14. రక్షిత వాహన చోదకము ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). ప్రమాదాలను పసి గట్టడం ఎట్లా ?
కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రోడ్డు మీద అనేక అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి ! ఆ అవాంతరాలను ముందే పసి గడితే , వాటిని సమయ స్ఫూర్తి తోనూ , డ్రైవింగ్ నైపుణ్యం తోనూ , నివారించుకోవచ్చు ! మరి అట్లా చేయడానికి ప్రతి డ్రైవరూ ఏమి చేయాలి ?
1. స్పష్టమైన దృష్టి ఉండాలి :
కారు నడుపుతున్నపుడు మన ముందు ఉండే రోడ్డు మీద మనకు స్పష్టమైన దృష్టి ఉండాలి , దానితో ముందున్న రోడ్డు వ్యూ కూడా స్పష్టం గా కనబడుతుంది ! అంటే కేవలం కనబడితే ప్రయోజనం ఏముంటుంది అని అనుకోవచ్చు ! కానీ కారు ప్రయాణం చేస్తున్నంత సేపూ కేవలం ముందున్న రోడ్డును గమనిస్తూ ఉండాలి ! అట్లా చేస్తూ ఉండడం వల్ల , మన కారుకు అడ్డం వస్తున్న ఇతర వాహనాలు కానీ , మోటారు సైకిళ్ళు కానీ , సైకిళ్ళు కానీ , ఇంకా ముఖ్యం గా చిన్న పిల్లలు కానీ , లేదా ఇతర పాద చారులు కానీ రోడ్డు దాటుతూ ఉండడం , లేదా అకస్మాత్తు గా పడి పోవడమూ జరగ వచ్చు ! అప్రమత్తత తో గమనిస్తున్న మనం , ఆ రకమైన అవాంతరాలను ముందే గమనించి , తదనుగుణం గా మన కారును నిదానం గా నడపడం కానీ , ఇంకా అవసరం అవుతే బ్రేక్ వేసి ఆపడం కానీ చేయ వచ్చు !
బ్లైండ్ స్పాట్ అంటే ఏమిటి ?
మనం నడిపే వాహనాన్ని బట్టి , మన దృష్టి కి ఇరువైపులా కూడా కొంత మేర కనబడదు ఆ ప్రదేశాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు ! ఈ బ్లైండ్ స్పాట్ ను గుర్తు ఉంచుకోవడం , ప్రత్యేకించి , మనం వాహనం నడుపుతున్నంత సేపూ , అత్యంత ముఖ్యమైన కర్తవ్యం ! ఎందుకంటే మనం నడుపుతున్న కారుకు ఎడమ వైపు కానీ , కుడి వైపున కానీ ఈ బ్లైండ్ స్పాట్ ను కనుక మనం పట్టించుకో కుండా , కనుక , కారును ప్రక్కకు ( కుడి ప్రక్కకు కానీ , ఎడమ ప్రక్కకు కానీ ) తిప్పగానే , వెనుక నుంచి వస్తున్న వాహనం తో ఢీ కొట్టి , తీవ్రమైన ప్రమాదం జరగ వచ్చు ! ఆ ప్రమాద తీవ్రత , ఆ పరిస్థితులలో , వెనుకనుంచి వచ్చే వాహనాల వేగం బట్టి మారుతూ ఉంటుంది !
ఇట్లా జరగడం ఎందువల్ల ?
బ్లైండ్ స్పాట్ లో వెనుకనుంచి వస్తున్న వాహనాలు కనిపించవు కనుక.
మరి బ్లైండ్ స్పాటు లో వచ్చే వాహనాలను గమనించే మార్గం ఏమిటి ? : మన కారు లో ఉన్న రియర్ వ్యూ మిర్రర్ నూ , సైడ్ మిర్రర్ లనూ వీలైనంత ప్రదేశం చూపించేట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ! అంతే కాక , డ్రైవింగ్ చేసే సమయం లో ఒక లిప్త కాలం పాటు, అంటే కేవలం కొన్ని క్షణాల పాటు మనం మన తలను ప్రక్క కు తిప్పి మన కారు ప్రక్క గా ప్రయాణం చేస్తున్న వాహనాలను గమనించాలి ! ఈ క్రింద ఇచ్చిన యూ ట్యూబ్ వీడియో ను కారు ఉన్న ప్రతి వారూ తప్పని సరిగా చూసి , బ్లైండ్ స్పాట్ గురించి స్పష్టం గా అర్ధం చేసుకోవాలి ! ప్రమాద నివారణ కోసమూ , సురక్షిత డ్రైవింగ్ కోసమూ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !