కామ వాంచ – శాస్త్రీయ విశ్లేషణ.20.
సుదీర్ అలా తన తోలిరాత్రులు కొన్ని విచారకరం గా గడిపాడు. వేడి ముద్దులూ , బిగి కౌగిళ్ళతో సరిపుచ్చుకుంటున్నాడు. రతిక్రియ వద్ద అంత వరకూ ‘ మగ ధీరుడనుకున్న’ సుదీర్ , బలహీనుడవుతున్నాడు. సుజాత తన మటుకు తను, అతనితో ఎంతో ప్రేమతో, ఆప్యాయత తో సాహచర్యం చేస్తుంది.
ఆమె ప్రవర్తన సుదీర్ ను ఇంకా ఆందోళన పరుస్తూంది, ఇంకో ప్రక్క తను కొంత వరకు అందుకు కొంత రిలీఫ్ గా ఉన్నా ! ఈ అనుభూతులు సుదీర్ కు కొత్తగా ఉన్నాయి.
ఎందుకు తను రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాడు, అదే సమయం లో ఎందుకు ఆందోళన పడుతున్నాడు? ఎందుకు గిల్టీ గా ఫీల్ అవుతున్నాడు.? ఏమీ అంతు పట్టడం లేదు అతనికి.
ఇక ఇలాగే తన జీవితం సాగితే సుజాత తనకు కాకుండా పోతుందేమోనన్న భయం పీడించింది సుదీర్ ను. ధైర్యం చేసి ఒక రోజు మధ్యాహ్నం సెలవు తీసుకుని మానసిక వైద్యుణ్ణి సంప్రదించాడు.
నాలో ఏదైనా లోపం ఉందా డాక్టర్ ? అని ఆందోళన తో అడిగాడు. వివరాలన్నీ విన్న సైకియాట్రిస్ట్ ఇలా సలహా ఇచ్చాడు సుదీర్ కు
‘ సుదీర్! నీవు అనుకుంటున్నట్లు దీనిని అనార్గాస్మియా అంటారు. కానీ ఇది సెకండరీ అనార్గాస్మియా అంటే నీ కేసు లో మానసికమైన కారణాల వల్ల సంభవించిన స్థితి ఇది. ఇది పూర్తి గా నయం అవుతుంది. అందుకు చికిత్స కూడా నువ్వే !
నీవు నీ బాల్యం లో సహజం గా ఉన్న కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉబలాటం దానినే ఇంక్విసిటివ్నెస్ అంటారు. దానితో నీవు బూతు బొమ్మల పుస్తకాలు చూసావు. మీ తండ్రి మీద నీకు విపరీతమైన ప్రేమా , భయము ఉండటం వల్ల, ఆయన నిన్ను మందలిస్తూ అన్న మాటలు నీ మనసులో గట్టిగా నాటుకున్నాయి. నీలో ‘ సెక్స్ అంటే ఒక నేరం ‘ అనే భావన కలిగి, ఆ భావన నీలో సబ్ కాన్షస్ గా బలీయం గా ఉండిపోయింది, నీవు పెరుగుతున్నాకూడా! అందుకే నీవు నీ భార్య సుజాత తో కామోత్తేజం పొందుతున్నప్పటికీ, ఆర్గాసం పొందలేక పోతున్నావు.
నీవు వెంటనే చేయవలసిన పని నీ ఆలోచనా ధోరణి మార్చుకోవడం. సెక్స్ అతి సహజమైన మానవ లక్షణం. నీవు నీ చదువు ను కూడా ఏమీ అశ్రద్ధ చేయలేదు కదా అందుకు నీవు గిల్టీ గా గా ఫీల్ అవనవసరం లేదు. నీ మెదడు సబ్ కాన్షస్ గా స్విచ్ ఆఫ్ అవుతూ ఉన్నది సెక్స్ కు, ఇప్పటి వరకూ. ఇందుకు కారణం నీకు రతి మీద ఉన్న అపోహలే !
‘ స్విచ్ ఆన్ యువర్ బ్రెయిన్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ సుజాత !’ అన్నాడు.
అంతా అతి జాగ్రత్త గా ఒక్క అక్షరం కూడా మిస్ అవకుండా విన్న సుదీర్ కు అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రాలాయి, కళ్ళనుంచి.
‘ థాంక్స్ డాక్టర్ ‘ అన్నాడు.
ఆగ మేఘాల మీద చేరుకున్నాడు ఇంటికి, దారిలోనే అర్జెంటు గా సుజాతను ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చి.
ఇంటికి చేరుకున్న సుజాతను నేరుగా శయన మందిరం లో కి తీసుకువెళ్ళాడు, విషయం కనుక్కోడానికి నోరు విప్పుదామని సుజాత కనీసం పది నిమిషాలు ప్రయత్నించింది. ఫలితం శూన్యం. ఎందుకంటే తన పెదవుల మీద సుదీర్ పెదవులు పెనవేసుకు పోయాయి, ఆ పది నిమిషాలూ , కృతజ్ఞతా పూర్వకంగా !
ఇంకో గంట తరువాత సుదీర్ ‘ మళ్ళీ మగ దీరు డయ్యాడు’ ‘ ఇవాళ ఆఫీస్ నుంచి మ్యాజిక్ ల్యాంప్ ఏదైనా తెచ్చారా అలా స్వర్గం లోకి తీసుకు వెళ్ళారు ‘ అంది సుజాత ‘ అమాయకంగా’ వినిపించీ వినిపించని స్వరంతో !
సుదీర్ మందహాసం తో ఆమె తల ముంగురులు సవరిస్తూ సైకియాట్రిస్ట్ మాటలు గుర్తు తెచ్చుకుంటున్నాడు ‘ స్విచ్ ఆన్ యువర్ బ్రెయిన్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ సుజాత ‘ ! అవును! నిజంగానే సుజాత సుదీర్ జాతకం కూడా మార్చి వేసింది ఆ రోజునుంచీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !