6. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). ప్రాధమిక మెయింటె నెన్స్ ఏమిటి ?:
మిగతా జాగ్రత్తలు :
విండ్ స్క్రీన్ ఇంకా విండోస్ : విండ్ స్క్రీన్ ఎప్పుడూ , మసక బారకుండా , స్పష్టం గా ఉండాలి ! దానిమీద ఏ రకమైన స్టికర్ లూ అంటించ కుండా జాగ్రత్త వహించాలి ! అంటించిన స్టికర్ లు చూపును కొన్ని కోణాలకే పరిమితం చేసి , అత్యవసర సమయాల లో రోడ్డు మీద వాహనాలను గమనించ కుండా చేసి , ప్రమాదాల రిస్కు ఎక్కువ చేస్తాయి !విండ్ స్క్రీన్ మీద తరచూ చిన్న చిన్న రాళ్ళు పడి , విండ్ స్క్రీన్ మీద చిన్న చిన్న పగుళ్ళ కు కారణమవుతాయి ! ఈ పగుళ్ళు కూడా చూపు కు అంతరాయం కలిగిస్తాయి ! పెద్ద పగుళ్ళను వెంటనే సీల్ చేయడం కానీ , లేదా విండ్ స్క్రీన్ మార్చడం కానీ చేయాలి !విండోస్ కూడా సరిగా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
ఎలెక్ట్రి కల్ పరికరాలు చెక్ చేయడం :
కారు లో వివిధ లైట్లూ , విండ్ స్క్రీన్ వాషర్ లూ , హారన్ లూ , ఇట్లాంటి అనేకం విద్యుత్తు బ్యాటరీ ద్వారానే పని చేస్తాయి కదా ! వాటిని పరీక్ష చేసుకోవడం కూడా ఉత్తమం ! ప్రత్యేకించి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటే ! అట్లాగే కారు బ్రేక్ నూ , స్టీరింగ్ వీల్ నూ కూడా పరీక్ష చేసుకోవాలి బయలు దేరే ముందే !
చాలా మంది ఇంధన టాంకు ను ఒక మాదిరి గానే నింపి , ప్రయాణాలకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ! కానీ వెళ్ళే చోటు వెదకడం కానీ , లేదా ట్రాఫిక్ ఎక్కువ గా ఉండి తరచూ గేర్లు మార్చి కారును నడపడం వల్ల కానీ ఎక్కువ ఇంధనం ఖర్చు అయి రోడ్డు మీద ఇంధనం లేక పోవడం వల్ల , కారు ఆగి పోవచ్చు ! అందువల్ల ఎప్పుడూ అనుకున్న దానికంటే ఎక్కువ ఇంధనం టాంకు లో నింపు కోవడం మంచి అలవాటు !
పాసెంజెర్ ల జాగ్రత్త :
కారు నడిపే డ్రైవర్ దే , కారు లో కూర్చున్న మిగతా వారందరి బాధ్యతా కూడా ! ఈ మిగతా పాసెంజర్ లు చిన్న పిల్లలు కావచ్చు , ముదుసలులు కావచ్చు , లేదా గర్భిణీ స్త్రీలో , అనారోగ్యం తో ఉన్న వారో కూడా కావచ్చు ! అట్లాంటి వారందరి జాగ్రత్త కూడా , ప్రయాణం ముందే ఏర్పాటు చేసుకోవాలి , కారు నడిపే వారే ! ప్రత్యేకించి సీట్ బెల్ట్ లు పెట్టుకున్నారో లేదో గమనించడం , వారి బరువు కు తగ్గట్టుగా కారు టైర్ల లో గాలి నింపడం జరిగిందో లేదో అని చూసుకోవడమూ , ఇంకా వారికి కావలసిన ఆహార పానీయాల విషయాలు కూడా ముందే ఏర్పాటు చేసుకోవాలి ! వాతావరణం బాగో లేక పోయినా , లేదా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడిన సమయాలలో ,కారు ను వదిలి , రెస్టారెంట్ లో తినడం , తాగడం సంభవం కాదు కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !