ఆకర్షణ,ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 11.
ఒకే సంబంధమూ – విడాకులూ :
స్త్రీ పురుషుల మధ్య సంబంధము, ప్రణయాకర్షణ లో తన్మయత్వం చెంది, ప్రేమానురాగాలు గా మారి, వివాహమూ, తదనంతరం జరిగే రతీ మన్మధ కేళీ విలాసాలకు నిలయం గా పరిణమిస్తుంది సహజంగా – ఇంత వరకూ అత్భుతంగా ఉంది కధ!.
కానీ ఈ స్త్రీ పురుష సంబంధము మానవ నాగరికత పరిణామం చెందుతున్న కొద్దీ, మారిపోతున్నది. అంటే ఒక సారి స్త్రీ పురుష సంబంధం ( సాధారణం గా వివాహం ద్వారా ) ఏర్పడ్డ తరువాత, అది శాశ్వతం అవట్లేదు.
ఇటీవల జరిపిన ఒక సర్వే లో ప్రపంచం లో ఉన్న 62 అభివృద్ధి చెందిన, లేక అభివృద్ధి చెందుతున్న సమాజాలూ, వ్యవసాయమే ప్రధానం గా కల సమాజాలలో విడాకుల సంఖ్య గణనీయం గా పెరిగిందని తెలిసింది. సర్వే చేసిన ఈ సమాజాలలో విడాకులు, సంప్రదాయ బద్ధం గా, ఇప్పటి వరకూ చాలా అరుదు గా ఉన్న సమాజాలు కూడా ఉన్నాయి.
దీనిని బట్టి తెలుస్తున్నదేంటంటే, విడాకులు క్రమేణా విశ్వ వ్యాప్తంగా బలహీన పడుతున్న వివాహ బంధాలకు కొలమానాలవుతున్నాయి. విడాకులు స్త్రీ పురుష ఆర్ధిక స్వాతంత్ర్యానికి కూడా అవినాభావ సంబంధం తో ఉంటున్నాయి. అంటే ఎక్కడైతే ఆర్ధిక స్వాతంత్ర్యం ( ముఖ్యంగా స్త్రీలకు ) ఎక్కువ అవుతుందో అక్కడ విడాకుల సంఖ్య కూడా ఎక్కువ గా ఉంటూంది.
ఈ విడాకులు స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి సామర్ధ్యం ఎక్కువ గా ఉన్నప్పుడు అంటే వారు ఇరవై , ముప్పై సంవత్సరాల మధ్య లో ఉన్నప్పుడు, వారికి వివాహం అయి నాలుగు ఏళ్ళు అయినప్పుడు జరుగుతున్నాయి ఎక్కువగా ! సాధారణం గా పెళ్లి అయి నాలుగు ఏళ్ళు ఆయే సరికి ఒక బాబు లేక పాప పుట్టటం జరిగి వారు కొంత స్వతంత్రత కలిగి ఉంటారు. అంటే వారికి తల్లి పాలు అప్పుడు అవసరం ఉండవు కదా. అలాగే వారు వారి పనులు వారు, చెపితే చేసుకునే వయసు లో ఉంటారు. సంతానం ఏమీ లేని దంపతులు కూడా ఎక్కువ గా విడిపోతున్నారు.
ఎక్కువ కాలం వివాహం చేసుకుని జీవిస్తున్న వారు , పిల్లల తో ఉన్న వారు , వీరిలో తరువాత విడాకుల సంఖ్య తక్కువ గా ఉంటోంది.
ప్రపంచ వివాహ వ్యవస్థ ను పరిశీలిస్తే ఒకే స్త్రీ తో నూ లేక పురుషుని తోనూ శాశ్వత సంబంధం కలిగిన వారు తగ్గి , ఒక నిర్ణీత సమయం వరకే వారు సంబంధం కలిగి వుంటున్నారు. అంటే స్త్రీ పురుషులు వారి జీవిత కాలం లో ఒకరి కన్నా ఎక్కువ భాగస్వాముల తో సంబంధం కలిగి ఉంటున్నారు. దీనినే ‘ serial monogamy ‘ లేక ‘ pair bonding ‘ అని కూడా అంటారు . ఇలా ఒక పురుషునితో కొంత కాలమే జీవించే స్త్రీల సంఖ్యా , అలాగే ఒక స్త్రీ తో కొంత కాలమే జీవించే పురుషుల సంఖ్యా , ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అవుతుంది, క్రమేణా !!!
వివాహ వ్యవస్థ లో ఈ మార్పులకు, పరిణామ రీత్యా ఉన్న కారణాలు వచ్చే టపాలో చూద్దాము !!!
The rate of divorce is on the increase, what ever may be the reason
True.