ జీవిత మాధుర్యం, మీకు తెలుస్తుంది ! మీరు అనుభవించే విరహ వేదన ‘ కేవలం ‘ అంటే ఆఫ్టరాల్ ఒక్క వ్యక్తి మాత్రమే, నన్ను తృ ణీక రించడం జరిగింది ‘ అనుకుని , ఆ విషయాన్ని, మీరు, మీ ఆమూల్యమైన జీవిత పధం లో, అడ్డు వచ్చిన ఒక గడ్డి పోచ లా, పక్కకు వంచి , తదేక దీక్షతో పురోగమించ గలుగుతారు ! అంతటి శక్తి ఉంది , మీ ఆలోచనలకు ! మీ కర్తవ్యానికి మూల స్తంభాలైన మీ ఆలోచనా ధోరణి లో మార్పు , మీ కర్తవ్యాన్ని పటిష్టం చేస్తుంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…