Our Health

Archive for నవంబర్ 20th, 2013|Daily archive page

చదువుకోవడం ఎట్లా?7. చదువుకు పధకం ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 20, 2013 at 10:15 సా.

చదువుకోవడం ఎట్లా?7. చదువుకు పధకం ఏమిటి ? 

ప్రతి పనికీ, వేసుకో పధకం ! 
నీ జీవితం లో, నీవే  ప్రధమం ! 
పధకం చేస్తుంది , 
నీ లక్ష్యం, సుగమం !  
 
క్రితం టపాలలో , చదువుకోవడానికి కావలసిన కనీసపు ‘ ముడి సరుకులు ‘ ఏమిటో తెలుసుకున్నాం కదా !  ముఖ్యం గా కావలసినది, చదువుకోవాలనే నిరంతర ‘ తపన ‘ , కృత నిశ్చయం !   వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ , ఆ తపనా , దీక్షా , బలమవుతూ ఉంటుంది ! కానీ చిన్న వయసులలోనే , చదువంటే , ఉత్సాహం కలిగించి , అన్ని విధాలా బాల బాలికలకు , అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వ వలసినది , తల్లి దండ్రులే , ఆ తరువాత ఉపాధ్యాయులు !  గుర్తు ఉంచుకోవలసిన విషయం :  తల్లి తండ్రులు , ఆ రకమైన ప్రోత్సాహం , ఉత్సాహం , తమ పిల్లలలో కలిగించ డానికి , వారు చదువు కున్న వారవనవసరం లేదు ! డబ్బు బాగా ఉన్న వారూ  అవనవసరం లేదు !  తమ శక్తి యుక్తులు సర్వస్వం , తమ సంతానం కోసం ధార పోసి ,   వారు  ‘ నాలుగు అక్షరం ముక్కలు నేర్చి , నాలుగు రాళ్ళు సంపాదించుకుని , వారి కాళ్ళ మీద వారు నిలబడితే చూద్దామని , వేచి ఉండే తల్లి దండ్రులూ , వితంతువులైన తల్లులూ , భార్య లను కోల్పోయిన తండ్రులూ కూడా , మన భారతావని లో,  అనేక లక్షల మంది ఉన్నారు ! అందుకే అంటారు కదా ‘ జననీ , జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి ‘ అని ! మరి చదువుకు పధకం ఏమిటి ? స్టడీ ప్లాన్ ఏమిటి ? దాని ఉపయోగం ఏమిటి ? మరి ఆ పధకాన్ని ఎట్లా వేసుకోవాలి ?  ఆ పధకం వేసుకుని , విద్యార్ధులు చదవడం లోనూ , వారిని ఒక పధకం ప్రకారం చదివించడం లోనూ , వారి తల్లి దండ్రులు ఏంచేయాలి ? 
చదువుకు పధకం ఏమిటి ? :  
మన జీవితం లో మనం చేరుకోవాలనే ప్రతి లక్ష్యానికీ , ఒక పధకం మనకు ఉండాలి !  పధకం లేని ప్రయాణం నడి సముద్రం లో నావ లా ఉంటుంది !  అంటే లక్ష్య సాధన కు పధకం తప్పని సరిగా ఉండాలి !  బాగా చదువుకోవాలనే లక్ష్యం మనకుంటే , అందుకు తగిన పధకం కూడా మనం సిద్ధం చేసుకోవాలి !  ఒక ఉద్యోగం చేయాలనే లక్ష్యం ఉంటే , అందుకూ పధకం తప్పని సరి !  పధకం అంటే కేవలం, మన ఆలోచనలను , ఆచరణలో పెట్టే , ఒక క్రమ పధ్ధతి ! ఆర్గనైజేషన్ ! ఏ పధకం వేసుకున్నా , తాత్కాలికం గానూ , దీర్ఘకాలికం గానూ  చేయవలసినది  ఒక క్రమ పధ్ధతి లో చేస్తూ పొతే , పధకం విజయవంతం అవుతుంది ! 
ఉదాహరణకు, చదువు:  రోజు వారీ చదువు , స్కూల్ నుంచీ , లేదా కాలేజ్ నుంచీ, ఇంటికి వచ్చాక , ఎంత సేపు చదువుకోవాలి ? ఏ ఏ సబ్జెక్ట్ లు చదువుకోవాలి అనే విషయాలు , విద్యార్ధులు ముందే , ఒక అవగాహన కు వచ్చి , తదనుగుణం గా సిద్ధం అవాలి  ఆ సబ్జెక్ట్ విషయాలు తెలుసుకోవ డానికి ! నూటికి ఎనభై శాతం విద్యార్ధులు , సరిగా ఫలితాలు సాధించ లేక పోవడానికి ప్రధాన కారణం , కేవలం ఒక పధకం లేక పోవడమే ! విద్యార్ధులకు చదువుకోడానికి సమయం కొదువ ఉండదు కదా ! అట్లాగే , అవకాశం కూడా ఇవ్వ బడితేనే కదా బడి లో కానీ , కళాశాల లో కానీ ప్రవేశించ గలిగేది ! మరి ఫలితాలు సరిగా ఉండడానికి వారు చేయవలసినది కేవలం , ఒక పధకం తో చదవడమే ! మరి ఆ పధకం వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాం ! ఇది తెలుసుకోవడం , కేవలం విద్యార్థులకే కాక ,వారి ని చదివిస్తున్న తల్లి దండ్రులకు కూడా ఎంతో ఉపయోగకరం !  

 

%d bloggers like this: