Our Health

12. డయాబెటిస్ లో, కళ్ళ జాగ్రత్తలు మరి ఎట్లా తీసుకోవాలి ?:

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 30, 2013 at 10:37 సా.

12. డయాబెటిస్ లో, కళ్ళ జాగ్రత్తలు మరి ఎట్లా తీసుకోవాలి ?:

 
క్రితం టపాలలో మనం, ప్రత్యేకించి డయాబెటిస్ వ్యాధి కంట్రోలు లో లేక పొతే దాని పరిణామాలు కళ్ళ లో ఏ విధం గా కాంప్లికేషన్ లు గా కనిపిస్తాయో వివరం గా తెలుసుకున్నాం కదా !  మరి డయాబెటిస్ ఉన్న వారు కళ్ళ గురించిన ఏ  ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?:
 
1. చెక్కెర కంట్రోలు లేదా షుగరు కంట్రోలు : డయాబెటిస్ లో  అనర్థాల కన్నిటికీ ప్రధాన కారణం, రక్తం లో చెక్కెర ఎక్కువ అయిన ఫలితం గా ఏర్పడే పరిణామాలే కదా ! ఆ అనర్ధాలలో కళ్ళు  కూడా  ” శిక్షింప బడతాయి ”  అందువల్ల కళ్ళ  జాగ్రత్తలో ప్రధానం గా  రక్తం లో ఎప్పుడూ చెక్కెర , అదే షుగరు పరిమాణం అంటే షుగర్ లెవల్  సరి అయిన పాళ్ళ లోనే ఉండే  ‘కృషి ‘  చేయాలి. ఇక్కడ ” కృషి ” అనే పదం వాడ బడింది ఎందుకంటే , రక్తం లో షుగర్ కంట్రోలు దానంతట అదే సునాయాసం గా అవ్వదు , డయాబెటిస్ ఉన్న ప్రతి వారూ , ఏ ఏ  పరిస్థితులలో వారి రక్తం లో,షుగరు ఎక్కువ అవుతుందో , ఆ యా  పరిస్థితుల నన్నిటినీ తెలుసుకోవడమే కాకుండా ,ఆ పరిస్థితులను  అన్ని వేళలా ” నివారించు కోవాలి ! ” ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ప్రతి ఒక్కరి రక్తం లో,చెక్కర పరిమాణానికీ , వారే బాధ్యులు ! చాలా చిన్న పిల్లలలో కనుక డయాబెటిస్ వస్తే , అప్పుడు మనం చిన్నారి పిల్లలను నిందించ లేము కదా ! మనం ఇక్కడ టైప్ టూ  డయాబెటిస్ , అదే ఒక వయసు వచ్చాక , వచ్చే డయాబెటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి , రక్తం లో చెక్కెర నియంత్రించుకునే బాధ్యత పూర్తి గా వారి మీదే ఉంటుంది ! చెక్కెర కంట్రోలు అన్ని విధాలా నివారించుకోవడానికి , వారికి , ఏ ఏ  పదార్ధాలు  రక్తం లో చెక్కెర ను ఎక్కువ చేస్తాయో , సరి అయిన అవగాహన ఏర్పరుచుకోవాలి ముందే ! ఉదాహరణ కు ” నేను  చెక్కెర అసలు ముట్టుకోను , కూరగాయలే తింటాను అదీ ఆలుగడ్డల కూర ఎక్కువ గా తింటాను కానీ నా బ్లడ్ షుగర్ కంట్రోలు లో ఉండట్లేదు , డాక్టర్ కూడా కారణం చెప్పలేక పోతున్నాడు ” అనే వారు చాలా మంది ఉంటారు. ఇక్కడ అట్లాంటి వారు మరచి పోయేది ఏమిటంటే ,’ ఆలుగడ్డలు కూడా తీయగా లేక పోయినా , అందులో చెక్కెర లేక పోయినా కూడా, బ్లడ్ షుగర్ ను ఎక్కువ చేస్తాయి ‘ అనే విషయం !  
2.  ఇక కంటి జాగ్రత్తలు ప్రత్యేకం గా చెప్పుకోవాలంటే , కళ్ళ లో పొరపాటున కూడా చేతి  వేళ్ళు పెట్టుకోవడం చేయకూడదు !
3. కంటి చూపు, ఏ కారణం చేత మందగించినా కూడా, ఆలస్యం చేయకుండా , కంటి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి !
4. కంటి లో నీరు కారడం , చీటికీ మాటికీ కళ్ళు ఎర్ర బడడం , ఒక కన్నులో నొప్పి ఉండడం, లాంటి లక్షణాలను డయాబెటిస్ లేని వారు తరచూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు ,ప్రత్యేకించి డయాబెటిస్ ఉన్న వారు ఈ లక్షణాలు గమనిస్తే , అశ్రద్ధ చేయకూడదు !
5. కంటి చూపు  లో కొంత భాగమే కనిపించడం , కళ్ళ  ముందు తెరలు ఏర్పడడం , కాంతి లో చూడలేక పోవడం ,  ఒక వస్తువు రెండు వస్తువులు గా కనబడడం లాంటి లక్షణాలు కూడా అశ్రద్ధ చేయకూడదు ! 
6. కనీసం ప్రతి ఏడూ  a . కంటి చూపు ( శుక్లాలు పెరుగుతున్నాయో లేదో, చత్వారం , లేదా చూపు మంద గిస్తుందో లేదో తెలుసుకోవడం కోసం ) , b . కంటిలో పీడనం ( గ్లాకోమా మొదలవుతుందో లేదో తెలుసుకోవడం కోసం  ) , c . రెటీనా ఫోటో (రెటీనా లో ఏర్పడే మార్పులు తోలి దశ లోనే గుర్తించడం కోసం )  ఈ మూడు పరీక్ష లూ తప్పని సరిగా చేయించుకోవాలి డయాబెటిస్ ఉన్న వారు !  గమనించండి , ఈ మూడింటి లో దేనిని అశ్రద్ధ చేసినా కూడా  చూపు కోల్పోయే ప్రమాదం ఉంది కదా ! 
7. మిగతా అన్ని వ్యాధులలొనూ  ” నివారణ   చికిత్స కన్నామేలు  ” అనే నానుడి వర్తిస్తుంది ! కానీ  డయాబెటిస్ లో కళ్ళ  జాగ్రత్త విషయం లో , ” నివారణ కన్నా నియంత్రణ మేలు ” అనే నానుడి ని మనం గుర్తించుకోవాలి !  అంటే డయాబెటిస్ లో కళ్ళ లో వచ్చే కాంప్లికేషన్ లు తగు జాగ్రత్తలతో , చాలా కాలం వరకూ వాయిదా వేయ వచ్చు !  కొన్ని కాంప్లికేషన్ లు తప్పని సరి అయినప్పుడు వాటిని అత్యంత తొలిదశల లోనే  కనుక్కుంటే , వాటిని చాలా వరకు నియంత్రించుకోవచ్చు , ఆధునిక పద్ధతుల సహాయం తో !  
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 1. సుధార్ జీ,
  వందనాలు. మీరు బ్లాగు ద్వారా మాకు ఎన్నో ఆరోగ్య విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు.

  అతిమూత్ర వ్యాధితో కళ్ళ గురించి చెబుతున్నారు, బాగుంది, దానిని పూర్తి చేసిన తరవాత ఇతర అవయవాలకి వచ్చే ఇబ్బందులు కూడా చెప్పమని వినతి. ఇప్పుడు ప్రతివారికి ఈ జబ్బు ముఫై లోపే వచ్చేస్తోంది🙂 మీ బ్లాగ్ చాలా మంది చదువుతున్నారు రోజూ, నేనే ఇద్దరు ముగ్గురికి చెప్పేను కూడా.
  మరొక సారి ధన్యవాదాలు.

 2. శర్మ గారూ ,
  ” బాగు ” చదివి , వీలైనంత మంది తెలుగువారు లాభ పడాలనే కదా, బాగు ఉద్దేశం ! మీ వంతు గా మీరు ఇతరులకు చెప్పి వారికి సహాయం చేస్తున్నారు , కృతఙ్ఞతలు !’సర్వేంద్రియానాం నయనం ప్రధానం ‘ అన్న వాక్కు మీకు తెలియనిది కాదు కదా ! అందువల్లనే కళ్ళ గురించి ముందుగా తెలియ చేయడం జరిగింది ! మిగతా ముఖ్య అవయవాల గురించి కూడా టపాలు ” పోస్టు ” చేద్దామనే ఉద్దేశం ! అవసరం వచ్చినపుడు, అందరికీ, అందుబాటులో ఉంటాయి ! ప్రతి వారికీ, వారి బంధువులో , మిత్రులో, ఎవరో ఒకరు డయాబెటిస్ వచ్చిన వారు ఉంటారు కదా, అందువల్ల, ఆ వ్యాధి గురించి తెలుసుకోవడం అందరికీ మంచిదే ! నా ” ఫీజు ” గుర్తుంచుకోండి , టపా చదివిన ప్రతి వారూ !

 3. సుధాకర్ గారు,
  నా ఉద్దేశం కూడా వ్యాధి గురించిన పరిజ్ఞానం కొంతేనా రోగికి ఉంటే కొంత దైర్యంగా ఉంటుంది, రోగి రోగమ్ గురించి తెలుసుకోవాలి, శరీరం తనదే కదా🙂 మిమ్మల్ని అడిగి సెర్చ్ ఆప్షన్ పెట్టించినది కావలసినవి వెతుక్కోడానికే. మీ శ్రమకి, ఇతరుల ఆరోగ్యం పట్ల, తెనుగు భాషపట్ల, తెనుగువారి ఆరోగ్యం గురించిన మీతపనకు జోహార్లు. మీఫీస్ మరిచిపోను🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: