Our Health

ఋతుక్రమం- సమస్యలు.6.డిస్ మెనో రియా చికిత్స.

In Our Health on ఏప్రిల్ 9, 2012 at 9:04 ఉద.

ఋతుక్రమం- సమస్యలు.6.డిస్ మెనో రియా చికిత్స.

 
మునుపటి టపా లో తెలుసుకున్నట్టు , ప్రాధమిక   డిస్  మెనో రియా  లేక ప్రైమరీ డిస్ మెనో రియా , కు ప్రత్యేక కారణాలు ఉండవు. సహజ ఋతు క్రమం లోనే  కనిపించే లక్షణాలు  ఇంకా తీవ్రం గా  ఉండి స్త్రీని బాధ పెడతాయి.
ఇక ద్వితీయ లేక సెకండరీ డిస్ మెనో రియా లో గర్భాశయం లో ఏ భాగం లో నైనా వచ్చే జబ్బులు, స్త్రీలను బాధించి వారికి రుతుస్రావ సమయం లో భరింప లేని నొప్పులు కలిగిస్తాయి.
ఈ రకమైన గర్భాశయ జబ్బులలో  ఎండో మెట్రియోసిస్, అడినో మయోసిస్,  ఇంకా అండాశ య తిత్తులు అంటే ఓవరియన్ సిస్టులు  ముఖ్యమైనవి.  పిల్లలు పుట్టకుండా గర్భాశయం లో వేయించుకునే కాపర్ లూపు కూడా కొన్ని సమయాలలో స్త్రీలలో రుతుస్రావ సమయం లో భరింప లేని నొప్పులకు కారణమవ వచ్చు.
ఏ ఏ పరీక్షలు అవసరం అవుతాయి? : 
ఇలాంటి లక్షణాలు గమనించిన స్త్రీలు మొదటగా చేయ వలసినది తమ లక్షణాల నన్నిటినీ క్షుణ్ణం గా అంటే వివరం గా ఒక నోట్ బుక్ లో రాసుకోవడం, తేదీ వారీ గా. ఇలా చేయటం వల్ల, తమ లక్షణాలు సహజ ఋతు క్రమం లో వస్తున్నాయా, లేక అస్త వ్యస్తం గా, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయా అనే విషయం తెలుస్తుంది. అలాగే  ఋతు స్రావానికీ, ఈ నొప్పులకూ సంబంధం ఉందొ లేదో కూడా తెలుస్తుంది.
ఈ వివరాలు గమనించి స్పెషలిస్టు ను సంప్రదించినప్పుడు వివరం గా చెపితే , ప్రాధమిక డిస్ మెనో రియా కానీ , ద్వితీయ డిస్ మెనో రియా కానీ నిర్ణయించ డానికి వీలవుతుంది.
ఇక రక్త పరీక్షలు, ప్యాప్ స్మియర్ టెస్ట్ ( అంటే  గర్భాశయ ద్వారం అంటే సర్విక్స్ అనే భాగం లో ఉన్న కణ జాలాన్ని పరీక్ష చేయటం ) కూడా అవసరం ఆవ వచ్చు.  అలాగే గర్భాశయాన్ని  అల్ట్రా సౌండ్  అంటే ధ్వని పుంజా లతో పరీక్ష  చేయడం కూడా అవసరం అవవచ్చు. ఇలాంటి   పరీక్షలు ప్రత్యేకించి  ద్వితీయ డిస్ మెనో రియా  కనుక్కోవడానికి  ఉపయోగ పడతాయి.
డిస్ మెనో రియా కు చికిత్సా పద్ధతులు ఏమిటి ?: 
ఏ రకానికి చెందిన డిస్ మెనో రియా అయినప్పటికీ , నొప్పి తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.  తగినంత విశ్రాంతి, క్రింద ఉదర భాగం లో వేడి నీటితో ఉన్న సంచీ ఉంచుకోవడము  అంటే (  హాట్ వాటర్ బ్యాగ్ )  ( పైన ఉన్న పటం చూడండి ) పార సెటమాల్ , బ్రూఫెన్ , మేఫెనమిక్ ఆసిడ్ వంటి నొప్పి ఉపశమనం కలిగించే మందులు  అవసరం అవుతాయి.  ఇలాంటి మందులు తరచూ వేసుకో కూడదు. కేవలం రుతుక్రమ సమయం లో నొప్పులు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఈ మందులు ఖాళీ పొట్ట లో అంటే ఏమీ తినకుండా వేసుకుంటే కడుపులో మంట కలిగిస్తాయి.  అందు వల్ల మందు వేసుకోబోయే ప్రతి సారీ  సాత్విక మైన ఆహారం  ( అంటే  పచ్చళ్ళూ  , మసాలాలు  లేని ఆహారాలు ) తినాలి. అలాగే మంచి నీరు కూడా తగినంత తాగుతుండాలి.
హార్మోనుల పాత్ర:  ప్రైమరీ డిస్ మెనో రియా కూ , సెకండరీ డిస్ మెనో రియా కూ  హార్మోనులు కొంత వరకు  ఉపశమనాన్ని ఇస్తాయని వివిధ పరిశోధనల వల్ల తెలిసింది.
 అలాగే ఋతు క్రమాన్ని తాత్కాలికం గా నిలిపి వేసేందుకు, గర్భాశయ నాళం లో వేయించుకునే కాపర్ లూప్ కూడా డిస్ మెనో రియా ఉపశమనానికి మంచి ఫలితాలనిస్తుంది.
ఇక పరీక్ష ల ద్వారా తెలిసుకున్న గర్భాశయ పరిస్థితులు ఏవైనా ఉంటే వాటిని సరి చేయటం కూడా ఈ ఋతు స్రావం లో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి.  ఉదాహరణకు  కొందరిలో అండాశయం లో తిత్తులు ఏర్పడతాయి. వాటిని  తీయించు కోవలసిన అవసరం రావచ్చు.
అనుభవజ్ఞులైన  గైనకాలజిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం ఇలాంటి పరిస్థితులలో.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

వ్యాఖ్యానించండి