Our Health

రతి వ్యాయామం కాదా.2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 16, 2013 at 10:42 సా.

రతి వ్యాయామం కాదా.2. 

 
మీ హస్త లాఘవం కూడా క్యాలరీలను దహించి  ఆమె లో కామోత్తేజ దీపం వెలిగిస్తుంది ! :
 క్యాలరీలు వ్యయం కావట్లేదు అనుకునే వారికి రతి  ముందు వారి చేతులతో చూపించే ” చొరవ ”  కూడా  బాగా ఉపయోగ పడి, కనీసం అరగంటకు ఓ యాభై క్యాలరీలను దహిస్తుంది ! అంటే ఒక గంటకు వంద క్యాలరీలు ! ఓపికను బట్టి , హస్త లాఘవం ఒక గంట వరకూ చూపించ వచ్చు !  ప్రేయసీ ప్రియులు రతి ముందే  ఒకరి నుంచి ఇంకొకరు ఆనందాన్ని దోచుకోవడమే కాకుండా పంచుకోవచ్చు కూడా !  ” చాలా సుతి మెత్తని , భావోద్వేగ పూరితమైన  అనుభూతులు రేకెత్తించే స్పర్శ మీ చేతులతో , అతి నెమ్మది గా కలిగించాలి !  ఆమె దేహం మీద అతడూ , అతని దేహం మీద ఆమె  కేవలం కర స్పర్శ తో నే  క్యాలరీలను మండి స్తూ , రతికి ముందు అవసరమయే ఉష్ణోగ్రత జనింప చేయవచ్చు అంటారు సెక్సాలజిస్ట్ కింబాచ్ ! అంతే కాకుండా ఒకరినొకరు తమ దేహాలు పరస్పరం తగిలించు కుంటూ కూడా , అంటే కేవలం చేతులతో కాకుండా క్యాలరీలను కాల్చ వచ్చునంటారు ఆమె ! 
 
మర్దన తో అంటే మసాజ్ తో కూడా వేడిని పుట్టించ వచ్చు ! మీ మెసేజ్ ను ఎక్కడా  రాయకుండా నే తెలప వచ్చు ! 
” మీ ప్రియుడికి మీ చేతులతో ఒక మంచి మసాజ్ , అదే మర్దన ఇచ్చినా కూడా  మీలో  ప్రేమ  ప్రవర్ధనం అవుతుంది ”  మీరు ప్రేమ తో , అతని శరీరం మీద మర్దన చేసే ప్రతి సారీ , మీ హృదయ స్పందన వేగం ఎక్కువ అవుతూ , మీలో కోరికల గుర్రాలను చెల్లా చెదురుగా పరిగెత్తిస్తుంది ”  మీ శరీరాన్ని క్యాలరీలు కాల్చే మోడ్ లో పెడుతుంది ! ఇక్కడ కూడా ” మీరు ఎంత నిదానం గా , ఎంత ” లోతు గా ” మర్దన చేస్తే, అంత లాభం !  క్యాలరీలు దహించడం లోనూ , మీ ఆనందపు గ్యాలరీ లో మీ అనుభవాలను పదిల పరుచుకోవడం లోనూ ” అంటారు కింబాచ్ !  ఇంకో చిరు సూచన కూడా ఆమె చేశారు ! మీరు కేవలం శయన మందిరం లో కాక ఈ మసాజ్  ఇవ్వడం, పుచ్చుకోవడం , ఒక మసాజ్ బల్ల , అదే టేబుల్ ఉపయోగించడం ఉత్తమం ! మసాజ్ టేబుల్  మీద ఒకరుండి , ఇంకొకరు నుంచుని మసాజ్ చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి ! ” అని కూడా ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !     
  1. Okkannee entha sepu saavamantaaru… vyaayam…:@

    • ఒంటరి గారూ , వ్యాయామం మానవులకందరికీ ఆరోగ్య దాయకమండీ , మీరు ఒంటరి అయినా , జంటగా ఉన్నా కూడా ! శాస్త్రీయ పరిశోధనలు కనీసం రోజుకు అరగంట వ్యాయామం చేసినా , లాభాలు ఉంటాయి అని చెబుతున్నారు ! మీరు ” జంట ” గా అయే వరకూ నిరుత్సాహ పడకుండా , వ్యాయామం చేస్తూ , ఉండండి , కనీసం రోజూ ఓ అరగంట !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: