మీరు ఎప్పుడైనా , మీ డయాబెటిస్ రిస్కు కనుక్కున్నారా?

డయాబెటిస్ , అదే షుగర్ వ్యాధి , లేదా మధు మేహం అనబడుతుంది. ఈ వ్యాధి ముఖ్యం గా రెండు రకాలు గా ఉంటుంది . చిన్నతనం లో వచ్చే డయాబెటిస్ ను టైప్ వన్ డయాబెటిస్ అంటారు. కొంత వయసు మళ్ళాక ( అంటే ముప్పై నలభై సంవత్సరాల వయసున్నపుడు ) వచ్చే డయాబెటిస్ ను టైప్ టూ డయాబెటిస్ అంటారు.మనం ఇప్పుడు మాట్లాడు కొనేది ఈ టైప్ టూ డయాబెటిస్ గురించి. ఈ టైప్ టూ డయాబెటిస్ ఆసియా వాసులలో అధికం గా వస్తూ ఉంటుంది. కొంత వరకూ ఆసియా వాసులలో జీన్స్ అంటే జన్యువుల అమరిక వల్లనూ , ముఖ్యం గా వారి ఆహార అలవాట్ల వల్ల నూ ఈ టైప్ టూ డయాబెటిస్ అధికం గా వస్తుంది ! ఇట్లా డయాబెటిస్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందే , కొన్ని కారణాలు కలిసి ,మనలో డయాబెటిస్ ముందు ముందు వచ్చే అవకాశాలను అధికం చేస్తాయి ! అందుకే ఈ కారణాలను రిస్కు ఫ్యాక్టర్ లు అంటారు ! ఈ రిస్కు ఫ్యాక్టర్ లను ముందే మనం తక్కువ చేసుకుంటే , ముందు ముందు డయాబెటిస్ రాకుండా నివారించు కోవచ్చు. లేదా ఆ వచ్చే అవకాశాలను చాలా కాలం పాటు వాయిదా వేసుకోవచ్చు ! మన జీన్స్ అంటే జన్యువులలో మార్పులు మనం నియంత్రించడం కానీ , నివారించడం కానీ చేయ లేక పోయినప్పటికీ , ఈ రిస్కు ఫ్యాక్టర్ లను తగ్గించు కుంటే ,మనం డయాబెటిస్ ( అంటే టైప్ టూ డయాబెటిస్ ) వ్యాధి నివారణ లో విజయ వంతం అవవచ్చు !
ఈ క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీరు మీ రిస్కు ను లెక్క కట్టుకోండి ! ( లింకు మీద ఒక్క క్లిక్కు తో ! ) రిస్కు కనుక అధికం గా ఉంటే , మీరు మీ వైద్యుడిని సంప్రదించి , అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి ! మీ ఆరోగ్యం కోసం ఈ ముందు జాగ్రత్త తీసుకోవడం లో తప్పు లేదు కదా ! అంతే కాక ఇది ఉచితం కూడా ! ( ఒక గమనిక : పరీక్ష వివరాలలో మీ ఎత్తు అడుగులలో ఉంది కాబట్టి మీ బరువు కూడా పౌండ్ల లో రాయాలి. ఇది కష్టమేమీ కాదు. మీ బరువును కిలోలలో కొలుచుకుని, రెండు పాయింట్ రెండు తో గుణిస్తే మీ కిలోలలో ఉన్న మీ బరువు పౌండ్ల లో మారుతుంది ( ఎందుకంటే ఒక కిలో బరువు 2. 2 పౌండ్ల తో సమానం కనుక ).
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !