Our Health

Archive for ఏప్రిల్ 2nd, 2012|Daily archive page

కామ వాంఛ – శాస్త్రేయ విశ్లేషణ.21.

In Our Health on ఏప్రిల్ 2, 2012 at 9:43 సా.

కామ  వాంఛ – శాస్త్రేయ విశ్లేషణ.21.

వయాగ్రా తో కామ వాంఛ నయాగరా అవుతుందా ? 
పురుషులలో   ఆర్గాసం సమస్య పరిష్కారం కోసం గత రెండు మూడు దశాబ్దాలలో ఎన్నో పరిశోధనలు జరిగాయి.  అమెరికా కు చెందిన ఫైజర్ కంపెనీ వారు మార్కెట్ లోకి ‘ వయాగ్రా ‘ అనే మందు బిళ్ళ ప్రవేశ పెట్టారు. గత సంవత్సరం లో కేవలం ఈ మందు బిళ్ళ తో  అమెరికా లో   రెండు బిలియన్ల  డాలర్ల  వ్యాపారం చేశారు ఫైజర్ కంపెనీ వారు.
వయాగ్రా కాకుండా ఇంకొన్ని మందు బిళ్ళలు కూడా మార్కెట్ లో ప్రవేశ పెట్టడం జరిగింది కూడా !   ఈ రకమైన మందులలో వయాగ్రా మొదటిది కనుక దాని గురించి తెలుసుకుందాము.
వయాగ్రా అనేది  వ్యాపార నామం అంటే ట్రేడ్ నేమ్ అంటారు. మనకు మార్కెట్ లో లభ్యమయే ప్రతి మందు బిళ్ళా , అది తయారు చేసిన మందుల కంపెనీ వారు పెట్టిన పేరు తో బయటికి వస్తుంది.
కా నీ ఆ బిళ్ళ లో ఉండే ఫార్ములా అసలైన రసాయన నామం. అలా చూస్తె  వయాగ్రా  ఫార్ములా పేరు  సిల్దేనాఫిల్  ( sildenafil ) .
ఈ రసాయన ఫార్ములా మన దేహం లో జరిగే ఒక జీవ రసాయన క్రియ ను ఆపుతుంది.  దాని విషయం వివరంగా చెప్పాలంటే :
మామూలు గా పురుషులలో అంగ స్తంభనం జరిగినప్పుడు  ఆ ప్రదేశంలో నైట్రిక్ ఆక్సైడ్  ( ‘ NO ‘ అంటారు రసాయన ఫార్ములా లో), ఈ నైట్రిక్ ఆక్సైడ్  పురుషాంగం లో  ఎక్కువ అవటం వల్ల, అక్కడ ఉన్న రక్త నాళాలు వ్యాకొచిస్తాయి. తద్వారా పురుషాంగము నిటారుగా అవుతుంది. దీనినే ‘ అంగ స్థంభన ‘ లేక ఎరెక్షన్ అంటారు.  సహజంగా ఈ ఎరెక్షన్ లేక అంగ స్థంభన  నాలుగైదు నిమిషాలు ఉంటుంది.
ఈ సమయం లో  మన దేహం లో ‘ PDE5 ‘ దీనినే దీర్ఘంగా  ఫాస్ఫో డయి ఎస్ట రేజ్  -5. అంటారు.  ఈ ఎంజైం  ఉత్పత్తి అయి అది  నైట్రిక్ ఆక్సైడ్ ను  పురుషాంగం నుంచి   తగ్గించి వేస్తుంది.
ఇది సహజం గా  ఆరోగ్య వంతులైన పురుషులలో జరిగే  జీవ రసాయన చర్య.  వివిధ కారణాల వల్ల కొందరు పురుషులలో  అంగ స్థంభన ఎక్కువ సమయం ఉండదు. దానితో ఆర్గాసం పొందలేక పోవచ్చు. అలాగే ఆ సమస్య సంతానోత్పత్తి కి కూడా అవరోధం ఆవ వచ్చు. 
ఇలాంటి పరిస్తితులలో వారికి సిల్దేనాఫిల్ లేక వయాగ్రా ఉపయోగ పడుతుంది.  ఒక్క వాక్యం లో చెప్పాలంటే ఈ బిళ్ళ పురుషులలో  ‘  PDE5 ‘ ఎంజైం ను తాత్కాలికం గా నివారిస్తుంది. దానితో నైట్రిక్ ఆక్సైడ్ పురుషాంగం లో ఎక్కువ సమయం ఉండి, అంగ స్థంభన కూడా ఎక్కువ సమయం ఉండటానికి తోడ్పడుతుంది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి.  అంగస్తంభన  ఎప్పుడూ లేని వారికి, ఈ మందును రికమెండ్ చేయరు. అలాగే రక్తనాళాల జబ్బులతో, లేక గుండె జబ్బు తో బాధ పడే వారికి  ఈ మందు రికమెండ్ చేయరు.  ఈ మందు ఉపయోగం స్పెషలిస్ట్ డాక్టర్ సలహా మీద చేయడం ఉత్తమం. 
సరియైన ఆరోగ్యం తో ఉండి , కేవలం అంగ స్థంభన  సమయం ఎక్కువ అవాలనుకునే పురుషులలో  వయాగ్రా  తో   కామ వాంఛ  నయాగరా అవుతుంది.
కేవలం ఉత్సాహం తో,  అవసరం లేక పోయినా ఇలాంటి మందులు వాడటం ఎంత మాత్రమూ మంచిది కాదు.  ముందు చెప్పినట్టు  డాక్టర్ సలహా తప్పని సరిగా తీసుకుంటే మంచిది.
స్త్రీల లో  కూడా వయాగ్రా పని చేస్తుందా ? :
ఇప్పటి వరకూ జరిపిన పరిశోధనలు ఖచ్చితం గా స్త్రీలు  వయాగ్రా వల్ల లాభ పడతారని చెప్పలేక పోయాయి. అందు వల్లే    అమెరికా లో  అన్ని మందుల వాడకానికీ  ముందుగా ఆమోద ముద్ర వేసే FDA  సంస్థ ఈ వయాగ్రా ను స్త్రీలకూ రికమెండ్ చేయలేదు.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసు కుందాము !
%d bloggers like this: