Our Health

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 2.

In Our Health on మార్చి 15, 2012 at 11:04 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 2.
కామ వాంఛ – ప్రతిక్రియా వలయం. అంటే సెక్సువల్ రెస్పాన్స్ సైకిల్. ( human sexual response cycle ):
మానవులలో కామ ప్రతిక్రియ గురించి ఒక శాస్త్రీయ విశ్లేషణ చేసి ప్రతిపాదించిన వారిలో మాస్టర్స్ అండ్ జాన్సన్  ప్రముఖులు.
వీరు ( Dr.Masters  పురుషుడు, Dr.Johnson స్త్రీ ) 1950 నుంచి 1980 వరకూ ఈ విషయం పైన అనేక పరిశోధనలూ , పరిశీలనలూ, చేశారు. వీరి  ప్రతిపాదన ప్రకారం, మానవులలో కామ ప్రతిక్రియ నాలుగు దశలు గా ఉంటుంది.
మొదటి దశ :  Excitement  దీనిని తెలుగు లో సాధారణం గా ‘  కామోద్రేకం ‘  అని అంటాము.
రెండవ దశ :  Plateau. దీనినే సమతల దశ  అనవచ్చు. 
 మూడవ దశ :  Orgasm.  ఈ దశ కామ ప్రక్రియ లో ఉచ్చ దశ. Climax  అని కూడా పిలవ బడుతుంది  .
నాల్గవ దశ : Resolution.  యధాస్తితి అనవచ్చు నేమో దీనిని తెలుగులో.
మాస్టర్స్ అండ్ జాన్సన్ చేసిన పరిశీలనలో, మానవులలో  ఈ కామప్రతిక్రియ ఒక నిర్దిష్టమైన  పధ్ధతి లో  జరుగుతుందని చెప్పారు.
ఈ ప్రతిక్రియ స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఒకే విధం గా కాక , కొద్ది తేడాలతో  ఉంటుంది.
పురుషులు త్వరగా ‘ వేడెక్కి ‘ ఉచ్చ దశ కు అంటే క్లైమాక్స్ కు చేరుకుంటారు కామ క్రియలో! స్త్రీలు కొద్దిగా ‘ ఆలస్యంగా ‘ వేడెక్కి ‘ ఉచ్చ దశ కు చేరుకుంటారు.
పైన ఉన్న పటం లో నీలం గీత పురుషుల కామ ప్రక్రియ నూ , ఎరుపు రంగు గీత స్త్రీలలో ఈ కామ ప్రక్రియనూ తెలియ చేస్తుంది.
ఈ గీతలు రెండూ మీరు గమనించినట్లైతే  క్రిందనుంచి మొదలై క్రమంగా పైకి వెళుతున్నాయి.  ఇలా గీయటం కామోద్రేకం క్రమం గా ఎలా ఎక్కువ అవుతుందో సూచిస్తూంది.
ఈ గీతలు రెండూ ఒకే సారి ఉచ్చ దశకు చేరుకోకుండా  వేరు వేరు సమయాలలో ఈ దశ లో ఉన్నాయి.
అలాగే ఈ గీతలు క్రిందకు వచ్చేటప్పుడు కూడా కలిసి రాకుండా కుడి ఎడమలు గా దిగుతున్న్నాయి.
ఇది కామ ప్రక్రియ లో సంపూర్ణ మైన తృప్తి పొంది ‘యధాస్థితి’  కి వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి.
ఈ గీతల మొదలు నుంచి చివరల వరకూ ఉండే దూరం  కామ ప్రతిక్రియ సమయాన్ని సూచిస్తూంది. మీరు సరదాగా ఒక స్కేలు తీసుకుని కొలవవచ్చు ఈ దూరాలను.
(  గ్రాఫ్  అంటే  graph అంటే తెలియని వారికి కూడా అర్ధం ఆయేట్టు  ఈ విధం గా వివరించటం జరిగింది. )
మాస్టర్స్ మాటలలో చెప్పాలంటే   ‘ Men are like microwaves ‘ and ‘ Women are like slow cookers’ !! 
వీటి మిగతా  వివరాలు వచ్చే టపాలో చూద్దాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: