ఋతుక్రమం – సమస్యలు.
ఋతు క్రమం ప్రతి స్త్రీకీ ప్రకృతి సిద్ధంగా వచ్చిన ప్రత్యేకత. కానీ రమారమి యాభయి శాతం కంటే ఎక్కువ మంది స్త్రీలు ఋతుక్రమం లో అవకతవకల వల్ల బాధ పడుతుంటారని వివిధ గణాంకాల వల్ల తెలిసింది.
ఈ ఋతుక్రమం వివరాలూ, స్త్రీల ఋతుక్రమం లో వచ్చే తేడాలూ, వాటి కారణాలూ, వాటికి చికిత్స పద్ధతులూ మనం తెలుసుకుందాము.
పురుషులకు కూడా ఋతుక్రమం గురించి అవగాహన ఏర్పడటం మంచిది. ఎందుకంటే, కుటుంబం లో ఎవరి ఆరోగ్యం, బాగోలేక పోయినా, ఆ ప్రభావం ఇంట్లో ఉన్న వారందరి మీదా ఉంటుంది.
అలాగే రుతుక్రమ సమస్యలున్నప్పుడు ఆ లక్షణాల గురించి స్త్రీల తో పాటు పురుషులకు కూడా అవగాహన ఏర్పడితే అది, ఆ సమస్యా పరిష్కారం లో కూడా ఉపయోగ పడుతుంది.
ముందు గా సహజ ఋతుక్రమం గురించి తెలుసుకుందాము ( అప్పుడు ఋతుక్రమం లో సమస్యలు శులభం గా అర్ధం చేసుకోవచ్చు ) :
రుతుక్రమాన్ని తెలుగులో ‘ ముట్టు ‘ అంటారు. చాలా సాధారణంగా ‘ పీరియడ్స్ లేక మెన్సెస్ ‘ అని కూడా అంటుంటారు.
పీరియడ్స్ ఎందుకు వస్తాయి? : ప్రతి పిరియడ్ లో అండాశయం నుంచి అండం విడుదల అవుతుంటుంది. ఆ అండము కనుక పురుషుడి వీర్యం తో ( ఖచ్చితంగా చెప్పాలంటే సాధారణంగా ఒక వీర్య కణం తో ) కలవక పొతే పిండం ఏర్పడక మళ్ళీ పిరియడ్ వస్తుంది.
ఒక శాస్త్రజ్ఞుడు వ్యాఖ్యానించినట్టు ‘ each menstrual period is the cry of the womb for want of a baby ‘ అంటే ప్రతి పిరియడూ శిశువు లేక పోవడం కారణం గా గర్భాశయం చెందే ఆవేదన !
ఇలా పీరియడ్స్ స్త్రీ ప్రత్యుత్పత్తి లేక సంతానోత్పత్తి దశ అంటే సహజం గా ఆగి పోయేంత వరకూ ప్రతి నెలా వస్తుంటాయి. ఇలా పీరియడ్స్ ఆగి పోవడాన్ని మెనో పాజ్ అంటారు.
ఋతుక్రమం మొదటి సారిగా యువతులలో రావడాన్ని మెనార్కే అంటారు. సాధారణంగా ఈ మెనార్కే ప్రపంచం లో చాలా దేశాలలో యువతులకు రమారమి పదమూడు సంవత్సరాలున్నప్పుడు వస్తుంది. కానీ ఏషియన్ యువతులలో ఒక సంవత్సరం ఆలస్యం గా వస్తుంది. ఈ తేడాలు వివిధ దేశ ప్రాంత పరిస్తితులబట్టీ, జాతుల బట్టీ మారు తుంటాయని గమనించడం జరిగింది. ఈ మెనార్కే రావడాన్ని యుక్త వయసు కు సంకేతం గా పేర్కొనవచ్చు అంటే ప్యుబర్టీ ‘ puberty ‘ .
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !