Our Health

Archive for ఏప్రిల్, 2012|Monthly archive page

ఋతు క్రమం – సమస్యలు.3.

In Our Health on ఏప్రిల్ 6, 2012 at 8:37 ఉద.

 ఋతు క్రమం – సమస్యలు.3.

ఋతు స్రావం లేక  మెన్ స్ట్రు ఎషన్: 
క్రితం టపా లో చూసినట్లు ఋతు స్రావం మొదలవటం, స్త్రీ గర్భం దాల్చలేదని తెలపడమే. ఈ   ఋతు స్రావం జరిగే సమయం లో   వీర్యకణం తో కలవని అండం తో పాటు గర్భాశయ పొర  అంటే  లైనింగ్ కు ఉన్న కణ జాలం  కూడా యోని ద్వారా గర్భాశయం  నుంచి  బయటకు వస్తాయి.సాధారణం గా ఋతుస్రావం నాలుగు రోజులు జరుగుతుంది. కొంత రక్త  స్రావం కూడా జరుగుతుంది (  రమారమి  10 నుంచి 80 మిల్లీ లీటర్ల రక్త స్రావం అవుతుంది, సగటున 35, మిల్లీ లీటర్లు ) ఈ సమయంలో.  కానీ ఈ రక్తం లో ప్లాస్మిన్ అనే పదార్ధం ఉండటం  వల్ల   గడ్డ కట్టదు.
ఇలా ఋతు స్రావం, స్త్రీ రజస్వల అయినప్పటి నుంచి, అంటే ప్యుబర్టీ నుంచి ( 8 నుంచి  18  ఏళ్ళ లోపు ) ఋతు క్రమం ఆగి పోయే వరకూ అంటే మెనో పాజ్ వరకూ ( 40 నుంచి 50 ఏళ్ళ మధ్య )   ఋతుక్రమం లో వస్తూ ఉంటుంది.
ఈ రక్త స్రావం సాధారణంగా అనీమియా కు దారి తీయదు. ఒక పరిశోధనలో సుమారు  85 శాతం మంది స్త్రీలలో   కడుపులో మంట, అల్సర్లు ఉండటం గమనించారు. అంటే అనీమియా కు కేవలం ఋతు స్రావమే కారణం కాదని తెలిసింది.
కానీ  శాక హారులూ , బక్క పలచ గా ఉన్న యువతులలో ఋతుస్రావం,  అనీమియా గా  కనపడటానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
ఋతుస్రావం జరిగే సమయం లో జరిగే శారీరిక మార్పులు :  చాలా మంది స్త్రీలు, అలసట, కడుపులో తిప్పినట్లు ఉండటం,  సెక్స్ పట్ల కోరిక లో మార్పులు ,  స్తనాలలో నొప్పిగా ఉండటం,  పెల్విక్ భాగం లో అంటే కటివలయ భాగం లో క్రామ్ప్స్  లేక కండరాల నొప్పులు ,  కొద్దిగా నీరు చేరి శరీరమంతా బరువు ఎక్కువైనట్లు, ఇలాంటి లక్షణాలు, అన్నీ కానీ , కొన్ని కానీ  గమనిస్తారు.
ఋతు స్రావం సమయం లో కండరాల నొప్పులు ఎందుకు వస్తాయి.? :  మనం ముందు తెలుసుకున్నట్లు,  ఋతుస్రావం సమయం లో అండం కనుక వీర్య కణం తో కలవక పోయినట్లయితే, దానిని , దానితో పాటు గర్భాశయ లైనింగ్ కణ జాలాన్నీ వదిలించుకోడానికి  గర్భాశయ కండరాలు గట్టి గా వ్యాకోచము, సంకోచము జరుపుతాయి. ఇలా జరిగుతున్నప్పుడు , స్త్రీలు ఆ ప్రాంతమంతా మెలి తిప్పినట్టు నొప్పి అనుభవిస్తారు. కొందరిలో ఈ నొప్పులు తీవ్రం గా, భరింప లేనివి గా ఉంటాయి.  
ఇలా కండరాలు వ్యాకోచ, సంకోచాలు జరిపినప్పుడు ప్రోస్టా గ్లాండిన్స్ ఎక్కువ గా విడుదల అవుతాయి.
మానసిక మార్పులు :  ఋతుస్రావ సమయం లో జరిగే హార్మోనుల మార్పులు, తద్వారా గర్భాశయం లో జరిగే మార్పుల వల్ల స్త్రీలు సాధారణం గా, అలసి పోతుంటారు. అలాగే చీటికి  మాటికి చీకాకు పడటం ,  కళ్ళ లో నీరు నిండడం ( అంటే చిన్న కారణాలకే తట్టుకోలేక ఏడవడం ) , ఇలాంటి లక్షణాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 
 
 

ఋతుక్రమం- సమస్యలు.2.

In Our Health on ఏప్రిల్ 5, 2012 at 9:52 ఉద.

ఋతుక్రమం- సమస్యలు.2.

క్రితం టపాలో చూసినట్టు, ఋతుక్రమాన్ని, ముఖ్యంగా నాలుగు హార్మోనులు  నియంత్రిస్తాయి.
ఈ నియంత్రణను పోల్చాలంటే   ఈ ముఖ్యమైన హార్మోనులు ఒక రకమైన   రిలే పరుగు  లో పాల్గొంటాయి. అంటే ఈ హార్మోనులు ,  పలు దశలలో  కీలకమైన పాత్ర వహించి  ప్రకృతి  లో   మానవ జీవన పరుగు  ను విజయ వంతం చేస్తాయి. ఎందుకంటే, ఈ హార్మోనులు వాటి క్రియలను ఏ దశ లో నైనా  నిర్వర్తించక పొతే, అండాశయం నుంచి  అండం విడుదల అవదు. కేవలం వీర్యకణాలు గర్భాశయం లో ప్రవేశించినా ( రతిక్రియ ద్వారా లేక  artificial insemination ద్వారా అయినా ),  పిండం ఏర్పడదు కదా !  దానితో మానవ సృష్టి ఆగి పోయినట్లే కదా !
ఋతు క్రమానికి   స్త్రీ  దేహం లో ఏ ఏ చోట్ల ఈ రిలే పరుగు జరుగుతుందో చూద్దాము :
మెదడు లో రెండు చోట్ల అంటే హైపో తలామస్ ఇంకా పిట్యు టరీ గ్రంధి – ఈ రెండు చోట్ల లో. 
అలాగే గర్భాశయం లో రెండు చోట్ల అంటే గర్భాశయం కు చివరల్లో ఉన్న అండాశయం లో, ఇంకా ముఖ్యమైన  గర్భాశయం లో !
క్రింద పటం చూడండి. ఆ పటం లో ఉన్న  అంకె ల వారీగా వివిధ దశలలో జరిగే మార్పులు కూడా గమనించండి. ( సులభం గా అర్ధమవటానికి  పటం లో చూపిన  రంగులనే  వివరణ అంకెలలో, వాక్యాలలో ఉపయోగించడం జరిగింది. ) ఆసక్తి కరం గా ఉండటానికి, ఈ క్రింద జరుగుతున్న మార్పులను , అంచెల వారీ గా ఒక చిన్న కధ లాగా చదవండి, మీకు ఇప్పుడు ఏ  పరీక్ష అంటే టెస్ట్ లేదు కదా ! కంగారు పడ నవసరం లేదు ! )
1. మెదడులోని హైపో త లామాస్  GnRH అనే హార్మోనును విడుదల చేస్తుంది.
2. ఈ GnRH  హార్మోను రక్తం ద్వారా పిట్యు టరీ గ్రంధి కి చేరి అక్కడ నుంచి FSH అనే హార్మోనును విడుదల చేయిస్తుంది.
3. FSH హార్మోను  మళ్ళీ రక్త ప్రసరణ ద్వారా ( పిట్యు టరీ గ్రంధి నుంచి ) ఆండాశ యానికి చేరి అక్కడ అండం విడుదల చేసే కణ జాలాన్ని  వృద్ధి చేస్తుంది.
4. అండాశయం లో వృద్ధి చెందిన కణ జాలం ( దీనినే గ్రాఫియన్ ఫాలికిల్స్ అని కూడా అంటారు ) ఈస్ట్రో జెన్ ను ఉత్పత్తి చేస్తాయి.
5. ఈ ఈస్త్రోజేన్  పిట్యు టరీ గ్రంధిని చేరి అక్కడ నుంచి FSH ను తగ్గించమని ఉత్తర్వు లిచ్చి అదే సమయం లో LH అనే ఇంకో హార్మోనును విడుదల చేయిస్తుంది, పిట్యు టరీ గ్రంధి చేత. ఈ స్ట్రోజెన్ సహాయం తో గర్భాశయం లోని రక్త నాళాలు కూడా గట్టి పడతాయి.
6. LH హార్మోను ఎక్కువ అవడం వల్ల  అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. ఈ అండం గర్భాశయం చివరల నుంచి ప్రయాణం కొనసాగించి ఫాలోపియన్ ట్యూబ్  ద్వారా  ( మీరు వినే వుంటారు, పిల్లలు ఇక వద్దు అనుకునే స్త్రీలకు ఈ ఫాలోపియన్ ట్యూబ్ లను కత్తిరించి, అండం గర్భాశయం లోకి చేరకుండా చేస్తారు ) గర్భాశయం చేరుతుంది.
7. అండం విడుదల అయిన తరువాత, అండాశయం లో ఉన్న కణజాలం ( అంటే గ్రాఫియన్ ఫాలికిల్స్ ) ప్రోజేస్టిరాన్ అనే హార్మోను ను విడుదల చేస్తాయి. ఈ ప్రోజేస్టిరాన్ మళ్ళీ పిట్యు టరీ కి చేరుకొని దాని చేత ‘ LH ‘ ను ఆపించేస్తుంది.( ఎందుకంటే LH పని అంటే అండాశయం నుంచి , అండం విడుదల చేయించడం, జరిగింది కనుక ) 
8. గ్రాఫియన్ ఫాలికిల్స్  విడుదల చేసిన ఈ ప్రో జేస్టిరాన్ , గర్భాశయాన్ని శిశువు పెరగటానికి అనువుగా తయారు చేస్తుంది. అంటే గర్భాశయం  ను ఒక అనువైన , సహజమైన ‘ ఊయల ‘ లేక ‘ పడక ‘ లాగా చేస్తుంది. అలాగే  గర్భాశయం లో ఉన్న కణ జాలాన్ని,
  మ్యుకస్ అంటే జిగట గా చేసి, ఆ ప్రదేశం వీర్య కణం, అండం చేరు కోడానికి  చేసే ‘ ప్రయాణాన్ని ‘ సులువు చేస్తుంది. ఆశ్చర్యం గా ఉంది కదూ ఈ క్లిష్టమైన జీవ క్రియలన్నీ తెలుసు కుంటూంటే !
గర్భాశయం చేరిన అండం, వీర్య కణం తో కలవడానికి  వేచి చూస్తూ ఉంటుంది కనీసం 24 నుంచి 48 గంటల వరకూ.
9. వీర్య కణం కనుక గర్భాశయం లో తన కొరకు వేచి చూస్తున్న అండాన్ని కలిస్తే  స్త్రీ గర్భం దాల్చినట్టే ! అంటే  ఇంకో జీవ సృష్టి జరిగినట్లే ! అప్పుడు  ఏర్పడే ‘  పిండం ‘ అంటే ఎంబ్రియో  ఇంకో హార్మోనును విడుదల చేస్తుంది. దీనినే HcG అంటారు (  స్త్రీలు గర్భం దాల్చారో లేదో తెలిపే అనేక పరీక్షలు అంటే  pregnancy tests ,  ఈ  HCG హార్మోను పరిమాణం బట్టి నిర్ణయించేవే ! )  
ఈ ‘ HCG ‘ హార్మోను  గ్రాఫియన్ ఫాలికిల్స్ చేత ప్రోజేస్టిరాన్ నూ , ఇంకా ఈస్త్రోజేన్ నూ ఉత్పత్తి  చేయిస్తుంది. ఎందుకంటే ఆ హార్మోనులు కూడా పిండం పెరుగుదల కు అవసరం కాబట్టి.
10. ఒక వేళ వీర్య కణం కనుక అండం తో కలవలేక పొతే,  అండాశయం నుంచి  ప్రోజేస్టిరాన్, ఈస్త్రోజేన్ ఉత్పత్తి అవ్వక వాటి పరిమాణం తగ్గి , ఋతు స్రావం అవుతుంది. దానితో ఋతుక్రమం మొదలవుతుంది మళ్ళీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము.
.

ఋతుక్రమం – సమస్యలు.1.

In Our Health on ఏప్రిల్ 4, 2012 at 1:56 సా.

ఋతుక్రమం – సమస్యలు.1.

సహజ ఋతుక్రమం . ( normal menstrual cycle ) :
ఋతుక్రమం లేక  మెన్ స్ట్రువాల్ సైకిల్  అనే పదం,  గర్భధారణ సామర్ధ్యం కల స్త్రీల శరీరం లో జరిగే మార్పులను తెలిపే శాస్త్రీయ పదం. ఋతుక్రమం అని ఎందుకు పిలవబడుతుందంటే , ఈ మార్పులు స్త్రీ లలో సహజంగా,  ప్రతి నెలా క్రమంగా వస్తాయి కాబట్టి. 
సాధారణం గా ఋతుక్రమం ఇరవై ఎనిమిది  రోజుల తరువాత మళ్ళీ మొదలవుతుంది.  ఈ ఇరవై ఎనిమిది రోజులలో జరిగే వివిధ మార్పులను మనం కొన్ని దశలుగా గమనించవచ్చు.
ఈ మార్పులు స్త్రీలలోని అండాశయం లోనూ ఇంకా గర్భాశయం లోనూ  జరుగుతుంటాయి.
అండాశయాలు రెండు, గర్భాశాయానికి రెండు వైపులా ఉంటాయి.  అండాశయం లో జరిగే మార్పులను మూడు   దశలలో మనం తెలుసుకోవచ్చు.
ఒకటి ఫాలిక్యులర్ దశ రెండవది ఒవ్యులేషన్ , మూడవది   ల్యుటియాల్ దశ. అలాగే గర్భాశయం లో జరిగే మార్పులను మూడు దశలలో ఉంటాయి. ఒకటి  మెన్సెస్, రెండవది ప్రాలిఫరేటివ్ దశ , మూడవది సేక్రీటరీ దశ. 
మనం ఋతుక్రమం సాధారణ సమయం ఇరవై ఎనిమిది రోజులు అని అనుకున్నట్లయితే మొదటి రోజు నుంచి నాలుగవ రోజు వరకు మెన్సెస్  అని చెప్పుకోవచ్చు . అంటే రమారమి ఈ నాలుగు రోజులూ ఋతుస్రావం లేక మెన్ స్ట్రువాల్ బ్లీడింగ్ అవుతుంది. 
అండాశయం లో జరిగే మార్పులూ , గర్భాశయం లో జరిగే మార్పులూ అనేక రకాలైన హార్మోనుల  పర్యవేక్షణ లో జరుగుతాయి. మనం క్రితం టపా లలో చూశాము హార్మోనులు అంటే ఏమిటో.( మన దేహంలో ఉండే, నిరంతరం తయారవుతూ ఉండే , జీవ రసాయన పదార్ధాలు. ఈ ప్రత్యేకమైన జీవ రసాయన పదార్దాలు, కొన్ని కొన్ని ప్రత్యేకమైన జీవ క్రియలను మన దేహం లో  నియంత్రించి పర్యవేక్షిస్తూ కూడా ఉంటాయి. ) వీటి గురించి కూడా తెలుసుకుంటే   బర్తు కంట్రోలు కు అవసరమయే బిళ్ళలు ఎలా పని చేస్తాయో కూడా అర్ధం చేసుకోవచ్చు.
ఈ క్రింది పటం స్థూలం గా ఋతుక్రమం లో జరిగే మార్పులను తెలుపుతుంది.

( యు ట్యూబ్ అందుబాటు లో లేని వారు ఈ పటం లో ఆ మార్పులు గమనించ వచ్చు ) 
 
 
 
వచ్చే టపాలో ఋతుక్రమం లో వివిధ దశలలో జరిగే వివిధ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాము.
 
సహజ ఋతు క్రమంలో ఏమి జరుగుతుందో క్లుప్తంగా వివరించిన ఈ అత్భుతమైన యు ట్యూబ్ వీడియో చూడండి:
 
 
 

ఋతుక్రమం – సమస్యలు.

In Our Health on ఏప్రిల్ 3, 2012 at 6:41 సా.

ఋతుక్రమం – సమస్యలు.

 
ఋతు క్రమం ప్రతి స్త్రీకీ ప్రకృతి సిద్ధంగా వచ్చిన ప్రత్యేకత.   కానీ రమారమి యాభయి శాతం కంటే ఎక్కువ మంది స్త్రీలు ఋతుక్రమం లో అవకతవకల వల్ల బాధ పడుతుంటారని  వివిధ గణాంకాల వల్ల తెలిసింది. 
ఈ ఋతుక్రమం  వివరాలూ,  స్త్రీల ఋతుక్రమం లో వచ్చే  తేడాలూ, వాటి కారణాలూ, వాటికి చికిత్స పద్ధతులూ మనం తెలుసుకుందాము.
పురుషులకు కూడా ఋతుక్రమం గురించి అవగాహన ఏర్పడటం మంచిది. ఎందుకంటే,  కుటుంబం లో ఎవరి ఆరోగ్యం, బాగోలేక పోయినా, ఆ ప్రభావం ఇంట్లో ఉన్న వారందరి మీదా ఉంటుంది.  
అలాగే రుతుక్రమ సమస్యలున్నప్పుడు  ఆ లక్షణాల గురించి స్త్రీల తో పాటు పురుషులకు కూడా అవగాహన ఏర్పడితే అది, ఆ సమస్యా పరిష్కారం లో  కూడా ఉపయోగ పడుతుంది. 
 
ముందు గా సహజ ఋతుక్రమం గురించి తెలుసుకుందాము ( అప్పుడు ఋతుక్రమం లో సమస్యలు శులభం గా అర్ధం చేసుకోవచ్చు )
రుతుక్రమాన్ని  తెలుగులో ‘ ముట్టు ‘ అంటారు. చాలా సాధారణంగా ‘ పీరియడ్స్ లేక మెన్సెస్  ‘  అని కూడా అంటుంటారు. 
పీరియడ్స్ ఎందుకు వస్తాయి? : ప్రతి పిరియడ్ లో  అండాశయం నుంచి అండం విడుదల అవుతుంటుంది. ఆ అండము కనుక  పురుషుడి వీర్యం తో ( ఖచ్చితంగా చెప్పాలంటే  సాధారణంగా ఒక వీర్య కణం తో ) కలవక పొతే  పిండం ఏర్పడక మళ్ళీ పిరియడ్ వస్తుంది.
ఒక శాస్త్రజ్ఞుడు వ్యాఖ్యానించినట్టు   ‘ each menstrual period is  the cry of  the womb for want of a baby ‘ అంటే ప్రతి పిరియడూ శిశువు లేక పోవడం కారణం గా గర్భాశయం చెందే ఆవేదన ! 
ఇలా పీరియడ్స్ స్త్రీ ప్రత్యుత్పత్తి లేక సంతానోత్పత్తి దశ అంటే సహజం గా  ఆగి పోయేంత వరకూ ప్రతి నెలా వస్తుంటాయి. ఇలా పీరియడ్స్ ఆగి పోవడాన్ని మెనో పాజ్ అంటారు. 
ఋతుక్రమం మొదటి సారిగా యువతులలో రావడాన్ని మెనార్కే అంటారు.  సాధారణంగా ఈ మెనార్కే  ప్రపంచం లో చాలా  దేశాలలో యువతులకు రమారమి  పదమూడు సంవత్సరాలున్నప్పుడు వస్తుంది. కానీ ఏషియన్ యువతులలో ఒక సంవత్సరం ఆలస్యం గా వస్తుంది.  ఈ తేడాలు  వివిధ దేశ ప్రాంత పరిస్తితులబట్టీ,  జాతుల బట్టీ  మారు తుంటాయని  గమనించడం జరిగింది.  ఈ మెనార్కే రావడాన్ని  యుక్త వయసు కు సంకేతం గా పేర్కొనవచ్చు అంటే  ప్యుబర్టీ ‘ puberty ‘ .
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 
 
 
 
 

కామ వాంఛ – శాస్త్రేయ విశ్లేషణ.21.

In Our Health on ఏప్రిల్ 2, 2012 at 9:43 సా.

కామ  వాంఛ – శాస్త్రేయ విశ్లేషణ.21.

వయాగ్రా తో కామ వాంఛ నయాగరా అవుతుందా ? 
పురుషులలో   ఆర్గాసం సమస్య పరిష్కారం కోసం గత రెండు మూడు దశాబ్దాలలో ఎన్నో పరిశోధనలు జరిగాయి.  అమెరికా కు చెందిన ఫైజర్ కంపెనీ వారు మార్కెట్ లోకి ‘ వయాగ్రా ‘ అనే మందు బిళ్ళ ప్రవేశ పెట్టారు. గత సంవత్సరం లో కేవలం ఈ మందు బిళ్ళ తో  అమెరికా లో   రెండు బిలియన్ల  డాలర్ల  వ్యాపారం చేశారు ఫైజర్ కంపెనీ వారు.
వయాగ్రా కాకుండా ఇంకొన్ని మందు బిళ్ళలు కూడా మార్కెట్ లో ప్రవేశ పెట్టడం జరిగింది కూడా !   ఈ రకమైన మందులలో వయాగ్రా మొదటిది కనుక దాని గురించి తెలుసుకుందాము.
వయాగ్రా అనేది  వ్యాపార నామం అంటే ట్రేడ్ నేమ్ అంటారు. మనకు మార్కెట్ లో లభ్యమయే ప్రతి మందు బిళ్ళా , అది తయారు చేసిన మందుల కంపెనీ వారు పెట్టిన పేరు తో బయటికి వస్తుంది.
కా నీ ఆ బిళ్ళ లో ఉండే ఫార్ములా అసలైన రసాయన నామం. అలా చూస్తె  వయాగ్రా  ఫార్ములా పేరు  సిల్దేనాఫిల్  ( sildenafil ) .
ఈ రసాయన ఫార్ములా మన దేహం లో జరిగే ఒక జీవ రసాయన క్రియ ను ఆపుతుంది.  దాని విషయం వివరంగా చెప్పాలంటే :
మామూలు గా పురుషులలో అంగ స్తంభనం జరిగినప్పుడు  ఆ ప్రదేశంలో నైట్రిక్ ఆక్సైడ్  ( ‘ NO ‘ అంటారు రసాయన ఫార్ములా లో), ఈ నైట్రిక్ ఆక్సైడ్  పురుషాంగం లో  ఎక్కువ అవటం వల్ల, అక్కడ ఉన్న రక్త నాళాలు వ్యాకొచిస్తాయి. తద్వారా పురుషాంగము నిటారుగా అవుతుంది. దీనినే ‘ అంగ స్థంభన ‘ లేక ఎరెక్షన్ అంటారు.  సహజంగా ఈ ఎరెక్షన్ లేక అంగ స్థంభన  నాలుగైదు నిమిషాలు ఉంటుంది.
ఈ సమయం లో  మన దేహం లో ‘ PDE5 ‘ దీనినే దీర్ఘంగా  ఫాస్ఫో డయి ఎస్ట రేజ్  -5. అంటారు.  ఈ ఎంజైం  ఉత్పత్తి అయి అది  నైట్రిక్ ఆక్సైడ్ ను  పురుషాంగం నుంచి   తగ్గించి వేస్తుంది.
ఇది సహజం గా  ఆరోగ్య వంతులైన పురుషులలో జరిగే  జీవ రసాయన చర్య.  వివిధ కారణాల వల్ల కొందరు పురుషులలో  అంగ స్థంభన ఎక్కువ సమయం ఉండదు. దానితో ఆర్గాసం పొందలేక పోవచ్చు. అలాగే ఆ సమస్య సంతానోత్పత్తి కి కూడా అవరోధం ఆవ వచ్చు. 
ఇలాంటి పరిస్తితులలో వారికి సిల్దేనాఫిల్ లేక వయాగ్రా ఉపయోగ పడుతుంది.  ఒక్క వాక్యం లో చెప్పాలంటే ఈ బిళ్ళ పురుషులలో  ‘  PDE5 ‘ ఎంజైం ను తాత్కాలికం గా నివారిస్తుంది. దానితో నైట్రిక్ ఆక్సైడ్ పురుషాంగం లో ఎక్కువ సమయం ఉండి, అంగ స్థంభన కూడా ఎక్కువ సమయం ఉండటానికి తోడ్పడుతుంది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి.  అంగస్తంభన  ఎప్పుడూ లేని వారికి, ఈ మందును రికమెండ్ చేయరు. అలాగే రక్తనాళాల జబ్బులతో, లేక గుండె జబ్బు తో బాధ పడే వారికి  ఈ మందు రికమెండ్ చేయరు.  ఈ మందు ఉపయోగం స్పెషలిస్ట్ డాక్టర్ సలహా మీద చేయడం ఉత్తమం. 
సరియైన ఆరోగ్యం తో ఉండి , కేవలం అంగ స్థంభన  సమయం ఎక్కువ అవాలనుకునే పురుషులలో  వయాగ్రా  తో   కామ వాంఛ  నయాగరా అవుతుంది.
కేవలం ఉత్సాహం తో,  అవసరం లేక పోయినా ఇలాంటి మందులు వాడటం ఎంత మాత్రమూ మంచిది కాదు.  ముందు చెప్పినట్టు  డాక్టర్ సలహా తప్పని సరిగా తీసుకుంటే మంచిది.
స్త్రీల లో  కూడా వయాగ్రా పని చేస్తుందా ? :
ఇప్పటి వరకూ జరిపిన పరిశోధనలు ఖచ్చితం గా స్త్రీలు  వయాగ్రా వల్ల లాభ పడతారని చెప్పలేక పోయాయి. అందు వల్లే    అమెరికా లో  అన్ని మందుల వాడకానికీ  ముందుగా ఆమోద ముద్ర వేసే FDA  సంస్థ ఈ వయాగ్రా ను స్త్రీలకూ రికమెండ్ చేయలేదు.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసు కుందాము !

కామ వాంచ – శాస్త్రీయ విశ్లేషణ.20.

In Our Health on ఏప్రిల్ 1, 2012 at 10:32 సా.

కామ  వాంచ – శాస్త్రీయ విశ్లేషణ.20.

సుదీర్  అలా తన తోలిరాత్రులు కొన్ని విచారకరం గా గడిపాడు. వేడి ముద్దులూ , బిగి కౌగిళ్ళతో సరిపుచ్చుకుంటున్నాడు. రతిక్రియ వద్ద  అంత వరకూ ‘ మగ ధీరుడనుకున్న’  సుదీర్ ,  బలహీనుడవుతున్నాడు.  సుజాత తన మటుకు తను, అతనితో ఎంతో ప్రేమతో, ఆప్యాయత తో సాహచర్యం చేస్తుంది.
ఆమె ప్రవర్తన సుదీర్ ను ఇంకా ఆందోళన పరుస్తూంది, ఇంకో  ప్రక్క తను కొంత వరకు అందుకు  కొంత రిలీఫ్  గా ఉన్నా ! ఈ అనుభూతులు సుదీర్ కు కొత్తగా ఉన్నాయి.
ఎందుకు తను  రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాడు, అదే సమయం లో ఎందుకు ఆందోళన పడుతున్నాడు?  ఎందుకు గిల్టీ గా ఫీల్ అవుతున్నాడు.?  ఏమీ అంతు పట్టడం లేదు అతనికి. 
ఇక ఇలాగే తన జీవితం సాగితే సుజాత తనకు కాకుండా పోతుందేమోనన్న భయం పీడించింది సుదీర్ ను. ధైర్యం చేసి ఒక రోజు మధ్యాహ్నం సెలవు తీసుకుని మానసిక వైద్యుణ్ణి సంప్రదించాడు.
నాలో ఏదైనా లోపం ఉందా డాక్టర్ ? అని ఆందోళన తో అడిగాడు. వివరాలన్నీ విన్న సైకియాట్రిస్ట్  ఇలా సలహా ఇచ్చాడు సుదీర్ కు
‘ సుదీర్!   నీవు అనుకుంటున్నట్లు దీనిని అనార్గాస్మియా అంటారు. కానీ ఇది సెకండరీ అనార్గాస్మియా అంటే నీ కేసు లో మానసికమైన కారణాల వల్ల సంభవించిన స్థితి ఇది. ఇది పూర్తి గా నయం అవుతుంది. అందుకు చికిత్స కూడా నువ్వే ! 
నీవు నీ బాల్యం లో సహజం గా ఉన్న కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉబలాటం దానినే ఇంక్విసిటివ్నెస్  అంటారు. దానితో నీవు బూతు బొమ్మల పుస్తకాలు చూసావు. మీ తండ్రి మీద నీకు విపరీతమైన ప్రేమా , భయము ఉండటం వల్ల, ఆయన నిన్ను మందలిస్తూ అన్న మాటలు నీ మనసులో గట్టిగా నాటుకున్నాయి.  నీలో ‘ సెక్స్ అంటే ఒక నేరం ‘ అనే భావన కలిగి, ఆ భావన నీలో సబ్ కాన్షస్ గా బలీయం గా ఉండిపోయింది, నీవు పెరుగుతున్నాకూడా!  అందుకే నీవు నీ భార్య సుజాత తో కామోత్తేజం పొందుతున్నప్పటికీ, ఆర్గాసం పొందలేక పోతున్నావు.
నీవు వెంటనే చేయవలసిన పని నీ ఆలోచనా ధోరణి మార్చుకోవడం. సెక్స్ అతి సహజమైన మానవ లక్షణం. నీవు నీ చదువు ను కూడా ఏమీ అశ్రద్ధ చేయలేదు కదా అందుకు నీవు గిల్టీ గా   గా ఫీల్ అవనవసరం లేదు. నీ మెదడు  సబ్ కాన్షస్ గా స్విచ్ ఆఫ్ అవుతూ ఉన్నది సెక్స్ కు, ఇప్పటి వరకూ. ఇందుకు కారణం నీకు రతి మీద ఉన్న అపోహలే !
‘ స్విచ్ ఆన్ యువర్ బ్రెయిన్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ సుజాత !’  అన్నాడు.
అంతా అతి జాగ్రత్త గా ఒక్క అక్షరం కూడా మిస్ అవకుండా విన్న సుదీర్ కు అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రాలాయి, కళ్ళనుంచి.
‘ థాంక్స్ డాక్టర్ ‘ అన్నాడు.
ఆగ మేఘాల మీద చేరుకున్నాడు ఇంటికి, దారిలోనే అర్జెంటు గా సుజాతను ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చి.
ఇంటికి చేరుకున్న సుజాతను నేరుగా  శయన మందిరం లో కి తీసుకువెళ్ళాడు,  విషయం కనుక్కోడానికి   నోరు విప్పుదామని సుజాత కనీసం పది నిమిషాలు ప్రయత్నించింది. ఫలితం శూన్యం. ఎందుకంటే తన పెదవుల మీద సుదీర్ పెదవులు పెనవేసుకు పోయాయి,    ఆ పది నిమిషాలూ , కృతజ్ఞతా పూర్వకంగా !
ఇంకో గంట తరువాత సుదీర్ ‘ మళ్ళీ మగ దీరు డయ్యాడు’   ‘ ఇవాళ  ఆఫీస్ నుంచి మ్యాజిక్ ల్యాంప్ ఏదైనా తెచ్చారా అలా స్వర్గం లోకి తీసుకు వెళ్ళారు ‘ అంది  సుజాత ‘ అమాయకంగా’ వినిపించీ వినిపించని స్వరంతో !
సుదీర్ మందహాసం తో ఆమె తల ముంగురులు సవరిస్తూ సైకియాట్రిస్ట్ మాటలు గుర్తు తెచ్చుకుంటున్నాడు ‘ స్విచ్ ఆన్ యువర్ బ్రెయిన్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ సుజాత ‘ ! అవును! నిజంగానే సుజాత సుదీర్ జాతకం కూడా మార్చి వేసింది ఆ రోజునుంచీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.19.

In Our Health on ఏప్రిల్ 1, 2012 at 4:28 సా.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.19.

పురుషులలో అన్నార్గాస్మియా:

