హై బీ పీ రకాలూ, కారణాలూ.1.
మనం క్రితం టపాలలో బీ పీ అధికం గా ఉండి , చాలా కాలం కంట్రోలు లో లేక పొతే పరిణామాలు ఎట్లా ఉంటాయో పటం సహాయం తో తెలుసుకున్నాము.
ఈ టపాలలో ఒక పటం సాధారణ రక్త పీడనం, ఇంకా అధిక రక్త పీడనం ఎంత ఉంటుందో సంఖ్య ల ద్వారా ఇవ్వటం జరిగింది కదా !
ఇక ఈ అధిక రక్త పీడనానికి కారణాలు చూద్దాము.
రక్త పీడనం లో రెండు రకాలుంటాయి. మొదటి రకాన్ని ప్రాధమిక అధిక రక్త పీడనం లేక ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు ( primary hypertension or essential hypertension ) ( 90 % ).
రెండవ రకాన్ని ద్వితీయ లేక సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు ( secondary hypertension ) ( 10 % ) . నూరు మందిలో అధిక రక్త పీడనం ఉంటే అందులో, తొంభయి మంది ఈ ప్రాధమిక అధిక రక్త పీడనం తో బాధ పడతారు. మిగతా పది మంది లో సెకండరీ అధిక రక్త పీడనం ఉంటుంది.
ప్రాధమిక అధిక రక్త పీడనం లేక ప్రైమరీ హైపర్ టెన్షన్ ముందు చెప్పుకున్నట్టు, తొంభై శాతం కేసులలో ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ ఈ ప్రాధమిక అధిక రక్త పీడనానికి కారణం ఖచ్చితం గా తెలియలేదు.
కానీ చాలా ఇతర కారణాలు ఉంటే, ఈ కారణాల వల్ల ప్రాధమిక అధిక రక్త పీడనం రావటానికి కారణం అవుతాయి. అందువల్ల వీటిని రిస్కు ఫాక్టర్స్ ( risk factors ) అంటారు.
ఈ కారణాలు ఇవి :
1. మన వయసు మీరుతున్న కొద్దీ , ఈ రకమైన అధిక రక్త పీడనం రావడానికి అవకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది.
2. సాధారణంగా ఇది వంశ పారంపర్యం గా ఉంటుంది. అంటే మన వంశంలో పూర్వీకులకు ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉంటే మనకూ రావటానికి అవకాశాలు ఎక్కువ.
3. మన ఆహారం లో మనం తినే ఉప్పు ( ప్రత్యక్షం గా కానీ, పరోక్షం గా కానీ ) ఎక్కువ అవుతున్న కొద్దీ , అధిక రక్త పీడనం రావడానికి అవకాశం హెచ్చుతుంటుంది.
4. తగిన వ్యాయామం లేక పోవడం. అంటే ఎక్సర్సైజ్ లేక పోవడం.
5.టొబాకో పొగ తాగటం ( అంటే సిగరెట్, బీడీ, లేక చుట్ట – వీటిలో వేటి పొగ అయినా తాగటం, పీల్చడం లేక ) స్మోకింగ్ చేయడం .
6. ఎక్కువ పరిమాణం లో ఎక్కువ కాలం మద్యం సేవించడం.
7. స్త్రెస్స్ , లేక మానసిక వత్తిడి ( stress ).
ఈ విషయాలను వివరం గా చూద్దాము వచ్చే టపాలలో !