6. ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి ?
ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ వ్యాధి నిర్ణయం అవ్వక ముందు ఉండే పరిస్థితి.
ప్రీ డయాబెటిస్ ను ఎట్లా కనుక్కోవచ్చు ?:
ప్రీ డయాబెటిస్ ను మూడు రకాలైన రక్త పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు ! ప్రీ డయాబెటిస్ పరిస్థితిలో రక్త పరీక్షలు అబ్ నార్మల్ గా ఉంటాయి. కానీ ఈ అబ్ నార్మల్ పరీక్షలు ఖచ్చితం గా డయాబెటిస్ ఉన్నప్పుడు లాగా ఉండవు అందు వల్ల నే ఈ పరిస్థితిని ప్రీ డయాబెటిస్ అని అంటారు ! ఇక వ్యాధి లక్షణాల మాటకొస్తే , ప్రీ డయాబెటిస్ పరిస్థితి ఉన్నవారు కొన్ని డయాబెటిస్ లక్షణాలు మాత్రమే చూపిస్తారు ! ఈ ప్రీ డయాబెటిస్ పరిస్థితిని కనుక కనుక్కుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనీసం అరవై శాతం మంది లో అంటే ఒక వంద మంది ప్రీ డయాబెటిస్ ఉన్న వారిలో అరవై మంది లో వారు డయాబెటిస్ వ్యాధి బారిని పడకుండా నివారించుకోవచ్చు అని పరిశోధనల వల్ల స్పష్టమైంది ! అందుకే ఈ ప్రీ డయాబెటిస్ ప్రాముఖ్యత అందరూ తెలుసుకోవడం ఉత్తమం !
ఈ ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి ? :
1. అసాధారణం గా దాహం వేయడం
2. ఎక్కువ గా మూత్ర విసర్జన చేయడం
3. తీవ్రమైన అలసట కలగడం !
4. కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండడం అంటే మసక మసక గా కనిపించడం
5. తరచూ ఇన్ఫెక్షన్లు కలగడం
6. చిన్న చిన్న గాయాలు తగిలినా కూడా ఆ గాయాలు మానక , చీము పట్టడం
7. చేతులు , కాళ్ళు తిమ్మిర్లు ఎక్కువ గా అనిపించడం
8. మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్ లు తరచూ రావడం , ప్రత్యేకించి స్త్రీలలో .
ఈ ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశం ఎవరిలో ఎక్కువ గా ఉంటుంది ?:
1. సామాన్యం గా 45 సంవత్సరాలు దాటిన వారిలో
2. ఆసియా వాసులలో ( అంటే భారత ఉపఖండం లో ఉన్న వారు కూడా ! )
3. కుటుంబం లో ఎవరైనా డయాబెటిస్ అప్పటికే ఉన్నవారు ఉంటే
4. అధిక రక్త పీడనం ఉన్నవారు
5. గర్భం తో ఉన్నపుడు డయాబెటిస్ వచ్చిన స్త్రీలు
ప్రీ డయాబెటిస్ వచ్చిన వారందరూ తరువాత డయాబెటిస్ వ్యాధి గ్రస్తులవుతారా ?:
కాదు. పైన తెలిపినట్టుగా , ప్రీ డయాబెటిస్ అనే పరిస్థితి పూర్తి డయాబెటిస్ వ్యాధి వచ్చే ముందు ఉండే పరిస్థితి. ఈ పరిస్థితి లో కనుక అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే , మధుమేహాన్ని లేదా డయాబెటిస్ ను నివారించుకోవచ్చు ! వచ్చే టపాలో ప్రీ డయాబెటిస్ ను కనుక్కునే పరీక్షల గురించి తెలుసుకుందాం !