సుధీర్  స్పురద్రూపి. కష్ట పడి చదివాడు, మంచి  జీతం కూడా వస్తుంది, చేస్తున్న ఉద్యోగానికి .  అతనికి తోడు  తన ఆఫీస్ లోనే ఉద్యోగం చేస్తున్న సుజాత పరిచయమయింది.  త్వరగా ఆ పరిచయం స్నేహం గా మారింది.  తలిదండ్రులు ఇంకో ఊళ్ళో ఉంటుండటం వలన సుదీర్  నాలుగు డబ్భులు ఆదా చేయాలనే ఆలోచనతో ఒక అపార్ట్మెంట్ కూడా తీసుకున్నాడు లోన్ తీసుకుని, తన కోసమే . ఇక కావాల్సింది చక్కని ఇల్లాలు. ఒక రోజు తన మనసులో మాట చెపాడు సుజాతతో ! సుజాత ఒప్పుకుంది అతనితో సహగమనానికి ! ఇద్దరి తలితండ్రులు కూడా సుముఖంగా ఉన్నారు, వారి పెళ్ళికి .  సుదీర్ ఆనందానికి అవధులు లేవు.  ఒక శుభ ముహూర్తాన వివాహం జరిగింది. ఇక తన జాతకం కూడా మారిందనుకున్నాడు సుదీర్ !
ఎంతో కాలం నుంచి కలలు కంటున్న మొదటి రాత్రి  ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ సుదీర్  చాలా  పధకాలు  వేస్తున్నాడు.  సుజాత   పారిజాతం లా  ప్రణయ పరిమళాలు వెదజల్లుతూ  పడక గది లో  అలా వేచి చూస్తుంటే తను అలవోక గా  ఆమెను నవ్వించి, ఆమె బుగ్గల మధ్యలో పడిన సొట్ట లను తన పెదవులతో ముద్దిడాలనీ, తాంబూలం వేసుకుని ఎర్రగా పండిన ఆమె పెదవులను అతి జాగ్రత్తగా తన పెదవులతో తడమాలనీ, తొలిరాత్రి  ఆమె కురులలో తన వేళ్ళు పోనిచ్చి ఆమెతో ఊసు లాడాలనీ, కామోత్తేజం తో ఆమెనూ కవ్వించి, ఆమె తో పాటు ,  రతిలో ఎన్నో సార్లు ఆర్గాసం పొందాలనీ …. ఇలా ఎన్నో ‘  ముఖ్యమైన ‘ చిరు పధకాలు కేవలం ఆ తొలి రాత్రి కోసమే సుదీర్ చాలా దీర్ఘంగా ఆలోచించి వేసుకున్నాడు.
ఆ సమయం కూడా వచ్చింది. బయట ఆహ్లాదకర వాతావరణం. ఉష్ణోగ్రత సమం గా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. పడక గది లో సుజాత తను అనుకున్న దానికంటే అందం గా ఉంది. కాక పొతే  చీర కట్టుకుని ఉంటుందనుకున్న సుదీర్  కు ,    ఆమెను నైటీలో చూసి ఇంకా  కామోత్తేజం కలిగింది. చాలా అమాయకం గా సుజాత అతని కౌగిలో నిజంగా పారిజాతం లానే ఒదిగి పోయింది. ఆమె తనకు పాల గ్లాసు అందించే సమయంలో, అతని లో మన్మధుడు అలజడి రేపి, ఆమె వక్షోజాల వైపు తదేకం గా చూస్తుండటం తో , గ్లాసును  అందుకోలేదు. ఆమె నేరం చేసిన దానిలా రెండు చేతులూ కలిపి, తన కను సన్నల నుంచి సుదీర్ ను చూసింది. అప్పుడు సుదీర్ కు కోపం రాలేదు సరికదా, ఆమెను దగ్గరికి తీసుకుని ఎంతో ప్రేమ తో హత్తుకున్నాడు. కామోత్తేజం అలలై ఎగిసి పడుతుంది.
సరిగా ఆమె రేకులు విప్పిన పారిజాతం లా రతి క్రియకు తనకు తెలియకనే సమాయత్తమవుతే, సుదీర్  అనూహ్యంగా  ఇంకో వేవ్  లెంత్  లోకి  వెళ్లి పోయాడు. ఆమెను దగ్గర కు తీసుకుంటున్నాడు కానీ సంగమించలేక పోతున్నాడు. వేవ్ లెంత్ ఆకస్మికంగా మారటం తో సుదీర్ మనసులో అలజడి రేగింది.  సుజాత కు ఇదేమీ తెలియలేదు.  ఆమె అమాయకం గా అతని కౌగిలి లో ఒదిగి నిద్రలోకి జాలు వారింది.
కానీ సుదీర్  తీవ్రంగా ఆలోచించాడు. తను ‘ ఎందుకని అంతగా పధకం వేసుకుని ఎదురు చూస్తున్న తొలిరాత్రి అనుభవం  రతీ సంగమం తో సుఖాంతం  అ వలేదు ‘  అని ఆందోళన చెందాడు. కలత నిద్రలో సుదీర్ కు, ఒక కల – తన  తండ్రి తన చిన్న తనం లో తను ఒకసారి బూతు బొమ్మల పుస్తకం చూస్తుంటే, పట్టుకుని, బెత్తం తో తనను వీపు మీద కొట్టడం  స్పష్టంగా కనిపించి ‘ నేను చూడను నాన్నా , ఎప్పుడూ చూడను ఇక ‘ అని అంటూ ఉలిక్కి పడి లేచాడు. దానితో సుజాత కూడా లేచి, సుదీర్ ఏమైంది అని అడిగి మళ్ళీ నిద్రలోకి జారింది అతని చేయి తీసుకుని.
సుదీర్ సమస్య కు పరిష్కారం వచ్చే టపాలో చదవండి !